వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు జుట్టును పొడిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వర్షంలో తడిస్తే వెంటనే మైల్డ్, సల్ఫేట్–ఫ్రీ షాంపూతో తలస్నానం చేయాలి. తడి జుట్టును అస్సలు ముడివేయవద్దు. తేమ ఉన్నట్లయితే కుదుళ్ళు బలహీనపడతాయి. జుట్టును గాలికి సహజంగా ఆరనివ్వాలి. జుట్టు చిక్కులు తీయడానికి వెడల్పాటి పళ్ళున్న దువ్వెనను ఉపయోగించాలి.
వారానికి రెండు మూడుసార్లు మాత్రమే తలస్నానం చేయాలి, లేదంటే జుట్టు నిర్జీవంగా మారుతుంది. శరీరంలో పోషకాల లోపం వల్ల కూడా వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతుంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, బాదం వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజంతా సరిపడా నీరు తాగడం వల్ల కుదుళ్ళు తేమగా, బలంగా ఉంటాయి. దువ్వెనలు, పిల్లో కవర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.


