Meet Dr.Stuti Khare Shukla-India's Hair Growth Queen | Meet Dr Stuti Khare Shukla-India Hair Growth Queen Bringing Hope to Hair Loss Patients | Sakshi
Sakshi News home page

Meet Dr.Stuti Khare Shukla-India's Hair Growth Queen

Nov 14 2026 11:00 AM | Updated on Nov 14 2026 11:00 AM

Meet Dr Stuti Khare Shukla-India Hair Growth Queen Bringing Hope to Hair Loss Patients

మీడియా, భారతదేశ ప్రభుత్వం నుంచి పలు పురస్కారాలను అందుకున్న ప్రముఖ డెర్మటాలజిస్ట్, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెయిర్ స్పెషలిస్ట్ డాక్టర్ స్తుతి ఖరే శుక్లా (Dr. Stuti Khare Shukla)ను అంతా ‘హెయిర్ గ్రోత్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తుంటారు. వీఐపీల నుంచి అన్ని వర్గాల ప్రజల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగులకు ఆమె సేవలు అందిస్తున్నారు. జుట్టు రాలే సమస్య, బట్టతల సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఆమె హెయిర్ రీస్టొరేషన్ (జుట్టు పునరుద్ధరణ) సేవల ద్వారా ఆశాకిరణంగా నిలిచారు. బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఆమె అందించే ఫలితాలపై నమ్మకం ఉంచారు.

డాక్టర్ స్ఫుతి రూపొందించిన సిగ్నేచర్ ఇన్నోవేషన్లలో నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ బూస్టర్ (Hair Growth Booster) చికిత్స ఒకటి. ఇది కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో చేసే శస్త్రచికిత్స రహిత (నాన్-సర్జికల్) విధానం. ఎలాంటి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా, సర్జరీకి సంబంధించిన అసౌకర్యం కలగకుండా జుట్టు పెరిగేందుకు ఈ ట్రీట్‌మెంట్ ఒక చక్కటి మార్గాన్ని అందిస్తుంది. జుట్టు రాలే సమస్య, బట్టతలకు శస్త్రచికిత్స రహిత ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

నాన్-సర్జికల్ హెయిర్ రీగ్రోత్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘హెల్త్‌కేర్ లీడర్’ గుర్తింపు లభించింది. ఇటీవల జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2026’ పోటీలకు సంబంధించి సుస్మితా సేన్, సెలీనా జైట్లీ, ఊర్వశి రౌతేలా వంటి ప్రముఖులతో పాటు ఆమె జ్యూరీ ప్యానెల్‌లో సభ్యురాలిగా వ్యవహరించారు.

అంతర్జాతీయ విద్య.. అధునాతన శిక్షణ

డాక్టర్ స్తుతి ఖరే శుక్లా విద్యాపరమైన ప్రయాణంలో భారతదేశంలో డెర్మటాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ శిక్షణతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వైద్య సంస్థలలో ప్రసిద్ధ కాస్మెటిక్‌ సర్జన్‌ల ఆధ్వర్యంలో నాలుగు అంతర్జాతీయ ఫెలోషిప్‌లు ఉన్నాయి.

ఆమె పూర్తి చేసిన అంతర్జాతీయ ఫెలోషిప్‌లు

  • యూఎస్ఏలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాక్టర్ జెయిన్ ఒబాగి సెంటర్‌లో ‘అడ్వాన్స్‌డ్ స్కిన్ హెల్త్ ట్రీట్‌మెంట్స్’లో ఫెలోషిప్.

  • యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని నాష్‌విల్లేలో ఉన్న డాక్టర్ గోల్డ్ స్కిన్ కేర్ సెంటర్‌లో ‘కాస్మెటిక్ డెర్మటాలజీ’లో ఫెలోషిప్.

  • సింగపూర్‌లోని నేషనల్ స్కిన్ సెంటర్‌లో డెర్మటోసర్జరీలో ఫెలోషిప్.

  • బ్యాంకాక్‌లోని సిరిరాజ్ హాస్పిటల్‌లో ‘లేజర్స్’ విభాగంలో ఫెలోషిప్.

అంతర్జాతీయ శిక్షణను పూర్తి చేసుకున్న తర్వాత జుట్టు ఎదుగుదల చికిత్సల రంగంలో ఒక మైలురాయిని సృష్టించాలనే దృక్పథంతో ఆమె భారతదేశానికి తిరిగి వచ్చారు.

ఆమె క్లినిక్ నెట్‌వర్క్ అయిన ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్తెటిక్స్’ (The Elements of Aesthetics), ముంబై, హైదరాబాద్, నాగ్‌పూర్ వంటి నగరాల్లో తన సేవలను విస్తరించి రోగులకు చికిత్సనందిస్తోంది.

హైదరాబాద్‌లో ఓపీడీ సేవలు

డాక్టర్ స్తుతి ఖరే శుక్లా నవంబర్ 21, 22 తేదీల్లో హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ఉన్న ‘ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్తెటిక్స్’ క్లినిక్‌లో ఓపీడీ ద్వారా సంప్రదింపులకు అందుబాటులో ఉంటారు.

నేరుగా క్లినిక్‌కు రాలేనివారు ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. దీనివల్ల వారు తమ ఇంట్లోనే ఉండి నిపుణుల సలహాలు పొందే అవకాశం లభిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా జుట్టు రాలే సమస్య బాధితులకు చేరువవుతూ..

నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్స్‌లో డాక్టర్ స్తుతి ఖరే శుక్లా చేసిన కృషి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా, మధ్య ప్రాచ్యం (మిడిల్ ఈస్ట్), ఇతర ఆసియా దేశాల నుంచి కూడా రోగులు ఆమెను సంప్రదిస్తున్నారు.

నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్ విధానం కోసం అనేక మంది అంతర్జాతీయ రోగులు ఆమెను ఆశ్రయిస్తున్నారు. భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా రోగులు ఆమె నైపుణ్యాన్ని, చికిత్స మార్గదర్శకత్వాన్ని పొందేలా ఆన్‌లైన్ కన్సల్టేషన్లు ఎంతగానో దోహదపడ్డాయి.

అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన హరీష్ రెడ్డి తీవ్రమైన బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. అనేక రకాల ట్రీట్‌మెంట్‌లను పరిశీలించినప్పటికీ ఆయన ఆశించిన ఫలితం దక్కలేదు. చివరకు ఆయన ఆన్‌లైన్ కన్సల్టేషన్ ద్వారా డాక్టర్ స్తుతిని సంప్రదించారు. ఆ ట్రీట్‌మెంట్ తర్వాత తన జుట్టు ఎదుగుదలలో గణనీయమైన మెరుగుదల వచ్చినట్లు ఆయన తెలిపారు.

సాంకేతికత కారణంగా ప్రత్యేకమైన హెయిర్ కేర్ సేవలు మరింత సులభతరమయ్యాయి. దీనివల్ల ప్రపంచంలోని వివిధ ప్రాంతాల రోగులు భారత్‌కు ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే చికిత్స విధానాలను తెలుసుకోగలుగుతున్నారు.

తీవ్రమైన బట్టతల కారణంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ (జుట్టు మార్పిడి) చేసుకోవడానికి తగిన అర్హత లేని రోగులతో కూడా డాక్టర్ స్తుతి పనిచేస్తున్నారు. అలాంటి రోగులకు ఆమె అందించే నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్ వారి వ్యక్తిగత పరిశీలన ఆధారంగా మరొక చక్కటి మార్గంగా మారుతుంది.

ఆమె క్లినికల్ సేవలలో అధునాతన స్థాయి బట్టతల, వంశపారంపర్యంగా వచ్చే జుట్టు రాలే సమస్య, అరుదైన జన్యుపరమైన జుట్టు సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, పీసీఓడీ (PCOD) వల్ల వచ్చే జుట్టు రాలే సమస్యలు వంటి ఎన్నో క్లిష్టమైన అంశాలు ఉన్నాయి.

పరిశోధన, ఆవిష్కరణ, గ్లోబల్ కొలాబరేషన్స్

క్లినికల్ సేవలతో పాటు డాక్టర్ స్తుతి రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (R&D) కార్యకలాపాలలో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. జుట్టు సంరక్షణ ఉత్పత్తుల డెర్మటాలజికల్ మూల్యాంకనం కోసం ఆమె పారిస్‌లోని అధునాతన ల్యాబ్‌ బృందాలతో సహకరిస్తున్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, వైద్యులతో కలిసి పనిచేస్తున్నారు.

ప్రముఖ అమెరికన్ జర్నల్స్‌లో 10కి పైగా అంతర్జాతీయ రీసెర్చ్ పబ్లికేషన్స్‌ను ఆమె రచించారు. పలు అంతర్జాతీయ సంస్థలకు కీలక అభిప్రాయ నాయకులుగా (Key opinion leader) సేవలందిస్తున్నారు. పారిస్, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

ఆమె సిగ్నేచర్ ‘హెయిర్ గ్రోత్ బూస్టర్’ చికిత్స ఫలితాలు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆమోదించిన జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ ట్రీట్‌మెంట్‌కు ఎఫ్‌డీఏ (FDA) ఆమోదం కూడా లభించిందని, ఇది దీని అంతర్జాతీయ గుర్తింపును మరింత పెంచిందని పేర్కొన్నారు.

నాన్-సర్జికల్ హెయిర్ రెస్టోరేషన్ టెక్నిక్స్‌లో వివిధ దేశాలకు చెందిన వైద్యులు కూడా ఆమె వద్ద శిక్షణ పొందుతున్నారు. ఇది ఈ రంగంలో పెరుగుతున్న ఆసక్తిని ప్రతిబింబిస్తోంది.

డాక్టర్ స్తుతి గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే..

నాన్-సర్జికల్ హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్స్‌లో డాక్టర్ స్తుతి ఖరే శుక్లా చేస్తున్న కృషిని, ఆమెను ‘హెయిర్ గ్రోత్ క్వీన్’ అని ఆప్యాయంగా పిలుచుకునే రోగుల అనుభవాలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ పేజీ @dr.stutikhareshukla ద్వారా తెలుసుకోవచ్చు.

డాక్టర్ స్తుతి ఖరే శుక్లా హెయిర్ గ్రోత్ ట్రీట్‌మెంట్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ క్రింది ప్లాట్‌ఫారమ్‌లను సందర్శించండి.

Instagram: https://instagram.com/dr.stutikhareshukla

Website: https://www.drstutikhareshukla.in/

YouTube: https://youtube.com/@DrStutiKhareShukla

Email: drstutikhareshukla@gmail.com

అపాయింట్‌మెంట్ విచారణల కోసం కాల్ లేదా వాట్సాప్ చేయాల్సిన నంబర్‌: +91 626 196 7835

హైదరాబాద్ ఓపీడీ: నవంబర్ 21, 22 తేదీలు

చిరునామా: ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్తెటిక్స్, బంజారా హిల్స్, హైదరాబాద్

Disclaimer: ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్తెటిక్స్ క్లినిక్స్ ద్వారా ఈ కంటెంట్ రూపొందించబడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement