కొత్త ఇన్వెస్టర్ల కోసం పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్ లాంచ్
పరిశోధనాత్మక ఇన్‌సైట్‌లతో పోర్ట్‌ఫోలియోల రూపకల్పన, సమీక్ష, ఆప్టిమైజేషన్‌కు వీలు
ఫోన్‌పే తన ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ అయిన షేర్.మార్కెట్‌ను ఫోన్‌పే ఇన్వెస్ట్‌గా మార్చినట్లుగా ప్రకటించింది. దీన్ని ఫోన్‌పే బ్రాండ్ కిందకు తీసుకొచ్చామని తెలిపింది.
షేర్.మార్కెట్ నుంచి ఫోన్‌పే ఇన్వెస్ట్‌గా రూపాంతరం చెందడం వల్ల, పేమెంట్‌లు, లోన్‌లు, ఇన్సూరెన్స్‌తో పాటు, పరిశోధన ఆధారిత వెల్త్ మేనేజ్‌మెంట్ కూడా ఫోన్‌పే ఏకీకృత ఆర్థిక వ్యవస్థలోకి చేరుతుంది. ఇది వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీస్‌లను ఎక్కువ మంది యూజర్‌లకు చేరువ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది, దీంతో ఫోన్‌పేలో ఉన్న అతిపెద్ద, విభిన్నమైన యూజర్‌ల సమూహానికి ఇన్వెస్ట్ చేయడం మరింత సులభతరం అవుతుంది.
ఈ మార్పులో భాగంగా.. ఫోన్‌పే ఇన్వెస్ట్ తన స్టాక్స్, IPO, మ్యూచువల్ ఫండ్, F&O సౌకర్యాలను, కొత్తగా లాంచ్ చేసిన పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్‌తో జత చేస్తుంది. ఇది ఒక సమగ్రమైన, సొంత పోర్ట్‌ఫోలియో ఇంటెలిజెన్స్ టూల్. ఇది యూజర్‌ల ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను ఒకే చోట సులభంగా రూపొందించడంలో, సమీక్షించడంలో, మరింత మెరుగుపరుచుకోవడంలో సహాయపడుతుంది.
ఈ 'పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్' అనేది ఇన్వెస్ట్‌మెంట్లు చేయడమే కాకుండా, ఇన్వెస్టర్‌ల జర్నీలో ప్రతి దశలోనూ తోడుగా ఉంటుంది - అంతగా అనుభవం లేని ఇన్వెస్టర్‌లకు సులభమైన టూల్స్‌తో దారి చూపిస్తూ, అనుభవజ్ఞులకు వారి పోర్ట్‌ఫోలియోలపై లోతైన, ఆచరణలోకి తీసుకురాగల ఇన్‌సైట్‌లను అందించి వారికి ఇన్వెస్టింగ్‌పై మరింత పట్టునిస్తుంది.

పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్ సామర్థ్యాల్లో కింది అంశాలు ఉంటాయి:
బిల్డ్ (రూపకల్పన) - కొత్త ఇన్వెస్టర్లు ఎలాంటి అయోమయం లేకుండా, పూర్తి నమ్మకంతో తమ ఇన్వెస్టింగ్ జర్నీని ప్రారంభించడానికి, అలాగే ఒక మంచి పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడానికి ఇది సహాయపడుతుంది.
సమీక్ష - ఇన్వెస్టర్ల అన్ని డీమ్యాట్ అకౌంట్‌లలో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్లు అన్నింటినీ ఒకే చోట చూపిస్తూ, పోర్ట్‌ఫోలియో నాణ్యత, వైవిధ్యంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. అంతేకాక, రీసెర్చ్ ఆధారిత ‘హోల్డ్ చేయండి, పర్యవేక్షించండి, లేదా అమ్మండి’ రేటింగ్స్‌తో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
ఆప్టిమైజ్ - ఇన్వెస్టర్‌లు కేవలం “వన్-క్లిక్‌తో” తమ ఫోన్‌పే ఇన్వెస్ట్ పోర్ట్‌ఫోలియో హెల్త్‌ను మెరుగుపరచుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఇన్వెస్టర్‌లు తక్కువ పనితీరు కనబరుస్తున్న అసెట్‌లు, ఏదైనా రంగంలో ఇన్వెస్ట్‌మెంట్లను కేంద్రీకరించడం వల్ల వచ్చే ముప్పు, అలాగే వారి పోర్ట్‌ఫోలియోను ప్రభావితం చేసే ఇతర కారకాలను గుర్తించి, తమ పోర్ట్‌ఫోలియోలను సజావుగా మరోసారి సమతుల్యం చేసుకోవడానికి తెలివైన ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు.

పోర్ట్‌ఫోలియో డయాగ్నస్టిక్‌లు, ఆచరణాత్మక ఇన్‌సైట్‌లు, రేటింగ్‌లు ఈ అనుభవానికి కేంద్రంగా ఉంటాయి. ఇవి ఇన్వెస్టర్‌లు తమ పోర్ట్‌ఫోలియోను ఏ అంశాలు నడిపిస్తున్నాయో అర్థం చేసుకోవడానికి, అలాగే సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. చురుకైన ఇన్వెస్టర్‌ల కోసం ప్రత్యేకమైన ఫోన్‌పే ఇన్వెస్ట్ యాప్‌లో పోర్ట్‌ఫోలియో ఆప్టిమైజర్ అందుబాటులో ఉంటుంది, అదే సమయంలో సరళంగా అర్థమయ్యే ఎంట్రీ పాయింట్లు, మార్గదర్శకంతో చేసే ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలు కూడా సాధారణ యూజర్‌ల కోసం ప్రధాన ఫోన్‌పే యాప్‌తో అనుసంధానమవుతాయి.
ఈ ప్రకటనపై ఫోన్‌పే వ్యవస్థాపకులు & CPTO రాహుల్ చారి మాట్లాడుతూ, “ఫోన్‌పే ఇన్వెస్ట్ అనేది మేము అందిస్తున్న వెల్త్ సర్వీస్‌లలో ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుంది. మేము వెల్త్, బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఫోన్‌పే గుర్తింపు కింద ఏకీకృతం చేస్తుండటం వల్ల, భారతదేశ పేమెంట్ల వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించినట్లుగానే, భారతీయులందరికీ స్మార్ట్ ఇన్వెస్టింగ్‌లోనూ సమాన అవకాశాలు అందించాలనే మా ఆశయాన్ని ఫోన్‌పే ఇన్వెస్ట్ బ్రాండ్ ప్రతిబింబిస్తుంది. ఇన్వెస్టర్‌లు తమ పోర్ట్‌ఫోలియోలను రూపొందించుకోవడానికి, సమీక్షించుకోవడానికి, ఆప్టిమైజ్ చేసుకోవడానికి వీలు కల్పించే స్మార్ట్ ప్రోడక్ట్‌లు, టూల్స్‌ను మేము ఒకేచోటకు తీసుకొస్తున్నాము. భారతదేశవ్యాప్తంగా చాలా మంది తమ వెల్త్ క్రియేషన్ జర్నీని ప్రారంభిస్తుండటం వల్ల, వారు సులభంగా, మరింత అవగాహనతో ఇన్వెస్ట్ చేసేలా మార్చడమే మా లక్ష్యం, దీంతో ప్రజలు తమ ఇన్వెస్ట్‌మెంట్ నిర్ణయాలపై పూర్తి నియంత్రణతో ఉంటూనే ఆత్మవిశ్వాసంతో ఇన్వెస్ట్ చేయగలరు” అని అన్నారు.
ప్రస్తుత షేర్.మార్కెట్ యూజర్‌ల డీమ్యాట్ హోల్డింగ్‌లు, బ్యాలెన్స్‌లు, వాచ్‌లిస్ట్‌లు, ఆర్డర్ హిస్టరీ, లాగిన్ వివరాలు కొత్త ఐడెంటిటీ కింద కూడా యథాతథంగా కొనసాగుతాయి. మరిన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఫీచర్‌లతో నిరాటంకంగా వాటి ట్రేడింగ్‌ను కొనసాగించవచ్చు. ఈ మార్పు వల్ల ప్రస్తుత బ్రోకరేజ్ విధానాలు, ఫీజు ప్లాన్‌లు లేదా వార్షిక నిర్వహణ ఛార్జీలలో (AMCలలో) ఎలాంటి మార్పులు ఉండవు.


