దంపతుల బలవన్మరణం | Tragic incident took place in Nandyal | Sakshi
Sakshi News home page

దంపతుల బలవన్మరణం

Sep 30 2026 4:33 AM | Updated on Sep 30 2026 4:33 AM

Tragic incident took place in Nandyal

కిరణ్‌–మౌనిక (ఫైల్‌)

షేర్‌మార్కెట్‌ పెట్టుబడుల్లో నష్టపోయిన భార్య 

భర్తకు తెలుస్తుందేమోనన్న భయంతో ఉరేసుకుని ఆత్మహత్య 

భార్య మృతిని జీర్ణించుకోలేక భర్త బలవన్మరణం

బొమ్మలసత్రం: భర్తకు తెలియకుండా ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను విక్రయించి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయిన భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నంద్యాలలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలలోని రోజకుంట వీధికి చెందిన కిరణ్‌(45), మౌనిక(35) దంపతులు. వీరికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు(ఒకరికి ఏడేళ్లు, ఒకరికి ఐదేళ్లు) ఉన్నారు. 

కిరణ్‌ నంద్యాల సంజీవనగర్‌ రామాలయం కాంప్లెక్స్‌లో బుక్‌స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం షేర్‌మార్కెట్‌లో పెట్టుబడులు పెడితే అధిక లాభం వస్తుందని కొందరు చెబితే ఆమె నమ్మింది. భర్తకు తెలియకుండా బంగారు ఆభరణాలు విక్రయించి షేర్‌మార్కెట్‌లో పెట్టుబడి పెట్టింది. తాను పెట్టుబడి పెట్టిన కంపెనీలో నష్టాలు రావడంతో భర్తకు చెప్పటానికి భయపడిపోయింది. 

మంగళవారం సా­యంత్రం భర్త బుక్‌స్టోర్‌కు వెళ్లిన తర్వాత ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ ఒక సూసైడ్‌నోట్‌ రాసింది. చీరతో ఫ్యాన్‌­కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య ఎంతకీ ఫోన్‌ తీయకపోవటంతో అ­ను­మానం వచ్చిన భర్త ఇంటికి వచ్చి చూడ­గా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిరణ్‌ సోదరుడు సురేష్ కు విషయం తెలిపి ఆయన ఇంటికి వచ్చేలోగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌నోట్‌ స్వాదీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement