‘బాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది’ | Ysrcp Leader Kurasala Kannababu Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

‘బాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది’

Sep 29 2026 6:44 PM | Updated on Sep 29 2026 7:01 PM

Ysrcp Leader Kurasala Kannababu Fires On Chandrababu

సాక్షి, కాకినాడ‌ జిల్లా: ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా? అంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియంత సామ్రాజ్యంలా‌ ఉందని ప్రజలు అనుకుంటున్నారు.. ప్రశ్నించేవారిని అణిచివేసేలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అధికారులను అడ్డదారుల్లో వాడుకుంటుందన్నారు. 

ఉద్యోగుల పట్ల చంద్రబాబుకు చాలా చులకన. అన్ని వర్గాలాన్నే ప్రభుత్వ ఉద్యోగులు కూడా మోసపోయారు. ఇప్పుడు సచివాలయం ఉద్యోగులు మోసపోయారు. పరిపాలన వికేంద్రీకరణ లక్ష్యంతో వైఎస్ జగన్ సచివాలయాలు ఏర్పాటు చేయాలని విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. 15,004 సచివాలయాలు నిర్మించి.. 1,34,000 ఉద్యోగులను నియమించారు. సచివాలయం వ్యవస్థే వృధా అన్నట్లు మంత్రులు మాట్లాడుతున్నారు’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.

‘‘అక్రమ కేసులు పెట్టి సచివాలయం ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆంద్రజ్యోతిలో సచివాలయాల మీద పచ్చి అబద్దాలను వండి వర్చారు. గ్రామాల్లోకి వెళ్లి సచివాలయాల ఉద్యోగులు ఎలా పని చేస్తున్నారో అడగండి. వైఎస్‌ జగన్ మీద ద్వేషం తప్పా.. మీకు మరేమీ లేదు. ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటానని చంద్రబాబు ఎన్నికల‌ మానిఫెస్టోలో చెప్పారు. తమ‌ హక్కుల కోసం అడిగితే ఉద్యోగులపై కేసులు పెడతారా?.

..చంద్రబాబు చేతిలో పోలీస్ శాఖ కీలు బొమ్మగా మారిపోయింది. సచివాలయం ఉద్యోగులకు ఎలాంటి జీవోలు గత పాలనలో ఇచ్చామో ఆఫీస్‌కి వెళ్లి వెతుక్కోండి. సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తారా? అని సూటిగా చంద్రబాబును అడుగుతున్నా?. సచివాలయ వ్యవస్థను కుదించే కార్యక్రమం చంద్రబాబు చేస్తున్నారు. కోవిడ్‌లో సచివాలయం ఒక యూనిట్‌గా ప్రజలకు సేవలందాయి. సచివాలయం ఉద్యోగులను వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా గౌరవంగా చూసింది. మీ చేతగానితనాన్ని సచివాలయం ఉద్యోగులపై ఎందుకు రుద్దుతారు చంద్రబాబు?

..ఉద్యోగుల‌ మీద ప్రజల్లో నెమ్మదిగా పాయిజన్ ఎక్కిస్తున్నారు. వచ్చిన ప్రభుత్వ ఆదాయం ఉద్యోగులకు సరిపోతుందని చెబుతున్నారు. పి-4 పథకంలో దాతలు దొరకకపోతే.. ఉద్యోగులే దాతలుగా మారాలని ఒత్తిడి తెచ్చారు. ఇప్పడు సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిస్తున్నారు. మీ ఎల్లో మీడియా ఉందని పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకూడదూ?. పెయిడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లను తీసుకువచ్చారు. మీ తండ్రి కొడుకులను వాళ్లు తమ భుజాన ఎత్తుకుని మోయాలి

ఇన్‌ఫ్లుయెన్స్‌ కోల్పోయిన వాళ్లే ఇన్‌ఫ్లుయెన్సర్లను పెట్టుకుంటారు. అసలు సమస్యలను వదిలేసి వైఎస్ జగన్‌పై దూషణలతో ఎంతకాలం నెట్టుకొస్తారు. ఉద్యోగులు ఏం పాపం చేశారని వారిపై మీ రెడ్‌బుక్ ప్రయోగిస్తున్నారు. ఉద్యోగులు వాళ్ల హక్కుల కోసం ప్రశ్నిస్తే తప్పా..? ఎకరం రూ.99 లకు కార్పోరేట్ సంస్థలకు కట్టబెడితే ఒప్పా? అని ఎల్లో‌ మీడియాను అడుగుతున్నా..

..భీమడోలు షుగర్ ఫ్యాక్టరీని పప్పు బెల్లంలా గతంలో చంద్రబాబు అమ్మేశారు. ఇప్పుడు మరికొన్ని సహకార చక్కెర కర్మాగారాలను అమ్మేసే ప్రయత్నం జరుగుతుంది. రైతులు దీనికి ఒప్పుకోవడం లేదు. త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంటే వైఎస్సార్‌సీపీ చూస్తూ ఊరుకోదు. సచివాలయం ఉద్యోగులపై కేసులు పెట్టడం దుర్మార్గం.. అమానుషం’’ అంటూ కురసాల కన్నబాబు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: కొల్లు రవీంద్రకు ఇదే నా ఛాలెంజ్: పేర్ని కిట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement