సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మరో ప్రమాదం జరిగింది. స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్-1లో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాడిల్ నుంచి ద్రవపు ఉక్కు నేలపాలైంది. గతంలో ఇదే విభాగంలో ప్రమాదం జరిగి కార్మికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి ఇవాళ సీడీసీ ప్రారంభమైంది. సీడీసీ తిరిగి ప్రారంభించిన రోజు స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎవరికి ఏమీ కాకపోవడంతో కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.
కాగా, గత జులైలో స్టీల్‌ప్లాంట్ కోకోవేన్ విభాగంలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందారు. ఐరన్ పడటంతో తీవ్ర గాయాలతో మృతిచెందారు. జూన్ నెలలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్లాంట్‌లో తరుచుగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా గ్యాస్ లీకేజ్, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజ్ వంటి ఘటనలు జరుగుతూనే ఉండటంతో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల భద్రత ప్రశ్నార్థకరంగా మారింది.
ఇదీ చదవండి: తిరుపతిలో ఘోర ప్రమాదం


