కూరగాయలలో రారాజు | Asia Continues to Lead in Eggplant Production | Sakshi
Sakshi News home page

కూరగాయలలో రారాజు

Aug 16 2026 3:00 AM | Updated on Aug 16 2026 3:00 AM

Asia Continues to Lead in Eggplant Production

వంకాయ దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతుంది. ఏడాది పొడవునా పండుతుంది. వంకాయ ప్రస్తావన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. బహు భాషలలో కవుల ప్రశంసలు పొందిన ఘనత కూరగాయలలో వంకాయకు మాత్రమే ప్రత్యేకం. వంకాయ తొలుత భారత్‌ సహా దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలలో పండేది. ఈ ప్రాంతం నుంచి పశ్చిమాసియాకు, ఉత్తరాఫ్రికాకు చేరింది. అక్కడి నుంచి మధ్యయుగాల నాటికి యూరోప్‌ దేశాలకు చేరింది. వంకాయలో వందలాది రకాలు ఉన్నాయి. వంకాయతో వందలాది వంటకాలు ఉన్నాయి. వంకాయ ఉత్పాదనలో ఇప్పటికీ ఆసియా దేశాలే ముందంజలో ఉంటున్నాయి. వంకాయ విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం.

వంకాయలో పోషకాలు
బరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి వంకాయ తగిన ఆధరువు. వంకాయలో అతి తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో కొవ్వులు నామమాత్రంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల వంకాయలు 20 కిలోకేలరీల శక్తిని మాత్రమే ఇస్తాయి. వంకాయలోని పోషకాల వివరాలు...

వంకాయ ఉత్పాదనలో చైనా, భారత్‌ మొదటి రెండు స్థానల్లో ఉన్నా, ఎగుమతుల విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. వంకాయలు ఎక్కువకాలం నిల్వ ఉండవు. కాబట్టి వీటిని సుదూర దేశాలకు ఎగుమతి చేయడం దాదాపు అసాధ్యం. తగిన చల్లదనంలో భద్రపరచి, సమీప దేశాల్లోని మార్కెట్‌లలోకి మాత్రమే వీటిని ఎగుమతి చేసే వీలుంటుంది. వంకాయ ఎగుమతుల గణాంకాలు చూద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement