నారికేళ వైభవం | World Coconut Day is celebrated every year on September 2nd | Sakshi
Sakshi News home page

నారికేళ వైభవం

Aug 30 2026 3:41 AM | Updated on Aug 30 2026 3:41 AM

World Coconut Day is celebrated every year on September 2nd

సెప్టెంబర్‌ 2 వరల్డ్‌ కోకోనట్‌ డే

మన దేశంలో కొబ్బరి వేలాది సంవత్సరాలుగా వినియోగంలో ఉంది. మన దేశమే కాదు, ఇండో–పసిఫిక్‌ ప్రాంతం అంతటా కొబ్బరి వినియోగం అప్పటి నుంచే ఉంది. మన దేశంలో కొబ్బరికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. సంస్కృతంలో నారికేళఫలంగా పిలుచుకొనే కొబ్బరిని పూజాదికాల్లోను, యజ్ఞయాగాలలోను, శుభకార్యాలలోను విరివిగా ఉపయోగిస్తారు. నారికేళాన్ని ‘శ్రీఫలం’ అని కూడా అంటారు. ఆధ్యాత్మిక ప్రశస్తి అటుంచితే, కొబ్బరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి పీచును, కొబ్బరి కలపను వివిధ రకాల వస్తువుల తయారీ కోసం పారిశ్రామికంగా కూడా వినియోగిస్తుంటారు. కొబ్బరి ఉత్పాదనలో మన దేశం రెండో స్థానంలో ఉంది. కొబ్బరి విశేషాలను గణాంకాలలో తెలుసుకుందాం.

కొబ్బరికాయలోను, కొబ్బరినీరులోను పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొబ్బరికాయలో తినే భాగంలో ఎక్కువగా కొవ్వులు ఉంటాయి. దీని నుంచే కొబ్బరి నూనె తీస్తారు. కొబ్బరి తురుమును, కొబ్బరి నూనెను రకరకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. కొబ్బరినీరు వేసవిలో దాహార్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరినీటిలోని ఖనిజాలు తక్షణ శక్తినిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement