అందం కోసం సరికొత్త టెక్నాలజీ.. పూర్వీకుల పద్ధతులు కూడా భలే! | Led Pimple Patch Almond Oil And Ancient Hair Care Tips | Sakshi
Sakshi News home page

అందం కోసం సరికొత్త టెక్నాలజీ.. పూర్వీకుల పద్ధతులు కూడా భలే!

Sep 20 2026 1:36 PM | Updated on Sep 20 2026 1:39 PM

Led Pimple Patch Almond Oil And Ancient Hair Care Tips

ఫండే

బ్యూటీజర్‌

ఒకప్పుడు పింపుల్స్‌ వస్తే తెగ టెన్షన్‌ పడిపోయేవారు. కానీ నేటితరం వాటిని ఒక ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌లా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. సరిగ్గా ఈ మైండ్‌సెట్‌ను క్యాచ్‌ చేస్తూ, నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ స్కిన్‌ కేర్‌ బ్రాండ్‌ ఫేవ్స్‌ ఒక సూపర్‌ కూల్‌ ప్రొడక్ట్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. అదే... ‘క్లారిఫైయింగ్‌ ఎల్‌ఈడీ ప్యాచ్‌ ’. క్యాట్‌ షేప్, బ్రైట్‌ ఆరెంజ్‌ షేడ్‌లో ఉండి, సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈ డివైజ్‌ మొటిమలను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తుంది.

ఈ పరికరంలో రెండు రకాల ఎల్‌ఈడీ లైట్లు (బ్లూ, రెడ్‌) ఉంటాయి. బ్లూ లైట్‌ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపివేస్తుంది. రెడ్‌ లైట్‌ పింపుల్స్‌ వల్ల వచ్చే ఎరుపుదనం, మంట, వాపును తగ్గించి చర్మాన్ని కూల్‌గా ఉంచుతుంది. ఈ రెండింటి కాంబినేషన్‌ వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా చర్మ రంధ్రాల పరిమాణం తగ్గి, స్కిన్‌ గ్లోయింగ్‌గా, స్మూత్‌గా మారుతుంది.

మెరిపించే ఆల్మండ్‌..
జుట్టు సంరక్షణకు అత్యంత ప్రభావవంతమైన సహజ నూనెల్లో బాదం నూనె ఒకటి. ఇందులో ఉండే విటమిన్‌ ‘ఇ’, బయోటిన్‌ కుదుళ్లను దృఢంగా మార్చి, జుట్టు రాలడాన్ని తగ్గించి వేగంగా పెరిగేలా చేస్తాయి. ఈ నూనె జుట్టు పొడిబారడాన్ని నివారించి, చిక్కులు పడకుండా సిల్కీగా, మెరిసేలా చేస్తుంది.

అలాగే ఇందులోని యాంటీఫంగల్‌ గుణాలు తలలో వచ్చే చుండ్రు, దురదను తగ్గిస్తాయి. బాదం నూనె మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది. గోరువెచ్చని నూనెను తలకు పట్టించి.. రాత్రంతా అలాగే ఉంచి మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఏనుగు దంతాలే దువ్వెనలు!
ప్రాచీన కాలంలో ప్లాస్టిక్‌ దువ్వెనలు లేవు. ఆ రోజుల్లో సహజ సిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన దువ్వెనలను మాత్రమే వాడేవారు. రాజుల కాలంలో రాజకుటుంబాలు ఏనుగు దంతాలు లేదా ఎద్దుల కొమ్ములతో తయారు చేసిన దువ్వెనలను ఉపయోగించేవారు. జుట్టును దువ్విన తర్వాత దాన్ని కాపాడుకోవడానికి ప్రత్యేకమైన ముడులు వేసుకునేవారు.

సామాన్య ప్రజలు వేప, గంధపు చెక్కతో చేసిన దువ్వెనలను ఉపయోగంచేవారు. వీటివల్ల తలలో ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు, చుండ్రు రాకుండా ఉండేవి. ఆవునేతిని మూలికలతో కలిపి కాచి జుట్టుకు పట్టించేవారు. జుట్టుకు సహజమైన సువాసన లభించేందుకు సంపెంగ, మల్లె, గులాబీ పువ్వులను జడలో తురుముకునేవారు.

ఇదీ చదవండి: ఎగరలేని రామచిలుక కోసం.. యజమాని ఐడియా ఇప్పుడు వైరల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement