జుట్టు రాలే సమస్యకు స్మార్ట్ టెక్నాలజీ! | Helmet-Like LED Device Hits Market to Help Combat Hair Loss | Sakshi
Sakshi News home page

జుట్టు రాలే సమస్యకు స్మార్ట్ టెక్నాలజీ!

Aug 9 2026 3:53 AM | Updated on Aug 9 2026 3:53 AM

Helmet-Like LED Device Hits Market to Help Combat Hair Loss

నేటి ఆధునిక జీవనంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడమనేది సహజమైపోయింది. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు అచ్చంగా హెల్మెట్‌లా కనిపించే అత్యాధునిక పరికరం మార్కెట్‌లోకి చేరింది. అదే ‘లో లెవల్‌ లైట్‌ థెరపీ’ ఆధారంగా పనిచేసే కరెంట్‌ బాడీ స్కిన్‌ ఎల్‌ఈడీ హెయిర్‌ గ్రోత్‌ డివైస్‌. సర్జరీలతో పనిలేకుండా, నాన్‌–ఇన్వేసివ్‌ పద్ధతిలో పనిచేసే ఈ పరికరంలో 120 ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. ఇవి తల ఉపరితలం అంతటా నిర్దిష్ట కాంతి తరంగాలను ప్రసరింపజేసి కుదుళ్లను తిరిగి ఉత్తేజపరుస్తాయి.

అమెరికాకు చెందిన ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆమోదం పొందిన ఈ హెడ్‌సెట్‌ స్త్రీ, పురుషులిద్దరిలోనూ హార్మోన్ల వల్ల లేదా జన్యుపరంగా వచ్చే జుట్టు నష్టాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాల చొప్పున, 16 వారాలు దీనిని వాడితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ డివైస్‌ కేవలం హెయిర్‌ కేర్‌కే పరిమితం కాకుండా వినోదాన్ని కూడా పంచుతుంది. ఇందులో బ్లూటూత్‌ హెడ్‌పోన్స్‌ కూడా ఉంటాయి. చికిత్స పొందుతున్న సమయంలో తమకు ఇష్టమైన పాటలు, 
పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement