breaking news
Hair problem
-
జుట్టు రాలే సమస్యకు స్మార్ట్ టెక్నాలజీ!
నేటి ఆధునిక జీవనంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలడమనేది సహజమైపోయింది. జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు అచ్చంగా హెల్మెట్‌లా కనిపించే అత్యాధునిక పరికరం మార్కెట్లోకి చేరింది. అదే ‘లో లెవల్ లైట్ థెరపీ’ ఆధారంగా పనిచేసే కరెంట్ బాడీ స్కిన్ ఎల్ఈడీ హెయిర్ గ్రోత్ డివైస్. సర్జరీలతో పనిలేకుండా, నాన్–ఇన్వేసివ్ పద్ధతిలో పనిచేసే ఈ పరికరంలో 120 ఎల్ఈడీ బల్బులను అమర్చారు. ఇవి తల ఉపరితలం అంతటా నిర్దిష్ట కాంతి తరంగాలను ప్రసరింపజేసి కుదుళ్లను తిరిగి ఉత్తేజపరుస్తాయి.అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం పొందిన ఈ హెడ్సెట్ స్త్రీ, పురుషులిద్దరిలోనూ హార్మోన్ల వల్ల లేదా జన్యుపరంగా వచ్చే జుట్టు నష్టాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ 10 నిమిషాల చొప్పున, 16 వారాలు దీనిని వాడితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు. ఈ డివైస్ కేవలం హెయిర్ కేర్కే పరిమితం కాకుండా వినోదాన్ని కూడా పంచుతుంది. ఇందులో బ్లూటూత్ హెడ్‌పోన్స్ కూడా ఉంటాయి. చికిత్స పొందుతున్న సమయంలో తమకు ఇష్టమైన పాటలు, పాడ్‌కాస్ట్‌లు వినవచ్చు. -
2 స్పూన్లు టీ ... 2 కప్పుల నీళ్లు...
వెంట్రుకల చివర్లు చిట్లడం, పొడిబారడం, జీవం లేనట్టుగా కనిపించడం.. ఇలాంటి శిరోజాల సమస్యలు చాలామంది ఎదుర్కొంటూ ఉంటారు. పరిష్కారం... వారానికి ఒకసారి 2 కప్పుల నీళ్లు.. 2 స్పూన్ల టీ.తేయాకును నీళ్లలో వేసి పది నిమిషాలు మరిగించి, చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేశాక, నీళ్లన్నీ పోయేలా తుడవాలి. తర్వాత టీ నీళ్లతో జుట్టు అంతా తడి చేయాలి చివర్లతో సహా!10 నిమిషాలు వదిలేయాలి. ఆ తర్వాత నీళ్లతో కడిగేయాలి. తేయాకులో ఉండే ఔషధ గుణాలు వెంట్రుక కుదుళ్లకు బలాన్నిచ్చి, మంచి కండిషనర్‌లా ఉపయోగపడి మెరుపు వస్తుంది. జుట్టు రాలే సమస్యా తగ్గుతుంది.


