బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
సాధారణంగా విలువైన లోహాలు అంటే చాలామందికి బంగారం, వెండి గుర్తుకొస్తాయి. దీంతో వీటికి డిమాండ్ ఎక్కువై.. రేటు కూడా పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో రాగి ధరలు కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ రేటు 12000 డాలర్లు దాటేసింది.2025లో బంగారం, వెండి ధరలు వరుసగా 70 శాతం, 140 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రాగి రేటు ఏకంగా 35 శాతం పెరిగిపోయింది. 2009 తరువాత కాపర్ రేటు ఇంతలా పెరగడం బహుశా ఇదే మొదటిసారి. దీంతో నిపుణులు దీనిని కొత్త బంగారం లేదా కొత్త వెండి అని పిలుస్తున్నారు.రాగి ధరలు భారీగా పెరగడానికి కారణాలుమార్కెట్లో రాగి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం..భౌగోళిక, రాజకీయ కారణాలు.రాగిని ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో, డేటా సెంటర్లలో, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో వినియోగించడంఅమెరికా విధించిన సుంకాలు కూడా రాగి ధర పెరగడానికి ఓ కారణం అనే చెప్పాలి. సుంకాల కారణంగా.. రాగి రేటు భవిష్యత్తులో పెరుగుతుందేమో అని చాలామంది దీనిని నిల్వ చేసుకుంటున్నారు. దీంతో సరఫరా తగ్గిపోయి.. డిమాండ్ పెరుగుతోంది. డిమాండుకు తగిన సరఫరా లేకపోవడం వల్ల.. ధర పెరిగింది.రాగి ఉత్పత్తి తగ్గడం కూడా సరఫరా తగ్గడానికి కారణమైంది.
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెల్లింగ్టన్: తమ నుంచి తమ ఐదేళ్ల కుమారుడిని దూరం చేయొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఓ భారతీయ కుటుంబం అభ్యర్థిస్తోంది. ‘ మా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కానీ అతన్ని మా నుంచి దూరం చేస్తే మా కుటుంబం చిద్రమవుతుంది’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి వీసా విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో చూడాలని వారు కోరుతున్నారు.న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. భారత్‌కు చెందిన నితిన్ మాంకీల్, ఆయన భార్య అపర్ణ జయంధన్ గీత ఆక్లాండ్‌లో నివసిస్తున్నారు. ఇద్దరు వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు ఐదేళ్ల ఐదన్ నితిన్ (Aidhan Nithin). ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అతనికి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే అతన్ని భారత్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే ఐధాన్ వీసా విషయంపై న్యూజిలాండ్ అసోసియేట్ ఇమ్మిగ్రేషన్ మంత్రి హాన్ క్రిస్ పెంక్కు రెండుసార్లు అప్పీలు చేశారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐధాన్ ఆరోగ్య పరిస్థితి దేశంలోని ఆరోగ్య, విద్యా సేవలపై అధిక భారం అవుతుందని అధికారులు భావించారు. తల్లిదండ్రులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్నప్పటికీ బాలుడికి వీసాను తిరస్కరించింది. వీసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదన్ నితిన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థిక సహాయం కోరడం లేదని, ఆటిజం సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడి పట్ల మానవతా కోణంలో వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.ఈ ఘటన న్యూజిలాండ్‌లో వలస విధానాలపై మానవతా కోణం ఎంత ముఖ్యమో మరోసారి బయటపెట్టింది. ఆటిజం బాధిత బాలుడిని డిపోర్ట్ చేయాలన్న నిర్ణయం స్థానికులు, భారతీయ వలసదారులు, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు న్యూజిలాండ్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది.
నకిలీ ఆరోగ్య ఉత్పత్తులతో జాగ్రత్త
నేటి కాలంలో ఆరోగ్యం మరియు పోషణ మన రోజువారీ జీవితంలో విడదీయరాని భాగాలుగా మారాయి. మనం తీసుకునే ఉత్పత్తులపై నమ్మకం గతంలో కంటే ఎంతో ముఖ్యమైంది. అయితే నకిలీ ఆరోగ్య ఉత్పత్తుల పెరుగుతున్న ముప్పు ఈ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. ఇది అసలైన బ్రాండ్లకే కాదు, వినియోగదారుల ఆరోగ్యానికీ తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పోషణ మరియు వెల్నెస్ సంస్థ అయిన హెర్బలైఫ్ ఇండియా, నకిలీ ఉత్పత్తులపై అవగాహన పెంచేందుకు మరియు ఆరోగ్యం వెల్నెస్ రంగంలో అసలితనం యొక్క ప్రాధాన్యతను తెలియజేయేందుకు ఒక శక్తివంతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది.నకిలీ పోషక సప్లిమెంట్లు చాలాసార్లు నియంత్రణలేని కేంద్రాల్లో తయారవుతాయి. అక్కడ భద్రత, ప్రభావాన్ని నిర్ధారించడానికి అవసరమైన కఠినమైన పరీక్షలు మరియు నాణ్యత తనిఖీలు ఉండవు. ఇవి ఒకే విధమైన ప్యాకేజింగ్, లేబుళ్లతో అసలైనవిగా కనిపించవచ్చు; కానీ వాటిలో ధృవీకరించని లేదా హానికరమైన పదార్థాలు ఉండే అవకాశముంది. హెర్బలైఫ్ ఇండియా తాజా అవగాహన ప్రచారం వినియోగదారులకు ఈ ప్రమాదాల గురించి తెలియజేయడమే కాకుండా, నకిలీ ఉత్పత్తులు డబ్బు వృథా చేయడమే కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం మరియు శ్రేయస్సును కూడా హానిచేయవచ్చని స్పష్టంగా తెలియజేస్తోంది.హెర్బలైఫ్ ఇండియా అసలితనంపై తన కట్టుబాటును సంస్థ కార్యకలాపాల పునాది నుంచే ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన “Seed to Feed” తత్వం ద్వారా. ముడి పదార్థాల సేకరణ నుంచి తుది తయారీ వరకు ప్రతి దశలో కఠినమైన నాణ్యత నియంత్రణను అమలు చేసే ఈ సమగ్ర ప్రక్రియ, అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తుంది. శాస్త్రీయ నవీనత మరియు పారదర్శకత సమన్వయంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన అత్యున్నత నాణ్యత గల పోషక ఉత్పత్తులనే వినియోగదారులకు అందిస్తున్నామని హెర్బలైఫ్ నిర్ధారిస్తుంది.ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా.. హెర్బలైఫ్ ఇండియా వినియోగదారులను అవగాహనతో కూడిన, బాధ్యతాయుత నిర్ణయాలు తీసుకునేలా సాధికారత కల్పిస్తోంది. భారతదేశంతో పాటు ప్రపంచంలోని 90కు పైగా దేశాల్లో హెర్బలైఫ్ ఉత్పత్తులు కేవలం శిక్షణ పొందిన స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల ద్వారానే విక్రయించబడుతున్నాయని సంస్థ మరోసారి స్పష్టం చేస్తోంది. సరైన వినియోగం మరియు ఉత్పత్తుల అసలితనం గురించి వినియోగదారులకు మార్గనిర్దేశం చేయడానికి ఈ అసోసియేట్లకు శిక్షణ ఇస్తారు. హెర్బలైఫ్ ఏ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా లేదా అనధికార విక్రేతల ద్వారా తన ఉత్పత్తులను విక్రయించదు. కేవలం స్వతంత్ర హెర్బలైఫ్ అసోసియేట్ల నుంచి కొనుగోలు చేసి అసలితనాన్ని నిర్ధారించడం ద్వారా, వినియోగదారులు తమ ఆరోగ్య రక్షణలో చురుకైన పాత్ర పోషించవచ్చు.ఈ అవగాహన కార్యక్రమం బాధ్యతాయుత సంస్కృతిని పెంపొందించే ప్రయత్నం. నకిలీకరణ అనేది ఒక సామూహిక సామాజిక సమస్య. దీని పరిష్కారానికి వినియోగదారులు, బ్రాండ్లు మరియు సంబంధిత అధికారులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వెల్నెస్ రంగంలో మోసాల నుంచి ప్రజలను రక్షించడానికి అవగాహన మరియు సహకారం అత్యంత అవసరమని హెర్బలైఫ్ తీసుకున్న ఈ ముందడుగు స్పష్టంగా తెలియజేస్తోంది.ఆరోగ్యమే సంపదగా భావించే ఈ కాలంలో, అసలితనంపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని హెర్బలైఫ్ ఇండియా మనకు గుర్తు చేస్తోంది. సందేశం స్పష్టమైనది: మీ ఆరోగ్యానికి అసలైనదే అర్హత. విద్య, నమ్మకం మరియు కట్టుబాటుతో, ప్రతి హెర్బలైఫ్ ఉత్పత్తి నాణ్యత, భద్రత మరియునిజాయితీకి ప్రతీకగా నిలవాలనే లక్ష్యంతో, వినియోగదారుల రక్షణలో కొత్త ప్రమాణాలను సంస్థ నెలకొల్పుతోంది.హెర్బలైఫ్ లిమిటెడ్ గురించిహెర్బలైఫ్ (NYSE: HLF) అనేది ప్రముఖ ఆరోగ్య మరియు వెల్నెస్ సంస్థ, సమాజం మరియు ప్లాట్‌ఫారమ్, ఇది 1980 నుంచి శాస్త్రీయ ఆధారాలతో కూడిన పోషక ఉత్పత్తులు మరియు స్వతంత్ర డిస్ట్రిబ్యూటర్లకు వ్యాపార అవకాశాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకొస్తోంది. ప్రపంచంలోని 90కు పైగా మార్కెట్లలో, ఆలోచన కలిగిన డిస్ట్రిబ్యూటర్ల ద్వారా హెర్బలైఫ్ ఉత్పత్తులు వినియోగదారులకు చేరుతున్నాయి. వ్యక్తిగత మార్గదర్శనం మరియు సహాయక సమాజం ద్వారా, ప్రజలను మరింత ఆరోగ్యకరమైన, చురుకైన జీవనశైలిని అనుసరించేందుకు ప్రోత్సహిస్తూ వారు తమ ఉత్తమ జీవితాన్ని గడపేందుకు తోడ్పడుతోంది. మరింత సమాచారం కోసం దయచేసి Herbalife సందర్శించండి.
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పేలవ ఫామ్‌తో సతమవుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా జట్టును విజయ పథంలో నడిపిస్తున్నప్పటికి..వ్యక్తిగత ప్రదర్శనల పరంగా మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. 2025 ఏడాది అతడి కెరీర్లో ఒక పీడకలల మిగిలిపోనుంది. ఆసియాకప్ వంటి మేజర్ టైటిల్స్ సాధించినప్పటికి.. ఒక ఆటగాడిగా మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ ఏడాది కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. ఈ ఏడాది మొత్తంగా 21 అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్యకుమార్.. 13.62 సగటుతో కేవలం 218 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 47గా ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కూడా కేవలం 34 పరుగులు (12, 5, 12, 5) మాత్రమే చేశాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్-2026 తర్వాత సూర్యను కెప్టెన్సీ నుంచి తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ముందే సూర్యపై వేటు వేయాలని సెలక్టర్లు భావించినప్పటికి.. వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నీకి ముందు ప్రయోగాలు ఎందకని తమ నిర్ణయాన్ని మార్చుకున్నారంట.కెప్టెన్‌గా బుమ్రా..!అయితే భారత టీ20 జట్టు కెప్టెన్సీ రేసులో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నట్లు తెలుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తదుపరి కెప్టెన్‌గా బుమ్రా పేరును సిఫార్సు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బుమ్రాకు కెప్టెన్‌గా పెద్దగా అనుభవం లేనప్పటికి.. నాయకత్వ లక్షణాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.రోహిత్ శర్మ తరహాలోనే బుమ్రా మైదానంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఒత్తిడి సమయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఒక బౌలర్‌గా అతడికి బాగా తెలుసు. 2022లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 35 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు.టెస్టుల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు బుమ్రా నెలకొల్పాడు. ఆ తర్వాత 2023లో ఐర్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరించాడు. గాయం నుంచి కోలుకుని తిరిగొచ్చిన బుమ్రా.. ఆ సిరీస్‌లో కెప్టెన్‌గా, బౌలర్‌గా దుమ్ములేపాడు.అయితే రోహిత్ శర్మ రిటైర్మ్ తర్వాత బుమ్రా టెస్టు కెప్టెన్‌గా ఎంపిక అవుతాడని అంతా భావించారు. కానీ బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడే కీలక బౌలర్ కావడంతో.. అతడికి కొన్ని సిరీస్‌లకు టీమ్ మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సుదీర్ఘ ఫార్మాట్లో అతడు అన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. ఇంగ్లండ్ పర్యటనలో అతడు కేవలం మూడు టెస్టులు ఆడాడు. మిగితా రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. అందుకే అతడికి టెస్టుల్లో జట్టు పగ్గాలను అప్పగించలేదు. కానీ అతడు ఇప్పుడు దాదాపుగా అన్ని టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటున్నాడు. వన్డే, టెస్టులకు విశ్రాంతి తీసుకుంటున్నప్పటికి పొట్టి ఫార్మాట్లో మాత్రం ఆడేందుకు బుమ్రా సముఖత చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టీ20 కెప్టెన్సీ అప్పగించాలని బీసీసీఐ సిద్దమైనట్లు ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో తెలియాలంటే టీ20 ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్..
ఆలస్యమైందని నటుడిపై దాడి.. 70% వినికిడి శక్తి కోల్పోయి!
టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
షాకింగ్.. అలిగి ఆటోలో వెళ్లిపోయిన హెడ్ కోచ్
గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!
పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని..
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య
శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీ రద్దు
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
బ్రిటీష్ జమానాలోనే ప్రత్యేక పాలన.. ఎలాంటి మార్పు లేదు!
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
ఆలస్యమైందని నటుడిపై దాడి.. 70% వినికిడి శక్తి కోల్పోయి!
టీజీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
షాకింగ్.. అలిగి ఆటోలో వెళ్లిపోయిన హెడ్ కోచ్
గ్లామర్‌కు నో.. ఆ ఇద్దరు హీరోయిన్స్‌లా చేయాలనుంది!
పెళ్లైన వ్యక్తిని ప్రేమించిందని..
టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!
Bangladesh: ఆగని మత హింస: మరో యువకుని హత్య
శ్రీవాణి ఆఫ్ లైన్ టికెట్ల జారీ రద్దు
బంగారం, వెండిలా.. దూసుకెళ్తున్న మరో మెటల్ రేటు!
బ్రిటీష్ జమానాలోనే ప్రత్యేక పాలన.. ఎలాంటి మార్పు లేదు!
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
పసిడి హ్యాట్రిక్.. వెండి త్రిబుల్ షాక్!
టీమిండియావైపు దూసుకొస్తున్న సరికొత్త పేస్ సంచలనం
ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు!
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
పడిక్కల్ వీరోచిత పోరాటం.. ఇషాన్ కిషన్ సుడిగాలి శతకం వృధా
రేషన్ బియ్యం అమ్ముకుంటున్న కూటమి ముఠాలు
2026 నుంచి చైనా గేమ్ ప్లాన్ ఇదే..
సిఐడి - బాబుకేసుల మూత విభాగం
భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!
తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు
డివిలియర్స్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
నేరుగా ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా
ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు
హీరోయిన్ల డ్రెస్‌పై శివాజీ వ్యాఖ్యలు... అనసూయ పోస్ట్ వైరల్
ఈ రాశి వారికి ఆస్తిలాభం.. ఉద్యోగులకు పదోన్నతులు
100 ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా
'తనూజ'కు మర్యాద మనీష్ క్షమాపణలు
సార్ మనవాళ్లే! వీడేమో పేకాట కింగ్, వాడేమో మద్యం డాన్, ఆడేమో కబ్జా వస్తాద్!
ఫొటోలు
‘భర్త’ను మరోసారి పెళ్లి చేసుకున్న వీనస్ విలియమ్స్ (ఫొటోలు)
క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొన్న వైఎస్ జగన్ (ఫొటోలు)
టాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
శరత్ కుమార్-రాధిక క్రిస్మస్ లంచ్‌లో కోలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)
కర్నూల్ ఇన్సిడెంట్ కర్ణాటకలో రిపీట్! (చిత్రాలు)
హీరోయిన్ తమన్నా ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
హృతిక్ రోషన్ కజిన్ పెళ్లి.. సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
హైదరాబాద్‌లో ఘనంగా టాలీవుడ్ ప్రో లీగ్ ప్రారంభం (ఫొటోలు)
హైదరాబాద్ లో క్రిస్మస్ పండగ సందడి (ఫొటోలు)
మహేష్ బాబు ఫ్యామిలీలో వేడుక.. ఫోటోలు వైరల్
సినిమా
హారర్ సినిమా 'ఈషా' రివ్యూ
ప్రమోషనల్ కంటెంట్‌తో కొంతలో కొంత ఆకట్టుకున్న హారర్ సినిమా 'ఈషా'. త్రిగుణ్, హెబ్బా పటేల్, అఖిల్ రాజ్, సిరి హనుమంతు, బబ్లూ పృథ్వీరాజ్ లీడ్ రోల్స్ చేశారు. సున్నిత మనస్కులు ఈ మూవీకి రావొద్దని నిర్మాతలు స్టేట్మెంట్ ఇవ్వడం లాంటివి ఆసక్తి కలిగించాయి. తాజాగా(డిసెంబరు 25) థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? చెప్పినంతలా భయపెట్టిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కల్యాణ్(త్రిగుణ్), నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హనుమంతు), వినయ్ (అఖిల్ రాజ్) చిన్నప్పటి నుంచి స్నేహితులు. దెయ్యాలు, ఆత్మలు లేవు అని నమ్ముతుంటారు. పెద్దయ్యాక టీమ్‌గా ఏర్పడి దొంగ బాబాలు, స్వామిజీల బండారాల్ని బయటపెడుతుంటారు. అలా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉంటున్న ఆదిదేవ్ (బబ్లూ పృథ్వీరాజ్) బాబా గురించి వీళ్లకు తెలుస్తుంది. అతడి బాగోతం కూడా బయటపెట్టాలని ఫిక్స్ అవుతారు. వెళ్లి ఆదిదేవ్ బాబాని కలుస్తారు. ఆత్మల విషయంలో ఈ నలుగురికి బాబా ఓ ఛాలెంజ్ చేస్తాడు. ఇంతకీ ఆ సవాలు ఏంటి? చివరకు వీళ్లు ఏం తెలుసుకున్నారు? ఈ నలుగురిని చంపాలనుకుంటున్న పుణ్యవతి ఎవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ కాలంలోనూ దెయ్యాలు, భూతాలు ఉన్నాయా? అంటే చాలామంది అలాంటివేం లేవని అంటారు. మరికొందరు మాత్రం అవును అలాంటివి ఉన్నాయని నమ్ముతుంటారు. అలా వ్యతిరేక భావాలున్న ఇద్దరూ ఎదురెదురు పడి సవాళ్లు విసురుకుంటే ఏమైందనేదే 'ఈషా' సినిమా.హారర్ సినిమాలు అనగానే కొన్ని అంశాలు పక్కాగా ఉంటాయి. హీరో లేదా హీరోయిన్ పాత్రధారులు దెయ్యాల్ని నమ్మకపోవడం.. అనుకోని పరిస్థితుల్లో పాడుబడిన బంగ్లాలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడటం.. దెయ్యాల్ని వదిలించే ఓ శక్తివంతైన బాబా.. ఇలాంటివి దాదాపుగా కనిపిస్తాయి. అయితే ఎన్ని ఉన్నా సరే ప్రేక్షకుడు భయపడ్డాడా లేదా అనేది కీలకం. ఈ విషయంలో 'ఈషా'కు పాస్ మార్కులే పడతాయి. ఎందుకంటే నాలుగైదు చోట్ల భయపెట్టడం తప్పితే గొప్పగా ఏం లేదు.నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవని నిరూపించడం.. ఈ క్రమంలోనే ఆదిదేవ్ బాబాని వెతుక్కుంటూ అతడి దగ్గరకు వెళ్లడం.. మార్గం మధ్యలో ఓ ప్రమాదం.. ఓ సవాలు.. అనుకోని పరిస్థితుల్లో వీళ్లంతా పాడుబడిన బంగ్లాలో ఉండాల్సి రావడం.. ఇలా దాదాపు స్టోరీ అంతా ఫ్లాట్‌గానే వెళ్తూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ భయపెడుతూ ఉంటుంది తప్పితే తెరపై సీన్స్ ఆ ఫీల్ కలిగించవు.ఇందులో పుణ్యవతి ఎపిసోడ్ భయపెడుతుంది. కాకపోతే అదంతా చాలా సింపుల్‌గా తేల్చేయడం ఏంటో అర్థం కాదు. అసలు ఆ పాత్రని ఇంకాస్త పొడిగించి ఉంటే భయపెట్టే స్కోప్ చాలా ఉండేది. ఆమె ఆత్మకు.. కొడుకు, భర్తతోనూ ఎమోషనల్ సీన్స్ పెట్టొచ్చు. కానీ దర్శకుడు అలా ఎందుకు ఆలోచించలేకపోయాడా అనిపిస్తుంది. పుణ్యవతి పాత్రని ఎందుకో మధ్యలోనే వదిలేశారో ఏంటో? అలానే అమెరికాలో టాప్ న్యూరో సర్జర్ అయిన ఆదిదేవ్.. మన దేశానికి వచ్చి దెయ్యాల్ని వదిలిస్తూ బాబాగా ఎందుకు మారాడో అర్థం కాదు. అతడి బ్యాక్ స్టోరీ చెప్పలేదు.ఈ సినిమాకు క్లైమాక్సే కీలకం. దర్శకుడు కూడా దాన్నే నమ్ముకుని తీశాడు. క్లైమాక్స్ ఒక్కటే సర్ప్రైజ్ చేస్తే సరిపోదుగా.. మిగతా సీన్స్ కూడా ఎంగేజ్ చేయాలి. అప్పుడే మూవీ బాగుంటుంది. ఇక్కడా ఆ పొరపాటే జరిగింది. క్లైమాక్స్ తప్పితే మిగతా అంతా రొటీన్. అకస్మాత్తుగా చనిపోయిన వాళ్లు ఆత్మలుగా ఎందుకు మారతారు? అనే పాయింట్‌ని చివరలో చూపిస్తూ.. సీక్వెల్ కూడా ఉంటుందని హింట్ ఇచ్చి ముగించారు.ఎవరెలా చేశారు?ఫ్రెండ్స్ గ్యాంగ్ త్రిగుణ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు, అఖిల్ రాజ్ బాగానే చేశారు. బాబా ఆదిదేవ్గా బబ్లూ పృథ్వీరాజ్ ఓకే. వేషధారణ కాస్త విచిత్రంగా ఉన్నా ఎందుకో పవర్‌ఫుల్‌గా చూపించలేకపోయారు. పుణ్యవతి ఆత్మ ఆవహించిన వ్యక్తిగా మైమ్ మధు అదరగొట్టేశాడు. గెటప్ చూస్తేనే భయపడతాం. ఆ రేంజ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టెక్నికల్ విషయాలకొస్తే.. ధ్రువన్ సంగీతం బాగుంది. సీన్లో దమ్ములేకపోయినా సౌండ్‌తో భయపెట్టే ప్రయత్నం బాగా చేశారు. విజువల్స్ కూడా హారర్ ఫీల్ కలిగించాయి. దర్శకుడు శ్రీనివాస్ మన్నె ఎంచుకున్న పాయింట్లో కొత్తదనం లేదు. సినిమాని కూడా ఇంపాక్ట్‌ఫుల్‌గా తీయలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లున్నాయి. ఓవరాల్‌గా చెప్పుకొంటే 'ఈషా' ఓకే.- చందు డొంకాన
వెంకటేశ్- ఆర్తి ఎవర్గ్రీన్ క్లాసిక్.. రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా బ్లాక్ బస్టర్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. ఈ చిత్రానికి కె విజయభాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, డైలాగ్స్ అందించగా.. స్రవంతి రవికిశోర్ నిర్మించారు. ఈ మూవీ 2001 సెప్టెంబర్ 6న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 1న 4కే వెర్షన్‌తో ప్రపంచవ్యాప్తగా రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా రీ రిలీజ్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 4కె వర్షన్లో రిలీజైన ట్రైలర్ వెంకీ మామ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన చిత్రమని నిర్మాత రవికిశోర్ అన్నారు. నువ్వు నాకు నచ్చావ్. ఇది కేవలం రీ రిలీజ్ మాత్రమే కాదని.. నూతన సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయమని అన్నారు.
సంతలో పశువులు అనుకున్నారా?.. ఇండిగో తీరుపై వీకే నరేశ్ ఆగ్రహం..!
హైదరాబాద్ విమానాశ్రయంలో సినీనటుడు చేదు అనుభవం ఎదురైంది. ఇండిగో విమానయాన సంస్థ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సులో ప్రయాణికులను పశువుల్లా తీసుకెళ్లడంపై ఆయన మండిపడ్డారు. తమ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో సంస్థ నిర్లక్ష్యపూరిత తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విటర్లో ఫోటోలు పంచుకున్నారు.నరేశ్ తన ట్వీట్లో రాస్తూ..'ఇండిగో ఎయిర్‌లైన్స్ బస్సు ప్రయాణం చిత్ర హింసకు గురిచేసింది. విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి సాక్ష్యమిదే. మమ్మల్ని పశువుల్లా ఒక లారీలో ఎక్కించినట్లు విమానం వద్దకు తీసుకెళ్లారు. అందులో వృద్ధులు, చక్రాల కుర్చీలలో ఉన్న కొందరు నిలబడటానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కువ మందిని ఎక్కించవద్దని నేనే గట్టిగా అరిచా. బస్సులకు ఒక నిర్దిష్ట పరిమితి ఉండాలి. వృద్ధుల కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలి. చట్టపరంగా ముందుకు వెళ్లడానికి నా న్యాయ బృందంతో మాట్లాడుతున్నా.' అంటూ పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో నరేశ్ మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.The bus torture chambers of INDIGO airlines are excruciating reminders of the airline monopoly. Thy had loaded us like cattle in a lorry (twice the capacity )with senior citizens , some in wheel chairs struggling to stand ( seen in the back ground ) . I had screamed at the top of… pic.twitter.com/JzcOvsLlul— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) December 23, 2025
‘శంబాల’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
టైటిల్: శంబాలనటీనటులు: ఆది సాయికుమార్, అర్చన అయ్యర్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, స్వాసిక విజయ్, షీజు మీనన్, శివకార్తిక్ తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజుదర్శకత్వం: యుగంధర్ మునిసంగీతం:శ్రీచరణ్ పాకాలవిడుదల తేది: డిసెంబర్ 25, 2025ఆది సాయికుమార్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. ఈ మధ్య ఆయన నటించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని సస్పెన్స్ థ్రిల్లర్ ‘శంబాల’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇటీవల ఆది ఏ సినిమాకు రానంత హైప్ శంబాలకు వచ్చింది. సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొదలు ట్రైలర్ వరకు ప్రతీది ఆసక్తిని పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉది? ఆది(aadi saikumar) ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే...ఈ సినిమా కథంతా 1980 నేపథ్యంలో సాగుతుంది. శంబాల అనే గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అదే రోజు ఆ ఊరికి చెందిన రైతు రాములు(రవి వర్మ) ఆవు నుంచి పాలుకు బదులుగా రక్తం వస్తుంది. దీంతో ఆ ఉల్కని ఊరి ప్రజలంతా బండ భూతం అని బయపడారు. ఆ రాయిని పరీక్షించేందుకు డిల్లీ నుంచి ఖగోళ శాస్త్రవేత్త విక్రమ్(ఆది సాయికుమార్) వస్తాడు. చావులోనూ సైన్స్ ఉందనే నమ్మే వ్యక్తి విక్రమ్. అలాంటి వ్యక్తి శంబాలకు వచ్చిన తర్వాత వరుస హత్యలు జరుగుతుంటాయి. రాములుతో సహా పలువురు గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తూ కొంతమందిని చంపి..వాళ్లు చనిపోతుంటారు. ఇదంతా బండ భూతం వల్లే జరుగుందని సర్పంచ్‌తో సమా ఊరంతా నమ్ముతుంది. విక్రమ్ మాత్రం ఆ చావులకు, ఉల్కకు సంబంధం లేదంటాడు. ఆ రాయిని పరీక్షించే క్రమంలో ఓ రహస్యం తెలుస్తుంది. అదేంటి? అసలు శంబాల గ్రామ చరిత్ర ఏంటి? ఆ గ్రామదేవత కథేంటి? ఊర్లో విక్రమ్‌కి తోడుగా నిలిచిన దేవి(అర్చన ఐయ్యర్) ఎవరు? వింత చావుల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో శంబాల(Shambhala Review) చూడాల్సిందే.ఎలా ఉందంటే..సైన్స్ గొప్పదా? శాస్త్రం గొప్పదా అంటే సరైన సమాధానం చెప్పలేం. కొంతమంది సైన్స్‌ని మాత్రమే నమ్ముతారు. మరికొంత మంది శాస్త్రాలనే నమ్ముతారు. అయితే సైన్స్‌లోనూ శాస్త్రం ఉంది..శాస్త్రంలోనూ సైన్స్ ఉంది అని చాటి చెప్పే చిత్రం శంబాల. దర్శకుడు యుగంధర్ ముని ట్రెండింగ్ సబ్జెక్ట్‌ని ఎంచుకొని.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. అసలు కథ ఏంటో చెప్పకుండా టీజర్, ట్రైలర్ వదిలి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. అదే ఆసక్తితో థియేటర్స్‌కి వెళ్లిన ప్రేక్షకుడి అంతకు మించిన కొత్త విషయాలను పరిచయం చేసి అబ్బురపరిచాడు. సైన్స్, శాస్త్రాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినిమా కథనం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. రొటీన్ కథే అయినా స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ప్రతి ఐదారు నిమిషాలకు ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని పరిచయం చేస్తూ.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించారు.పురాణాల్లోని కథని సాయి కుమార్‌తో వాయిస్ ఓవర్ చెప్పించి.. శంబాల కథను ప్రారంభించారు దర్శకుడు. ఫస్టాఫ్ మొత్తం శంబాల గ్రామం పరిచయం..అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత ఘటనల చుట్టూనే కథనం సాగుతుంది. శంబాల ఊరిలో ఉల్క పడడం..ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం.. రైతు రాములు వింతగా ప్రవర్తించడం..ఇలా సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడిని శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు.ఫస్ట్ సీన్ నుంచే ప్రేక్షకులను భయపెట్టడం స్టార్ట్ చేశాడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే..అంతకు రెండింతలు అన్నట్లుగా మీసాల లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి. కల్లు దుకాణంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతుంది. ఇక లక్ష్మణ్ పాత్రకు సంబంధించిన కొన్ని సీన్లు అయితే ప్రేక్షకుడి వెన్నులో వణుకు పుట్టిస్తాయి.ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఊరి సమస్యను తీర్చేందుకు విక్రమ్ చేసే ప్రయత్నాలు మెప్పిస్తాయి. సినిమా ప్రారంభంలో వచ్చే ఒక పాటలోని లిరిక్స్‌కి ఈ కథను ముడిపెట్టిన విధానం బాగుంది. ప్రతీ సీన్ కన్విన్సింగ్ ఉంటుంది. కానీ చాలా చోట్ల రిపీటెడ్‌గా అనిపిస్తాయి. శంబాల గ్రామ చరిత్ర తెలిసిన తర్వాత కథనం ఊహకందేలా సాగుతుంది. ఇంద్రనీల్ పాత్రకు సంబంధించిన ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ రొటీన్‌గానే ఉన్నా..అక్కడ వచ్చే ఓ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. సైన్స్‌కి, శాస్త్రాలకు మధ్య సంబంధం ఉందని చెప్పేలా ఆ ట్విస్ట్ ఉంటుంది. ఓవరాల్‌గా రైటింగ్ పరంగా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ.. శంబాల మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆది సినీ కెరీర్లో ఇదొక డిఫరెంట్ చిత్రంగా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..సైంటిస్ట్ విక్రమ్ పాత్రలో ఆది ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. దేవి పాత్రకు అర్చన అయ్యర్ న్యాయం చేసింది. అయితే ఆమె పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దితే బాగుండేదేమో. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఆమెకు బలమైన సన్నివేశాలేవి ఉండవు. రైతు రాములుగా రవివర్మ తనదైన నటనతో భయపెట్టేశాడు. ఇక మీసాల లక్ష్మణ్‌కి కూడా ఈ సినిమాలో ఓ బలమైన పాత్ర లభించింది. దివ్యాంగుడు కృష్ణగా ఆయన నటన అదిరిపోయింది. కొన్ని చోట్ల కేవలం చూపులతోనే భయపెట్టేశాడు. కానిస్టేబుల్ హనుమంతుగా మధునందన్ బాగా చేశాడు. అతని కూతురిగా చేసిన అమ్మాయి కూడా చక్కగా నటించింది. స్వాసిక విజయ్, శివకార్తిక్, ఇంద్రనీల్, షిజు మీనన్, శైలజ ప్రియలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీచరణ్ పాకాల నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. ప్రవీన్ కె బంగారి సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫెక్స్ వర్క్ ఈ సినిమాలో తక్కువే ఉన్నా.. చక్కగా కుదిరింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె , సాక్షి డెస్క్
క్రీడలు
'సెలక్టర్లు తప్పు చేశారు.. గిల్ స్ధానంలో అతడే సరైనోడు'
టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టులో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. బీసీసీఐ సెలక్షన్ కమిటీ అనుహ్యంగా గిల్ స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకుంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో కిషన్ రెండేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే సడన్‌గా కిషన్‌ను వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది మాజీలు తప్పుబడుతున్నారు. ఈ జాబితాలోకి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ చేరాడు. గిల్ స్ధానంలో ఓపెనర్ యశస్వి జైశ్వాల్‌ను ఎంపిక చేసి ఉండాల్సిందని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డారు. కాగా సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల రిటైర్మెంట్ తర్వాత టీ20ల్లో జైశ్వాల్‌కు ఓపెనర్‌గా చోటు దక్కుతుందని అంతా భావించారు.కానీ అతడిని పూర్తిగా జట్టు నుంచే తప్పించారు. గౌతమ్ గంభీర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక టీ20ల్లో భారత జట్టు ఓపెనింగ్ జోడీ సంజూ శాంసన్-అభిషేక్ శర్మలకు అవకాశం దక్కింది. ఆ తర్వాత గిల్ తిరిగి జట్టులోకి రావడంతో శాంసన్ బెంచ్‌కే పరిమితమవ్వాల్సి వచ్చింది. అయితే తన పునరాగమనంలో గిల్ విఫలం కావడంతో సెలక్టర్లు వేటు వేశారు.మళ్లీ అభిషేక్-సంజూనే భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే జైశ్వాల్‌కు కూడా ఓపెనర్‌గా మంచి రికార్డు ఉంది. ఐపీఎల్‌తో పాటు టెస్టు క్రికెట్లో కూడా ఓపెనర్‌గా తన మార్క్ చూపించాడు."టీ20 ప్రపంచకప్ టోర్నీకి సెలక్టర్లు అత్యుత్తమ జట్టును ఎంపిక చేశారు. కానీ ఈ జట్టులో యశస్వి జైశ్వాల్ లేకపోవడం తీవ్ర నిరాశపరిచింది. అతడు అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతడిని జట్టులోకి తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం.జైశూ టీ20 జట్టులోకి తిరిగి రావాలంటే ఇంకా ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, ఫిట్నెస్ను దృష్టిలో పెట్టుకుని వరల్డ్‌కప్ టోర్నీకి సెలక్టర్లు ఎంపిక చేశారు. గిల్ ఫామ్‌లో లేనందున పక్కన పెట్టడం సరైన నిర్ణయమే. ఈ విషయంలో నేను సెలక్షన్ కమిటీ నిర్ణయంతో ఏకీభవిస్తున్నాను. కానీ గిల్ స్ధానంలో జైశ్వాల్‌కు అవకాశమిచ్చి ఉంటే బాగుండేది. అతడికి ఓపెనర్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మెరుపు ఆరంభాలను అందించే సత్తా అతడికి ఉంది అని వెంగ్‌సర్కార్ పిటిఐతో పేర్కొన్నాడు.కాగా జైశ్వాల్ గత కొంత కాలంగా టెస్టు జట్టులో మాత్రం రెగ్యూలర్‌గా సభ్యునిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో తన దక్కిన అవకాశాన్ని జైశ్వాల్ రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. గిల్ గైర్హజరీలో జట్టులోకి వచ్చిన జైశూ అద్భుత సెంచరీతో అదరగొట్టాడు.చదవండి: 'అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్ టోర్నీకి రెడీ'
'అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.. వరల్డ్‌కప్ టోర్నీకి రెడీ'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు.బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవలం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. కోహ్లికి ఇది 58వ లిస్ట్-ఎ సెంచరీ. అదేవిధంగా ఇదే మ్యాచ్‌లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగమించాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వన్డే వరల్డ్‌కప్-2027కు తాను సిద్దంగా ఉన్నానని తన ప్రదర్శనలతోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్‌కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కోహ్లి 302 పరుగులు చేశాడు.చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్.. చెలరేగిన జీషన్ అన్సారీ
అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆడే భారత జట్టుకు ఎంపికైన రింకూ సింగ్ దేశీ వన్డే టోర్నీలో శుభారంభం అందుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ నయా ఫినిషర్.. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్‌ను విజయంతో ఆరంభించాడు.ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన పోరులో ఉత్తరప్రదేశ్ 84 పరుగుల తేడాతో హైదరాబాద్ (HYD vs UP)పై గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసింది ఉత్తరప్రదేశ్. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 324 పరుగులు సాధించింది. అదరగొట్టిన జురెల్, ఆర్యన్, రింకూధ్రువ్ జురేల్ (61 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఆర్యన్ జుయల్ (96 బంతుల్లో 80; 9 ఫోర్లు, 1 సిక్స్), అభిషేక్ గోస్వామి (81 బంతుల్లో 81; 10 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ రింకూ సింగ్ (48 బంతుల్లో 67; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో కదంతొక్కారు.ఇక హైదరాబాద్ బౌలర్లలో అర్ఫాజ్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టగా... రక్షణ్ రెడ్డి, తనయ్ త్యాగరాజన్, నితిన్ సాయి యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం ఛేదనలో హైదరాబాద్ 43 ఓవర్లలో 240 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 84 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో ఓటమిపాలైంది. హైదరాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (53; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించగా... రాహుల్ బుద్ధి (47; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), వరుణ్ గౌడ్ (45; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు.జీషాన్ అన్సారీకి 4 వికెట్లుఉత్తరప్రదేశ్ బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జీషాన్ అన్సారీ 4 వికెట్లు పడగొట్టాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో జమ్మూకశ్మీర్ 10 వికెట్ల తేడాతో చండీగఢ్‌పై... బరోడా 5 వికెట్ల తేడాతో అస్సాంపై... బెంగాల్ 3 వికెట్ల తేడాతో విదర్భపై విజయాలు సాధించాయి. ఇక ఎలైట్ గ్రూప్ ‘సి’లో హిమాచల్ ప్రదేశ్ 95 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్‌పై... గోవా 6 వికెట్ల తేడాతో ఛత్తీస్‌గఢ్‌పై... పంజాబ్ 51 పరుగుల తేడాతో మహారాష్ట్రపై గెలుపొందాయి.మరోవైపు.. గ్రూప్ ‘ఎ’లోనే భాగంగా జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో కేరళ 145 పరుగుల తేడాతో త్రిపురపై... తమిళనాడు 101 పరుగుల తేడాతో పాండిచ్చేరిపై... మధ్యప్రదేశ్ 99 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయాలు సాధించాయి.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్‌కు చోటు.. షమీకీ ఛాన్స్!
అలా ప్రేమ పుట్టింది.. ఆస్తి భర్త కంటే వంద రెట్లు ఎక్కువే!
‘‘ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా’’.. ఇటీవలి కాలంలో ప్రేమికులను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా పాటలోని పంక్తులు అమెరికా టెన్నిస్ దిగ్గజం వీనస్ విలియమ్స్- ఇటలీ నటుడు ఆండ్రియా ప్రెటీకి సరిగ్గా సరిపోతాయి.వేర్వేరు దేశాలకు చెందిన వీనస్- ఆండ్రియా రంగాలూ, పైకి కనిపించే సోకాల్డ్ ‘రంగు’లూ భిన్నమైనవే. సంపాదనలోనూ భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా. వయసులోనూ ఎనిమిదేళ్ల వ్యత్యాసం. అయితేనేం వారి హృదయాంతరాల్లో ఉన్న స్వచ్చమైన ప్రేమకు ఈ అంతరాలు అడ్డంకి కాలేదు. ఏడాదిన్నర కాలంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న ఈ జోడీ.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది.ఇటలీలో ఈ సెప్టెంబరులోనే వీనస్- ఆండ్రియా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అయితే, ఇటలీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీనస్ విదేశీయురాలు కాబట్టి ఈ వివాహం అధికార ముద్ర పొందేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. అందుకే తాజాగా తన స్వస్థలం ఫ్లోరిడాలోని బీచ్‌లో వీనస్ మరోసారి తన భర్తతో పెళ్లినాటి ప్రమాణాలు చేసింది.ఇంతకీ ఈ ఆండ్రియా ప్రెటీ ఎవరు?డానిష్ సంతతికి చెందిన ఆండ్రియా ఇటలీలో పెరిగాడు.మోడల్‌గా కెరీర్ ఆరంభించి.. నటుడిగా, నిర్మాతగా కొనసాగుతన్నాడు. సినిమాలు, టీవీ షోలు, రియాల్టీ షోలతో బోలెడంత పాపులారిటీ సంపాదించిన ఆండ్రియా.. విలక్షణ రీతిలో కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.చక్కటి అందగాడు మాత్రమే కాదు.. నిరాడంబరంగా జీవించేందుకే ఆండ్రియా ఇష్టపడతాడని అతడి సన్నిహితులు చెబుతుంటారు. వీనస్‌తో డేటింగ్ మొదలుపెట్టిన కొద్దికాలంలోనే ఆమె కుటుంబంతో చక్కగా కలిసిపోయాడు ఆండ్రియా.ప్రేమకథ అలా మొదలైందికెరీర్కు ప్రాధాన్యం ఇచ్చే వీనస్ విలియమ్స్ నాలుగు పదుల వయసు దాటినా పెళ్లి మాట ఎత్తలేదు. స్వాతంత్ర్యంగా జీవించేందుకు ఇష్టపడే వీనస్... గతేడాది వరకూ సింగిలే. అయితే, 2024లో మిలాన్‌లో జరిగిన ఫ్యాషన్ వీక్.. ఆమె జీవితంలోని నవ వసంతానికి నాంది పలికింది.అక్కడే తన కంటే ఎనిమిదేళ్లు చిన్నవాడైన 37 ఏళ్ల ఆండ్రియా ప్రెటీ తొలి చూపులోనే వీనస్ దృష్టిని ఆకర్షించాడు. అతడిది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. మాటలు కలిశాయి. మనసులు ఒక్కటయ్యాయి. స్నేహం ప్రేమగా మారి పరిణయానికి దారి తీసింది.ఎవరి నెట్‌వర్త్ ఎంత?మహిళల సింగిల్స్‌లో ఏడుసార్లు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న వీనస్ విలియమ్స్.. డబుల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో కలిపి మరో పదహారు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల వాషింగ్టన్ డీసీ ఓపెన్‌లో గెలిచిన 45 ఏళ్ల వీనస్.. ఈ టైటిల్ గెలుచుకున్న రెండో అతిపెద్ద వయస్కురాలిగా చరిత్రకెక్కింది.చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకుని దిగ్గజంగా ఎదిగిన వీనస్ విలియమ్స్.. ఇటు టెన్నిస్ టైటిళ్ల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీ.. అటు ఎండార్స్మెంట్ల ద్వారా భారీ మొత్తమే కూడబెట్టింది. అంతేకాదు ఇంటీరియర్ రంగంలో అడుగుపెట్టిన వీనస్‌కు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి.వంద రెట్లు ఎక్కువఇలా రెండు చేతులా సంపాదిస్తున్న వీనస్ విలియమ్స్ నికర ఆస్తుల విలువ తొంభై ఐదు మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో దాదాపు 851 కోట్ల రూపాయలకు పైమాటే.మరోవైపు.. వీనస్ భర్త ఆండ్రియా ప్రెటీ.. మోడలింగ్, నటన, సినిమా ప్రొడక్షన్ ద్వారా సుమారుగా 1- 2 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు అంచనా (భారత కరెన్సీలో దాదాపు రూ. 8- 17 కోట్లు). దీనర్థం భర్త కంటే వీనస్ ఆస్తుల విలువ రమారమి వంద రెట్లు ఎక్కువ. అందుకే మరి అనేది.. ఇచ్చంత్రాల ఈ ప్రేమ ఏ అంతరాలు ఎంచదమ్మా.. మనసొక్కటె జన్మస్థానమంటూ.. కొత్త కథలాగా మొదలైతదమ్మా!!చదవండి: David Beckham: భార్యే సర్వస్వం.. చీలిన కుటుంబం
న్యూస్ పాడ్‌కాస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'
రోడ్డెక్కితే బాదుడే... ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన వేల కోట్ల రూపాయల భారం
‘ఇంక్విలాబ్ మంచ్’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యతో బంగ్లాదేశ్‌లో విధ్వంసం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మేం రాగానే పూర్తి చేస్తాం... తేల్చిచెప్పిన వైఎస్ జగన్మోహన్రెడ్డి... మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల పత్రాలు గవర్నర్‌కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో కోటి సంతకాల సమరం... కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ మహా ఉద్యమం.. నేడు గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులు అందజేయనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి
ఫేక్ సొసైటీతో భూములు కబ్జా చేయడానికి కుట్ర... విజయవాడలో 42 మంది పేదల ఇళ్ల కూల్చివేత బాబు సర్కారు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్‌లో పోటెత్తిన కోటి సంతకాల ర్యాలీ. కోటి మంది చేసిన సంతకాల ప్రతులతో జిల్లా కేంద్రాలలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు
బిజినెస్
తగ్గిన ఎయిర్ పొల్యూషన్: ఆ వాహనాలపై నిషేధం ఎత్తివేత!
ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైన నేపథ్యంలో.. బీఎస్4 వాహనాలను నగరంలో ప్రవేశించకుండా నిషేధించారు. అయితే ఇప్పుడు ఆ ఆంక్షలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గాలి నాణ్యత మెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.డిసెంబర్ 13న, ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 స్థాయిని దాటిన తర్వాత.. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) స్టేజ్ IV అమలులోకి వచ్చింది. ఈ సమయంలోనే రాజధానిలో కొన్ని నిర్దిష్ట వాహనాలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఇప్పుడు గాని నాణ్యత మెరుగుపడటంతో.. ఈ నిషేధం తొలగించారు.బీఎస్ 6 వాహనాలు మాత్రమే నగరంలోకి ప్రవేశించాలనే నియమం అమలు చేసిన సమయంలో.. సుమారు 1.2 మిలియన్ వాహనాలను నిషేధించారు. అయితే ఇప్పుడు ఆంక్షలు నిషేధించబడినప్పటికీ.. ఢిల్లీలో రిజిస్టర్ చేసుకున్న BS4 వాహనాన్ని కలిగి ఉంటే, మీ PUC చెల్లుబాటు అయితే, GRAP స్టేజ్ IV సమయంలో.. ఢిల్లీ NCRలో ఉపయోగించవచ్చు. ఢిల్లీలో రిజిస్టర్ కానీ బీఎస్3, బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదు. నియమాలను అతిక్రమించిన వాహనదారులు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్‌గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్‌సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్‌ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్‌ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్‌లో మెటా Llama 4 మోడల్స్‌ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్‌లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో ఏఐ మోడ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్‌లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్‌లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్‌గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా?
వెండి ఇప్పుడే ఇంతుంటే.. అప్పటికల్లా అంతే!
ప్రపంచవ్యాప్తంగా వెండి ధర భగ్గుమంటోంది. ప్రతిరోజూ కొత్త రికార్డు స్థాయికి దూసుకెళ్తోంది. ఔన్స్‌కు 72 డాలర్ల మార్కును దాటింది. దాదాపు 140% లాభాలతో, వెండి అనేక ఇతర అసెట్లను గణనీయంగా అధిగమించింది. ఈ నేపథ్యంలో ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఫియట్ కరెన్సీ, హార్డ్ అసెట్స్‌పై వ్యాఖ్యానానికి ప్రసిద్ధి చెందిన రాబర్ట్ కియోసాకి సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు.పారిశ్రామిక డిమాండ్, స్థూల ఆర్థిక ఆందోళనల మధ్య సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా భావిస్తూ పెట్టుబడులు పెంచుతుండటంతో వెండి ధరలు తారస్థాయికి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’లో తనదైన శైలిలో స్పందించారు.‘వెండి 70 డాలర్లు దాటింది.బంగారం, వెండి పొదుపు చేసేవారికి గొప్ప వార్త.ఫేక్ మనీ (డాలర్లు) దాచుకునే వాళ్లకు బ్యాడ్ న్యూస్’ అంటూ పోస్టును ప్రారంభించిన కియోసాకి అధిక ద్రవ్యోల్బణం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ, డాలర్ విలువను కోల్పోతూనే ఉన్నందున 2026 నాటికి వెండి ఔన్స్ కు 200 డాలర్లకు పెరుగుతుందని ఆయన అంచనా వేశారు.‘నష్టపోకండి.. వెండి ధర 2026 నాటికి 200 డాలర్లకు చేరుకుంటున్న క్రమంలో ఆ ఫేక్ డాలర్ (డబ్బు విలువ ఉండదనేది ఆయన అభిప్రాయం) కొనుగోలు శక్తి మరింత క్షీణిస్తుంది’ అంటూ ముగించారు. రాబర్ట్ కియోసాకి అంచనా కాస్త అతిశయోక్తిలా అనిపించినా వెండి ధర అత్యంత వేగంగా పెరుగుతోందనే విషయం మాత్రం వాస్తవం. SILVER over $70.GREAT NEWS for gold and silver stackers.BAD NEWS for FAKE MONEY savers.I am concerned $70 silver may signal hyper-inflation in 5 years as the fake $ keeps losing value. Don’t be a loser. Fake $ will continue to lose purchasing power as silver goes to…— Robert Kiyosaki (@theRealKiyosaki) December 23, 2025
రూ.10 నోట్లకు గుడ్‌బై..!
సామాన్య ప్రజల దైనందిక అవసరాలలో చిల్లర నోట్లకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అలాగే విద్యార్థుల అవసరాలకు, చిన్న చిన్న ఒప్పందాల లావాదేవీలలో ఉపయోగించే 10 రూపాయల స్టాంప్ పేపర్ల పాత్ర ప్రాధాన్యమైంది. ఉదయం పాల నుంచి మార్కెట్లో కూరగాయలు, నిత్యావసరాల కొనుగోళ్లలో పది రూపాయల నోట్ల ప్రాధాన్యత మామూలుది కాదు. అయితే కొన్నేళ్లుగా రూ.10 నోట్లు కనుమరుగవుతున్నాయి. నోట్లకు బదులు విడుదల చేసిన రూ.10 నాణేలు చెల్లుబాటు కావని పలు వదంతులు రావడంతో వాటి చెలామణిలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రూ.10 నాణెం తయారీ కంటే 10 నోట్ల ముద్రణ తక్కువ ఖర్చవుతున్నా వాటి జీవిత కాలం తక్కువగా ఉండటంతో నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసినట్లు తెలుస్తోంది. వేయి రూ.10 నోట్లు ముద్రించడానికి ఆర్బీఐకి 966(ప్రతీ నోటుకు 1.01 రూ) రూపాయలు ఖర్చవుతుండగా. 10 నాణెం తయారీకి 5.54 రూపాయలు ఖర్చు అవుతున్నట్లు సమాచారం. నోట్ల ముద్రణ తక్కువ ఖర్చుతో కూడుకున్నదే అయినా వాటి జీవితకాలం కూడా తక్కువగానే ఉంటున్నది. 10 రూపాయల నోటు ఏడాదిలోపే శిథిలమవుతుండగా నాణాలు మాత్రం జీవితకాలం పాడవకుండా ఉంటాయి. ఇదే కారణంగా ప్రతి ఏడాది నోట్ల ముద్రణ కంటే నాణాల ముద్రణకే ఆర్బీఐ మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. మార్కెట్లో 10 నాణాలపై వస్తున్న వదంతులను ఖండిస్తూ ఆర్బీఐ కచ్చితమైన ప్రకటనలు చేసింది. 10 నాణాలను (10 Rupees Coins) ఎవరైనా నిరాకరిస్తే ఫిర్యాదు చేయవచ్చని సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లను సామాజిక మాధ్యాల ద్వారా పోస్టర్ల ద్వారా బ్యాంకుల్లో ప్రదర్శించింది. వదంతులకు గురైన పాత రూ.10 నాణాలతో పాటు, గత సంవత్సరం కొత్త రూ.10 నాణాలను ఆర్బీఐ విడుదల చేసింది. రూ.10 నోట్ల కొరత కారణంగా ప్రస్తుతం రూ.10 నాణాల పట్ల మార్కెట్లో తిరస్కరణ ఉండటం లేదని పలువురు అంటున్నారు.రూ.10 స్టాంప్ పేపర్ల కొరతవిద్యార్థుల, సామాన్యుల అవసరాలలో ప్రాధాన్యత కలిగిన రూ.10 స్టాంప్ పేపర్లు కూడా కనుమరుగయ్యాయి. కొద్ది కాలం క్రితం వరకు వాహనాల నెలవారీ కిరాయిలు, ఇళ్లు, దుకాణాల కిరాయినామా లావాదేవీలు, చిన్న చిన్న అఫిడవిట్లు పూర్తిగా రూ.10 స్టాంప్ పేపర్ల పైనే జరిగేవి. విద్యార్థుల స్టైఫండ్ల రెన్యూవల్స్, ఆదాయ, కుల ధృవీకరణాల పత్రాల కోసం ఈ స్టాంప్ పేపర్లనే వాడే వారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు రూ.10 స్టాంప్ పేపర్లపైనే అందజేసేవారు. కొద్ది కాలంగా స్టాంప్ పేపర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో విద్యార్థులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రూ.10 స్టాంప్‌లు లభించకపోవడంతో రూ.20, రూ.50, రూ.100 స్టాంప్ పేపర్లను వాడాల్సి వస్తోంది. సాధారణ అవసరాలకు కూడా ఎక్కువ విలువ గల స్టాంప్ పేపర్లను వాడుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ఏడాది క్రితమే రూ.10 స్టాంప్ పేపర్ల ముద్రణ కూడా ఆగిపోయిందని అధికారులు అంటున్నారు.ఫ్రాంకింగ్ మెషిన్ల ద్వారా..స్టాంప్ పేపర్ల కొరతను అధిగమించేందుకు ప్రతి రిజి్రస్టార్ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్ మెషిన్లను అందుబాటులోకి తెచ్చినట్లు సబ్ రిజిస్ట్రార్ అధికారులు తెలిపారు. ఈ మెషిన్ల ద్వారా తెల్ల కాగితంపై వినియోగదారులకు ఎంత విలువ స్టాంప్ పేపర్లు (Stam Papers) అవసరమో ఆ విలువను ముద్రించి ఇస్తున్నామని వారు అంటున్నారు.
ఫ్యామిలీ
ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..!
టాలీవుడ్ నటి, అక్కినేని వారి కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల పలు కార్యక్రమంలో స్టైలిష్ల లుక్‌లో కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. అంతేగాదు ఆమె ధరించే డిజైనర్ వేర్లు, ఆభరణాలు ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. పైగా ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రతి వేడుకలో ఆమె ఆహార్యం, లుక్ హైలెట్‌గా నిలవడం విశేషం. అక్కినేని వారి కోడలు అంటే రేంజ్ ఇది అన్నట్లుగా లగ్జరీ ఫ్యాషన్ వేర్లతో అదరహో అనేలా తళుక్కుమంటోంది. అంతేగాదు శోభితా అంటే అత్యంత శోభాయమానం అని చెప్పకనే చెబుతోంది తన స్టైలిష్ లుక్‌తో. ఈసారి ఓ ప్రముఖ లగ్జీరి మేకప్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన షార్లెట్ టిల్బరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా గోల్డ్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిపోయింది. అంతేగాదు ఆ లెహంగాకి బుర్గుండి దుపట్టా జత చేయడంతో అలనాటి రాణుల వైభవంలోకి తీసుకుపోయింది శోభితా స్టన్నింగ్ లుక్. చూపు తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అత్యంత బరువైన బుర్గుండి దుప్పటా మహారాణి మాదిరి రాజదర్పాన్ని అందించింది. అంతేగాదు ఆ దుస్తులు డిజైన్ చేసిన విధానం కారణంగా ఆభరణాలతో పనిలేదనిపించేలా ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దారు వాటిని. ఇక ఈ బుర్గుండి దుప్పటా డీప్ వెల్వెట్ టోన్డ్ కలర్ దానిపై బంగారు ఎంబ్రాయిడరీ అంచు..ఆ గోల్డెన్ కలర్ లెహంగా అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఒక్క దుప్పట కారణంగా రాయల్టీ లుక్ వచ్చింది ఆ లెహంగాకి. అంతేగాదు శోభితా ఈ లెహంగాలో మహారాణి మాదిరిగా, పెళ్లికూతురిలా ధగధగ మెరిసిపోయారామె. నార్మల్ మేకప్‌తో, ఆ లెహంగాకి సరిపడా చోకర్, చెవిపోగులతో చాలా సింపుల్‌గా ఉన్నా..హెవీ డిజైన్‌తో రూపొందిన ఈ లెహంగా మిగతా లోటుని భర్తించేసిందా అనేలా నిండైన అందాన్ని అందించింది. ఇక ఈ గోల్డెన్ లెహంగాను జిగర్ మాలి రూపొందించారు. ఇక రిచ్ బుర్గుండి దుప్పటాను డిజైనర్ నైషా తీర్చిదిద్దారు. కాగా అంతకుముందు శోభితా ఒక ముంబై కార్యక్రమంలో ఇలానే గోల్డెన్ లెహంగాతో పెళ్లికూతురిలా మెరిసిపోగా ఈసారి రాజుల కాలం గుర్తుకుతెచ్చేలా మరో గోల్డెన్ లెహంగాతో మంత్రముగ్ధుల్ని చేసింది. View this post on Instagram A post shared by Nykaa (@mynykaa) బుర్గండీ రంగు దుపట్ట ప్రత్యేకత.. ఇది గాఢ ఎరుపు వైన్ షేడ్‌లో రిచ్‌గా కనిపించే రంగులో ఉండటమే దీని ప్రత్యేకత. ఇది సంప్రదాయ దుస్తులతో జత చేస్తారు. ఎక్కువగా చీర సల్వార్, లెహంగాలతో జత చేస్తే ఒక్కసారిగా రాయల్టి లుక్ వచ్చేస్తంఉది. ఇక్క వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌కి జతచేస్తే..స్టైలిష్‌గా ఉంటుంది. పార్టీవేర్‌కి సిల్క్ లేదా జార్జెట్, డైలీవేర్‌కి కాటన్ లేదా లినెన్, వింటర్లో అయితే శోభితా ధరించినట్లుగా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌లో ధరిస్తే లుక్ అదుర్స్.(చదవండి: నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?)
కొత్త ఏడాది టాప్-10 ప్రదేశాలు ఏవంటే..?
ఏటా పెరుగుతున్న భారతీయుల పర్యాటకాసక్తి ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. వచ్చే ఏడాది కూడా మనోళ్లు టూర్ ఇష్టులుగానే కొనసాగనున్నారు. ఈ విషయాన్ని అలీఎక్స్‌ప్రెస్ అనే సంస్థ తాజా ట్రావెల్ ట్రెండ్స్ 2026 నివేదిక వెల్లడించింది. మన వాళ్లు వచ్చే ఏడాది ఏ యే ప్రాంతాలను చూడాలని ఆశిస్తున్నారు? అనేది విశ్లేషించేందుకు అలీ ఎక్స్‌ప్రెస్ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. పదివేల ట్రావెల్ డేటా పాయింట్లను విశ్లేషించిన ఫలితంగా రూపొందిన ఈ నివేదిక రాబోయే సంవత్సరానికి భారతీయ ప్రయాణికుల ప్రాధాన్య జాబితాలో ఉన్న టాప్ టూరిస్ట్ ప్లేసెస్‌ను ఆవిష్కరించింది. 2026లో భారతీయులు సందర్శించడానికి ప్లాన్ చేస్తున్న టాప్ 10 గమ్యస్థానాలు ఇక్కడ ఉన్నాయి. జోర్హాట్భారతదేశంలోని అస్సాం రాష్ట్రం ఇటీవలి కాలంలో పర్యాటకుల ఆసక్తిని బాగా చూరగొంటోంది. అస్సాం హృదయం లాంటి ప్రదేశం జోర్హాట్, విస్తారమైన టీ ఎస్టేట్లు, గొప్ప వారసత్వం, ప్రపంచంలోని అతిపెద్ద నదీ ద్వీపం అయిన మజులికి సమీపంలో టోక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు నిలయంగా ఉంది. ఈ ప్రాంతం చరిత్ర, పచ్చని ప్రకృతి సౌందర్యం, ఉత్సాహభరితమైన అస్సామీ సంప్రదాయాల ప్రశాంతమైన మిశ్రమానికి నెలవుగా ఉంటుంది.జాఫ్నాపామిరాతో కప్పబడిన తీరాలు, పురాతన దేవాలయాలతో, జాఫ్నా శ్రీలంక ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తుంది. వచ్చే ఏడాది భారతీయ ప్రయాణికులు (Indian Tourists) ఈ ప్రాంతం చూడాలని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు, తమిళ సంస్కృతి వంటకాలతో ఇది భారతీయుల మది దోచుకుంటోంది. ముఖ్యంగా కొత్తగా వృద్ధి చెందిన విమానాల సంఖ్య గతంలో కంటే అక్కడకు సులభంగా చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నాయి.మస్కట్కఠినమైన పర్వతాలు అరేబియా సముద్రం మధ్య ఉన్న మస్కట్, అరేబియా వారసత్వంతో ఆధునిక సంప్రదాయాల సొగసైన మిశ్రమంతో సందర్శకులను ఆకర్షిస్తోంది. గొప్ప గొప్ప మసీదులు చారిత్రాత్మక కోటల నుంచి ఉత్సాహభరితమైన సౌక్లు సముద్రతీర విహార ప్రదేశాల వరకు, ఈ రాజధాని నగరం తక్కువ విలాసవంతమైన శాశ్వత ఆకర్షణను అందిస్తుంది.క్వీన్స్టౌన్న్యూజిలాండ్ దేశంలోని క్వీన్స్టౌన్ కూడా భారతీయుల ఎంపిక జాబితాలో చోటు సంపాదించింది. వాకటిపు సరస్సు ఒడ్డున ఉన్న ఇది సాహసోపేతమైన ప్రకృతి ప్రేమికులకు అంతిమ ఆట స్థలం. ది రిమార్కబుల్స్ పర్వత శ్రేణితో చుట్టుముట్టబడిన ఇది థ్రిల్, ప్రశాంతతను సజావుగా మిళితం చేస్తుంది. ఐకానిక్ అనుభవాలలో బంగీ జంపింగ్, సుందరమైన ట్రైల్స్, వైన్ తయారీ కేంద్రాలు విశ్రాంతి స్పా రిట్రీట్లు దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.చియాంగ్ రాయ్థాయిలాండ్ లోని చియాంగ్ రాయ్ ఆధ్యాత్మికత కళాత్మకతను కలిసే ప్రదేశం. వైట్ టెంపుల్, బ్లూ టెంపుల్, ప్రశాంతమైన టీ తోటలు, రోలింగ్ హిల్స్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లతో, వైవిధ్యభరిత సంస్కృతుల మధ్య కూడా ప్రశాంతతను కోరుకునే వారికి ఇది స్వర్గధామంగా నిలుస్తోంది.వారణాసిమన దేశంలోని ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వారణాసి (Varanasi) ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక గమ్యస్థానంగా అత్యధిక సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. గంగా నది ఒడ్డున మంత్రముగ్ధులను చేసే సాయంత్రం హారతిని వీక్షించడం, సూర్యోదయంలో పవిత్ర స్నానం చేయడం, పురాతనమైన పురాణాలను, ఇతిహాసాల వేదికగా.. పురాతన దేవాలయాలు ఈ నగరాన్ని ఏటా భారతీయ పర్యాటకులకు ఇష్టమైన పర్యాటక గమ్యస్థానంగా ఉంటోంది.మనీలాఫిలిప్పీన్స్ దేశంలోని మనీలా అనేది వైరుధ్యాల నగరం, అక్కడ వలసరాజ్యాల యుగపు గోడలు నియాన్–లైట్ల వెలుగుల్లో దర్శనమిస్తాయి. ఉల్లాసమైన వీధులు, ఇంట్రామురోస్ వంటి చారిత్రాత్మక జిల్లాలు, సందడిగా ఉండే ఆహార మార్కెట్లు ఉత్సాహభరితమైన రాత్రి జీవితం దీనిని సాంస్కృతిక శక్తి కేంద్రం ఇది. ఫిలిప్పీన్స్‌కు చెందిన సుందరమైన ద్వీప సౌందర్యాలను ఆస్వాదించేందుకు సరైన ప్రదేశం. టిబిలిసిజార్జియాలోని టిబిలిసి పాత కాలం నాటి ఆకర్షణ, ఆధునిక సామర్ధ్యం రెండింటితో నిండి ఉంది. రాళ్లతో కప్పబడిన వీధులు శతాబ్దాల నాటి చర్చిలు, థర్మల్ బాత్‌లు సమకాలీన ఆధునిక కేఫ్‌లకు ఇది నిలయం. సృజనాత్మక శక్తి హృదయపూర్వక ఆతిథ్యంతో, జార్జియన్ రాజధాని వైవిధ్యాన్ని కోరుకునే భారతీయ ప్రయాణికుల జాబితాలో ముందుంది.హోచిమిన్వియత్నాంలోని హోచిమిన్ నగరం దాని ఆకాశహర్మ్యాలు, వలసరాజ్యాల ల్యాండ్‌మార్క్‌లు, వీధి ఆహార దుకాణాలు, ఇలా సజీవంగా ఉన్న మార్కెట్లతో అబ్బురపరుస్తుంది. పచ్చని మెకాంగ్ డెల్టా దక్షిణ వియత్నాం వారసత్వ మార్గాలను అన్వేషించడానికి ఇది సరైన లాంచ్‌ప్యాడ్ ఇది. చాలా మంది భారతీయులు ఈ ఏడాది భారీ సంఖ్యలో వియత్నాంకు ప్రయాణించారు మరింత మంది వచ్చే ఏడాది సందర్శించాలని చిస్తున్నారు,పోర్ట్ లూయిస్మారిషస్లోని మణి సముద్రాలు పచ్చని కొండల నేపథ్యంలో ఉన్న పోర్ట్ లూయిస్ ఉష్ణమండల ఆకర్షణను కాస్మోపాలిటన్ శైలితో మిళితం చేస్తుంది. కళకళలాడే మార్కెట్లు, వలసరాజ్యాల నిర్మాణం భిన్న వైరుధ్యాలు కలిగిన ఫుడ్ కల్చర్ ఉల్లాసమైన ప్రశాంతమైన గమ్యస్థానంగా దీనిని మారుస్తున్నాయి సూర్య ప్రశాంతతను కోరుకునే వారికి అనువైనది. నివేదిక శోధనలలో 93% పెరుగుదలను చూపించింది. దీనిని అనేక మంది భారతీయుల ప్రయాణ బకెట్ జాబితాలలో ఉంచింది.చదవండి: భాయిజాన్ సల్మాన్‌ఖాన్ ఫిట్నెస్ సీక్రెట్..! 60లో కూడా కండలు తిరిగిన బాడీ సొంతం కావాలంటే...
చలికాలం... ఫుడ్ విషయంలో జాగ్రత్త!
గజగజలాడించే చలికాలంలో... ఎప్పుడూ వేడివేడిగా, మసాలాలు బాగా దట్టించిన ఫుడ్ తినాలని అనిపిస్తూంటుంది. చలి కాబట్టి దాహం కూడా అనిపించదు. చాలామంది వేడివేడి కాఫీ, టీలతోనే గడిపేస్తూంటారు. అయితే చలికాలంలో ఇలాంటి అలవాట్లు అస్సలు మంచివి కావంటున్నారు వైద్యులు. గరం గరం ఆహారం, కాఫీ, టీలు.. జిహ్వ రుచికి హాయినిచ్చినా.. ఆరోగ్యానికి మాత్రం అస్సలు సరిపడవని అంటున్నారు. అందుకే ఈ వింటర్ సీజన్లో ఫుడ్ విషయంలో ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దని హెచ్చరిస్తున్నారు. మరి అవేంటో చూద్దామా..ఈ చలికాలంలో సమతుల్య ఆహారాన్నే తీసుకోవాలని సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు ఈ కాలంలో తీసుకునే ఆహారం, రోగనిరోధక వ్యవస్థను, జీర్ణక్రియ, చర్మపరిస్థితి, శక్తిస్థాయిలు, హార్మోన్ సమతుల్యతకు అనుగుణమైన పోషకవంతమైన ఆహారమే తీసుకోవాలని చెబుతున్నారు. తప్పనిసరిగా తినాల్సినవి..ఈ కాలంలో సూప్‌లు, కిచిడి, పప్పులు, తృణధాన్యాల గంజి, తదితరాలు శరీరాన్ని వెచ్చగా ఉండచడమే కాకుండా, తగిన ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుందని అంటున్నారు. అల్లం, పసుపు, దాల్చిన చెక్క, జీలకర్ర వంటి సుగంధద్రవ్యాలు పోషకవిలువను తగ్గించవు, వణికించే చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తాయి కూడా. చలికాలం అని చాలామంది పండ్లు, కూరగాయల వినియోగాన్ని పరిమితం చేస్తారు. ఇది మలబద్ధకం, పొట్ట ఉబ్బరం, పోషకాల కొరతకు దారితీస్తుందట. నిజానికి ఈ కాలంలో లభించే పళ్లను తీసుకోవడం మంచి ఫలితాలనిస్తుందటతేలికగా వేయించిన ఆకుకూరలు, కాల్చిన దుంపలు, పండ్లు తదితరాల్లో ఫైబర్లు, యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పైగా జీర్ణక్రియకు మద్దతిస్తాయి. అంతేకాకుండా ఈ కాలంలో సిట్రస్ పండ్లు, ఆపిల్స్, జామ వంటవి రోగనిరోధక వ్యవస్థను మెరుగ్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయటఇక 30 ఏళ్ల దాటిన మహిళలు, పెద్దల్లో కండరాల అలసట, ఆకలి పెరగడం, జుట్టు రాలడం, జీర్ణక్రియ నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి తీసుకునే ఆహారం కచ్చింగా పోషకవంతమైనేద తీసుకుంటే మేలు. పప్పులు, పన్నీర్, గుడ్లు, టోఫు, పెరుగు, నట్స, చేపలు, లీన్ మాంసాలు తదితరాలు ఆరోగ్యానికి మంచివే కాకుండా పోషక స్థిరత్వాన్ని అందించి శరీరాన్ని వెచ్చగా ఉంచేలా చేస్తాయట. ఈ కాలంలో హైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే ఈ కాలంలో దాహం వేయదు, అందులోనూ చలికాలం కావడంతో పరిమితంగానే నీటిని తీసుకుంటారు అందువల్ల ఈ సమస్య ఉత్ఫన్నమవుతుందని చెబుతున్నారు. ఈ సీజన్లో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంటుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు, మానసిక స్థితిపై గట్టి ప్రభావం చూపిస్తాయట. స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా సహజంగా లభించే తియ్యటి పండ్లు, ఖర్జురం, బెల్లం లేదా డార్క్ చాక్లెట్లు తీసుకుంటే మేలుచాలామంది కొవ్వులను అనారోగ్యకమరని తప్పుగా అపోహపడుతుంటారు. అయితే వింటర్లో ఆరోగ్యకరమైన కొవ్వలు హార్మోన్ల ఉత్పత్తికి, చర్మపరిస్థితికి, శరీర ఉష్ణోగ్రత నియంత్రకు ముఖ్యమైనవట. ఈ సమయంలో నెయ్యి, ఆలివ్ నూనె, నట్స్, అవకాడోలు, కొవ్వుచేపలను పరిమిత క్వాంటిటీలో తీసుకుంటే మంచిదట. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎంతో మంచివని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పాటించే ముందు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: Best Brain Boosting Foods: బ్రెయిన్‌కు మేలు చేసే ఆహారాలు..!)
చిన్న కానుక... ఎంతో సంతోషం
శాంటా తాత వస్తాడు అడిగినవన్నీ ఇస్తాడు... అని పిల్లలు అనుకోవడం ఆనవాయితీ.తల్లిదండ్రులే ఏ అర్ధరాత్రో వారి దిండ్ల వద్ద ఆ కానుకలు పెట్టి ఆశ్చర్యపరచడమూ ఆనవాయితే.కాని శాంటాలు రాని ఇళ్లుంటాయి.శాంటా బహుమతులు అందని పిల్లలుంటారు. ఈ క్రిస్మస్ వేళ పేద పిల్లలకు, హోమ్స్‌లో ఉండే నిరాధార పిల్లలకు మీరే శాంటాలుగా కానుకలు ఎందుకు ఇవ్వకూడదు? అవి అవి అందుకున్న వారి ముఖాల్లో నక్షత్ర కాంతిని ఎందుకు చూడకూడదు?శాంటా క్లాజ్‌కు దేశం లేదు.... ప్రాంతం లేదు... భాష లేదు... అందరు పిల్లలకూ శాంటా తాత ఇష్టం. తాత తెచ్చే కానుకలు ఇష్టం. అందుకే క్రిస్మస్ వస్తుందనగా తమ కోరికలన్నీ కాగితం పై రాసి జాగ్రత్తగా డబ్బాలో వేసి పెట్టడమో, ఫ్రిజ్‌కు ఉన్న అయస్కాంతం కింద వేళ్లాడగట్టడమో,పోస్ట్‌బాక్స్‌లో వేయడమో చేస్తారు. ఎప్పుడెప్పుడు శాంటా వస్తాడా... కానుకలు ఇస్తాడా అని ఉద్వేగంగా ఎదురు చూస్తారు.క్రిస్మస్ ముందు రోజు రాత్రి తప్పకుండా శాంటా వస్తాడని పిల్లల నమ్మకం. ‘జింగిల్ బెల్స్... జింగిల్ బెల్స్... జింగిల్ ఆల్ ద వే’ అని పాడుకుంటూ, మువ్వలు గలగలలాడుతున్న రైన్డీర్ల బండి ఎక్కి, కానుకల మూటతో శాంటా వచ్చి ఒక్కో పిల్లవాడికి/పాపకు ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చి వెళతాడని వాళ్లు భావిస్తారు. అంతేనా? మంచి నడవడిక చూపినందుకు, బాగా చదువుకుంటున్నందుకు ‘మెచ్చుకోలు పత్రం’ కూడా ఇచ్చి వెళతాడు. ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే మానుకోమని హెచ్చరిస్తాడు కూడా.అలా అని విశ్వసించే పిల్లలు క్రిస్మస్ రోజు కళ్లు తెరిచి తమ దిండ్ల పక్కనే ఉన్న బహుమతులు చూసుకుని కేరింతలు కొడతారు. శాంటా ఇచ్చాడని మురిసి΄ోయి పక్కింటి పిల్లలకు చూపిస్తారు. శాంటా లేఖను పదే పదే చదువుకుంటారు. ఇది వారి మురిపమైన అమాయక ప్రపంచం. ఆ ప్రపంచంలో వారిని ఉంచేందుకు తల్లిదండ్రులు/ బంధువులు రహస్యంగా కానుకలు ఏర్పాటు చేస్తారు. ఇలా సీక్రెట్ శాంటాలుగా కన్నబిడ్డలకే కాదు... మనసులోని చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరని స్థితిలో ఉన్న పిల్లలకు కూడా కావచ్చు.సీక్రెట్ శాంటా నెట్వర్క్స్మన దేశంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ‘సీక్రెట్ శాంటా నెట్వర్క్స్’ కలిగి ఉన్నాయి. ఇవి తమ వెబ్‌సైట్స్‌లో అండర్ ప్రివిలేజ్డ్ పిల్లలు అంటే పేద బస్తీల్లో, హాస్టళ్లలో, అనాథ గృహాలలో ఉన్నవారు కోరిన కోరికలను ఉంచుతారు. వాటిని చూసి ఆ కోరిక నెరవేర్చేందుకు సాయం చేయవచ్చు. లేదా ఆ గిఫ్ట్‌ను స్వయంగా అందే ఏర్పాటు చేయవచ్చు. శాంటా పంపినట్టే ఈ పిల్లలకు ఆ గిఫ్ట్స్ అందుతాయి. ఇలాంటి పని కోసం వలెంటీర్లుగా పని చేసే విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. ‘భూమి’, ‘హోమ్‌లెస్ కేర్ ఫౌండేషన్’, ‘లిటిల్ హార్ట్ ఫౌండేషన్’, ‘ది లెప్రసి మిషన్ ట్రస్ట్ ఇండియా’... వంటి సంస్థలు సీక్రెట్ శాంటాలుగా క్రిస్మస్ సమయంలో పేద పిల్లల ముఖాన చిర్నవ్వులు చిందించే ఏర్పాటు చేస్తున్నారు. నగరాలన్నింటిలోనూ ఇంకా అనేక సంస్థలు పని చేస్తున్నాయి. ఇంటర్నెట్ ద్వారా ఎంచుకుని సహాయం చేయవచ్చు.చిన్న కానుక... ఎంతో సంతోషంక్రిస్మస్ డిసెంబర్ ఆఖరున వస్తుంది. కాబట్టి స్వెటర్లు, ఉన్ని టోపీలు, రగ్గులు ఇవ్వొచ్చు. స్కూలు బ్యాగులు, నోట్‌బుక్స్, షూస్, హైజీన్ కిట్స్... ఇవన్నీ వారికి ఆనందాన్ని ఇచ్చేవే. బొమ్మలు, బట్టలు చెప్పనక్కర్లేదు. కేక్స్, చాక్లెట్లు తప్పనిసరిగా ఉండాలి. ‘నీకు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు చాలా మంచి పిల్లాడివి’ అని రాసిన శాంటా లేఖ వారికి వేయి ఏనుగుల బలం ఇస్తుంది. మనం నివసిస్తున్న చోట హౌస్ హెల్ప్‌గా పని చేసే వారి పిల్లలకు, వాచ్మెన్, సెక్యూరిటీ గార్డ్స్ పిల్లలకు సీక్రెట్ శాంటాగా బహుమతులు పంపితే ఆ తర్వాత ఆ పిల్లల రియాక్షన్ తెలుసుకుంటే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.శాంటా కథ ‘మంచికి ప్రతిఫలం ఉంటుంది’ అని చెబుతుంది. పిల్లల్లో ఈ విశ్వాసం నింపడం ముఖ్యం. అండర్ ప్రివిలేజ్డ్ పిల్లల్లో మన కోసం కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది... మనకూ బహుమతులు ఉంటాయి అనే భరోసా కల్పించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. క్రిస్మస్ చెట్టు, తార, బెల్స్... ప్రేమను పంచమనే చెబుతాయి. చిన్నపిల్లలకు ప్రేమను పంచడానికి మించిన ఆనందం లేదు.
అంతర్జాతీయం
సునీత సాహసం
వాషింగ్టన్: భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లోపల పనిచేయడమే ఎంతో సాహసంతో కూడిన పని. ఇక ఐఎస్ఎస్ ఆవల విధులు నిర్వర్తించడమంటే కత్తిమీద సామే. అలాంటి పనిని అలవోకగా చేసి భారతీయ మూలాలున్న మహిళా వ్యోమగామి సునీతా విలియమ్స్ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఐఎస్ఎస్కు ప్రాణాధారాలైన సువిశాల సౌర ఫలకలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా ఒడుపుగా వాటి సమీపంలో పనిచేస్తున్న సునీత ఫొటోలను తాజాగా అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మిని్రస్టేషన్(నాసా) వ్యోమగామి డాన్ పెటిట్ విడుదలచేశారు. దీంతో వ్యోమగాములు ఎంతటి విపత్కర, అననుకూల పరిస్థితుల్లో అంతెత్తులో పనిచేస్తారనేది సాధారణ ప్రజానీకానికి సైతం మరోసారి అవగతమైంది. ఈ ఏడాది జనవరిలో ఐఎస్ఎస్లో పనిచేసినప్పటి ఫొటోలను పెటిట్ తాజాగా తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘ అంతరిక్షంలో అణుమాత్రమైనా తప్పు జరక్కుండా ఎలా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందో ఈ ఫొటోలను చూస్తే తెలుస్తుంది’’ అని పెటిట్ రాసుకొచ్చారు. ఐఎస్ఎస్ ఇంధన అవసరాలు తీర్చే ఒక్కో సౌర ఫలకం 35 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులో ఉంటుంది. మొత్తంగా 2,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక్కో సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటుచేశారు. మొత్తం సౌరఫలకాల్లో 2,62,400 సోలార్ సెల్స్ ఉన్నాయి. నిరాటంకంగా సూర్యకిరణాల నుంచి వేడిమిని సంగ్రహిస్తూ ఇవి 120 కిలోవాట్ల విద్యుత్‌ను ఉత్పత్తిచేస్తాయి. ఐఎస్ఎస్లో కీలక మాడ్యూల్స్ అన్నింటి విద్యుత్ అవసరాలను ఈ సోలార్ ప్యానెళ్లే తీరుస్తున్నాయి. శాస్త్రీయ పరిశోధనలకు కావాల్సిన అదనపు విద్యుత్‌నూ ఇవే సరఫరా చేస్తాయి. ఇటీవల అదనపు సెల్స్‌ను అమర్చి మొత్తం సామర్థ్యాన్ని 30 శాతం పెంచారు. దీంతో మరో దశాబ్దకాలంపాటు శాస్త్రీయ శోధనకు కావాల్సిన శక్తి అవసరాలు తీరినట్లేనని శాస్త్రవేత్తలు ప్రకటించారు. అనుకోని స్పేస్‌వాక్ సునీత బృందం తిరిగిరావాల్సిన వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాళ్లు ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ఆమె అదనపు బాధ్యతలను నెత్తినేసుకున్నారు. ఇతర వ్యోమగాముల శాస్త్రపరిశోధనలో పాలుపంచుకుంటూనే ఆవలి వైపు మరమ్మతుల బాధ్యతలనూ సునీత సక్రమంగా నిర్వర్తించారు. అందులో భాగంగా సునీత ఈ అనుకోని స్పేస్‌వాక్ చేయాల్సి వచ్చిందని వ్యోమగామి పెటిట్ వెల్లడించారు. జనవరి 30వ తేదీన సునీత 9వ సారి స్పేస్‌వాక్ చేయగా అప్పుడు తాను తీసిన ఫొటోలనే పెటిట్ బహిర్గతంచేశారు. బోయింగ్ వారి ప్రతిష్టాత్మక స్టార్‌లింక్ వ్యోమనౌకను పరీక్షించే ప్రయోగంలో భాగంగా అందులో బుచ్ విల్మోర్తో కలిసి 2024 జూన్ ఐదో తేదీన సునీత ఐఎస్ఎస్కు పయనమయ్యారు. కేవలం 8 రోజుల్లో వీళ్లు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. కానీ తర్వాత స్టార్‌లింక్‌లో థ్రస్ట్ వైఫల్యం, హీలియం లీకేజీలతో సునీత భూమి మీదకు తిరిగి ప్రయాణం అస్సలు సాధ్యపడలేదు. దీంతో ఏకంగా 9 నెలలపాటు అక్కడే ఉండిపోయారు. ఎట్టకేలకు 2025 మార్చి 18వ తేదీన సునీత విజయవంతంగా భూమి మీదకు తిరిగొచ్చారు.
‘మా అబ్బాయి మీ దేశానికి భారమా?’.. న్యూజిలాండ్‌లో భారతీయ కుటుంబం ఆవేదన!
వెల్లింగ్టన్: తమ నుంచి తమ ఐదేళ్ల కుమారుడిని దూరం చేయొద్దని న్యూజిలాండ్ ప్రభుత్వాన్ని ఓ భారతీయ కుటుంబం అభ్యర్థిస్తోంది. ‘ మా కుమారుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. కానీ అతన్ని మా నుంచి దూరం చేస్తే మా కుటుంబం చిద్రమవుతుంది’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి వీసా విషయంలో ప్రభుత్వం మానవతా దృష్టితో చూడాలని వారు కోరుతున్నారు.న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల సమాచారం ప్రకారం.. భారత్‌కు చెందిన నితిన్ మాంకీల్, ఆయన భార్య అపర్ణ జయంధన్ గీత ఆక్లాండ్‌లో నివసిస్తున్నారు. ఇద్దరు వైద్య రంగంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు ఐదేళ్ల ఐదన్ నితిన్ (Aidhan Nithin). ఆటిజం సమస్యతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా న్యూజిలాండ్ ప్రభుత్వం అతనికి వీసా ఇచ్చేందుకు నిరాకరించింది. వెంటనే అతన్ని భారత్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే ఐధాన్ వీసా విషయంపై న్యూజిలాండ్ అసోసియేట్ ఇమ్మిగ్రేషన్ మంత్రి హాన్ క్రిస్ పెంక్కు రెండుసార్లు అప్పీలు చేశారు. కానీ ప్రభుత్వం వారి అభ్యర్థనను తిరస్కరించింది. ఐధాన్ ఆరోగ్య పరిస్థితి దేశంలోని ఆరోగ్య, విద్యా సేవలపై అధిక భారం అవుతుందని అధికారులు భావించారు. తల్లిదండ్రులకు పర్మినెంట్ రెసిడెన్సీ ఉన్నప్పటికీ బాలుడికి వీసాను తిరస్కరించింది. వీసా విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐదన్ నితిన్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఆర్థిక సహాయం కోరడం లేదని, ఆటిజం సమస్యతో బాధపడుతున్న తమ కుమారుడి పట్ల మానవతా కోణంలో వీసా మంజూరు చేయాలని తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు.ఈ ఘటన న్యూజిలాండ్‌లో వలస విధానాలపై మానవతా కోణం ఎంత ముఖ్యమో మరోసారి బయటపెట్టింది. ఆటిజం బాధిత బాలుడిని డిపోర్ట్ చేయాలన్న నిర్ణయం స్థానికులు, భారతీయ వలసదారులు, మానవ హక్కుల సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ఇప్పుడు ఈ కేసు న్యూజిలాండ్ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది.
నజ్నిన్ మున్నీని ఉద్యోగం నుంచి ఊడబీకండి.. లేదంటే తగలబెట్టేస్తాం
ఢాకా: బంగ్లాదేశ్ టేజ్గావ్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ టీవీ కార్యాలయంలో యువకుల గుంపు వీరంగం సృష్టించింది. మీ హెడ్ ఆఫ్ న్యూస్ నజ్నిన్ మున్నీని వెంటనే తొలగించకపోతే కార్యాలయాన్ని తగలబెడతాం’ అని వారు హెచ్చరించారు.సుమారు 7–8 మంది యువకులు కార్యాలయానికి వచ్చి, మున్నీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.లేదంటే ప్రోథోమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాల మాదిరిగానే మీ కార్యాలయాన్ని కూడా తగలబెడతాం’ అని వారు స్పష్టంగా బెదిరించారు.ఈ గుంపు తమను యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్ సభ్యులమని చెప్పుకున్నప్పటికీ, ఆ సంస్థ అధ్యక్షుడు రిఫాత్ రషీద్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు.గత వారం ప్రముఖ పత్రికలు ప్రోథోమ్ ఆలో మరియు డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరగడం, ఆ తరువాత గ్లోబల్ టీవీపై బెదిరింపులు రావడం మీడియా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నజ్నిన్ మున్నీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. 7–8 మంది నా కార్యాలయానికి వచ్చి, నేను ఉద్యోగం వదిలిపెట్టకపోతే కార్యాలయాన్ని తగలబెడతామని బెదిరించారు’అని వెల్లడించారు. ఆమె ఈ బెదిరింపులు మీడియాను భయపెట్టే ప్రయత్నంలో భాగమని పేర్కొన్నారు.ఈ ఘటన బంగ్లాదేశ్‌లో ప్రెస్ ఫ్రీడమ్‌పై ఉన్న ముప్పును మరోసారి బయటపెట్టింది. పత్రికా కార్యాలయాలపై దాడులు, టీవీ ఛానెల్‌లపై బెదిరింపులు జరగడం ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు పెద్ద సవాలుగా మారింది. అంతర్జాతీయ వర్గాలు ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
తైవాన్‌లో భారీ భూకంపం
తైపీ: భారీ భూకంపం తైవాన్ తూర్పు తీరప్రాంతాన్ని వణికించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైంది. భూకంపం సముద్ర ప్రాంతంలో, సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు తెలిపారు.భూకంపం సంభవించిన వెంటనే రాజధాని తైపే సహా అనేక ప్రాంతాల్లో భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం గురించి స్పష్టమైన సమాచారం అందలేదు. స్థానిక అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ, అత్యవసర సేవలను అప్రమత్తం చేశారు.తైవాన్ భూకంప కేంద్రం ప్రకారం, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. తైవాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉన్నందున తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 1999లో జరిగిన భారీ భూకంపం 2,400 మందికి పైగా ప్రాణాలు తీసిన విషయం గుర్తు చేస్తూ నిపుణులు ఈసారి పెద్ద నష్టం జరగకపోవడం ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. తైవాన్‌లో సంభవించిన ఈ భూకంపం ప్రజల్లో ఆందోళన కలిగించినప్పటికీ, సునామీ ప్రమాదం లేకపోవడం కొంత ఊరటనిచ్చింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేస్తున్నారు.
జాతీయం
ఏం జరిగిందో చెప్పలేను.. డీకే కీలక వ్యాఖ్యలు
బెంగళూరు: ఎడతెగని టీవీ సీరియల్ మాదిరిగా కర్ణాటక ముఖ్యమంత్రి మార్పిడి తతంగం కొనసాగుతోంది. హైకమాండ్ నేతలు ఒకమాట, సీఎం సిద్దరామయ్య మరో మాట చెబుతూ ఉంటే, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారనే చెప్పాలి. ఈ క్రమంలో డీకే శివకుమార్ (Shivakumar) కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం, పదవుల కంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండటమే తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. దీంతో, సీఎం మార్పు అనే వ్యవహారానికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఢిల్లీ పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ..‘సీఎం సిద్ధరామయ్య, నా మధ్య ఏం జరిగిందో నేను వెల్లడించలేను. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి పనిచేశాం. పార్టీ కోసం ప్రతిఒక్క కార్యకర్త ఎంతో కష్టపడ్డాడు. 1980 నుంచి పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేశాను. ఇప్పటికీ పార్టీ వర్కర్‌గా ఉండేందుకే ఇష్టపడతాను. హైకమాండ్ మాకు స్వేచ్ఛనిచ్చింది. కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం. పార్టీ అధికారంలోకి రావడానికి డీకే, సిద్ధూతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేశారు’ అని అన్నారు.ఈ సందర్భంగా సంక్రాంతి తర్వాత నాయకత్వ మార్పునకు సంబంధించిన చర్చల గురించి విలేకరులు ప్రశ్నించారు. అలాంటి చర్చలు మీడియాలో మాత్రమే జరుగుతున్నాయని.. ప్రభుత్వం, పార్టీలో కాదని డీకే స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం పార్టీ హైకమాండ్‌ను కలవడం లేదని, విదేశాల నుంచి వచ్చిన రాహుల్‌గాంధీని ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం మాత్రమే సమాధానం చెప్పగలరని వ్యాఖ్యానించారు.27వ తేదీపైనే ఆశలుఇదిలా ఉండగా.. సీఎం సిద్దరామయ్యకు మద్దతుగా మాజీ మంత్రి కే.ఎన్.రాజణ్ణ రాహుల్‌గాంధీకి లేఖ రాసి వేడి పుట్టించారు. ఈ నెల 27న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. అందులో పాల్గొనేందుకు డీకే శివకుమార్ వెళ్తారు. తాను వెళ్లనని సిద్దరామయ్య మొన్ననే చెప్పారు. ఆ సమావేశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని డీకే పట్టుదలతో ఉన్నారు. ఇందులో ఫైనల్ రౌండ్ చర్చలకు శ్రీకారం చుట్టనున్నారు.
వరుస బస్సు ప్రమాదాలు.. 2025లో భారీగా మరణాలు
దేశంలో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో బస్సులో సేదదీరుతూ గమ్యం చేరాలనుకునే సుదూర ప్రయాణికులు ఊహించని ప్రమాదాల్లో శాశ్వత నిద్రలోకి వెళ్లడం ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తోంది. ఈ ఏడాది(2025) భారీ సంఖ్యలో వరుస బస్సు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు.కార్లు, బైకులు, ఇతర ప్రైవేటు వాహనాలతో పోలిస్తే బస్సుల్లో ప్రయాణం సురక్షితం. బస్సులు రోడ్డు ప్రమాదానికి గురైనా ప్రాణ నష్టం అత్యంత స్వల్పంగా ఉంటుంది. కానీ, అదే అగ్ని ప్రమాదానికి గురైన సమయాల్లో ప్రాణ నష్టం ఊహకు అందడం లేదు. ప్రయాణికులు తేరుకునేలోగానే అగ్ని కీలలు వారిని ఎలా ముంచెత్తుతాయి. తాజాగా కర్ణాటకలో జరిగిన మరో బస్సు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. ఈ ఏడాది జరిగిన బస్సు ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నాయి.మేజర్ ప్రమాదాలు.. సెప్టెంబర్ 14న రాజస్థాన్‌లో దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో భారీగా మంటలు చెలరేగి 20 మంది సజీవదహనమయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వెనక భాగంలో చెలరేగిన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి.సెప్టెంబర్ 23న తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద పెళ్లి బృందం బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. 35మంది నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అందరూ కిందకు దిగిన తర్వాత బస్సు దగ్ధమైంది.సెప్టెంబర్ 26న హైదరాబాద్‌లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. మియాపూర్ నుంచి బయల్దేరిన బస్సు ఎస్సార్ నగర్ చౌరస్తాలో ఉమేశ్ చంద్ర విగ్రహం వద్దకు రాగానే ఏసీ నుంచి మంటలు వ్యాపించాయి.అక్టోబర్ 24న కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం. అర్ధరాత్రి బైక్‌ను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.అక్టోబర్ 26న యూపీలో స్లీపర్ బస్సులో చెలరేగిన మంటలు.అక్టోబర్ 29న మహారాష్ట్రలోని సమృద్ది హైవేపై బస్సులో మంటలు.నవంబర్ 3న చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం.డిసెంబర్ 12న మారేడుమిల్లి వద్ద లోయలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు. తొమ్మిది మంది మృతి, పలువురికి గాయాలు.ఈనెల 16న యూపీలోని మథుర వద్ద ఎక్స్‌ప్రెస్ హైవేపై ప్రమాదం. పొగ మంచు కారణంగా ఢీకొన్న బస్సులు, కార్లు. వాహనాల్లో మంటలు చెలరేగి 13 మంది మృతి, దాదాపు 60 మందికి గాయాలు.డిసెంబర్ 24న తమిళనాడులో రెండు కార్లను ఢీకొన్న బస్సు తొమ్మిది మంది మృతి.డిసెంబర్ 25(ఈరోజు) కర్ణాటకలో బస్సు ప్రమాదం. దాదాపు 13 మంది మృతి, పలువురికి గాయాలు.
ఉన్నావ్ కేసు.. సెంగర్‌కు షాక్ తప్పదా?
ఉత్తర ప్రదేశ్ ఉన్నావ్‌లో సంచలనం సృష్టించిన అత్యాచార కేసులో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. నిందితుడు కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం.. దీనిని నిరసిస్తూనే ప్రాణభయంతో బాధితురాలు, ఆమె తల్లి ఆందోళనకు దిగడం.. అందుకు అనుమతి లేదంటూ భద్రతా సిబ్బంది వాళ్లను ఈడ్చిపారేయడం.. యోగి ప్రభుత్వ నుంచి కనీస స్పందన లేకపోవడం.. బాధితుల సోనియా-రాహుల్ గాంధీలను కలవడంతో రాజకీయ రగడ నెలకొంది. ఈ తరుణంలో.. న్యూఢిల్లీ: ఉన్నావ్ కేసులో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు జరిపిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సెంగర్ బెయిల్‌ను సవాల్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని భావిస్తోంది. ఢిల్లీ హైకోర్టును సమీక్షించిన తర్వాత పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 2017లో నాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సింగ్ సెంగర్ మైనర్ అయిన బాధితురాలిని ఎత్తుకెళ్లి పలుమార్లు అత్యాచారం జరపడంతో పాటు ఆమెను అమ్మే ప్రయత్నమూ చేశారు. ఆ సమయంలో పోలీసుల చొరవతో ఆమె బయటపడగలిగింది. అయితే న్యాయం కోసం ఆమె పోరాడినా ఫలితం దక్కలేదు. దీంతో సీఎం యోగి ఆదిత్యానాథ్ నివాసం వద్ద బలవన్మరణం కోసం ప్రయత్నించడంతో ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షించగలిగింది. ఈలోపు.. ఆమె తండ్రి హత్యకు గురికాగా.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం జరిగింది కూడా. ఈ కేసు తీవ్రత దృష్ట్యా యూపీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. సుప్రీం కోర్టు చొరవతో విచారణను కూడా యూపీ నుంచి ఢిల్లీ కోర్టుకు మార్చారు. 2019లో విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు నిందితుడు కుల్దీప్ సెంగర్‌కు జీవితఖైదు విధించింది. అయితే.. తాజాగా(డిసెంబర్ 23, 2025) మంగళవారం ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం.. అధికారం ఉన్న వ్యక్తి లైంగిక దాడి చేస్తే కనీసం 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది. సెంగార్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారి కిందకు రారని.. కాబట్టి ఆయపై పెట్టిన పోక్సో చట్టంలోని సెక్షన్-5 వర్తించదని ఢిల్లీ హైకోర్టు ద్విసభ ధర్మాసనం తీర్పు సందర్భంగా అభిప్రాయపడింది. కాబట్టి ఆ చట్టంలోని సెక్షన్ 4 మాత్రమే ఆయనకు వర్తిస్తుందని పేర్కొంది.ఈ తీర్పును బాధితురాలి కుటుంబం తీవ్రంగా తప్పుబడుతోంది. సెంగార్ బయటకు రావడం అంటే.. తమ ప్రాణాలకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేయబోతోంది. అయితే ఇప్పుడు సీబీఐ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుండడంతో కేసు ఎలాంటి మలుపు తిరగబోతోందా? అనే ఆసక్తి నెలకొంది. ‘‘ దారుణోదంతానికి ఒడిగట్టి దోషిగా తేలిన వ్యక్తికి హైకోర్టు మళ్లీ బెయిల్ మంజూరుచేయడమేంటి? ఇది నా కుటుంబానికి మరణశాసనం రాయడమే. బెయిల్ రద్దు డిమాండ్‌తో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా’’ అని ఆమె అన్నారు. బెయిల్‌ను తీవ్రంగా తప్పుబడుతూ బాధితురాలి తల్లితోపాటు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా మంగళవారం రాత్రి ఢిల్లీలోని ఇండియాగేట్ సమీప మండీ హౌస్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు వెంటనే వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. ఈ క్రమంలో బాధితురాలికీ గాయాలయ్యాయని యోగిత చెప్పారు. ‘‘దోషికి ఇలాగే బెయిల్ ఇస్తూ పోతే దేశంలోని ఆడబిడ్డలకు రక్షణ అనేదిఉంటుందా? మా విషయంలో మాత్రం ఈ తీర్పు మరణశాసనమే. న్యాయం పొందటంలో ధనికులు లాభపడతారు. మాలాంటి పేదలు ఓడిపోతారు. తీర్పు తర్వాత మమ్మల్ని లాయర్లతోనూ కలవనివ్వట్లేరు. వాళ్లను కలిసేందుకు వెళ్తుంటే సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకుని తిరిగి ఇంటికి పంపేస్తున్నారు. నా కుటుంబసభ్యులు, లాయర్లు, సాక్షులకు గతంలో ఇచి్చన పోలీస్భద్రతనూ ఉపసంహరించారు. ఇప్పుడు మాకు ప్రాణహాని ఎక్కువైంది. మా గతేంటి? దోషిని బెయిల్‌పై విడుదలచేస్తే మమ్మల్ని అయినా జైలుకు పంపండి. అతడి మిగతా జైలుశిక్షను నేను అనుభవిస్తా. అక్కడయినా క్షేమంగా ఉంటాం. సరైన ఉపాధి లేదు. అక్కడయినా తినడానికి తిండి దొరుకుతుందేమో’’ :::ఉన్నావ్ బాధితురాలి ఆవేదనసోనియా, రాహుల్‌లతో భేటీ ధర్నా తర్వాత బాధితురాలు తన తల్లితో కలిసి 10, జన్‌పథ్‌లోని సోనియాగాంధీ అధికారిక నివాసంలో సోనియా, రాహుల్‌గాంధీలను కలిశారు. నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు. సుప్రీంకోర్టులో నేరాన్ని నిరూపించి దోషిని బోనులో నిలబెట్టేలా అత్యంత ప్రతిభావంతులైన లాయర్ల బృందాన్ని ఇవ్వాలని ఆమె ఇరునేతలను కోరారు. పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ఇరునేతలు బాధిత కుటంబానికి హామీ ఇచ్చారు. అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ‘‘ న్యాయం కోసం పోరాడుతున్నా. ప్రధాని మోదీని కలవాలని నిర్ణయించుకున్నా. న్యాయపోరాటం చేస్తున్నందుకు రాహుల్ అభినందించారు’’ అని బాధితురాలు తర్వాత మీడియాతో చెప్పారు. ‘‘ అమలవుతున్న యావజ్జీవ కారాగారశిక్షను హఠాత్తుగా నిలుపుదలచేసి బెయిల్ ఇవ్వడం భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా. రేపిస్ట్లు అందరూ ఇలాగే విడుదలవుతారనే భయం ఇప్పుడు బాధితులందరి మనసుల్ని పురుగులా తొలిచేస్తోంది. ఇదే ప్రభుత్వం? ఇదేం పాలన?’’ అని బాధితురాలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇదిలా ఉంటే.. సెంగర్ వర్గ ఓట్ల కోసమే కుల్దీప్ను యూపీ బీజేపీ సర్కార్ బయటకు రప్పించే ప్రయత్నం చేస్తోందని రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.సిగ్గుచేటుఉన్నావ్లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో దోషి కుల్దీప్ సెంగర్ జైలు నుంచి విడుదల కావడం దేశానికి సిగ్గు చేటు అని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం రాహుల్ తన సామాజికమాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘సామూహిక అత్యాచార బాధితురాలి విషయంలో ప్రభుత్వం ఇంత నిర్దయంగా వ్యవహరించడం ఏ విధంగా సమర్థనీయం?. న్యాయం కోసం గొంతు వినిపించడానికి ధైర్యం చేయడమే ఆమె చేసి తప్పా?. బాధితురాలు పదే పదే వేధింపులకు గురవుతూ ప్రాణభయంతో జీవిస్తుంటే దోషికి బెయిల్ మంజూరు చేయడం అత్యంత దారుణం. బెయిల్ రావడం చాలా నిరాశపరిచింది. ఇది సిగ్గుచేటు. అత్యాచారం చేసిన వారికి బెయిల్ ఇవ్వడం, బాధితులను నేరస్థుల్లా చూడడం ఇదేం న్యాయం?. కేవలం ఒక మృత ఆర్థిక వ్యవస్థే కాదు ఇలాంటి అమానవీయ సంఘటనలతో మనం ఒక నిర్జీవ సమాజంగా విపరిణామం చెందుతున్నాం. ప్రజాస్వామ్యంలో అసమ్మతి గళం వినిపించడం హక్కు. దానిని అణచివేయడం నేరం. బాధితురాలు గౌరవం, భద్రత, న్యాయం పొందాలి. కానీ నిస్సహాయత, భయం, అన్యాయం కాదు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బెంగాల్లో మిన్నంటిన నిరసనలు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌లో హిందూ కార్మికుడి హత్యతోపాటు మైనార్టీలపై జరుగుతున్న∙దాడుల పట్ల పశ్చిమ బెంగాల్లో హిందూ సంఘాల సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్, సరిహద్దులోని ఓడరేవుల వద్ద బుధవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. నిరసనకారులను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.దీంతో, కోల్‌కతాలో హౌరా బ్రిడ్జి వైపు ర్యాలీగా వస్తున్న జనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బారీకేడ్లను పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లడానికి నిరసనకారులు ప్రయత్నించారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై దాడులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ సనాతన ఐక్య పరిషత్ ఆధ్వర్యంలో 24 పరగణాల జిల్లా, మాల్డా, కూచ్ బెహార్ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఈ నెల 18న బంగ్లాదేశ్‌లోని మైమెన్సింగ్ సిటీలో దీపూ చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని అల్లరిమూకలు కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ రాక్షసకాండ పట్ల ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హిందూ సంఘాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి.ఇదిలా ఉండగా.. అల్లరిమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన దీపూ చంద్రదాస్ కుటుంబ బాధ్యతను బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వీకరిస్తుందని మధ్యంతర ప్రభుత్వ సీనియర్ సలహాదారు సీఆర్ అబ్రార్ చెప్పారు. ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దీపూ చంద్రదాస్ భార్య, పిల్లలు, తల్లిదండ్రుల బాగోగులను ప్రభుత్వం చూస్తుందని హామీ ఇచ్చారు. అమాయకుడిని హత్య చేయడం దారుణమని అన్నారు. ఈ హత్యకు పాల్పడినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మరోవైపు తమ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేకూర్చాలని దీపూ చంద్రదాస్ తండ్రి రవి చంద్రదాస్ డిమాండ్ చేశారు. తన కుమారుడిని పొట్టనపెట్టుకున్న ముష్కరులను కఠినంగా శిక్షించాలని అన్నారు.
ఎన్ఆర్ఐ
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఘనంగా శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి
శంకర నేత్రాలయ దృష్టి సేవా కార్యక్రమాల కోసం నిధులు సమీకరించేందుకు 2025 నవంబర్ 22న బోటెల్ నగరంలోని ఎంపైర్ బ్యాంక్వెట్ హాల్లో నిర్వహించిన ఫండ్‌రైజింగ్ కార్యక్రమం సంగీత విభావరి ఘనంగా, అత్యంత విజయవంతంగా జరిగింది.కార్యక్రమం చిన్నారులు మిత్రా, మీనాక్షి, విష్ణు, జస్మితా ఆలపించిన పవిత్ర గణేశ వందనాలతో ఆరంభమైంది. కార్యక్రమం నిరంతరాయంగా సాగాలని వినాయకుడిని ప్రార్థించిన ఈ చిన్నారుల గాన ప్రదర్శన సభలోని ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ప్రత్యేక ఘట్టంగా నిలిచింది. కార్యక్రమాన్ని సుందరంగా, శ్రద్ధగా ముందుకు తీసుకెళ్లిన ఎంసీలు వర అక్కెల్ల, సృజనా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రముఖ గాయకులు సుమంగళి, అంజనా సోమ్య, పార్థు, మల్లికార్జున అందించిన సంగీత ప్రదర్శనలు కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి.స్థానిక కమ్యూనిటీ సభ్యులు, కమ్యూనిటీ సంస్థలు, నాయకులు, వాలంటీర్లు మరియు మిత్రుల సమిష్టి సహకారంతో ఈ సంగీత విభావరి విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బోటెల్ సిటీ డిప్యూటీ మేయర్ రామి గారు, అలాగే కొత్తగా ఎన్నికైన సిటీ కౌన్సిల్ సభ్యుడు అంగులూరి తమ భార్యతో కలిసి హాజరై, శంకర నేత్రాలయ చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ తమ మద్దతును తెలియజేశారు.2023 ‘Adopt a Village’ స్పాన్సర్లుగా శ్భాస్కర్ గంగిపాముల, శ్రీ రామ్ కొట్టీ;2024 స్పాన్సర్లుగా Quadrant Technologies (వంశీ రెడ్డి , శ్రీ రామ్ పాలూరి, భాస్కర్ జీ ), విక్రమ్ గార్లపాటి, వర అక్కెల్ల గారు, రాహుల్ & అనీలా, నంద కిషోర్ గజుల ;అలాగే 2025 స్పాన్సర్లుగా అశోక్ గల్లా, రాజేశ్ గుడవల్లి, అశోక్ పసుపులేటి, వినోద్ నాగుల, కృష్ణ ఉంగర్ల, శ్వేత సానగపు, రాజేశ్ అర్జా Seattle Boys Club — తదితరాలు ముందుకు వచ్చి ఈ మహత్తర సేవా కార్యక్రమానికి అందించిన మద్దతుకు శంకర నేత్రాలయ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.డెకరేషన్ టీమ్ – Seattle Decors and Events కార్యక్రమాన్ని అద్భుతంగా అలంకరించగా, ప్రతి క్షణాన్ని అందంగా బంధించిన హ్యాష్‌ట్యాగ్ ఫోటోగ్రఫీ, అలాగే రుచికరమైన భోజనం అందించిన Aroma Bothell, Biryani Bistro, Curry Point ఫుడ్ వెండర్ల సేవలు సభలోని వారి నుంచి విశేష ప్రశంసలు అందుకున్నాయి.SNUSA జాతీయ అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి నాయకత్వం, మార్గదర్శకత్వం, SNUSA బృందంలోని మూర్తి రేకపల్లి, డా. రెడ్డి ఊరిమిండి, వంశి ఏరువారం, శ్యామ్ అప్పలీ, రత్నకుమార్ కవుటూరు, త్యాగరాజన్ గారి కీలక మద్దతు, అలాగే స్థానిక చాప్టర్‌కు సకాలంలో అందిన సహకారం ఈ కార్యక్రమం ఘనవిజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.శంకర నేత్రాలయ బోర్డ్ ట్రస్టీలు సోమ జగదీశ్ కుటుంబం, వినోద్ కుటుంబంతో ముందుండి కీలక పాత్ర పోషించగా, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ జయపాల్ రెడ్డి దొడ్డ మార్గదర్శకత్వంలో చాప్టర్ లీడర్లు, వాలంటీర్లు సమిష్టిగా శ్రమించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో దృష్టి సేవలు అందించే శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలకు ఈ ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి విలువైన మద్దతును అందించింది.(చదవండి: ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!)
ఘనంగా ‘ఆటా’ అంతర్జాతీయ సాహిత్య సదస్సు!
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA – ‘ఆటా’) ఆధ్వర్యంలో, హైదరాదాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ‘ఆటా అంతర్జాతీయ సాహిత్య సదస్సు-2025’ ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఒక రోజు అంతర్జాతీయ సదస్సులో ఈ ఏటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సుప్రసిద్ధ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై విస్తృత సమాలోచన జరిగింది. ఆయన హిందీ సాహిత్య సృష్టి, భావనా ప్రపంచం, ఆలోచనలు, అభిప్రాయాలు, సృజనాత్మక దృష్టికోణాన్ని తెలుగు సాహితీ వేదికకు పరిచయం చేస్తూ వివిధ ప్రాంతాలకు చెందిన సాహిత్యవేత్తలు, కవులు, రచయితలు లోతైన చర్చలు జరిపారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన తెలంగాణ సాహిత్య అకాడెమీ తొలి అధ్యక్షుడు – కవి నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి - హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్ యాకూబ్ తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి, ఈ సాహిత్య సదస్సును ప్రారంభించారు. జనరంజక సాహిత్యంతో శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకొని, అందరికీ స్ఫూర్తిగా నిలిచారని వక్తలు అన్నారు. ఆయన రచనలు ఇతర భాషలలోకి అనువాదం కావడం, అనేక అవార్డులు సొంతం చేసుకోవడం విశేషమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో భాష, సాహిత్య వికాసం కోసమే కాక, అమెరికాలోనూ తెలుగు సంస్కృతి కోసం ‘ఆటా’, ‘తానా’ లాంటి సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని సిధారెడ్డి అన్నారు. తెలుగులో నవలల పోటీలు నిర్వహించిన ఘనత ‘ఆటా’కు దక్కుతుందన్నారు. ఈ డిసెంబర్ చివరివరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ సాహిత్య, సాంస్కృతిక, వైద్య సేవా కార్యక్రమాలను ‘ఆటా’ నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఆదివారం జరిగిన అంతర్జాతీయ సాహిత్య సదస్సులో సాహితీవేత్తలు ప్రసేన్, డాక్టర్ ఆర్. సుమన్ లత, ప్రొఫెసర్ సర్రాజు, శ్రీనివాస్ గౌడ్, రూప్ కుమార్, వారాల ఆనంద్, డాక్టర్ రెంటాల జయదేవ తదితరులు పాల్గొని, జ్ఞానపీఠ విజేత అయిన శుక్లా రచనా ప్రస్థానం, ఆయన రచనా శైలి, కవిత్వం, కథలు, కథావస్తువులు, నవలలోని ప్రత్యేకత, సినిమాలుగా – దృశ్య రూపాలుగా వచ్చిన ఆయన రచనలు తదితర అంశాలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ‘ఆటా’ ఇండియా బోర్డు సభ్యులు రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి, అలాగే సాహితీవేత్త రాధిక సూరి తదితరులు సమన్వయకర్తలుగా ఈ సుదీర్ఘ సాహిత్య సదస్సు నిర్వహణలో కీలకంగా వ్యవహరించారు. వేదికపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.వచ్చే జూలైలో... బాల్టిమోర్‌లో ఆటా సదస్సు‘ఆటా’ ప్రస్తుత అధ్యక్షుడు జయంత్ చల్లా, అలాగే రానున్న అధ్యక్షులు – ప్రస్తుత ‘ఆటా’ వేడుకల చైర్ సతీశ్ రెడ్డి పర్యవేక్షణలో, అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డ రచయిత వేణు నక్షత్రం సమన్వయంతో ఈ సదస్సు నిర్వహించారు. మూడున్నర దశాబ్దాలుగా నిత్యం వివిధ సామాజిక, సాహిత్య, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు చేస్తూ, ముందుకు సాగున్న ‘ఆటా’ లక్ష్యాలనూ, కృషినీ జయంత్, సతీశ్‌రెడ్డి తదితరులు వివరించారు. హిందీ – తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. దీని ద్వారా ‘ఆటా’ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని వారు పేర్కొన్నారు.అలాగే, అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ నగరంలో ‘ఆటా’ వారి 19వ మహాసభలు, యువజన సదస్సు వచ్చే 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు జరగనున్నట్లు ‘ఆటా’ ప్రతినిధులు తెలిపారు. ప్రవాసంలో ఉన్న తెలుగువారినీ, వ్యాపారవేత్తలనూ, ఐటీ నిపుణులనూ, యువతరాన్నీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం అభిప్రాయాలు పంచుకోవడానికీ, కలసికట్టుగా ముందుకుపోవడానికీ మూడు రోజుల ఆ భారీ సదస్సు ఉపకరిస్తుందని వివరించారు.ఆదివారం రోజంతా జరిగిన సాహిత్య సదస్సులో యండమూరి వీరేంద్రనాథ్, నాళేశ్వరం శంకరం, కందుకూరి శ్రీరాములు, స్వర్ణ కిలారి లాంటి పలువురు ప్రముఖ రచయితలు, అమెరికా నుంచి పెద్దయెత్తున వచ్చిన ‘ఆటా’ ప్రతినిధులు జయంత్ చల్లా, సతీష్ రెడ్డి, నరసింహ, సాయి సుధుని తదితరులు, వారి కుటుంబ సభ్యులు, సాహిత్యాభిమానులు పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా అతిథులు, కవులు, రచయితలు, ‘ఆటా-ఇండియా టీమ్’ సభ్యులను ప్రస్తుత ‘ఆటా’ బోర్డు సభ్యులు ఘనంగా సత్కరించారు.(చదవండి: తెలంగాణ వాసి అరుదైన ఘనత..యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఉదయ్ నాగరాజు)
H-1B వీసా: భారతీయుల విషయంలో ఏం జరగొచ్చు!
న్యూఢిల్లీ: హెచ్–1బీ, హెచ్–4 వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్స్‌ను, వారు చేసిన పోస్టులను అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం క్షుణ్నంగా తనిఖీ చేయబోతోంది. సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేశాయి. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్ల విషయంలో ఇప్పటికే ఈ నిబంధన అమలవుతోంది. అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ డిసెంబర్ 15, 2025 నుంచి హెచ్–1బీ, హెచ్–4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించనుంది. ఇది ఇప్పటికే విద్యార్థులు మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్లకు అమలులో ఉన్న నిబంధనను విస్తరించడం ద్వారా జరుగుతోంది.కొత్త నిబంధన వివరాలుఈ కొత్త విధానం ప్రకారం, వీసా దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను “పబ్లిక్” సెట్టింగ్స్‌లో ఉంచాలి. కనీసం గత ఐదు సంవత్సరాల పోస్టులు, కామెంట్లు, వీడియోలు, ఫోటోలు వంటి సమాచారం పరిశీలనకు వస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్(ట్విటర్), లింక్డిన్.. తదితర ప్రధాన ప్లాట్‌ఫార్మ్‌లలోని కంటెంట్‌ను కాన్సులర్ అధికారులు పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో అభ్యర్థుల ఆన్లైన్ ప్రెజెన్స్ రివ్యూ తప్పనిసరి అవుతుంది.ప్రభావం-ఆందోళనలుఈ చర్యతో భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ప్రభావితమవుతారు, ఎందుకంటే హెచ్–1బీ వీసా హోల్డర్లలో 70% పైగా భారతీయులే ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలు లేదంటే స్టాంపింగ్ ప్రక్రియలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో, సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా వీసా ఆమోదం ఆలస్యం కావొచ్చు. ఒక్కోసారి తిరస్కరించబడే ప్రమాదం ఉంది. నిపుణులు దీనిని ప్రైవసీ హక్కులపై ప్రభావం చూపే చర్యగా భావిస్తున్నారు, కానీ అమెరికా ప్రభుత్వం మాత్రం ఇది జాతీయ భద్రతా కారణాల కోసం అవసరం అని చెబుతోంది.ఇప్పటికే అమలులో ఉన్న విధానం విస్తరణఇప్పటికే విద్యార్థులు (F-1 వీసా) మరియు ఎక్స్ఛేంజ్ విజిటర్ల (J-1 వీసా) సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు అదే విధానాన్ని తాత్కాలిక ఉద్యోగ వీసాలు (H-1B), వాటి ఆధారిత వీసాలు (H-4) వరకు విస్తరించారు. ఈ మార్పు వల్ల అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసే విదేశీ ప్రొఫెషనల్స్ మరింత జాగ్రత్తగా సోషల్ మీడియా వాడకాన్ని కొనసాగించాల్సి ఉంటుంది.
క్రైమ్
ప్రేమ వ్యవహారం మలుపు.. నల్లగొండలో ఉద్రిక్త పరిస్థితి
నల్లగొండ జిల్లా: నేరడుగొమ్ము మండలంలో ప్రేమికుడు మోసం చేశాడంటూ ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పులికంటి శ్రీను అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించి, ఉద్యోగం వచ్చాక పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితురాలు మంజుల ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గురువారం శ్రీను ఇంటి ఎదుటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన మంజుల, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంజుల కుటుంబ సభ్యులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకోగా, తోపులాట కూడా జరిగింది. తనకు న్యాయం చేయకపోతే చావే శరణ్యం అంటూ మంజుల ఆవేదన వ్యక్తం చేసింది.ప్రేమ పేరుతో మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఘటన అనంతరం పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని మంజులను శాంతింపజేశారు. ప్రస్తుతం ఆమె ప్రియుడు పులికంటి శ్రీను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రేమించలేదని యువతిపై దాడి
బెంగళూరు: ఆన్లైన్లో పరిచయమైన యువకుడు ప్రేమించాలని వేధిస్తూ యువతిపై దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నవీన్‌కుమార్ అనే నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశామని జ్ఞానభారతి పోలీసులు తెలిపారు. వివరాలు.. టెలికాలర్‌గా పనిచేస్తున్న యువతికి 2024లో ఇన్‌స్టా ద్వారా నవీన్‌కుమార్ పరిచయమయ్యాడు. అప్పుడప్పుడు కాల్స్, మెసేజ్ చేస్తున్న నవీన్‌కుమార్ ప్రేమించాలని ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఆమె అతన్ని తిరస్కరించింది. యువతి గత సోమవారం మధ్యాహ్నం పీజీ హాస్టల్ వద్ద నిలబడి ఉండగా కారులో వచ్చిన నవీన్‌కుమార్ గొడవపడి దాడి చేసి, యువతి బ్యాగ్‌ను లాక్కుని ఉడాయించాడు. దాడి దృశ్యాలు పీజీ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. pic.twitter.com/glv1rMtE1P Bengaluru's Jnanabharathi area on December 22, 2025, where 21-year-old Naveen Kumar groped, slapped, and attempted to tear the clothes of a woman who rejected his repeated romantic proposals after connecting on Instagram, as captured in attached CCTV…— MdShakeel(PingTV) (@PingtvIndia) December 24, 2025
పెప్పర్ స్ప్రే కొట్టి భర్తపై భార్య దాడి
విశాఖ సిటీ: తన భార్య, కుమార్తె, ఆమె స్నేహితుడు తనపై పెప్పర్ స్ప్రే కొట్టి, దాడికి పాల్పడ్డారని దీపాటి జార్జ్ మార్టిన్ అనే వ్యక్తి మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు.. మారి్టన్(56) భార్య హన్నా మార్టిన్, ఇద్దరు పిల్లలతో పాండురంగాపురం ప్రాంతంలో నివాసముంటున్నారు. భార్య పేరు మీద ఒక ఇంజనీరింగ్ కంపెనీని ప్రారంభించి, కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండేళ్ల నుంచి భార్య హన్నా మార్టిన్ ఆ కంపెనీ ఆర్థిక వ్యవహారాలను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన చేసిన కాంట్రాక్టు పనుల బిల్లులు సదరు కంపెనీ అకౌంట్లోనే పడడంతో వాటిని తీసుకునే అవకాశం మారి్టన్కు లేకుండా పోయింది. నాలుగు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మారి్టన్ తన తల్లి, కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. మంగళవారం పని మీద ఇంటికి వెళ్లడంతో అక్కడ భార్య, కుమార్తె, అమె స్నేహితుడు మార్టిన్‌పై పెప్పర్ స్ప్రే కొట్టి దాడి చేశారు. అతడి కాలు, చేతికి గాయాలవడంతో కేజీహెచ్‌లో చికిత్స చేయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లంకెలపాలెంలో అర్ధరాత్రి హత్య
పరవాడ: లంకెలపాలెం దరి శ్రీరామనగర్ కాలనీ వద్ద మంగళవారం అర్ధరాత్రి కాలనీకి చెందిన ఈగల వెంకినాయుడు(40) దారుణ హత్యకు గురయ్యాడు. ఘటనకు సంబంధించి పరవాడ సీఐ ఆర్.మల్లికార్జునరావు తెలిపిన వివరాలు.. లంకెలపాలెం దరి శ్రీరామనగర్‌కాలనీ(విలేకరుల కాలనీ)కి చెందిన వెంకినాయుడు.. మొల్లి సరస్వతి అనే మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. హతుడి భార్య, ఇద్దరు పిల్లలు పెద్దినాయుడుపాలెం ఉంటారు. మృతుడు ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడంతో పాటు కూర్మన్నపాలెంలోని ఓ జిమ్‌లో కోచ్. మంగళవారం రాత్రి కాలనీలోని ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాడు. రాత్రి 1 గంట సమయంలో తేజ అనే వ్యక్తి వచ్చి వెంకినాయుడును బయటకు రమ్మని పిలిచాడు. హతుడు స్వెటర్ వేసుకుని వెళ్లడం చూసిన సరస్వతి, ఏదో పని మీద బయటకు వెళుతున్నారని భావించి నిద్రపోయింది. వేకువ జామున లేచి వెంకినాయుడుకు, తేజకు ఫోన్ చేసింది. అటునుంచి సమాధానం రాలేదు. ఉదయానికి వెంకినాయుడు మృతదేహం సమీపంలోని లేఅవుట్లో పడి ఉందని స్థానికులు చెప్పడంతో.. వెళ్లి చూసి, హత్యకు గురైంది వెంకినాయుడేనని నిర్ధారించుకుని పరవాడ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి షర్ట్ చిరిగి ఉండటంతో స్నేహితుల మధ్య పెనుగులాట జరిగి ఉంటుందని, సమీపంలో లభ్యమైన 10 కిలోల బరువుండే బండ రాయితో తలపై గట్టిగా మోదడంతో తల నుజ్జుయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరవాడ డీఎస్పీ వి.విష్ణుస్వరూప్, సీఐ ఆర్.మల్లికార్జునరావు సందర్శించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి వివరాలు రాబట్టారు. స్థానికులు, కుటుంబ సభ్యుల నుంచి హత్యకు గల కారణాలను ఆరా తీశారు. ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదుచేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.
వీడియోలు
మావోయిస్టులకు మరో బిగ్ షాక్
రోడ్లు మీద కొడుకు బర్త్ డే వేడుకలు
క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ఆర్కే రోజా
నా కళ్ల ముందే 15 మందిని! బాండీ బీచ్ రియల్ హీరో.. సంచలన విషయాలు
సంతోష పడకు.. అన్ని ఆధారాలు ఉన్నాయ్.. కేసులు మూసేసినా.. నీ ఆట కట్టిస్తాం
ఇషాన్ ఊచకోత.. MS ధోని రికార్డు బ్రేక్
భక్తులపై లాఠీ ఛార్జ్.. కవరేజ్ చేస్తున్న సాక్షి ఫోటోగ్రాఫర్ పై దాడి
మరోసారి పోకిరి కాంబో.. వారణాసితో పాన్ వరల్డ్ షేక్
తిరుపతి అలిపిరి వద్ద తోపులాట
కోడిని చంపినట్లు భర్తలను చంపుతున్న భార్యలు

