breaking news
Nagarkurnool
-
పోలీసు ప్రజావాణికి 15 అర్జీలు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఎస్పీ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భూ తగాదాలపై 10, తగున్యాయం కోసం 5 ఫిర్యాదులు అందాయని.. సంబంధిత అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలిపెద్దకొత్తపల్లి: ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ.. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంచాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని వావిళ్లబావి, బాచారం ప్రాథమిక, కల్వకోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల అభ్యసన స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులు కొనసాగించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తప్పవన్నారు. డీఈఓ వెంట జిల్లా బాలికా విద్య కోఆర్డినేటర్ శోభారాణి, జిల్లా టెస్టుబుక్స్ మేనేజర్ నర్సింహులు ఉన్నారు.ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేయాలిస్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి కోసం ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ లక్ష్మిధర్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని డిపోలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు సోమవారం త్రైమాసిక అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను మిగతా వారు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. ఆర్టీసీలో ప్రమాదాల శాతాన్ని తగ్గించాలని సూచించారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, మీ అనుకూలమైన సమయాల్లో వీటి గురించి గ్రామాల్లో, కాలనీల్లో ప్రచారం చేయాలని కోరారు. టూర్ ప్యాకేజీల వల్ల అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో టూటౌన్ సీఐ ఎజాజుద్దీన్, డిపో మేనేజర్ సుజాత, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.175 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎంసీ అనుమతిపాలమూరు: మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం 175 సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కళాశాలలో పర్యటించిన ఎన్ఎంసీ బృందం.. పలు లోపాలు ఉన్నట్లు నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధిత అధికారులు లోపాలపై ఇచ్చిన నివేదికపై సంతృప్తి చెందిన ఎన్ఎంసీ.. సీట్లు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న సమస్యలను రాబోయే నాలుగు నెలల వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఎన్ఎంసీ ఆదేశించింది. -
ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తమ సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకంతో ప్రజలు వ్యయ, ప్రయాసాలకోర్చి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి.. పరిష్కారమార్గం చూపాలని సూచించారు. ఏదేని దరఖాస్తు పరిష్కారం కాని పక్షంలో సంబంధిత అర్జీదారుకు తెలియజేయాలని సూచించారు. కాగా, ప్రజావాణికి వివిధ సమస్యలపై 46 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం
పెంట్లవెల్లి: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం పెంట్లవెల్లిలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి ఆయన మైనార్టీ మహిళలకు 109 కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభు త్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేస్తామ న్నారు. పెంట్లవెల్లి మండలాన్ని అన్నివిధాలా అభి వృద్ధి చేయడంతో పాటు ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మైనార్టీల అభ్యున్నతి కోసం రూ. 20లక్షలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. అనంతరం పెంట్లవెల్లి కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయంలో రత్నగిరి ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. 17లక్షల విలువైన కిడ్ బెడ్స్ ను మంత్రి జూపల్లి అందజేశారు. కేజీబీవీలో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకొని చదువులో ఉన్నతంగా రాణించాలని విద్యార్థినులకు సూ చించారు. కార్యక్రమంలో నాయకులు రామన్‌గౌడ్, నర్సింహ యాదవ్, నల్లపోతుల గోపాల్, ఎర్ర శ్రీనివాసులు, ఎండీ కబీర్, మాజీ సర్పంచ్ సువర్ణమ్మ, గోపినాయక్, తిరుపాటి నాగరాజు, ధర్మతేజ, ఆంజనేయులు, భీంరెడ్డి, కుమార్ పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి నిరంతర కృషి అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు అందిస్తాం రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
ఇబ్బంది పడుతున్నాం..
మా కాలనీలోని డ్రెయినేజీ పూర్తిగా పాడైంది. కనీసం డ్రెయినేజీలోని చెత్తాచెదారం, పూడిక తొలగించడం లేదు. నిత్యం దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నాం. మురుగునీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. – కొట్ర మహేశ్, శ్రీపురం చౌరస్తా, నాగర్‌కర్నూల్ పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.. వానాకాలం నేపథ్యంలో పారిశుద్ధ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తాం. డ్రెయినేజీలు లేని ప్రాంతాల్లో నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నుంచి మురుగు బయటికి రాకుండా చూస్తాం. ప్రస్తుతానికి జెట్టింగ్ మిషన్ల ద్వారా మురుగునీటి తొలగింపు చేపడతాం. – నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్‌కర్నూల్ ● -
అసలేం జరుగుతోంది..
నాగర్‌కర్నూల్: జిల్లా పంచాయతీ అధికారిని కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా ఇటీవల కలెక్టరేట్‌కు చేరినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఉన్నతాధికారుల నుంచి మాత్రం స్పష్టమైన ప్రకటన రావడం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే తెరవెనక ప్రయత్నాలు ఏమైనా కొనసాగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు నేతల ఆగ్రహమే కారణమా? జిల్లా పంచాయతీ అధికారి బదిలీ వెనక ఇద్దరు ప్రధాన నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల జిల్లాలో జరిగిన రెండు సంఘటనలు వారి ఆగ్రహానికి కారణమై ఉండవచ్చని పలువురు చెబుతు న్నారు. జూన్ 21న కొల్లాపూర్ మండలంలోని సోమశిలలో ఓ రిసార్ట్‌ను కూలగొట్టేందకు డీపీఓ తమ సిబ్బందితో వెళ్లిన విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని రిసార్ట్‌కు అన్ని అనుమతులు ఉన్నాయని.. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులు కక్షపూరితంగా కూల్చివేసేందుకు అధికారులను పంపారని ఆందోళనకు దిగారు. కొందరు పెట్రోల్ బాటిళ్లతో రిసార్ట్ ఎదుట బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇక చేసేదేమీ లేక అధికారులు వెనుదిరిగారు. ఇదిలా ఉంటే, కొన్ని నెలల క్రితం అచ్చంపేట నియోజకవర్గంలోని దోమలపెంటలో బీఆర్ఎస్ నాయకుడికి చెందిన హోటల్ ప్రభుత్వ స్థలంలో ఉందంటూ కూల్చేశారు. అయితే సదరు బాధితుడు హైకోర్టును ఆశ్రయించడంతో హోటల్ తిరిగి కట్టించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు సదరు బాధితుడికి హోటల్ నిర్మించి ఇచ్చారు. ఈ రెండు సంఘటనలు అధికార పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. వారి ఆగ్రహంతోనే డీపీఓను కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేశారనే ప్రచారం సాగుతోంది. ఆది నుంచి వివాదాస్పదమే.. జిల్లా పంచాయతీ అధికారి తీరు ఆది నుంచి కొంత వివాదాస్పదంగానే ఉంది. కేవలం అధికార పార్టీ నేతల మాటలకు తలొగ్గి పనిచేస్తూ.. ఇతరుల ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోవడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు కొన్ని సంఘటనలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. పెద్దకొత్తపల్లి మండలం చిన్నకార్పాములలో ప్రభుత్వం నిర్మించిన డంపింగ్ యార్డును కొందరు ఉద్దేశపూర్వకంగా కూలగొట్టారని.. సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గత మార్చి 27న బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తెలకపల్లి మండల కేంద్రంలో 40 దుకాణాలను అనుమతులు లేకుండా నిర్మించారని.. వీటిపై చర్యలు తీసుకోవాలని కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అయితే నాలుగు నెలలుగా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. ఈ దుకాణాల అక్రమ నిర్మాణంపై ఇప్పటి వరకు మూడుసార్లు ఫిర్యాదు లు అందినా కనీస స్పందన కరువైంది. అన్ని ఫిర్యాదులపైఒకేలా స్పందించాలి.. అధికారులు అన్ని ఫిర్యాదులపై ఒకేలా స్పందించాలి. కేవలం అధికార పార్టీకి చెందిన నాయకుల మాటలు విని కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదు. పెద్దకొత్తపల్లి మండలం చిన్న కార్పాములలో డంపింగ్ యార్డు కూలగొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని మూడు నెలల క్రితం ఫిర్యాదు చేసినా ఇప్పటికీ స్పందన లేదు. – ఎల్లేని సుధాకర్‌రావు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కమిషనరేట్‌కు డీపీఓ అటాచ్ అంటూ ప్రచారం ఇప్పటికే ఆర్డర్ కాపీ కలెక్టరేట్‌కు చేరిందంటూ చర్చ స్పష్టత ఇవ్వని ఉన్నతాధికారులు సోమశిల రిసార్ట్, అచ్చంపేట హోటల్ ఘటనలే కారణమా..? -
పారిశుద్ధ్యం.. అస్తవ్యస్తం
సాక్షి, నాగర్‌కర్నూల్: అసలే వానాకాలం.. మున్సిపాలిటీల్లో మురుగుతో పాటు వర్షపునీరు రోడ్లపైనే పారుతోంది. డ్రెయినేజీల్లో చెత్తాచెదారం నిండిపోవడంతో నీరు పారేందుకు వీలులేక రోడ్లపైకి చేరుతోంది. వానాకాలానికి ముందే అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం.. నిర్లక్ష్యం వహిస్తోంది. జిల్లాకేంద్రంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో ఎక్కడా సంబంధిత యంత్రాంగంలో సన్నద్ధత కనిపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లో అధ్వానం.. జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ మున్సిపాలిటీల్లోని శివారు ప్రాంతాల్లో డ్రెయినేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో మురుగు రోడ్లపైనే పారుతోంది. ఇళ్లలోకి వర్షపునీరు, మురుగు చేరుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోనూ డ్రెయినేజీ నిర్వహణకు చర్యలు చేపట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. నాలాలు అన్యాక్రాంతం.. వానాకాలంలో వరదనీటిని పట్టణం నుంచి బయటకు పంపేందుకు కీలకమైన నాలాలు చాలాచోట్ల అన్యాక్రాంతానికి గురవుతున్నాయి. నాలాలను కబ్జాచేసి నిర్మాణాలు చేపడుతున్నా పర్యవేక్షణ కరువైంది. ఏళ్ల క్రితం నిర్మించిన నాలాలకు మరమ్మతులు, నిర్వహణ లేక పూడిక, చెత్తాచెదారంతో కనిపిస్తున్నాయి. మురుగు, వరదనీరు పారేందుకు వీలులేక రోడ్లపైనే పారుతూ.. ఇళ్లలోకి చేరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపాలిటీల్లోకంపు కొడుతున్న కాలనీలు రోడ్లపైనే పారుతున్న మురుగు శివారు ప్రాంతాల్లో డ్రైయినేజీలు కరువు ఇళ్లలోకి చేరుతున్న మురుగునీరు వానాకాలం నేపథ్యంలో ఎక్కడా కనిపించని పారిశుద్ధ్య చర్యలు -
సర్వేయర్లు కావాలె..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వేధిస్తున్న కొరత ● రోజురోజుకూ పెరిగిపోతున్న దరఖాస్తులు ● పరిష్కరించలేక చేతులెత్తేస్తున్న సర్వే ల్యాండ్ అధికారులు ● 2 వేలకుపైగానే ఎఫ్‌లైన్ అర్జీల పెండింగ్ ● తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్న రైతులు రికార్డులు శిథిలావస్థకు.. ఉమ్మడి ఇల్లాలో సర్వే చేసేందుకు సిబ్బంది కొరతతోపాటు ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన అవసరముంది. రీ సర్వే చేయకపోవడంతో చాలా కార్యాలయాల్లో రికార్డులు శిథిలావస్థకు చేరాయి. కొత్తగా వచ్చిన భూ భారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ సంతకం పెట్టిన తర్వాత ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్ చేసేలా పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది. దీని ద్వారా పొరపాట్లు జరిగే ఆస్కారం ఎక్కువగా ఉందని పలువురు అభిప్రాయపడు తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి తప్పు చేస్తే అతనిపై చర్యలకు అధికారం ఉన్నతాధికారులకు ఉంటుంది. లైసెన్స్ సర్వేయర్ తప్పు చేస్తే ఏమి టి పరిస్థితి అనేది ఎక్కడా లేదు. ఇందుకోసం సర్వేయర్ల పోస్టులను భర్తీ చేయడంతోపాటు వారి సమస్యలను పరిష్కరిస్తేనే క్షేత్రస్థాయిలో సమస్యలకు పరిష్కారం లభించనుంది. మహబూబ్‌నగర్ న్యూటౌన్: ఉమ్మడి జిల్లాలో భూములకు సంబంధించిన దరఖాస్తుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు సర్వేయర్ల కొరత వేధిస్తుండటంతో ఏళ్లు గడిచినా సర్వే చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా భూములకు అధికారికంగా సర్వే చేయింకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆర్వోఆర్– 2025 భూ భారతి చట్టంలో రీ సర్వేను సైతం ప్రాధాన్యత అంశంగా చేర్చారు. మళ్లీ కొత్తగా భూ భారతి చట్టంలో స్కెచ్ మ్యాపులు వేసేలా.. మరోవైపు లైసెన్స్ సర్వేయర్ల కోసం చర్యలు తీసుకుంటున్నారు. వీటి ద్వారా ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది.. ఏమైనా నష్టం కలుగుతుందా అనేది అమల్లోకి వస్తేనే తెలియనుంది. సర్వేయర్ల కొరతను తీర్చేందుకు లైసెన్స్ సర్వేయర్లను తీసుకొస్తున్నారు. మా భూములు కొలతలు చేయాలంటూ ఉమ్మడి జిల్లాలో 2 వేలకు పైగానే ఎఫ్‌లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వేయర్లను జాతీయ రహదారి, పాలమూరు– రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన భూ సేకరణకు వినియోగిస్తుండటంతో ఇతర పనులకు సమయం ఇవ్వడం లేదు. దీంతో చాలామంది రైతులు ప్రైవేటు సర్వేయర్లను ఆశ్రయిస్తున్నారు. అధికారికంగా లేకపోవడంతో భూముల హద్దుల వివాదాలు తేలడం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన వాటిని సర్వే చేసేందుకు ఉన్నవారికి సమయం సరిపోవడం లేదు. జిల్లా పోస్టులు ఉన్నవారు ఖాళీలు మహబూబ్‌నగర్ 27 18 9 నారాయణపేట 8 3 5 జోగుళాంబ గద్వాల 20 9 11 నాగర్‌కర్నూల్ 28 13 15 వనపర్తి 26 13 13 ఉమ్మడి జిల్లాలో పరిస్థితి ఇలా.. -
ఇంటర్ కళాశాలలకు మహర్దశ
కందనూలు: ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు మహర్దశ పట్టింది. విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన మెరుగైన విద్య అందించేందుకు గాను ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. జిల్లాలో 14 జూనియర్ కళాశాలలు ఉండగా.. రూ. 1.22కోట్లు మంజూరయ్యాయి. దశాబ్దకాలం తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వసతులు మెరుగు.. పదేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు నిధులు రాకపోవడంతో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. సరైన వసతులు లేక విద్యార్థులు, అధ్యాపకులు నానా అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులు కేటాయించడంతో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. తరగతి గదుల మరమ్మతుకు అవకాశం లభించింది. విద్యార్థులకు టాయిలెట్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం, భవనాలకు రంగులు వేయడం, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి పనులు చేపట్టనున్నారు. సమస్యలు తీరుతాయి.. చాలా సంవత్సరాల తర్వాత జూనియర్ కళాశాలలకు నిధులు మంజూరు కావడం ఆనందంగా ఉంది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు కళాశాలలను బాగు చేసుకునే అవకాశం లభించింది. నిధులను సద్వినియోగం చేసుకోవాలి. – వెంకటరమణ, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి కళాశాలల వారీగా నిధుల కేటాయింపు ఇలా.. పదేళ్ల తర్వాత నిధులు మంజూరు జిల్లాలో 14 కాలేజీలకు రూ.1.22 కోట్లు కేటాయింపు -
డబుల్బెడ్రూం ఇళ్ల పనుల పూర్తిపై నిర్లక్ష్యం సరికాదు
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్న డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనుల పూర్తిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేయడం సరికాదన్నారు. డబుల్బెడ్రూం ఇళ్ల పనులను వెంటనే పూర్తిచేసి.. పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం నాయకులు పొదిల రామయ్య, అశోక్, వెంకటేశ్, మధు, చంద్రశేఖర్, సత్యనారాయణ, మల్లికార్జున్ ఉన్నారు. -
తెలంగాణ గుండెచప్పుడు సాయిచంద్
అమరచింత: సాయిచంద్ పాట తెలంగాణ రాష్ట్రానికే గుండె చప్పుడుగా మారిందని.. బీఆర్ఎస్ కుటుంబాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమరచింతలో గిడ్డంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సాయిచంద్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సాయి అభిమానుల సమక్షంలో కనులపండువగా సాగింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో మాజీమంత్రులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ గొంతుకగా సాయి ప్రతి ఒక్కరి హృదయాల్లో గూడుకట్టుకున్నారని.. సిద్దిపేటలో చెత్త సేకరణ వాహనాలకు ఎలాంటి పాట బాగుంటుందని ఆలోచించానని, తను రాసి పాడిన పాటే ఇప్పటికీ మార్మోగుతుందని హరీశ్‌రావు అన్నారు. ఉద్యమ సమయంలో తన పాటలతో లక్షలాది మంది ప్రజలను ఉర్రూతలూగించిన వ్యక్తి సాయిచంద్ అని కొనియాడారు. భర్త లేకున్నా.. చిన్న పిల్లలతో కలిసి రజని చేస్తున్న పోరాటం అభినందనీయని.. ఆమె ఆశయ సాధనకు తామంతా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయపరంగా రజనికి కేసీఆర్ అభయం ఇచ్చారని.. వారి కుటుంబానికి మనోధైర్యం ఇద్దామన్నారు. సాయికి నివాళి అర్పించాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి.. కేసీఆర్ సీఎం కావాలని మనందరం సంకల్పించాలని కోరారు. -
బడులు బాగుపడేనా..?
ఉపాధ్యాయులకు పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు తనిఖీ చేసే అంశాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రగతికి సంబంధించిన అంశాలతో పాటు సైన్స్ ల్యాబ్‌ల వినియోగం, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకం అమలు, పారిశుద్ధ్య చర్యలు, వైద్యం, తాగునీటి సదుపాయాలు, లైబ్రరీ ఇతర సౌకర్యాలను పరిశీలిస్తారు. ప్రాథమిక పాఠశాల తనిఖీ అధికారి రోజుకు రెండు స్కూళ్లను సందర్శించాలి. మూడు మాసాల్లో కనీసం వంద పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలలకు సంబంధించి రోజుకు ఒక స్కూల్‌ను తనిఖీ చేయాలి. మూడు నెలల్లో దాదాపు 50 పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉంటుంది. తనిఖీ నివేదికలను డీఈఓకు అందజేస్తారు. వీటిపై ఉన్నతాధికారులు ప్రతినెలా 5వ తేదీన సమీక్షిస్తారు. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత.. పాఠశాలల తనిఖీలతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పగించే విధానంపై పలు ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఎంఈఓలు, జీహెచ్‌ఎంల పర్యవేక్షణలో ఉన్న పాఠశాలలను స్కూల్ అసిస్టెంట్లతో తనిఖీలు చేయించడం సరైంది కాదని పలువురు హెచ్ఎంలు పేర్కొంటున్నారు. అలాగే తనిఖీ చేసే ఉపాధ్యాయులకు హెచ్ఎంలు ఎంత వరకు సహకరిస్తారనేది అతిపెద్ద ప్రశ్న. మరోవైపు మండలానికి ముగ్గురు ఉపాధ్యాయులను నియమించడం వల్ల విద్యార్థులకు బోధనలో నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కందనూలు: సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయనే భావనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసైనా సరే.. తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితులను అధిగమించడానికి, పాఠశాలలపై మరింత పర్యవేక్షణ పెంచడానికి రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. విద్యావ్యవస్థలో మార్పునకు సర్కారు చర్యలు ఇకపై పాఠశాలలను తనిఖీ చేయనున్న టీచర్లు బోధనపై ప్రభావం చూపుతుందని ఉపాధ్యాయ సంఘాల ఆందోళన జిల్లాలో 131 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 125 ప్రాథమికోన్నత, 560 ప్రాథమిక పాఠశాలలు ఉండగా.. 3,513 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో జీహెచ్ఎంలు 152 మంది, పీఎస్ హెచ్ఎంలు 105, ఎస్జీటీలు 1,511 మంది, స్కూల్ అసిస్టెంట్లు 1,745 మంది ఉన్నారు. అయితే జిల్లాలో పనిచేస్తున్న మొత్తం ఉపాధ్యాయుల్లో 2శాతం మందిని తనిఖీ అధికారులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి
తాడూరు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేలా విద్యాబోధన ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం తాడూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంతో పాటు మేడిపూర్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను తెలుసుకోవడంతో పాటు ఏఐ బోధనా ప్రక్రియను పరిశీలించారు. అదే విధంగా అటల్ టింకరింగ్ సైన్స్ ల్యాబ్స్ ఏర్పాటుకు అవసరమైన గదులను కలెక్టర్ పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. మేడిపూర్ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో సాధించిన ఫలితాలపై ఆరా తీశారు. కేజీబీవీలో విద్యాబోధనను గమనించారు. పాఠ్యపుస్తకాల పంపిణీ, బోధనా లక్ష్యాలను తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏఐ విద్యను సమర్థవంతంగా అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలన్నారు. విద్యార్థుల భోజనం తయారీకి వినియోగించే పప్పుదినుసులు, వంట నూనె, బియ్యం ఇతర సామగ్రి నాణ్యతగా ఉండాలన్నారు. మెనూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అదే విధంగా సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న వసతులను ప్రజలకు వివరించి.. విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. కాగా, కేజీబీవీలో నెలకొన్న సమస్యలను ప్రత్యేకాధికారిణి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇంటర్లో 80 మందికి గాను 70 మంది చేరినట్లు తెలిపారు. -
శనేశ్వరాలయానికి భక్తుల తాకిడి
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు నిర్వహించేందుకు తెల్లవారుజాము నుంచే క్యూ కట్టారు.ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ఆధ్వర్యంలో శనేశ్వరుడికి తిలతైలాభిషేకాలు, గోత్రనామార్చనలు చేశారు. అనంతరం శివాలయాన్ని సందర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమామహేశ్వర్, సిబ్బంది గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలి నాగర్‌కర్నూల్ క్రైం: సబ్‌జైలులో ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సబ్‌జైలులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. క్షణికావేశం, ఇతరాత్ర కారణాలతో నేరాలకు పాల్పడి జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ఎవరికై నా న్యాయవాదిని నియమించుకోలేని పరిస్థితి ఉంటే.. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదిని నియమిస్తామని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి
గద్వాల/ధరూరు: కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం కింద చేపట్టిన నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను డిసెంబర్ నాటికి పూర్తి చేయడంతో పాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులను మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా జూరాల గేట్ల మరమ్మతు, ర్యాలంపాడు జలాశయం లీకేజీలపై అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు సాంకేతికపరంగా పూర్తి భద్రంగా ఉందన్నారు. ప్రాజెక్టుకు ఉన్న 62 గేట్లలో 58 గేట్లు నిర్విరామంగా సురక్షితంగా పనిచేస్తున్నాయని.. మిగిలిన నాలుగు గేట్లకు అవసరమైన మరమ్మతులు చేపడుతున్నట్లు వివరించారు. గతంలో జూరాలకు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వచ్చిన వరదను విజయవంతంగా ఎదుర్కొన్నట్లు గుర్తుచేశారు. అయితే జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయిన కారణంగా నీటినిల్వ సామర్థ్యం 25 శాతం తగ్గిందని.. డీసిల్టింగ్ చేపట్టి జలాశయంలో పూర్తిస్థాయి నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ఇంజినీర్లు, లస్కర్లు కూడా లేని దయనీయ పరిస్థితిలో తెచ్చిపెట్టారని విమర్శించారు. జూరాల డ్యాంపై నుంచి భారీ వాహనాల రాకపోకలు ప్రమాదకరమని నీటిపారుదలశాఖ అధికారులు నివేదికలు ఇచ్చినా.. వాటిని బుట్టదాఖలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ నాయకులదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలోనే పాత ప్రాజెక్టుల ఆపరేషన్స్ అండ్ మెయింటనెన్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం 110 మంది ఇంజినీర్లతో పాటు 1,800 మంది లస్కర్లను నియా మకం చేశామన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. పాత ప్రాజెక్టుల నిర్వహణ సక్రమంగా చేపట్టడంతో పాటు కొత్త ప్రాజెక్టులను పూర్తిచేసి బీడు భూములను సస్యశ్యామలం చేయ డమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ.3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్.. జూరాల డ్యాం సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న గ్యాంటీ క్రేన్‌కు అదనంగా రూ. 3.5 కోట్లతో మరో గ్యాంటీ క్రేన్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ర్యాలంపాడు జలాశయానికి ఏర్పడిన లీకేజీలకు పూర్తిస్థాయిలో మరమ్మతు చేస్తామన్నారు. అందులో నాలుగు టీఎంసీల నీటిని నిల్వ చేసి.. పూర్తిస్తాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పనుల పూర్తికి అవసరమైన రూ. 500కోట్లు మంజూరు చేస్తామన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి కోరిక మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ, ఆర్అండ్ఆర్, కెనాల్స్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి విజ్ఞప్తి మేరకు రామన్‌పాడ్ కింద డీ–6 పరిధిలో ఎమర్జెన్సీ క్రేన్, గేట్లు వంటి నిర్మాణాలు చేపడతామన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రాధాన్యం జూరాల జలాశయంలో డీసిల్టింగ్‌కు చర్యలు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: మంత్రి వాకిటి ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం.. జూరాల ప్రాజెక్టు భద్రంగా ఉందని.. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు. ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో అనవసరంగా ఆందోళన కలిగించే ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూరాల జలాశయంలో సిల్ట్ పేరుకుపోయి నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని, పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్ బీఎం సంతోష్, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఈఎన్సీ శ్రీనివాస్, సీఈ ప్రమీల, సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఎస్ఈ రహీముద్దీన్ తదితరులు ఉన్నారు. -
శ్రీశైలం జలాశయానికి జలకళ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఈసారి వానాకాలం సీజన్ ప్రారంభంలోనే కృష్ణానది నీటితో కళకళలాడుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వస్తున్న వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల ప్రాజెక్ట్ నిండటంతో గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్ శరవేగంగా నిండుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలకు శుక్రవారం నాటికి 125.1322 టీఎంసీలకు చేరింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలల్లో ఈస్థాయి నీటిమట్టానికి చేరుకునే ఈ ప్రాజెక్టులోఈసారి జూన్ నెలలోనే జలాశయం సగానికి పైగా నిండటం విశేషం. ● వారం రోజులుగా కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్ట్‌ల నుంచి జూరాల జలాశయానికి నీటి వరద కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాలలో 7.371 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. జూరాల ఆయకట్టుతో పాటు భీమా, కోయిల్‌సాగర్ లిఫ్ట్ కెనాల్, ఆర్డీఎస్ లింక్ కెనాళ్లకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్ నుంచి దిగువకు 1.14 లక్షల వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయంలో గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 865.7 అడుగల ఎత్తుకు చేరుకుంది. ఇంకా వర్షాలతో పాటు వరద కొనసాగితే మరో 10–15 రోజుల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్ మాసంలోనే కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరగడంతో సాగునీటి ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఈసారి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద మొత్తం 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ కింద 29వ ప్యాకేజీ విస్తరణ పనులు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వస్తుండడంతో కేఎల్ఐ కింద ఆయకట్టుకు ముందస్తుగానే సాగునీరు అందించేందుకు వీలుంది. జూరాల ప్రాజెక్ట్ ఇప్పటికే నిండటంతో ప్రాజెక్ట్ ఆయకట్టుకు నీటి విడుదల ప్రారంభమైంది. శ్రీశైలం జలాశయంలో పెరిగిన నీటి మట్టం ఈసారి ముందుగానే ఆయకట్టుకు నీటి సరఫరా.. మూడు మోటార్లు సిద్ధంగా ఉన్నాయి.. ఈసారి ముందుగానే కృష్ణానదిలో నీటి ప్రవాహం అందుబాటులో ఉండటంతో కేఎల్ఐ ద్వారా ఆయకట్టుకు నీరందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎల్లూరు వద్ద పంప్‌హౌస్‌లో మూడు మోటార్లు అందుబాటులో ఉన్నాయి. ఎప్పటికప్పుడు నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపేలా చర్యలు తీసుకుంటాం. రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. – శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ, నీటిపారుదల శాఖ మరమ్మతులు పూర్తయితేనే పూర్తిస్థాయి వినియోగం కృష్ణానదిలో నీరు సమృద్ధిగా ఉన్నప్పటికీ కేఎల్ఐ కింద పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతులను వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ ప్రాజెక్ట్‌లో భాగమైన ఎల్లూర్ పంప్‌హౌస్‌లో మొత్తం ఐదు మోటార్లకు రెండు మోటార్లు రిపేర్‌లో ఉన్నాయి. 3వ, 5వ మోటార్లు గతంలోనే పాడవగా, వీటి మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించింది. మోటార్ల రిపేరు పనులు కొనసాగుతున్నాయి. సీజన్ ప్రారంభం అయ్యే నాటికి మోటార్లను సిద్ధంగా ఉంచుతామని అధికారులు చెబుతున్నారు. కేఎల్ఐ కింద పూర్తిస్థాయిలో ఆయకట్టుకు నీరందించాలంటే మోటార్ల మరమ్మతును పూర్తిచేయాల్సి ఉంది. కేఎల్ఐ రిజర్వాయర్ల సామర్థ్యం టీఎంసీ కన్నా తక్కువగా ఉండటంతో ఎక్కువ నీటిని స్టోరేజీ చేసుకునే అవకాశం లేదు. అందువల్ల ప్రతి వారం రోజులకు ఒకసారి మూడు రిజర్వాయర్లను నింపుకోవాల్సి ఉంటుంది. అలాగే మిషన్‌భగీరథ నీటి సరఫరాతో పాటు సాగునీటి సరఫరాకు మోటార్ల ద్వారా నిరంతరం నీటి ఎత్తిపోతలను కొనసాగించాల్సి ఉంది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
కొల్లాపూర్ రూరల్: పశువులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వెటర్నరీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశువైద్యాధికారి జ్ఞాన శేఖర్ సూచించారు. శుక్రవారం కొల్లాపూర్, సింగోటం, పెంట్లవెల్లి పశువైద్య కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పశువులు, జీవాలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని పశువుల పెంపకందారులకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు. ఆయన వెంట కొల్లాపూర్ పశువైద్యాధికారి యాదగిరి, సిబ్బంది వెంకటస్వామి ఉన్నారు. -
స్నాతకోత్సవానికి వేళాయె
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2023– 25 విద్యా సంవత్సరం వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మ వంటి కోర్సులు చదువుతూ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేసే స్నాతకోత్సవానికి యూనివర్సిటీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగా అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల జాబితాను సిద్ధం చేశారు. మొత్తం 88 మంది విద్యార్థులకు మెడల్స్ అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సైతం కాన్వకేషన్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు విద్యార్థుల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించారు. గతేడాది చివరలో కూడా కాన్వకేషన్ నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేసినప్పటికీ కొన్ని కారణాలతో నిర్వహించలేదు. ఈ క్రమంలోనే తాజాగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ము ఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు పీ యూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్‌బాబు గవర్నర్‌కు ఆహ్వానం అందించారు. ఈ క్రమంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో గవర్నర్ ఇచ్చే తేదీల ఆధారంగా కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంది. స్పాన్సర్లకు అవకాశం.. కాన్వకేషన్‌లో మెడల్స్ ఇచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఆసక్తి గలవారు స్పాన్సర్షిప్ చేస్తే వారి పేరు మీద కూడా మెడల్స్ ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం వ్యక్తులు యూనివర్సిటీ పేరు మీద రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే కేవలం ఆ డబ్బుల మీద వచ్చే వడ్డీతో మాత్రమే మెడల్స్‌ను విద్యార్థులకు అందజేస్తారు. అందుకోసం ఆసక్తి గలవారు నేరుగా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది. పీయూలో 4వ కాన్వకేషన్‌కు సిద్ధమవుతున్న అధికారులు ఘనంగా నిర్వహిస్తాం.. పీయూ 4వ కాన్వకేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్‌మెడల్స్ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. – శ్రీనివాస్, పీయూ వీసీ 88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్‌లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్‌లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో 9, యూజీ కోర్సులలో టాపర్స్‌లో 17 మంది గోల్డ్‌మెడల్స్ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్‌మెడల్స్ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు. –ప్రవీణ, పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం యూజీ, పీజీ, పీహెచ్డీ, ఫార్మలో మొత్తం 88 మందికి గోల్డ్‌మెడల్స్ రూ.2 లక్షలు స్పాన్సర్ చేస్తే వారి పేరు మీద విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ఇచ్చే అవకాశం -
దేశానికే రోల్ మోడల్ తెలంగాణ
కల్వకుర్తి రూరల్: అభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి కల్వకుర్తి మండలం జంగారెడ్డిపల్లిలో రూ. 26కోట్లతో డబుల్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులతో పెట్రోల్ బంక్‌లు, ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, రైస్‌మిల్లులు తదితర వాటిని ఏర్పాటు చేయిస్తున్నట్లు చెప్పారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అదే విధంగా విద్య, వైద్యరంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. నిరుద్యోగ యువతకు 60వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రైతుభరోసా పథకం ద్వారా రైతులకు సకాలంలో పంట పెట్టుబడి సాయం అందించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మా ట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పించడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఎంపీ మల్లు రవి సహకారంతో దాదాపు రూ. 600కోట్లతో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. వచ్చేనెల 7న వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పొ ల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ అశోక్‌రెడ్డి, సంజీవ్ యాదవ్, విజయకుమార్‌రెడ్డి, ఆనంద్ కుమార్, లింగారెడ్డి, మాజీ ఎంపీటీసీ రామకృష్ణ, రాజేశ్‌రెడ్డి, పండిత్రావు, భూపతి రెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, సుదర్శన్‌రెడ్డి, బాలస్వామిగౌడ్ పాల్గొన్నారు. -
తీరని ‘కౌలు’ కష్టం!
అడియాశలుగానే మారిన ‘రైతుభరోసా’ ●ప్రభుత్వం ఆదుకోవాలి.. నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి తోడు ఎకరాకు రూ. 8వేల చొప్పున మూడెకరాలను కౌలుకు తీసుకొని పత్తిసాగు చేస్తున్నా. కౌలు డబ్బులే కాకుండా పెట్టబడికి రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. మొత్తంగా ఐదెకరాలకు రూ. 1.50 లక్షల పెట్టుబడి అవుతుంది. గతేడాది పంట దిగుబడి రాక రూ. 50వేలు నష్టపోయా. ప్రభుత్వం కౌలు రైతులకు సైతం భరోసా ఇచ్చి ఆదుకోవాలి. – నిమ్మల బాలింగయ్య, జంగంరెడ్డిపల్లి, అమ్రాబాద్ పెట్టుబడులు పెరిగాయి.. 13 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నా. ఒక పంటకు ఎకరా రూ. 10వేల చొప్పున 8 ఎకరాలు, మరో ఐదెకరాలు రూ. 8వేల చొప్పున కౌలు చెల్లిస్తున్నా. ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇస్తామన్నా రైతుభరోసా అందించి ఆదుకోవాలి. పెట్టుబడి సాయం మాకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. పంటల బీమా పథకాన్ని కూడా వర్తింపజేయాలి. – రాసమోల్ల శివ, తెలుగుపల్లి, అమ్రాబాద్ అచ్చంపేట: కౌలు రైతులకు సాగు కష్టాలు తీరడం లేదు. ఏటా కౌలు ధరలు పెరుగుతుండటం.. ప్రైవేటులో అప్పులు తెచ్చి సాగు చేయడం.. అష్టకష్టాలు పడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడటం పరిపాటిగా మారాయి. పంటల విక్రయం, ఎరువుల కొనుగోలుకు సైతం నానాయాతన పడక తప్పడం లేదు. గత ప్రభుత్వా ల మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా వారిపై కనికరం చూపడం లేదు. రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ రైతుభరోసా పథకం కింద సీజన్‌కు రూ. 12వేల చొప్పున అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను సైతం స్వీకరించింది. అయితే ఇప్పటి వరకు ఆ ఊసెత్తడం లేదు. దీంతో కౌలు రైతుల ఆశలు అడియాశలుగానే మారాయి. ఎకరా రూ.15వేల వరకు.. రెండేళ్ల క్రితం కౌలు ధరలు అంతంత మాత్రంగానే ఉండేవి. కానీ ప్రస్తుతం కౌలు ధరలు అమాంతం పెరిగాయి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఎకరాకు రూ.10వేల నుంచి 15వేల వరకు కౌలు తీసుకుంటున్నారు. వీరికి ప్రభుత్వ పరంగా ఎలాంటి చేయూత అందడం లేదు. కనీసం బ్యాంకుల్లో పంట రుణాలకు కూడా వీరు అర్హులు కాలేకపోతున్నారు. సాగు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలకు నష్టం వాటిల్లినా ప్రభుత్వపరంగా అందించే సాయం పట్టాదారుల ఖాతాల్లోకి చేరుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాలన్నా పట్టాదారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలన్నా పట్టాదారుల పేరుమీదే కొనుగోలు చేస్తున్నారు. చివరి దాకా కష్టాలే.. కౌలు రైతుకు సాగు సీజన్ ప్రారంభం ఉంచి మొదలుకుని సీజన్ పూర్తయ్యే వరకు కష్టాలు వెన్నంటి ఉంటున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలోని ప్రతీది ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఫలితంగా విత్తనాల కొనుగోలు నుంచి మొదలుకుని పంట అమ్మే వరకు పట్టాదారు పాస్‌పుస్తకం అవసరమవుతోంది. ఈ క్రమంలో కౌలురైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల జిరాక్స్ ఇచ్చేందుకు భూ యాజమానులు కొందరు వెనకడుగు వేస్తున్నారు. దీంతో ఎరువులు, విత్తనాల కోసం దళారులను ఆశ్రయించి మోసపోతున్నారు. విత్తన, ఎరువుల ధరలకు తోడు పెరుగుతున్న కౌలు పెట్టుబడుల కోసం తప్పని ప్రైవేటు అప్పులు ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు జిల్లావ్యాప్తంగా 70వేల మందికి పైగానే.. జిల్లాలో 7,59,793 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది వానాకాలంలో 4,35,692 ఎకరాల్లో సాగుచేయగా.. ఈ ఏడాది 5,38,462 ఎకరాలు సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా. మొత్తం 3,22,724 మంది రైతులు ఉండగా.. వీరిలో 70వేల మందికి పైగా కౌలురైతులు ఉన్నారని వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా. అయితే వీరిలో చాలా మంది తమకు ఉన్న ఎకరం, ఆరెకరం భూమితో పాటుగా మూడెకరాల నుంచి ఐదెకరాల వరకు కౌలుకు తీసుకొని పంటసాగు చేస్తున్నారు. వీరికి బ్యాంకుల నుంచి పంట రుణాలు ఇవ్వక.. రైతుభరోసా అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. పంట పెట్టబడులకు ప్రైవేటు అప్పులపైనే ఆధారపడుతున్నారు. -
ప్రమాదంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
ఇప్పటికే ప్రాజెక్టులోని 18 గేట్ల వద్ద రబ్బర్ సీల్, ఇనుప రోప్‌లు దెబ్బతిన్నాయి. అందులో 8, 12, 19, 21, 25, 27, 50 నంబర్ గేట్లతో పాటు మరికొన్నింటి నుంచి నీరు నిత్యం లీకేజీ అవుతోంది. అయినప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వరద రావడం.. ప్రాజెక్టులోని మరో రెండు గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోవడంతో ఎప్పుడేం జరుగుతుందోనని సమీప గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ● మరమ్మతుకు నోచుకోని ఆనకట్ట క్రస్ట్‌గేట్లు ● ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్న గేట్ల ఇనుప రోప్‌లు ● ‘సాక్షి’ ముందే హెచ్చరించినా స్పందించని యంత్రాంగం ● తాత్కాలిక మరమ్మతులతోనేసరిపెడుతున్న వైనం ● భారీ వరదలు వస్తే ప్రమాదం తప్పదంటున్న సమీప గ్రామాల ప్రజలు లీకేజీల మయం.. -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
నాగర్‌కర్నూల్ క్రైం: మాదకద్రవ్యాలను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా పోలీసుశాఖ, మహిళా, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానం నుంచి చేపట్టిన అవగాహన ర్యాలీని కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి జిల్లా జడ్జి ప్రారంభించగా.. జిల్లా జనరల్ ఆస్పత్రి వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు గ్రామస్థాయి వరకు వచ్చాయన్నారు. సమాజానికి ఒక చీడపురుగులా మాదకద్రవ్యాల వ్యవస్థ మారిందని.. వాటిని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. కళాశాలలు, పాఠశాలల్లో చదివే విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిరోధక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని అన్నారు. వీటిని విక్రయించే వారి సమాచారం తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ వినియోగంతో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లాలో డ్రగ్స్ బారిన పడిన యువత కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అక్కడ మెరుగైన వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో యు వత ముఖ్యభూమిక పోషించి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ● ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ సత్వర చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి జిల్లా జడ్జి రమాకాంత్ -
ఏసీబీ నజర్!
కల్వకుర్తి టౌన్: అవినీతి అధికారులకు ఏసీబీ భయం పట్టుకుంది. బుధవారం కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ–2 రాంచందర్‌జీ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన నేపథ్యంలో ఇతర శాఖల్లోని అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కో పనికి ఓ రేటు కట్టి మరీ వసూలు చేస్తున్నారని.. లంచం ఇవ్వకుంటే పనిచేయడం లేదని ప్రజలు బహిరంగంగా చెబుతు న్నారు. అయితే ఇటీవల పలు ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు మంజూరు చేసేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ మేరకు పట్టణంలోని పలు కార్యాలయాలపై ఏసీబీ నిఘా పెట్టిందని తెలిసింది. ముఖ్యంగా లబ్ధిదారులకు పథకాలను చేర్చడంలో కీలకంగా వ్యవహరించే రెవెన్యూ, మున్సిపల్ శాఖలపై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలుస్తోంది. పలు శాఖల అధికారులపై అవినీతి ఆరోపణలు ప్రభుత్వ పథకాలు అందించడంలోనూ చేతివాటం ఏసీబీ దాడులతో అవినీతిపరుల గుండెల్లో రైళ్లు -
పొంచి ఉన్న ముప్పు..
జూరాల ప్రాజెక్టుకు అత్యంత సమీపంలో మా గ్రామం ఉంటుంది. 2009 భారీ వరదల్లో పంట పొలాలు మునిగిపోవడంతో పాటు గుడిసెలు, పశుగ్రాసం నీటిలో కొట్టుకుపోయాయి. అప్పటి వరద ప్రవాహాన్ని చూసి భయపడ్డా. ఇప్పుడు క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందంటున్నారు. గేట్లు కొట్టుకుపోతే మా గ్రామం నీటిలో మునిగిపోవడం ఖాయం. ప్రభుత్వం చొరవ చూపి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలి. – అలంపూర్ ఆశన్న, నందిమళ్ల గొర్రెలు కొట్టుకుపోయాయి.. 2009లో వచ్చిన భారీ వరదలతో మూలముళ్ల గ్రామం అతలాకుతలం అయింది. భయంతో జనం పరుగులు తీశారు. నేను గొర్రెలను మేత కోసం నది సమీపంలోకి తీసుకెళ్లగా.. వరద నీటిలో చిక్కుకుని కొట్టుకుపోయాయి. ఇలాంటి ఘటనలు మరోమారు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. – బీసన్న, మూలమళ్ల ముందస్తు వరదతో పనులకు అడ్డంకి.. డ్యాం క్రస్ట్‌గేట్లకు మరమ్మతు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.11కోట్ల నిధులు వచ్చాయి. 2022లో పనులు కొంతమేర వేగవంతంగా జరిగాయి. 2023లో గ్యాంటీ క్రేన్‌కు సమస్య తలెత్తడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు తెగిపోయిందన్న మాట వాస్తవం కాదు. ఇది వరకే ఎనిమిది గేట్లకు సంబంధించి మరమ్మతులు మొదలుపెట్టాం. అయితే ముందస్తు వరద రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదు. మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేస్తాం. – రహీముద్దీన్, ఎస్ఈ, ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. జూరాల ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు దెబ్బతిన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. క్రస్ట్‌గేట్ల రూప్లు తెగినా పట్టించుకోని స్థితిలో ప్రాజెక్టు అధికారులు ఉండటం దారుణం. – చింతలన్న, నందిమళ్ల ● -
నిర్లక్ష్యమేలా..?
నాగర్కర్నూల్శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్ శ్రీ 2025కృష్ణాబేసిన్‌లో తెలంగాణ తొలి ప్రాజెక్టు.. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయినిప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై అంతులేని నిర్లక్ష్యం వెంటాడుతోంది. ఫలితంగా ప్రాజెక్టు ఆయువుపట్టుగా నిలిచే క్రస్ట్‌గేట్ల ఇనుప రోప్‌లు ఒకదాని తర్వాత మరొకటి తెగిపోతున్నాయి. ఇది వరకే 8 గేట్ల వద్ద ఇనుప రోప్‌లు తెగిపోగా.. తాజాగా 4, 36వ గేట్లకు సంబంధించిన రోప్‌లు తెగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. – గద్వాల/అమరచింత జూరాల ప్రాజెక్టులోని మొత్తం క్రస్ట్‌గేట్లకు రబ్బర్ సీల్స్, రోప్స్, పేయింటింగ్, సాండ్ బ్లాస్టింగ్, గేట్ల స్ట్రెన్తెనింగ్ వంటి మరమ్మతుల కోసం మూడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రూ.11 కోట్లు విడుదల చేసింది. అయితే నాటి నుంచి కేవలం 23శాతం పనులను మాత్రమే పూర్తిచేశారు. తాజాగా వరదలు మొదలయ్యే సమయంలో క్రస్ట్‌గేట్లకు ఉన్న ఇనుప రోప్‌లు తెగిపోతుండటంతో ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై గతంలోనే పలుమార్లు ‘సాక్షి’ వరుస కథనాలతో హెచ్చరించినా..అధికార యంత్రాంగం స్పందించలేదు. జూరాల ప్రాజెక్టు మరమ్మతుపై నిర్లక్ష్యం వీడ లేదు. -
కళ్లను అశ్రద్ధ చేయొద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరు నెలలకోసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డా.స్వరాజ్యలక్ష్మి సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనంలో గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కంటివైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ కళ్లను అశ్రద్ధ చేయొద్దన్నారు. ఎవరికై నా కంటి సమస్యలు ఉంటే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించాలని సూచించారు. శిబిరంలో మొత్తం 120 మందిని పరీక్షించి.. 46 మందికి శస్త్రచికిత్సలు అవసరమని గుర్తించినట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. కంటి పొర, క్యాటరాక్ట్ సమస్యలతో బాధపడుతున్న వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ ఏనుగొండలోని లయన్ రామిరెడ్డి కంటి ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాసు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. రవికుమార్ నాయక్, ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, కుమార్, శ్రీను, సురేశ్ పాల్గొన్నారు. -
రోగులకు అందుబాటులో మెరుగైన వైద్యం
లింగాల: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు వైద్యాధికారి తారాసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం జిల్లా అదనపు వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఆస్పత్రి తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోకి చేరడంతో త్వరలో అన్ని రకాల పోస్టులు భర్తీ అవుతాయన్నారు. దీంతో రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. త్వరలో సాధారణ కాన్పులు చేయడంతో పాటు ఆపరేషన్ థియేటర్‌ను కూడా ప్రారంభిస్తామన్నారు. మృతదేహాలకు ఇక్కడే పోస్టుమార్టం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోగులు రూ.వేలు ఖర్చు పెట్టి ఆస్పత్రులకు వెళ్లొద్దని, సర్కార్ దవాఖానాలోనే అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రేపు రెడ్‌క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం నాగర్‌కర్నూల్ క్రైం: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని ఈనెల 27న జిల్లా కేంద్రంలోని ఎస్జేఆర్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్‌క్రాస్ కార్యదర్శి రమేష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీలో శాశ్వత సభ్యత్వం కలిగిన సభ్యులతో పాటు ప్యాట్రన్, వైస్ ప్యాట్రన్ సభ్యత్వం కలిగిన వారు సమావేశానికి హాజరు కావాలని కోరారు. రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ కలెక్టర్ సూచనలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. రేపు పాలెంలో పాలిసెట్ కౌన్సెలింగ్ బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (ఏ)లో శుక్రవారం నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా.రాములు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 29వ తేదీ వరకు నిర్వహించే పాలిసెట్ కౌన్సెలింగ్‌కు వచ్చే విద్యార్థులు తమ వెంట ఒరిజినల్ టీసీ, పది, సమాన తరగతుల మెమోలు, బోనఫైడ్లు, ఆదాయం సర్టిఫికెట్, స్థానిక ధ్రువీకరణపత్రం ఆధార్‌కార్డు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో పాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో తీసుకొని రావాలని సూచించారు. స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 27, 28, 29 తేదీల్లో హాజరు కావాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కందనూలు: సాహస రంగంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ టెంజింగ్ నార్వే నేషనల్ అడ్వెంజర్ అవార్డు–2024 ఎంపికకు http://awards. gov.in అనే వెబ్సైట్ ద్వారా జిల్లాలోని యువత దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవార్డులు భూమిపై సాహసయాత్రలు, సముద్రంలో, ఆకాశంలో చేసే సాహస యాత్రలకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు జూన్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. 37 వాహనాలకు వేలం తెలకపల్లి: మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో గురువారం ఉదయం 11గంటలకు వివిధ కేసుల్లో పట్టుబడిన 37 వాహనాలకు సంబంధించిన వేలం నిర్వహిస్తున్నట్లు ఎకై ్సజ్ ఎస్ఐ జనార్దన్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.5వేలు, ఫోర్ వీలర్ వాహనాలకు రూ.20వేలు చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని కోరారు. వేలంలో వాహనం దక్కని వారికి వెంటనే డిపాజిట్ తిరిగి చెల్లిస్తామన్నారు. కేంద్ర బీమా పథకాలను వినియోగించుకోవాలి పాన్‌గల్: కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ అన్నారు. బుధవారం మండలంలోని తెల్లరాళ్లపల్లితండాలో దర్దీ ఆబా జన భాగీదారి అభియాన్‌లో భాగంగా ఇన్స్యూరెన్స్, పీఎం జనధన్ ఖాతాలు, సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా తదితర వాటిపై తండా వాసులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవడంతో కుటుంబానికి కలిగే ప్రయోజనాలను వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు. -
మదనగోపాలస్వామి ఆలయాన్ని సుందరీకరిస్తాం
పెంట్లవెల్లి: జటప్రోల్ గ్రామంలోని మదనగోపాలస్వామి ఆలయాన్ని సుందరీకరించి, భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం మంత్రి స్పెషల్ పీఎస్ జయేశ్ రంజన్, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి జటప్రోల్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పురాతన ఆలయాలు, కత్వ వాటర్ ఫాల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జటప్రోల్ గ్రామాన్ని, ఆలయాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే మదనగోపాలస్వామి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్నారు. గ్రామ సమీపంలో ఉన్న కత్వ వాటర్‌ఫాల్స్‌ను వీక్షించేందుకు వచ్చే పర్యాటకుల కోసం సీసీ రోడ్డు వేయించాలని, రైతులకు ఉపయోపడే విధంగా చెక్‌డ్యాం నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవింద్‌గౌడ్, నల్లపోతుల గోపాల్, భీంరెడ్డి, నాగిరెడ్డి, గుర్క ఆంజనేయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పర్యాటకుల కోసం వసతుల ఏర్పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
బిజినేపల్లి: దేశ భవిష్యత్‌లో కీలకంగా వ్యవహరించే యువతపై చెడు ప్రభావం చూపిస్తున్న మాదక ద్రవ్యాలను నిర్మూలించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. బుధవారం పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థుల కు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పి ంచారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మట్లాడుతూ.. మాదక ద్రవ్యాలకు బానిసయి న వారు సమాజం నుంచి తిరస్కరణకు గురవుతున్నారని, అంతేకాక శారీరక, మానసిక, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారి సమాచారం పోలీసు అధికారులకు తెలియజేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు తాగుతున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇస్తే వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, సాధారణ స్థితికి మారుస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డా.పుష్పావతి, కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.సత్యనారాయాణ, సీఐ కనకయ్యగౌడ్, ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ -
అవగాహన కల్పిస్తున్నాం
జిల్లాలో సీజనల్ వ్యాధు ల నివారణకు ముందస్తు అవగాహన చర్య లు చేపడుతున్నాం. ఆరోగ్యకేంద్రాల వారీగా వైద్య సిబ్బందిని అప్ర మత్తం చేశాం. కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని పారిశుద్ధ్య, వైద్య సిబ్బందికి సహకరించాలి. – డా.స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్ఓ, నాగర్‌కర్నూల్ ● -
కొండారెడ్డిపల్లి అభివృద్ధిలో వేగం పెంచండి
వంగూరు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు. బుధవారం గ్రామంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత కొండారెడ్డిపల్లిలోనే అంతర్గత విద్యుత్ లైన్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే వంద శాతం సోలార్ విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా నిలపాలని కోరారు. ఫోర్‌లైన్స్ రోడ్డు, పాలశీతలీకరణ కేంద్రం పనులు పూర్తి చేయడంతో పాటు అండర్ డ్రెయినేజీ పనులు ప్రారంభించాలన్నారు. నిధుల కొరత లేదు కొండారెడ్డిపల్లితో పాటు అచ్చంపేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎలాంటి నిధుల కొరత లేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో ముఖ్యమంత్రి సోదరుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎనుముల కృష్ణారెడ్డి, వేమారెడ్డి, రాఘవేందర్, వంశీ, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక అధికారిగా దేవసహాయం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేవసహాయాన్ని నియమించినట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఇక నుంచి గ్రామ అభివృద్ధిని మరింత వేగవంతం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఒకటే పార్టీ.. 2 సమావేశాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గద్వాల అంటేనే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. ఇది నిజమేనని మరోసారి రుజువైంది. పార్టీ ఒక్కటే.. సమావేశాలు మాత్రం రెండు చోట్ల జరిగాయి. బుధవారం జిల్లాకేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం గ్రూప్ రాజకీయాలకు వేదికగా మారింది. వచ్చిన పరిశీలకులకు సైతం ఒకింత ఇబ్బందిపడినట్లు సమాచారం.భిన్నాభిప్రాయాలు..కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పరిశీలకులు విశ్వనాథ్, దీపక్‌జాన్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం గద్వాలలో జరిగిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అయితే గద్వాలలో ఉన్న రెండు గ్రూపులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే బండ్లతో ఆయన క్యాంపు కార్యాలయంలో, సరిత వర్గంతో హరిత హోటల్లో సమావేశాలు నిర్వహించారు. అయితే పరిశీలకులే వేర్వేరుగా సమావేశాలు నిర్వహించడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్గ విభేదాలను ప్రోత్సహించేలా పరిశీలకులే వ్యవహరించారని ఓవైపు.. వేర్వేరుగా అయితేనే ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చడం సులువవుతుందని మరోవైపు పార్టీలో చర్చ జరుగుతోంది.2, 3 రోజుల్లో శుభవార్త..సరిత వర్గంతో భేటీ సందర్భంగా పార్టీలో ముందు నుంచి పనిచేసిన వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని, పార్టీ ఏ ఒక్క నాయకుడు, కార్యకర్తను వదులుకోదని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు విశ్వనాథ్ అన్నారు. సరితకు రెండు, మూడు రోజుల్లో శుభవార్త వస్తుందని సైతం హామీ ఇచ్చినట్లు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. కాగా.. బండ్ల, సరిత మధ్య బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన ఆధిపత్య పోరు కాంగ్రెస్‌లో సైతం కొనసాగుతుండటంపై పరిశీలకుల మధ్య హాట్‌హాట్‌గా చర్చ జరిగినట్లు పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నాయి. -
స్థానిక పోరుకు లైన్‌క్లియర్
సాక్షి, నాగర్‌కర్నూల్: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఇప్పటికే పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం పూర్తయ్యి 17 నెలల సమయం గడిచినా తిరిగి ఎన్నికలు నిర్వ హించని నేపథ్యంలో ఎట్టి పరిస్థితు ల్లో సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రానున్న రెండు, మూడు నెలల కాలంలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో, ఆశావహుల్లో సందడి మొదలైంది. పల్లెల్లో పడకేసిన పాలన.. గ్రామ పంచాయతీలకు 2019 జనవరిలో ఎన్నికలు జరగ్గా.. గతేడాది ఫిబ్రవరి 2 నాటికి పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సుమారు ఏడాదిన్నర కాలంగా సర్పంచ్‌లు లేక గ్రామాల్లో పాలన బోసిపోయింది. సకాలంలో ఎన్నికలు చేపట్టకపోవడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం నిలిచిపోయి.. గ్రామాల్లో పెద్దగా అభివృద్ధి పనులు చోటుచేసుకోలేదు. చాలావరకు గ్రామాల్లో అత్యవసర పనులు మాత్రమే చేపట్టారు. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు, డ్రెయినేజీ తదితర పనులు తప్పా మిగతా అభివృద్ధి పనులు, శాశ్వత సమస్యల పరిష్కారానికి చర్యలు కరువయ్యాయి. మేజర్ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ సైతం అస్తవ్యస్తంగా తయారైంది. పాలకవర్గాలు లేకపోవడంతో వారి స్థానంలో నియమించిన ప్రత్యేకాధికారులు గ్రామాల్లో అడుగు పెట్టకపోవడంతో గ్రామాల్లో పరిపాలన మందగించింది. దీంతో పూర్తి భారం పంచాయతీ కార్యదర్శులపైనే పడటంతో వారు సైతం ఏమీ చేయలేక చేతులేత్తేస్తున్న పరిస్థితి తలెత్తుతోంది. వీడని సందిగ్ధం.. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ లోగా నిర్వహించాలన్న హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుగా ఏ ఎన్నికలు నిర్వహిస్తారన్నది ఆసక్తిగా మారింది. ముందుగా పంచాయతీ ఎన్నికలా.. లేక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు చేపడుతారా.. అన్నదానిపై చర్చ మొదలైంది. అలాగే బీసీ రిజర్వేషన్లను 42 శాతం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దీనిపై పార్లమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది. దీంతో బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా.. లేక పాత పద్ధతిలోనే నిర్వహిస్తారా.. అన్న దానిపై కూడా సందిగ్ధం నెలకొంది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీల జనాభా ప్రాతిపదికన మాత్రమే ఓటర్ల జాబితా అందుబాటులో ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన ద్వారా బీసీల జనాభా, ఓటర్ల డాటా కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం లభిస్తే అదనంగా బీసీ జనాభా డేటా బేస్‌ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు ఆలోపే ముగించేందుకు ప్రభుత్వం కసరత్తు ముందుగా పంచాయతీనా.. ప్రాదేశికమా అన్నదానిపై కొరవడిన స్పష్టత రాజకీయ పార్టీలు, ఆశావహుల్లో మొదలైన సందడి బీసీ రిజర్వేషన్ల అమలుపైనే ఉత్కంఠ -
సీజనల్ వ్యాధులతో జరభద్రం
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లావ్యాప్తంగా కొన్ని రోజులుగా కురుస్తున్న ముసురు వర్షాల కారణంగా చలి గాలులు వీస్తుండడంతో సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షాల కారణంగా ఇంటి పరిసరాలు, పాత టైర్లు, నీటి తొట్టిల్లో నీరు నిల్వ ఉండి దోమలు వ్యాప్తి చెందుతాయన్నారు. దీంతో ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా, వైరల్ ఫీవర్ తదితర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రణాళిక ప్రకారం.. వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాల్లో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. దోమల వ్యాప్తి పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. గంబూషియా చేపలను సేకరించి గ్రామాల్లోని మురికి కుంటల్లో వదిలి దోమల వ్యాప్తిని అరికడుతున్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. జిల్లాలో నమోదయిన కేసులు జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేటలో 2024 సంవత్సరంలో 89 డెంగ్యూ, 3 చికన్‌గున్యా, 4 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2025లో ఇప్పటి వరకు నలుగురు డెంగ్యూ బారిన పడగా.. చికన్‌గున్యా, మలేరియా కేసులు నమోదుకాలేదు. డెంగీ, మలేరియా కేసులు పెరగకుండా పటిష్ట చర్యలు అవగాహన కల్పిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ -
ఎమర్జెన్సీ పేరుతో ప్రజాస్వామ్యంపై దాడి!
కందనూలు: ఎమర్జెన్సీ పేరుతో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేసిందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ తివారీ మా ట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎమర్జెన్సీ కా లంలో ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల ను పాతాళానికి నొక్కడంతో పాటు మీడియా గొంతు నొక్కా రని ఆరోపించారు. కోర్టులు సైతం బెదిరింపులకు లోనయ్యాయని, వేలాది మంది అమాయకులు జై లుశిక్ష అనుభవించారని నాటి రోజులను గుర్తుచేశారు. ఆ సమయంలో జనసంఘ్ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేసిందన్నారు. అనంత రం ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అరాచకాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, పార్లమెంట్ అభ్యర్థి భరత్‌ప్రసాద్, జిల్లా ఇన్చార్జ్ మాదగాని శ్రీనివాస్‌గౌడ్, ప్రమోద్‌కుమార్, సుధాకర్‌రెడ్డి, ఎల్లేని సుధాకర్‌రావు పాల్గొన్నారు. -
రైతులకు ఎరువుల కొరత రానివ్వం
నాగర్‌కర్నూల్: రైతులకు అవసరమైన ఎరువును సమృద్ధిగా సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ప్రధాన కార్యదర్శి కె రామకష్ణారావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆన్లైన్ ద్వారా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్‌పాం పంట విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాలపై సీఎస్ కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని వివరించారు. జిల్లావ్యాప్తంగా వన మహోత్సవంలో భాగంగా 41 లక్షల మొక్కలు నాటేందకు ప్రణాళికలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 1,200 మంది రైతులను గుర్తించి 3,500 ఎకరాల్లో ఆయిల్‌పాం పంట సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ జిల్లా అధికారి రోహిత్ గోపిడి, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ బదావత్ సంతోష్ -
‘పది’ ఫలితాల్లో 5వ స్థానానికి చేరుకుంటాం
తిమ్మాజిపేట: ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లాను రాష్ట్రంలో 12 నుంచి 5వ స్థానానికి చేర్చేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు లక్ష్యంగా పెట్టుకోవాలని విద్యాశాఖ జిల్లా అధికారి రమేష్‌కుమార్ అన్నారు. మండలంలోని గొరిట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నీటి సౌకర్యం కల్పించేందుకు గ్రామానికి చెందిన మొసలి శ్యామ్‌సుందర్‌రెడ్డి సొంత ఖర్చులతో చేపట్టిన పైప్‌లైన్ పనులను మంగళవారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, జిల్లా స్థాయిలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి ఘనంగా సన్మానించారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధన అందించడంతో పాటు విద్యార్థులకు క్రీడా మైదానం, ఉచిత నోట్, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్నం భోజనం ఉంటుందన్నారు. త్వరలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన చేస్తామన్నారు. ఈ ఏడాది నుంచి 8 నుంచి 10 తరగతులకు ఖాన్ అకాడమీ వారు ఉచితంగా ఆన్లైన్లో అన్ని సబ్జెక్టులపై అవగాహన కల్పిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ, దాత శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, హెచ్ఎం గోవిందప్ప, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ వసీమాబేగం, నాయకులు అచ్యుతారెడ్డి, జానకీరాంరెడ్డి, నారాయణ, చిన్నయ్య, మన్నెంరెడ్డి, బాల్‌రెడ్డి, పెంటయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగవుతున్నా పడావుగా చూపించారు..
నాకు చౌదర్పల్లిలో 4.02 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. బోరు సాయంతో పంటలు సాగు చేస్తున్నాం. నా బ్యాంక్ ఖాతాలో రైతు భరోసా కింద రెండు గుంటలకు మాత్రమే డబ్బులు రూ.300 పడ్డాయి. అధికారులు భూమి పడావు (నాట్ కల్టివేటింగ్) కింద చూపించడంతో నాకు అన్యాయం జరిగింది. – భాగ్యమ్మ, చౌదర్పల్లి, దేవరకద్ర అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి.. 2021, 22, 23లో పంట వేసినట్లు ఉంటేనే ప్రభుత్వం 2025లో రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. చాలామంది రైతులు ఈ విష యం తెలియక పంట ఎన్రోల్మెంట్ చేసుకోలేదు. అలాంటి రైతు భూములను అధికారులు పడావుగా చూపించి రైతు భరోసా పథకం అమలుకు నోచుకోకుండా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రజావాణిలో ఈ మేరకు వినతిపత్రం అందించాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పునఃసమీక్షించి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలి. – పట్నం చెన్నయ్య, తెలంగాణ దళిత పాంథర్స్ అధ్యక్షుడు 30వ తేదీ వరకు పెట్టుబడి సాయం జమ జిల్లాలో చాలా మంది రైతుల నుంచి రైతు భరోసా రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నా యి. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నాం. సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఈనెల 30వ తేదీ వరకు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ కానుంది. అప్పటికీ రైతు భరో సా పడని రైతులు ఎవరైనా ఉంటే వారి జాబి తా రూపొందించి కలెక్టర్‌కు అందజేసి వారందరికీ కూడా పంట పెట్టుబడి సాయం అందేలా చూస్తాం. – బి.వెంకటేష్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి ● -
విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలి
తాడూరు: విద్యార్థులు మనోధైర్యంతో ముందుకు సాగాలని జిల్లా లీగల్ సెల్ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు.మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పర్చుకొని సాధించాలన్నారు. ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. పాఠశాలలో వంటగది, తరగతి, డార్మెటరీ గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థినులకు పుస్తకాలు అందజేశారు. అనంతరం మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదేవిధంగా జానేశ్వర వాత్సల్య మందిరం సందర్శించారు.ముగిసిన క్రీడా పాఠశాలలకు ఎంపికలుకందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో 4వ తరగతి ప్రవేశం కొరకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి 65 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులను జూలై 4, 5వ తేదిల్లో హైదరాబాద్‌లోని హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో రాష్ట్ర ఎంపికలకు హాజరవుతారని జిల్లా యువజన, క్రీడల అధికారి సీతారాం తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ రమేష్‌కుమార్, ఎంఈఓ భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాంకల్వకుర్తి రూరల్: కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ అన్నారు. మంగళవారం పట్టణంలోని యూటీఎఫ్ భవనంలో సీపీఐ జిల్లా మహాసభలకు సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 1, 2వ తేదీలలో జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు డాక్టర్ శ్రీనివాస్, ఆనంద్ జి, ఫయాజ్, వెంకటయ్య, కేశవులు గౌడ్, నరసింహ, చంద్రమౌళి, భరత్, పరశురాములు, ధారదాసు ఉన్నారు. -
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ కమిషన్ల బదిలీ
నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్రవ్యాప్త బదిలీలలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొందరు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం కలగగా, మరికొందరికి పదోన్నతి లభించింది. ఈ మేరకు మంగళవారం సీడీఎంఏ టీకే శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేవారు. ఇప్పటివరకు జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (గ్రేడ్ –2)గా పనిచేస్తున్న టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహబూబ్‌నగర్‌కు బదిలీపై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న డి.మహేశ్వర్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచారు. వనపర్తి జిల్లాలోని అమరచింత కమిషనర్ (గ్రేడ్–1)గా పనిచేస్తున్న ఎం.రవిబాబును నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయింది. ఆయన స్థానంలో నల్లగొండ జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సీహెచ్.నాగరాజు పదోన్నతిపై వస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో కమిషనర్ (గ్రేడ్–2) గా పనిచేస్తున్న బి.నరేష్‌బాబును మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీ అయిన దేవరకద్రకు పంపిస్తున్నారు. అక్కడికి మేడ్చల్ నుంచి నాగిరెడ్డి (గ్రేడ్–2) కమిషనర్‌గా వెళ్తున్నారు. అలంపూర్‌లో ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న పి.చంద్రశేఖర్ పదోన్నతిపై కొల్లాపూర్‌కు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న టి.శ్రీనివాసన్‌కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. అలంపూర్‌కు ఎవరినీ నియమించలేదు. మక్తల్‌లో ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎన్.శంకర్‌నాయక్‌ను అక్కడే రెగ్యులర్ అధికారిగా పదోన్నతి కల్పించారు. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న డి.మురళిని కమిషనర్‌గా (గ్రేడ్–3) పదోన్నతిపై అచ్చంపేటకు పంపిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు ఇన్చార్జ్ కమిషనర్‌గా పనిచేసిన జి.యాదయ్య కోస్గికి మేనేజర్‌గా వెనక్కి వెళ్తున్నారు. మేడ్చల్‌లో రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ)గా పనిచేస్తున్న ఖాజా ఆరీఫొద్దీన్ను పదోన్నతిపై వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కమిషనర్ (గ్రేడ్–3)గా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎస్.అశోక్‌రెడ్డికి ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇక మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏఎంసీగా పనిచేస్తున్న జె.పవన్‌కుమార్‌ను కమిషనర్ (గ్రేడ్–2)గా పదోన్నతిపై ముడుచింతలపల్లికి పంపిస్తున్నారు. ఇక్కడికి ఏఎంసీగా ఎ.రాజన్న పదోన్నతిపై వస్తున్నారు. అలాగే పాలమూరులో శానిటరీ ఇన్స్పెక్టర్లుగా పనిచేస్తున్న యు.గురులింగం పదోన్నతిపై ఆందోల్–జోగిపేట మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్–3) గా, డి.వాణికుమారి జీహెచ్ఎంసీలో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్‌గా, కె.రవీందర్‌రెడ్డిని నల్లగొండ మున్సిపాలిటీ ఏఎంసీ కమిషనర్ (గ్రేడ్–3) గా పంపించారు. నలుగురు ఎస్ఐలకు గ్రేడ్–3 కమిషనర్లుగా పదోన్నతి వెయిటింగ్ లిస్ట్‌లో మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసన్, అశోక్‌రెడ్డి నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్‌గా నాగిరెడ్డి -
‘ముందస్తు’గా మేస్తున్నారు..!
కల్వకుర్తి టౌన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో అధికారులు ముందస్తు ప్రణాళికల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఆసరాగా చేసుకొని అధికారులు తమ బినామీల పేరుతో పనులు చేసి రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. ఈ పనులన్నీ కేవలం పేపర్ల మీదనే జరగడం మరో విశేషం. ఇలాంటి పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపులో సహకరించని ఉద్యోగులను బెదిరించి మరీ రికార్డులు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో ముందస్తు ప్రణాళికలో భాగంగా సుమారు రూ.20 లక్షల వరకు పేపర్ల పైనే బిల్లుల చెల్లింపులు జరిగాయని ప్రచారం జరుగుతోంది. బాక్స్, నామినేషన్ పద్ధతిలో.. మున్సిపాలిటీల్లో అత్యవసర పనులు చేసేందుకు ఎక్కువగా బాక్స్, నామినేషన్ పద్ధతిలో టెండర్లు వేస్తుంటారు. ఇలా చేసే పనులకు సంబంధించి పూర్తి వ్యవహారం అంతా ఇంజినీరింగ్ శాఖ అధికారి అజమాయిషీలో ఉంటుంది. దీంతో ఇంజినీరింగ్, అకౌంట్స్ అధికారులను ప్రసన్నం చేసుకునే వారికి టెండర్లు దక్కుతుంటాయి. కల్వకుర్తి మున్సిపాలిటీలో గతంలో పాలకవర్గం ఉన్న సమయంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి పనులు చేసినట్లుగా పేపర్లలో చూయించి, అకౌంట్ సెక్షన్ అధికారి చేతులు తడిపి బిల్లులు చేయించుకున్నట్లు కాంట్రాక్టర్లు చెప్పుకోవడం విశేషం. అవినీతిలో అందెవేసిన చెయ్యి.. మున్సిపాలిటీల్లో అవినీతి జరిగేందుకు ఆస్కారం ఉండేవి ఇతర అంశాల్లో చేపట్టే పనులు. పాలకవర్గం మీటింగ్‌లో పలు ఇతర అంశాలను ఎజెండాలో చేర్చి.. అధికారులకు, పాలకవర్గాలకు ఇష్టం వచ్చినట్లుగా వాటిని అమలు చేస్తారు. అలాంటి వాటిలో ‘తిలా పాపం.. తలా పిడికెడు’ అన్నట్లుగా అధికారులు, పాలకవర్గం సభ్యులు వాటాలు పంచుకుంటారు. ఇక్కడ లోపాలు అందరికీ తెలియడంతో ఎవరిని ఎవరూ ప్రశ్నించకుండా తేలు కుట్టిన దొంగల్లా పనులు చేసుకుంటున్నారు. పేపరుపై చేసిన పనులకు చెల్లింపులు సహకరించని ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్న వైనం మున్సిపల్ అధికారుల చేతివాటం -
మహిళలకు రక్షణ కరువు
బిజినేపల్లి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం బిజినేపల్లిలో నిర్వహించిన 18వ మండల మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని అన్నారు. దళితులు, మహిళలపై దాడులు పెరిగాయన్నారు. అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడం దారుణమన్నారు. చెంచు గిరిజనులను కూడా అటవీ ప్రాంతంలో లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.కోట్ల విలువచేసే ఖనిజ సంపదను ఆదానీ, అంబానీలకు నిసిగ్గుగా కట్టబెడుతుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోదీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని.. వీటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతుభరోసా వంటి ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. మన్మోహన్సింగ్ హయాంలో ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం వంటి వాటిని సీపీఐ సాధించిందని గుర్తుచేశారు. అంతకుముందు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి.. సభా ప్రాంగణం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఆనంద్జీ, వార్ల వెంకటయ్య, ఈర్ల చంద్రమౌళి, టి.నర్సింహ, మారేడు శివశంకర్, కృష్ణాజీ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.జీఓ 51ని సవరించాలిబిజినేపల్లి: గ్రామపంచాయతీల్లో మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేసేందుకు జీఓ 51ని సవరించాలని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని కారుకొండ తండా పంచాయతీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్థానం కల్పించి.. కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు సాయి, మశన్న, శివశంకర్, కృష్ణయ్య, కొండయ్య పాల్గొన్నారు.కల్వకుర్తి డీఎస్పీగా వెంకట్రెడ్డికల్వకుర్తిటౌన్: కల్వకుర్తి డీఎస్పీగా వెంకట్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయగా.. డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ కోసం వెయిటింగ్ చేస్తున్న వెంకట్‌రెడ్డిని కల్వకుర్తి డీఎస్పీగా నియమించారు. డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన వెంకట్‌రెడ్డికి డివిజన్లోని సీఐలు, ఎస్ఐలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.26న అప్రెంటిస్‌షిప్ మేళాకందనూలు: మహబూబ్‌నగర్ ఒకేషనల్ కళాశాలలో ఈ నెల 26న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నట్లు డీఐఈఓ వెంకటరమణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023 తర్వాత ఐటీఐ పూర్తిచేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో అప్రెంటిస్‌షిప్ మేళాకు హాజరు కావాలని సూచించారు.నేడు మండలస్థాయి క్రీడాకారుల ఎంపికలుకందనూలు: తెలంగాణ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల నిమిత్తం మంగళవారం మండల స్థాయిలో క్రీడాకారుల ఎంపికలు నిర్వహించనున్నట్లు డీవైఎస్ఓ సీతారాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించే మండలస్థాయి ఎంపికలకు 8–9 ఏళ్ల వయసు ఉన్న బాలబాలికలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఆధార్‌కార్డు, స్టడీ, జననం, కుల ధ్రువపత్రాలు, ఐదు ఫొటోలు తీసుకురావాలని సూచించారు. -
పెన్షనర్ల హక్కులను కాపాడుకుందాం
కందనూలు: పెన్షనర్ల హక్కులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పెన్షనర్ల సంఘం జిల్లా ఆధ్యక్షుడు రాంచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ బదావత్ సంతోష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షనర్ల పాలిట ఆశనిపాతంగా మారిన ఫైనాన్స్ బిల్లు–2025ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఏ పెన్షన్ రూల్స్‌కు సంబంధం లేకుండా ప్రభుత్వ పెన్షనర్లను వేర్వేరు గ్రూపులుగా విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. వేతన సవరణ సంఘం సిఫారసులను పాత పెన్షనర్లకు కాకుండా.. కొత్తగా రిటైర్డ్ అయిన వారికి మాత్రమే వర్తించే విధంగా చేయడం సరికాదని అన్నారు. పెన్షనర్ల హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి వెంకటశెట్టి, సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు చెన్నయ్య, మండలశాఖ అధ్యక్షుడు బుసిరెడ్డి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అచ్చంపేట రూరల్: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని హాజీపూర్ సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో మండల ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజా ర్టీతో గెలిపించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, రైతుభరోసా, రైతు రుణమాఫీ వంటి పథకాలను అందిస్తున్నామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో పాటుపడుతోందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. నిర్వాసితులకు అండగా ఉంటాం.. చారకొండ: మండలంలోని సిర్సనగండ్లలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వపరంగా అండగా ఉంటామని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. నిర్వాసిత కుటుంబాలు అచ్చంపేటలో ఎమ్మెల్యేను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఇళ్లు, స్థలాలు ఇస్తామని నిర్వాసితులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట్‌గౌడ్, మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి మహేందర్, నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, గోరటి శివ, మాజీ సర్పంచ్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
నేడు రైతులతో సీఎం ముఖాముఖి నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా పథకం ద్వారా వానాకాలం పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో విజయవంతంగా జమ చేసిన సందర్భంగా మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారని కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి రైతు వేదిక వద్ద ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలస్థాయి అధికారులను నోడల్ ఆఫీసర్లుగా నియమించినట్లు తెలిపారు. రైతువేదికల వద్దకు ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో చేరుకొని ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. నాగర్‌కర్నూల్ రూరల్: రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.సాగర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నకిలీ విత్తనాలతో మోసపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారన్నారు. వానాకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలు అందుబాటులో లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేదని.. నామమాత్రంగా రుణమాఫీ పథకం వర్తింపజేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రైతుభరోసా ఇవ్వడంలోనూ విఫలమైందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్దం పర్వతాలు, నాయకులు ఆర్.శ్రీనివాసులు, ఆంజనేయులు, గీత, దశ్యానాయక్, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. -
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి
నాగర్‌కర్నూల్: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి వస్తారని.. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజావాణి ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టవద్దన్నారు. కాగా, ప్రజావాణికి 72 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగిరం చేయాలి వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండారెడ్డిపల్లి గ్రామ పరిధిలో రూ. 21కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల రహదారి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామస్తుల తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 3కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం, రూ. 2.85కోట్లతో చేపట్టిన విద్యుత్ ఆధునికీకరణ పనుల్లో పురోగతి ఉండాలన్నారు. గ్రామంలో 515 ఇళ్లకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 407 ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డీఆర్డీఓ చిన్న ఓబులేషు, పీఆర్ ఈఈ విజయ్ ఉన్నారు. -
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
చారకొండ/వెల్దండ: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం చారకొండ మండలం చంద్రాయన్పల్లిలో రూ. 4.48కోట్లతో బీటీరోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదే విధంగా వెల్దండ మండలంలో రూ. 4.48కోట్లతో భైరాపూర్–అజిలాపూర్ బీటీరోడ్డు నిర్మాణానికి, కుప్పగండ్ల–పెద్దాపూర్ మార్గంలో రూ. 2.50కోట్లతో వంతెన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ వెంకట్‌గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, మాజీ సర్పంచులు వసంత, భూపతిరెడ్డి, నాయకులు సాంబయ్యగౌడ్, వెంకటయ్యగౌడ్, మోతీలాల్ నాయక్, సంజీవ్‌కుమార్, పర్వత్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణ, ఎర్ర శ్రీను, హరికిషన్, నారాయణ, రాంచంద్రాద్రారెడ్డి, వెంకట్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులపై చులకనభావం వద్దు
నాగర్‌కర్నూల్ క్రైం: దివ్యాంగులపై వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మెంబర్ శ్రీరాం ఆర్య అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగులు తమ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. వైకల్యం కారణంగా చిన్నచూపు చూడరాదని.. వ్యక్తిగత స్వేచ్ఛ హరించరాదన్నారు. వైకల్యం గల వ్యక్తులను హింసించడం, అనుమతి లేకుండా పరిశోధనలు చేయడం, ఆహారం ఇవ్వకపోవడం, లైంగికంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ. 50వేల నుంచి రూ. 5లక్షల వరకు జరిమానా విధించబడుతుందని అన్నారు. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి దివ్యాంగులను అకారణంగా విడదీయరాదన్నారు. దివ్యాంగులు టోల్‌ఫ్రీ నంబర్ 14416ను సంప్రదించి రక్షణ పొందాలని సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం రఘు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయం దిశగా..
● సహజ సిద్ధమైన ప్రకృతి సేద్యానికిప్రభుత్వ ప్రోత్సాహం ● జిల్లాలో 15 క్లస్టర్ల ఏర్పాటు ● మొదలైన మట్టి నమూనాల సేకరణ ● ఆసక్తి చూపుతున్న రైతులు అచ్చంపేట రూరల్: పంటల సాగులో రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం పెరిగింది. వీటిని వినియోగించి పండించిన ఆహార ధాన్యాలు, కూరగాయలు తినడంతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కోసం ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రకృతి సేద్యంతో పండించిన ఆహార పదార్థాలు, కూరగాయల షాపులు వెలుస్తున్నాయి. అయితే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా 2వేల ఎకరాల్లో.. జిల్లాలో ప్రయోగాత్మకంగా 2వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టేందుకు జిల్లా వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఆసక్తి ఉన్న రైతులను ఎంపిక చేస్తున్నారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా సహజ సిద్ధంగా ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులకు ప్రోత్సాహం అందించనున్నారు. అయితే జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకంలో 60శాతం నిధులను కేంద్రం భరిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. ఒక్కో క్లస్టర్లో 125మంది రైతులు.. జిల్లాలోని ప్రతి మండలంలో రెండు, మూడు గ్రామాలను కలిపి ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో క్లస్టర్ పరిధిలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి ఉన్న 125 మంది రైతులను ఎంపికచేసి.. 125 ఎకరాల్లో ప్రకృతి సేద్యాన్ని చేపడతారు. రైతులు ఎకరా విస్తీర్ణంలో తమకు నచ్చిన పంట సాగు చేయవచ్చు. అది పూర్తిగా ప్రకృతి సేద్యం విధానాల ద్వారా మాత్రమే చేపట్టాల్సి ఉంటుంది. కూరగాయలు, పప్పు దినుసులు పండిస్తే లాభసాటిగా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15 క్లస్టర్లలో 2వేల ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేపట్టనున్నారు. విధిగా భూసార పరీక్షలు.. జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకానికి ఎంపిక చేసిన రైతుల భూమి నుంచి మట్టి నమూనాలు సేకరించి.. భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఆ నివేదికలకు అనుగుణంగా భూమిలో ఉన్న లోపాలను సరిచేసేందుకు చర్యలు తీసుకుంటారు. పంటల సాగుకు జీవామృతం, ఘన జీవామృతం, పచ్చిరొట్ట, వివిధ ఆకుల కషాయాలు, అగ్నిఅస్త్రం తదితర ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ఎరువులను వినియోగించాల్సి ఉంటుంది. వీటి తయారీ కోసం రైతులకు అవసరమైన శిక్షణ ఇస్తారు. సాగు పద్ధతులు, సేంద్రియ ఎరువులు వినియోగించే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రతి క్లస్టర్‌కు కృషి సఖి లేదా కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లు ఇద్దరు ఉంటారు. వీరు నెలలో 16 రోజులు సేంద్రియ సాగు చేస్తున్న క్షేత్రాలను సందర్శించి రైతులకు సూచనలు చేస్తారు. ఆయా గ్రామాలకు చెందిన స్వయం సహాయ సంఘాల్లో సభ్యురాళ్లను కృషి సఖి, రీసోర్స్ పర్సన్లుగా ఎంపిక చేస్తారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపించే రైతుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఈ ఎంపిక పూర్తి చేస్తారు. సొసైటీలు, ఎన్జీఓల ద్వారా బయో రీసోర్స్ సెంటర్లు.. రైతులకు జీవామృతం లాంటివి తయారు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం రూ. 4వేల చొప్పున రెండేళ్లకు ప్రభుత్వం రూ. 8వేలు అందిస్తుంది. జీవామృతం తయారు చేసుకోలేని వారు బయో రీసోర్స్ సెంటర్ల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లావ్యాప్తంగా 10 బయో రీసోర్స్ సెంటర్లు ఏర్పాటుచేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఆసక్తి గల వారు రీసోర్స్ సెంటర్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలు త్వరలోనే వ్యవసాయశాఖకు అందే అవకాశం ఉంది. అవగాహన కల్పిస్తాం.. జిల్లాలో ఏర్పాటుచేసిన క్లస్టర్లలో ప్రకృతి సేద్యంపై ఆసక్తిగల రైతులను గుర్తిస్తున్నాం. వారికి ప్రత్యేకంగా శిక్షణనిస్తాం. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పకడ్బందీగా మట్టి నమూనాలు సేకరించి ఏ పంటకు అనుకూలమో తెలియపరుస్తాం. ఇప్పటికే ఆయా మండలాల్లో వ్యవసాయాధికారులు మట్టి నమూనాల సేకరణలో నిమగ్నమయ్యారు. – చంద్రశేఖర్, డీఏఓ -
కానరాని పల్లెవెలుగు!
‘ఈ చిత్రంలోని ప్రైవేటు వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నది బల్మూర్ మండలం రామోజీపేట గ్రామ విద్యార్థులు. ఈ మండలంలో మెజార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. మైలారం, అంబగిరి, నర్సాయపల్లి, రామోజీపల్లి, వీరాన్రాజుపల్లి, చెన్నారం గ్రామాల ప్రజలకు ఆటోలు, జీపులే దిక్కు. ఎక్కడికై నా వెళ్లాలంటే ప్రైవేటు వాహనాల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిందే. ఇక విద్యార్థుల అవస్థలు వర్ణణాతీతం.’ .. ఇలా జిల్లాలోని అనేక గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు సౌకర్యానికి నోచుకోక అవస్థలు పడుతున్నారు. మెజార్టీ గ్రామాలకు చేరని ప్రగతిచక్రం ఉచిత బస్సు ప్రయాణానికి దూరం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం గ్రామీణ మహిళలకు అందని ద్రాక్షగా మారింది. తమ గ్రామాల నుంచి మండల కేంద్రానికి వచ్చేందుకు బస్సులు లేకపోవడంతో ఆటోలు, జీపుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇదిలా ఉంటే, ఆర్టీసీ జిల్లాలోని మెజార్టీ రూట్లలో అద్దె బస్సులనే వినియోగిస్తోంది. అయితే అద్దె బస్సుల నిర్వాహకులు లాభదాయకమైన రూట్లను మాత్రమే ఎంచుకుంటున్నారు. దీంతో చాలా వరకు గ్రామాలకు బస్సు సౌకర్యం ఉండటం లేదు. ఒక్కో మండలంలో ఐదు నుంచి పది గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం అందుతుండగా.. మిగతా రూట్లలో ఆటోలు, జీపులే దిక్కవుతున్నాయి. అన్ని రూట్లలో అనుకూలమైన వేళల్లో బస్సులు నడుపుతూ.. ప్రైవేటు వాహనాలను నియంత్రిస్తే ఆక్యూపెన్సీ పెరిగే అవకాశం ఉండగా.. అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో నాలుగు ఆర్టీసీ డిపోలు ఉండగా.. ఒక్కో డిపో నుంచి ఏడాదికి సుమారు రూ. 8కోట్ల వరకు లాభం ఆర్జిస్తున్నప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని అనేక గ్రామాలకు నేటికీ ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడం.. గతంలో బస్సు సౌకర్యం ఉన్న గ్రామాలకు బస్సులను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో సామర్థ్యానికి మించి కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు సైతం ఆటోల్లో ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రైవేటు వాహనాలే దిక్కు.. జిల్లాలోని అచ్చంపేట, లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర, కొల్లాపూర్ మండలాల్లో చాలా వరకు గ్రామాల ప్రజలకు ప్రైవేటు వాహనాలే దిక్కవుతున్నాయి. అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి, బక్కలింగయ్యపల్లి, సిద్ధాపూర్, లింగాల మండలంలోని చెన్నంపల్లి, అప్పాయిపల్లి, ధారారం, బల్మూరు మండలంలోని మైలారం, రామోజీపల్లి, అంబగిరి, చెన్నారం, అమ్రాబాద్ మండలం తుర్కపల్లి, జంగిరెడ్డిపల్లి, కల్మూలోనిపల్లి, కుమ్మరోనిపల్లి, తిర్మలాపూరం, లక్ష్మాపూర్, కొల్లాపూర్ మండలం సోమశిల, అమరగిరి, ముక్కిడిగుండం, కుడికిళ్ల, పెంట్లవెల్లి మండలం మంచాలకట్ట, మధవానినగర్, ఉప్పునుంతల మండలం కంసానిపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రజలకు ఆటోలు, జీపులే దిక్కు పరిమితికి మించి ప్రయాణంతో ప్రమాదాలు విద్యార్థులకు తప్పని అవస్థలు -
జూరాల కాల్వకు నీటి విడుదల
అమరచింత: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఆయకట్టు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం డీఈ నారాయణ, కిసాన్‌సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అయ్యూబ్‌ఖాన్ ప్రత్యేక పూజలు చేసి నీటిని వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మునుపెన్నడూ లేని విధంగా ముందుస్తుగా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నామని చెప్పారు. రిజర్వాయర్లతో పాటు ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని తరలిస్తున్నట్లు చెప్పారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా పీజేపీ సిబ్బంది నిరంతరం కాల్వ వెంట తిరుగుతూ ప్రతి రైతుకు అందేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. కార్యక్రమంలో పీజేపీ ఏఈ ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహేందర్‌రెడ్డి, అరుణ్ కుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, చుక్కా ఆశిరెడ్డి, పీఎసీఎస్ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, రహమతుల్లా, పరమేష్, నల్గొండ శ్రీను, మొగిలి గంగాధర్‌గౌడ్, బంగారు భాస్కర్, తులసీరాజ్, ఏకే వెంకటేశ్వర్‌రెడ్డి, హన్మంతునాయక్ తదితరులు పాల్గొన్నారు. కుడి, ఎడమ కాల్వలకు.. జూరాలకు ఎగువ నుంచి వరద వస్తుండటంతో ఎడమ కాల్వ ద్వారా 920 క్యూసెక్కులు, నీటిని, కుడి కాల్వ ద్వారా 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఏటా వానాకాలం పంటల సాగుకు జులై చివర, ఆగస్టులో సాగునీరు వదిలే వారని.. ఈసారి ముందస్తుగా జూన్‌లోనే ఆయకట్టుకు నీటిని అందించడం హర్షణీయమన్నారు. -
రైతుభరోసా @ రూ.372 కోట్లు
నాగర్‌కర్నూల్: రైతుభరోసా పథకం ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 2,89,015 మంది రైతుల ఖాతాల్లో రూ. 372.215 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకం సుస్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి పునాది వేస్తోందన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది రైతులకు ఈ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వట్టెం వెంకన్న సన్నిధిలో కలెక్టర్.. బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చక బృందం వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న కలెక్టర్ దంపతులు, కుటుంబ సభ్యులతో అర్చకులు గోత్రనామార్చన పూజలు చేయించి ఆశీర్వచనాలు అందజేశారు. -
ఉత్సాహంగా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు
కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఆదివారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి స్వాములు, జనంపల్లి సంతోష్ అథ్లెటిక్స్ ఎంపికలను ప్రారంభించగా.. 150 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జూలై 6న హనుమకొండలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీల్లో పాల్గొనే అండర్–10, 12, 14 బాలబాలికల తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో అంజయ్య, ప్రసాద్, బాలయ్య, రాజేందర్, మల్లేష్, సుభాషిణి, రాజు, సురేశ్, ప్రేమ్ సాగర్, స్వాతి, మల్లయ్య, భాస్కర్, రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై నిరంతర పోరాటం తెలకపల్లి: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఎస్టీయూ నిరంతరం పోరాడుతుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సదానందంగౌడ్, మాజీ ఎమ్మెల్సీ కత్తి నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కేకే రెడ్డి పాఠశాలలో ఎస్టీయూ రాష్ట్ర, జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు సర్వీస్ సెక్టార్‌పై మాట్లాడిన మొట్టమొదటి సంఘం ఎస్టీయూ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకోసారి కరువు భత్యం ఇవ్వాలని ప్రతిపాదించి సఫలీకృతమయ్యామని చెప్పారు. యూనియన్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఉపాధ్యాయులకు అండగా నిలుస్తూ.. సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం సాగిస్తోందన్నారు. 2024 డిసెంబర్ డీఎస్సీ ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇప్పించేందుకు కృషి చేశామన్నారు. అనంతరం సంఘం నిబంధనలు, నాయకత్వ లక్షణాలను వివరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సుధాకర్‌రెడ్డి, మురళి, నర్సింహారెడ్డి, సుధాకర్, సైదయ్య, ఈశ్వర్, రఘురాంరెడ్డి, లక్ష్మణరావు, రమేశ్, మండల కార్యదరి జహంగీర్‌పాషా, బాలస్వామి, వేదావతి, సుఽజాత, సరళ పాల్గొన్నారు. రామన్‌పాడులో 1,016 అడుగులు మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులకుగాను ఆదివారం 1,016 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు. -
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు విద్యార్థుల ఎంపిక
నాగర్‌కర్నూల్: జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్లో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకు విద్యార్థులను ఎంపిక చేశారు. డీఈఓ ఎ.రమేశ్ కుమార్, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిశాఖ అధికారి రాంలాల్‌తో కలిసి.. అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లక్కీ డిప్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్, వెల్దండ, కల్వకుర్తి ప్రాంతాల్లో నిర్దేశించిన తొమ్మిది ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరం ఒకటో తరగతిలో చేరేందుకు 88సీట్లు (నాన్ రెసిడెన్షియల్), ఐదో తరగతిలో 90 సీట్లు (రెసిడెన్షియల్) కేటాయించగా.. మొత్తం 422మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. ఎస్సీ కులాల వారీగా 33శాతం రిజర్వేషన్లు బాలికలకు కేటాయించగా, మిగిలిన సీట్లను జనరల్ కోటాలో లక్కీ డిప్ తీసినట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు తమ ధ్రువపత్రాలతో ఎస్సీ సంక్షేమశాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ రాగమణి, కవిత, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఆయకట్టుకు సాగునీరు
●నారుమడి వేసుకున్నా.. యాసంగిలో 5 ఎకరాల్లో వరి సాగు చేసినా నీరందక ఆశించిన దిగుబడి రాలేదు. వానాకాలంలో ఎడమ కాల్వకు నీటిని ముందస్తుగా వదులుతారన్న ఆశతో వరి నారుమడి సిద్ధం చేసుకున్నా. మరోమారు 5 ఎకరాల్లో వరి పండించేందుకు పొలం సిద్ధం చేసుకుంటున్నా. – మోహన్‌రెడ్డి, రైతు, సింగంపేట మంత్రి చేతుల మీదుగా విడుదల.. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో వానాకాలం పంటల సాగుకుగాను ఆదివారం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఎడమ కాల్వకు నీరు వదులుతున్నాం. జూన్‌లోనే ఆయకట్టుకు నీరందిస్తున్నాం.. పొదుపుగా వినియోగించుకోవాలి. వానాకాలంలో పూర్తిస్థాయిలో నీటిని రోజువారీగా అందించనున్నాం. – జగన్మోహన్, ఈఈ, పీజేపీ నందిమళ్ల క్యాంపు డివిజన్ 100 కిలోమీటర్లు.. 85 వేల ఎకరాలు... జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా సుమారు 100 కిలోమీటర్ల పొడవునా.. 85 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నారు. జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వరకు కాల్వ వెంట సాగునీరు పారనుంది. ఏటా రెండు పర్యాయాలు వరి సాగు చేసే రైతులు కొన్నేళ్లుగా యాసంగిలో వారబందీ విధానంలో నీటిని అందిస్తుండటంతో వరితో పాటు చెరుకు సాగు చేస్తున్నారు. అధికారుల సూచనల మే రకు నీటిని పొదుపుగా వినియోగిస్తుండటంతో కోతల సమయం వరకు నీరందుతుంది. అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయానికి ఈ ఏడాది ముందస్తుగా వరద వస్తుండటంతో ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వరద నీరు వృథా చేయకుండా వానాకాలం పంటల సాగుకుగాను ఆయకట్టుకు ముందస్తుగా నీటిని వదలాలని నిర్ణయించిన అధికారులు ప్రభుత్వానికి విన్నవించడంతో జూరాల ప్రధాన ఎడమ కాల్వకు ఆదివారం నీరు వదిలేందుకు ముహూర్తం ఖరారు చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి డా. వాకిటి శ్రీహరి ఎడమ కాల్వకు నీటిని వదలనున్నారని.. ఇందుకుగాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రాజెక్టు అధికారులు వివరించారు. వానాకాలం పంటల సాగుకు ముందస్తుగా కాల్వకు నీటిని వదలడం జూరాల చరిత్రలో ఇదే మొదటిసారని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ● గతేడాది యాసంగిలో ప్రాజెక్టులో నిల్వ నీటిమట్టం తక్కువగా ఉండటంతో తాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఎడమ, కుడికాల్వ ఆయకట్టును కుదించి 35 వేల ఎకరాలకే పరిమితం చేసి అతి కష్టం మీద సాగునీరు అందించగలిగింది. దీంతో యాసంగి సాగుకు దూరమైన చివరి ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వం సన్నరకం వరికి బోసన్ చెల్లిస్తుండటంతో ఆయకట్టులో కేవలం ఆ పంట మాత్రమే సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రాజెక్టులో నీరు ఉన్నప్పుడు వదిలితే సాగు పనులు ప్రారంభిస్తారని.. ఉన్న నీరంతా దిగువకు వెళ్లిన తర్వాత వదలడంతో తలెత్తే సమస్యను అధికారులు ముందస్తుగా గుర్తించడం సంతోషకరమని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు విడుదల చేయనున్న మంత్రి వాకిటి శ్రీహరి జూరాల జలాశయానికి కొనసాగుతున్న వరద ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు -
నల్లమల రాజసం
వివరాలు 8లో uఅటవీ ప్రాంతాల్లో క్రూరమృగాల నుంచి ఎదురయ్యే ప్రమాదాలు.. వాతావరణ పరిస్థితులను ముందుగానే పసిగట్టగల తెలివితేటలు.. ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలిగే రోగనిరోధక శక్తి.. పొద్దస్తమానం పనిచేసినా అలసిపోనితత్వం.. గుర్రాల వంటి గిట్టలతో ఎత్తైన గుట్టలు, రాళ్లు, రప్పల్లోనూ అవలీలగా పరుగెత్తగల సత్తా నల్లమల లోతట్టు ప్రాంతంలోని పొడజాతి వృషభరాజాల సొంతం.. నిటారుగా ఉండే కొమ్ములు, తెలుపు, ఎరుపు, గోధుమ రంగుల్లో ఉండే మచ్చలే మకుటంగా ధరించిన తూర్పు పొడజాతి పశువులు తెలంగాణ బ్రాండ్‌గా ప్రఖ్యాతి గడించాయి. గిత్తంటే ఇదిరా అనే రైతన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. నల్లమల గిత్తగా పేరొందిన ఈ వృషభరాజాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. – అచ్చంపేట తెలంగాణ బ్రాండ్‌గా తూర్పు పొడజాతి పశుసంపద ● నల్లమల లోతట్టు ప్రాంతంలో మేలుజాతి పశువులు ● మన్ననూర్ గిత్తకు వందేళ్లకు పైగా చరిత్ర ● ఆదరణ కొరవడటంతో ప్రశ్నార్థకమవుతున్న మనుగడ ● ప్రభుత్వం నుంచి ప్రత్యేక గుర్తింపు కోసం ఎదురుచూపులు -
పేదల సంక్షేమమే ధ్యేయం
కొల్లాపూర్/కొల్లాపూర్ రూరల్/పెద్దకొత్తపల్లి: పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం పెద్దకొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో 90మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకు ముందు గాంధీజీ విగ్రహం, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘటన సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని.. అర్హులైన పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. ● యోగా సాధనతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పొందవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లోని వాసవీమాత ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. విద్యార్థులు, ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఘనమైన వారసత్వ సంపద యోగా అని అన్నారు. మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతల నివారణకు యోగా దోహద పడుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ యోగాసనాలపై అవగాహన ఉండాలని అన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, సింగిల్‌విండో చైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్రావు, రాజు, గోపాల్‌రావు, విష్ణు, సత్యం, రవికుమార్, కొండల్రావు, రాజేశ్వర్‌రావు, ఇమాన్గౌడ్, బోజ్యా నాయక్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీల అమలు రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం..
నల్లమల పొడ పశుజాతికి మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. వీటికి వ్యవసాయ పనుల్లో మంచి నైపుణ్యం ఉంటుంది. కష్టతరమైన పనులు సులువుగా చేస్తాయి. 34 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాల్లో అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. – గెంటెల హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు రైతులను ప్రోత్సహించాలి.. నాకు 50 వరకు పశువులు ఉన్నాయి. నల్లమల రైతులకు పశుపోషణ భారంగా మారింది. పశుగ్రాసం, నీటి కొరత ప్రధాన కారణంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పశుజాతిని సంరక్షించేందుకు పునరావాస, పశుగ్రాసం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పశువుల వల్ల అడవికి ఎలాంటి నష్టం ఉండదు. అడవిలో మేపుకొనేందుకు అనుమతి ఇవ్వాలి. – శివాజీ గెలవయ్య, మన్ననూర్, అమ్రాబాద్ సంతతి పెంచేందుకు కృషి.. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. తూర్పు పొడజాతి పశుసంతతి పెంచేందుకు కృషిచేస్తాం. మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. మచ్చల వైవిధ్యంపై పరిశోధన చేయించి, ఇక్కడ సంతనోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఈ జాతిని సంరక్షించేందుకు ప్రభుత్వపరంగా చొరవ తీసుకుంటాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట ● -
యోగాతో ఒత్తిడిని అధిగమిద్దాం
నాగర్‌కర్నూల్/నాగర్‌కర్నూల్ క్రైం: ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడిని అధిగమించేందుకు యోగా దోహదపడుతుందని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా జడ్జి పాల్గొని.. న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. యోగాతో ఏకాగ్రత పెరగడంతో పాటు అధిక బరువును నియంత్రించవచ్చన్నారు. అదే విధంగా రక్తప్రసరణ మెరుగుపడి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ యోగా ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా, సీనియర్ సివిల్‌జడ్జి వెంకట్రాం, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంతరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా జడ్జి రమాకాంత్ -
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
తాడూరు: ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ పిలుపునిచ్చారు. శనివారం తాడూరులో సీపీఐ మండల మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు. అనంతరం బాల్‌నర్సింహ పార్టీ జెండా ఎగురవేసి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక మతఘర్షణలు పెరిగాయన్నారు. నల్లదనం వెలికితీత, ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు, ధరల నియంత్రణ హామీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గాలికొదిలేసిందని అన్నారు. అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న చెంచులు, గిరిజనులను అక్కడి నుంచి ఖాళీ చేయించి.. ఖనిజ సంపద కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగా ఆపరేషన్ కాగర్ పేరుతో మావోయిస్టులను హతమారుస్తుందని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని.. ప్రజల పక్షాన సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు వార్ల వెంకటయ్య, శివశంకర్, భరత్, చంద్రమౌళి, రామకృష్ణ, కురుమూరి ఉన్నారు. -
నిత్య జీవితంలో యోగా భాగం కావాలి : కలెక్టర్
భారతీయుల పురాతన సంపద అయి న యోగా ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో భాగం కావాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. మనసు, శరీరం, ఆత్మల మధ్య సమన్వయాన్ని సాధించే ఒక ప్రాచీన పద్ధతి యోగా అని అన్నారు. దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఆందోళన, శారీరక రుగ్మతలకు యోగా ఒక అద్భుతమైన పరిష్కారమని అ న్నారు. ప్రాణాయామం, ధ్యానంతో మనసు స్థిరంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. అనంతరం జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌తో కలిసి కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమాల్లో ఏఎస్పీ రామేశ్వర్, ఏఆర్ ఏఎస్పీ భరత్, డీఎస్పీలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీఐలు కనకయ్యగౌడ్, నాగరాజు, నాగార్జున పాల్గొన్నారు. -
మున్సిపల్ వ్యవస్థ ఎంతో కీలకం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మనిషికి శ్వాస ఎంత ముఖ్యమో.. పట్టణాలు, నగరాలకు మున్సిపల్ వ్యవస్థ అంతే ముఖ్యమని సీడీఎంఏ టీకే శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో ‘తెలంగాణ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్– స్టార్టప్ సమ్మిట్’ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ‘వంద రోజుల ప్రత్యేక కార్యాచరణ’లో చేసే పనులు వినూత్నంగా ఉండాలన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మెరుగైన పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, నీటి శుద్ధికి సంబంధించి కొత్త ఆవిష్కరణలతో వివిధ స్టార్టప్ కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వీటిని ప్రజలకు క్షేత్రస్థాయిలో వివరించాలని, అందరూ వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. మున్సిపాలిటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా స్థానికంగా ఆర్థిక వనరులు పెంచుకోవడంపై దృష్టి పెట్టాలన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు ఫీజు, దుకాణాల అద్దెలను సకాలంలో వసూలు చేసి ఆర్థిక పరిపుష్టి సాధించాలన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పట్టణాలు, నగర ప్రాంతాల్లో వేస్టేజీ ఎక్కువగా ఉంటోందని దీనివల్ల వాతావరణ, నీటి, వాయు కాలుష్యం ఉత్పన్నమవుతోందన్నారు. వీటిని తగ్గించడానికి కొత్త ఆవిష్కరణలపై అధ్యయనం చేసి అమలయ్యేలా చూస్తామన్నారు. అంతకు ముందు శిల్పారామం ఆవరణలో ఏర్పాటు చేసిన 40 స్టాళ్లను పరిశీలించారు. కలెక్టర్ విజయేందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ మహేశ్వర్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత తదితరులు పాల్గొన్నారు. -
మహిళా అధ్యాపకుల నియామకం
కందనూలు: జిల్లాకేంద్రంలోని డిగ్రీ కళాశాల, రంగారెడ్డి షాద్‌నగర్ సమీపంలోని నూర్ ఇంజినీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ (ఉమెన్)లో బోధించుటకు అర్హులైన మహిళా అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బోటనీ, స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీలో ఖాళీలు ఉన్నాయని, పీజీలో 55 శాతం మార్కులు, నెట్, సెట్ ఉత్తీర్ణులై మూడేళ్ల బోధనానుభవం ఉన్న వారు జూన్ 25వ తేదీలోగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 95029 63320, 77939 75030 సంప్రదించాలని సూచించారు.ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ సీపీఐపెద్దకొత్తపల్లి: ప్రజా సమస్యలపై పోరాడే ఏకై క పార్టీ సీపీఐ అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. శుక్రవారం మండలంలోని వెన్నచర్లలో జరిగిన పార్టీ మండల 18వ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. వందేళ్లుగా ఓట్లు, సీట్లు, అధికారంతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి రాజీ లేని పోరాటం చేస్తున్నామన్నారు. దేశంలో రెండు దశబ్దాలు అధికారంలో ఉన్న పార్టీలు నేడు కనుమరుగయ్యే పరిస్థితి కనబడుతుందని.. ఓడిన పార్టీల నాయకులు అధికారం కోసం గెలిచిన పార్టీల్లో చేరుతూ అధికారాన్ని అస్వాదిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భూ స్వాములు, పెత్తందారుల కొమ్ము కాస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు గ్రామంలో నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండీ ఫయాజ్, కార్యవర్గసభ్యుడు నర్సింహ, పెబ్బేటి విజయుడు, కార్యదర్శి బొల్లెందుల శ్రీనివాసులు, బండి లక్ష్మీపతి, లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, మజీద్, రామచంద్రయ్య, వెంకటేష్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి’నాగర్‌కర్నూల్ రూరల్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోందని.. బీసీలను అవమానించేందుకు చూస్తోందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షుడు కాళ్ల నిరంజన్ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని.. అవమానకర రాజకీయాలు ఎవరు చేసినా బీసీ సమాజం తగిన బుద్ది చెబుతుందని హెచ్చరించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.అప్రమత్తతతోనే సీజనల్ వ్యాధుల నియంత్రణబిజినేపల్లి: సీజనల్ వ్యాధులతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. వెంకటదాస్ అన్నారు. శుక్రవారం ఉదయం పాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవడంతో పాటు దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాలెం పీహెచ్సీ వైద్యాధికారి డా. ప్రియాంక, వైద్య, ఆరోగ్య సిబ్బంది నర్సింహులు, బాదం రాజేశ్వర్, సుజాత, గజవర్దనమ్మ, విజయ, ఆశా కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
బల్మూర్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సన్నద్ధం కావాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని జిన్‌కుంటలో ఉన్న ఓ ఫంక్షన్హాల్లో పార్టీ మండల ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్గత విబేధాలు వీడి ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా సంఘటితంగా పని చేయాలని సూచించారు. గ్రూపు తగాదాలను ప్రోత్సహించే వారిపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ కోసం క్రమశిక్షణతో పనిచేసే వారికి పదవులు పైరవీలు లేకుండా వస్తాయన్నారు. సర్పంచ్, ఎంపీటీసీలుగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వారికి ప్రథమ రూ.20 లక్షలు, ద్వితీయ రూ.15 లక్షలు, తృతీయ రూ.10 లక్షలు అభివృద్ధి పనులకు తనవంతుగా అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకుంటే క్షమించేది లేదని హెచ్చరించారు. జులై మొదటి వారంలో ఇందిరమ్మ ఇళ్ల రెండోవిడత లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 10 ఎకరాలలోపు ఉన్న 93 శాతం మంది రైతులకు ప్రభుత్వం రైతుభరోసా నిధులు జమ చేస్తుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం అందుబాటులో ఉంటానన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఓబీసీ చైర్మన్ గిరివర్ధన్‌గౌడ్, నాయకులు కాశన్నయాదవ్, సుధాకర్‌గౌడ్, నర్సింగ్‌రావు, నిరంజన్‌గౌడ్, మండల కార్యనిర్వాహక అధ్యక్షుడు రాంప్రసాద్‌గౌడ్, శైలేష్, ఖదీర్, సంపంగి రమేష్, శ్రీనివాసులు, వెంకటయ్య, పద్మ, సైదులు, అశోక్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ డీఎం
కల్వకుర్తి టౌన్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శనివారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్లు కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ సుభాషిణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు వారి సలహాలు, సూచనలను సెల్‌నంబర్ 99592 26292లో సంప్రదించి తెలియజేయాలని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. బడుల బలోపేతంలో ఉపాధ్యాయులే కీలకం లింగాల: విద్యా ప్రమాణాలు పెంచడం, నాణ్యమైన బోధన అందించడంలో ఉపాధ్యాయులే కీలకమని.. అప్పుడే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని బాకారం, సూరాపూర్, మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా బాలికల విద్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని, విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. ఇప్పటికే విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేసినట్లు చెప్పారు. విద్యా ప్రమాణాల పెంపునకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. -
‘సంకెళ్ల ఘటన’లు పునరావృతం కానివ్వం
మహబూబ్‌నగర్ క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ కోర్టుకు రైతులను తీసుకువెళ్తున్న ఘటనలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడంపై ఎస్కార్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు అతి జాగ్రత్తతోపాటు ఎక్కువగా రక్షణాత్మకంగా ఉండాలని వ్యవహరించడం వల్లే ఈ తప్పిదం జరిగిందని మల్టీ జోన్– 2 ఐజీ సత్యనారాయణ అన్నారు. అలంపూర్, సంగారెడ్డి కోర్టులలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రత్యేక ఎస్ఓటీ తయారు చేసినట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐజీ మాట్లాడారు. ఉన్నతాధికారులకు విషయం తెలియకపోవడంతోపాటు స్థానిక ఎస్హెచ్ఓ సక్రమంగా మానిటరింగ్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. రైతుల ఘటన విషయంలో ఎలాంటి ఒత్తిడి లేదని, ఇలాంటి ఘటనలు జరగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో ఎక్కడా కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఎస్ఓటీ ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, దీనికి సివిల్ డీఎస్పీతోపాటు ఏఆర్ డీఎస్పీ పూర్తి బాధ్యత వహిస్తారని చెప్పారు. కొత్తగా వచ్చిన బీఎన్ఎస్ నిబంధనల ప్రకారం ఖైదీలకు ఇచ్చే ఎస్కార్ట్ విషయంలో ఆస్పత్రికి వెళ్లే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయని జైలు అధికారుల నుంచి ఎస్పీలకు సమాచారం వస్తుందన్నారు. ఖైదీలను తరలించే సమయంలో సమన్వయ, సమాచారం లోపం ఉండకుండా ఉండటానికి ఎస్పీ స్థాయిలో ఎస్బీ, లా అండ్ ఆర్డర్, రిజర్వ్ పోలీసులు కలిసి అన్ని జాగ్రత్తలు తీసుకునే క్రమంలోనే నూతనంగా ఎస్ఓటీ తయారు చేశామన్నారు. జైలు నుంచి ఖైదీలను ఆరోగ్య పరీక్షల కోసం ఆస్పత్రికి లేదా కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఇకపై జైలు నుంచి ఖైదీలను తీసుకువెళ్తున్న క్రమంలో వారి గత నేర చరిత్ర ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంకెళ్ల విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రైతులు, వికలాంగులు, విద్యార్థులు, మహిళలను కోర్టుకు తీసుకువెళ్తున్న క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై ఐదు జిల్లాల పోలీస్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. సంకెళ్లు వేయాల్సిన పరిస్థితి వస్తే సదరు కోర్టు న్యాయమూర్తి అనుమతి ప్రకారం వేయాలని, అదేస్థాయిలో బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం టెర్రరిస్టులు, నక్సలైట్లు, గతంలో నేర చరిత్ర కలిగినవారు అయితే పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి కూడా తీసుకోవాలన్నారు. పెద్దధన్వాడ ఇథనాల్ కంపెనీ ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, అదే సమయంలో రైతుల అభిప్రాయాలు సైతం సముచితంగా తీసుకొని చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కసారి ఖైదీలను రిమాండ్ చేసిన తర్వాత మళ్లీ తర్వాత బెయిల్ అప్లికేషన్ సందర్భంతోపాటు ఆస్పత్రికి పరీక్షల నిమిత్తం వెళ్లిన సందర్భంలో ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ పోలీసులు వాటిపై తక్కువ ఫోకస్ పెడుతున్నారని తెలిపారు. సమావేశంలో జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఉమ్మడి జిల్లాలోని ఎస్పీలు జానకి, వైభవ్ గైక్వాడ్, రావుల గిరిధర్, తోట శ్రీనివాస్‌రావు, యోగేష్ గౌతం పాల్గొన్నారు. కానిస్టేబుళ్ల అతి జాగ్రతతోనే తప్పిదం జరిగింది మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ -
ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం
నాగర్‌కర్నూల్: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణ, సీజనల్ వ్యాధులు, తెలంగాణ వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యాన పంటలపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీ, ప్రాజెక్టుల నిర్మాణానికి భూ సేకరణలో జాప్యం కాకుండా చూస్తూ సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. అంటువ్యాధుల నివారణకు ముందస్తుగా మందుల నిల్వ, వైద్యబృందాల సన్నద్ధత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సామర్థ్యం పెంచే చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని, నిర్లక్ష్యం సరికాదని హెచ్చరించారు. తెలంగాణ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని వ్యవస్థాత్మకంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉద్యాన పంటల సాగుపై కలెక్టర్ సమీక్షించారు. సాగు విస్తీర్ణం, రైతులకు అందుతున్న సాంకేతిక సాయం, మార్కెటింగ్, నీటి లభ్యతపై అధికారులతో చర్చించారు. రైతులకు ప్రోత్సాహకాల అమలుపై కూడా ఆరా తీశారు. 2,71,545 మంది రైతుల ఖాతాల్లో రూ.308 కోట్లు జమ.. రైతు భరోసా పథకంలో భాగంగా శుక్రవారం వరకు జిల్లాలోని 2,71,545 మంది రైతుల ఖాతాలో రూ.308.792 కోట్లు జమ అయ్యాయని కలెక్టర్ బదావత్ సంతోష్ ఓ ప్రకటనలో తెలిపారు. వానాకాలం సీజన్ కంటే ముందే నిధులు జమ చేయడం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని.. పెట్టుబడి భారం తగ్గించి ఉత్పాదకత పెంపొందించేందుకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. విడతల వారీగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయని వివరించారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు కలెక్టర్ బదావత్ సంతోష్ -
43,047 అర్జీలు
1,282 గ్రామాలు..వివరాలు 8లో uఉమ్మడి జిల్లాలో ముగిసిన భూ భారతి సదస్సులు ● నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 15,599 దరఖాస్తులు ● నారాయణపేటలో అత్యల్పంగా 4,052 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర ప్రభుత్వం ధరణిలో తప్పులను సవరిస్తూ.. మార్పులు, చేర్పులతో భూ భారతి పోర్టల్‌ను అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రతిష్టాత్మకంగా గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి.. భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించింది. నిర్దేశిత గడువు శుక్రవారంతో ముగియగా.. మొత్తంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల పరిధిలో 1,282 గ్రామాలకు సంబంధించి 43,047 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా 15,559 అర్జీలు రాగా.. నారాయణపేట జిల్లాలో అత్యల్పంగా 4,052 వచ్చినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. జిల్లాల వారీగా ఇలా.. ● మహబూబ్‌నగర్ జిల్లాలోని 16 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అత్యధికంగా కోయిల్‌కొండ మండలంలో 1,317 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 2,348, భూ విస్తీర్ణంలో తప్పులపై 966, భూ యజమాని పేర్లలో తప్పులు సవరించాలని 435 అర్జీలు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ● నారాయణపేట జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు జరగగా.. నారాయణపేట మండలంలో అత్యధికంగా 1,230 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 1,284, భూ విస్తీర్ణంలో తప్పులపై 776, పేర్లలో తప్పులు సవరించాలని 335 మంది దరఖాస్తు చేసుకున్నారు. ● జోగుళాంబ గద్వాల జిల్లాలోని 12 మండలాల పరిధిలో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. గద్వాల మండలంలో అత్యధికంగా 1,324 అర్జీలు వచ్చాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు సవరించాలని 832, పెండింగ్ సక్సేషన్లపై 750, అసైన్డ్‌మెంట్ ల్యాండ్‌లపై 640, గెట్ల పంచాయితీలపై 200 వరకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ● నాగర్‌కర్నూల్ జిల్లాలో 19 మండలాల పరిధిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,559 దరఖాస్తులు వచ్చాయి. కొల్లాపూర్ మండలం నుంచి అత్యధికంగా 2,138 అర్జీలు వచ్చినట్లు తెలుస్తోంది. మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 3,921, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,062, పేర్లలో తప్పులు సవరించాలని 478 మంది దరఖాస్తు చేసుకున్నారు. ● వనపర్తి జిల్లాలోని 15 మండలాల్లో రెవెన్యూ సదస్సులు జరిగగా.. అత్యధికంగా పాన్‌గల్ మండలంలో 1,555 దరఖాస్తులు వచ్చాయి. ప్రధానంగా మిస్సింగ్ సర్వే నంబర్లపై 1,135, భూ విస్తీర్ణంలో తప్పులపై 1,064, పేర్లలో తప్పులకు సంబంధించి 824 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారీగా సదస్సులు, దరఖాస్తుల వివరాలు.. జిల్లా సదస్సులు వచ్చిన నిర్వహించిన దరఖాస్తులు గ్రామాలు మహబూబ్‌నగర్ 293 9,610 జోగుళాంబ గద్వాల 198 5,800 నాగర్‌కర్నూల్ 338 15,559 నారాయణపేట 234 4,052 వనపర్తి 219 8,026 -
మత్తు వదిలిస్తున్నారు!
●కఠినంగా వ్యవహరిస్తాం.. మత్తు పదార్థాలు వినియోగించే, విక్రయించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పోలీసుశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలను కట్టడి చేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. – గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఎస్పీ నాగర్‌కర్నూల్ క్రైం: సమాజంలో మత్తుకు బానిసై ఎందరో తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్‌కు అలవాటైన వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం.. వారు అసాంఘిక కార్యకలాపాలతో పాటు నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. మత్తు పదార్థాల నియంత్రణకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వీడియో ప్రదర్శనలతో.. జిల్లాలోని 22 పోలీస్స్టేషన్ల పరిధిలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లోని పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాల్లో మత్తు బారిన పడితే కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీడియోలను ప్రదర్శిస్తూ వివరిస్తున్నారు. ప్రత్యేక నిఘా.. జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం, లోతట్టు ప్రాంతాల్లో గంజాయి సాగు, రవాణా జరగకుండా, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి మత్తు పదార్థాలు రాకుండా జిల్లా ఎకై ్సజ్, పోలీసుశాఖ సంయుక్తంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. కొందరు యువత పట్టణాలు, మండల కేంద్రాల శివార్లను అడ్డాలుగా చేసుకొని మత్తు పదార్థాలు సేవిస్తుండటంతో వారిపై ప్రత్యేక నిఘా ఉంచి అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. నియంత్రణకు పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు గ్రామాలు, పట్టణాల్లో యువతకు అవగాహన సదస్సులు డ్రగ్స్ నివారణకు నిరంతరం తనిఖీలు జిల్లాలో గంజాయి కేసుల నమోదు ఇలా.. 2022లో 7 కేసులు నమోదు చేసిన పోలీసులు 3.208 కిలోల గంజాయి, 4 కిలోల గంజాయి విత్తనాలు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్టు చేశారు. 2023లో మూడు కేసులు నమోదు చేసి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని 10 మందిని అరెస్టు చేశారు. 2024లో 7 కేసులు నమోదు చేసి 309 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని 12 మందిని అరెస్టు చేశారు. 2025లో ఇప్పటి వరకు రెండు కేసుల్లో 920 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. -
సికిల్‌సెల్ అనీమియాపై అప్రమత్తంగా ఉండాలి
వెల్దండ: సికిల్‌సెల్ అనీమియా అనేది ఎర్రరక్త కణాలపై ప్రభావం చూసే జన్యుపరమైన రక్తసంబధం రుగ్మత అని, దీనిపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని గుండాల శివారు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులకు సికిల్‌సెల్ అనీమియాపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ సికిల్‌సెల్ రుగ్మత గలవారిలో ఎర్రరక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయని, ఇవి రక్త సరఫరాలో అడ్డంకిగా మారుతాయన్నారు. వీరిలో ఎర్ర రక్త కణాల జీవితకాలం 10–20 రోజులు మాత్రమే ఉండి ఉత్పత్తి తక్కువగా ఉంటుందన్నారు. దీంతో వీరు తరుచుగా రక్తహీనతకు గురవుతారని, ఆక్సిజన్ సరఫరా తగ్గుతుందని వెంటనే చికిత్స తీసుకోకపోతే పరిస్థితి ప్రాణాంతకంగా మారుతుందన్నారు. సికిల్‌సెల్ అనేమియా వ్యాధి నిర్ధారణకు రక్తపరీక్షలు చేసుకోవాలన్నారు. జిల్లాలో చెంచు జనాభా, ఇతర గిరిజనులకు ఇప్పటి వరకు 60,546 మందికి సికిల్‌సెల్ అనీమియా స్క్రినింగ్ రక్త పరీక్షలు చేశామన్నారు. 2047 సంవత్సరం నాటికి దేశంలో ఈ వ్యాధి లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారికి ఈ వ్యాధి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు భీమానాయక్, వెంకటదాస్, సికిల్‌సెల్ ప్రోగ్రాం అధికారి ప్రదీప్, పాఠశాల ప్రిన్సిపల్ సుమన్, స్థానిక వైద్యాధికారి సింధు, డీపీఓ రేనయ్య, క్లస్టర్ కమ్యూనిటీ ఆరోగ్య అధికారి శ్రీనివాసులు, డివిజన్ ఉప మలేరియా అధికారి పర్వతాలు, డీడీఎం సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి టోర్నీలో విజేతగా నిలవాలి
మహబూబ్‌నగర్ క్రీడలు: రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నీలో జిల్లా జట్టు మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేశ్ అన్నారు. నిజామాబాద్‌లో ఈనెల 28 నుంచి వచ్చేనెల 1వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్‌బాల్ టోర్నీలో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను గురువారం జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ ఫుట్‌బాల్‌లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నిరంతర ప్రాక్టీస్‌తో క్రీడల్లో ఉన్నత స్థానాల్లో చేరుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్యాట్రన్ రంగారావు, భానుకిరణ్, కోశాధికారి కేఎస్.నాగేశ్వర్, కార్యనిర్వాహక కార్యదర్శి ఇమ్మాన్యుయెల్ జేమ్స్, నందకిషోర్, శ్రీనివాస్, వాజిద్, నికేష్, రాజు, రాము, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో కందనూలు ముందడుగు
నాగర్‌కర్నూల్: జిల్లాలో ప్రజల జీవన నైపుణ్యాలు పెంచేలా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అభివృద్ధిలో కందనూలు జిల్లా ముందడుగు వేస్తోందన్నారు. గురువారం సాయంత్రం కలెక్టర్ చాంబర్లో తెలంగాణ దర్శన్‌లో భాగంగా 2024 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఏఎస్‌లు సలోని చబ్రా, హర్ష్ చౌదరి, కరోలియన్ చింగ్ తిన్నవి, కొయ్యడ ప్రణయ్‌కుమార్ కలెక్టర్‌తోపాటు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్‌లను కలిశారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐఏఎస్‌లు జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవన విధానం, విద్య, వైద్యం, ఆదాయ వనరుల నిర్వహణ, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో, పీహెచ్‌సీలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతువేదికలు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. పర్యటనలో ఎదురైన విషయాలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమగ్రంగా వివరించారు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, రైతు రుణమాఫీ, గిరిజన రైతులకు ప్రత్యేక పథకాల విధానం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వంటి అంశాలను స్పష్టంగా చెప్పారు. నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న చెంచు, గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన పథకాల గురించి అవగాహన కల్పించారు. చెంచులు వారి సంప్రదాయ జీవనశైలిని కొనసాగిస్తూనే ఆధునిక వసతులు అందుకునేలా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుందన్నారు. విద్య, ఆరోగ్యం, జీవనోపాధి రంగాల్లో సమగ్ర మద్దతు అందించేందుకు గిరిజన అభివృద్ధి సంస్థల ద్వారా పలు పథకాలు అమలవుతున్నాయన్నారు. ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, హాస్టళ్లు, పోషకాహారం వంటి వసతులు విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తేనె, వన ఉత్పత్తుల సేకరణకు ప్రోత్సాహం అందిస్తున్నామని పేర్కొన్నారు. పాడి పరిశ్రమ, చిరుధాన్యాల సాగు వంటి మార్గాలతో వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. -
శిథిలావస్థలోకి పాఠశాల..
మన్ననూర్: మన్ననూర్లోని గిరిజన ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంటోంది. ఇక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు గతంలో 200 మంది వరకు విధ్యార్థులు ఉండేవారు. పక్కనే గిరిజన హాస్టల్ ఉండేది. ప్రస్తుతం అదే హాస్టల్లో గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడంతో విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. తరగతి గదులు, నిర్వహణకు గాను మొత్తం 11 గదులు 7 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే విద్యార్థులకు తగిన విధంగా 2 గదులు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. 1 నుంచి 5వ తరగతి వరకు మొత్తం 40 మంది విద్యార్థులు కాగా గురువారం 14 మంది మాత్రమే పాఠశాలకు హాజరు కావడంతో అందరినీ ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధించడం గమనార్హం. -
ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి
కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వారి సమస్యలపై వస్తే వాటిని వెంటనే పరిష్కరించేలా అధికారులు చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కావడంతో విద్యుత్ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయని, విరిగిన స్తంభాలు, విద్యుత్ వైర్లలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని వెంటనే సరిచేయాలని సూచించారు. గ్రామాల్లో అధిక ఓల్టేజీ, వ్యవసాయ విద్యుత్‌లో అంతరాయాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రెవెన్యూ సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించాలని, కొత్త సమస్యలు రాకుండా అధికారుల పనితీరు ఉండాలని చెప్పారు. అనంతరం కల్వకుర్తి నుంచి తలకొండపల్లికి నూతన బస్సు సర్వీసును ప్రారంభించి, ఎమ్మెల్యే స్వయంగా బస్సును నడిపారు. సమావేశంలో పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
నేడు ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ సదస్సు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో శుక్రవారం ‘తెలంగాణ అర్బన్ స్టార్టప్ చాలెంజ్’ పేరిట ఒక రోజు సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వర్క్‌షాపును పరిశీలించేందుకు కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి మహబూబ్‌నగర్ రానున్నారు. ముఖ్యంగా నగరాలు, పట్టణ ప్రాంతాలలో మెరుగైన పారిశుద్ధ్యం, వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ, నీటి శుద్ధికి సంబంధించి నవీన పద్ధతులను అవలంబించే విధానాలపై చర్చించనున్నారు. దీనికి జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషన్లు, ఇంజినీర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తప్పక హాజరుకావాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. కాగా, ఈపాటికే ఈ సదస్సు నిర్వహణకు స్థానిక మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శిల్పారామంలోని స్టాల్స్‌తో పాటు ఓపెన్ ఎయిర్ థియేటర్, సమావేశ హాలు, ప్రాంగణం మొత్తం శుభ్రం చేయించారు. ముఖ్య అతిథిగా హాజరుకానున్నసీడీఎంఏ టీకే శ్రీదేవి పాల్గొననున్న రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లు -
రేపు బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కు ఎంపిక
నాగర్‌కర్నూల్: జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్‌కు సంబంధించి 2025– 26 సంవత్సరానికి గాను శనివారం 1, 5 తగరతులల్లో ప్రవేశాల కోసం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ఎంపికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు కలెక్టరేట్లోని ప్రజావాణి మందిరంలో లక్కీ డిప్ ద్వారా జిల్లా కమిటీ సమక్షంలో ఎంపికలు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఎంపిక ప్రక్రియకు హాజరుకావాలని కోరారు. 22న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు కల్వకుర్తి రూరల్: పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈ నెల 22న జిల్లా అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు విజయేందర్, స్వాములు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 6న హనుమకొండలో నిర్వహించే 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్స్ పోటీల కోసం ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10, 12, 14 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించి జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ‘శూన్యం’ పుస్తకావిష్కరణ కందనూలు: జిల్లాకేంద్రానికి చెందిన ఫిజిక్స్ అరుణ్‌కుమార్ రాసిన తొలి కవితా సంపుటి శూన్యం పుస్తకాన్ని గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌లో సామాజిక స్పృహ, శాసీ్త్రయతతో కూడిన పుస్తకాలు రాయాలన్నారు. కార్యక్రమంలో ముచ్చర్ల దినకర్, వనపట్ల సుబ్బయ్య, ఎదిరేపల్లి కాశన్న పాల్గొన్నారు. భూ భారతి దరఖాస్తుల విచారణ పూర్తిచేయాలి నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల ఫీల్డ్ విచారణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లోని వీసీ హాల్లో నూతన ఆర్ఓఆర్ చట్టం, భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై కలెక్టర్ అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులలో విచారణ పూర్తయిన వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డుల మంజూరు చేయాలని, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారిగా బూత్ స్థాయి అధికారుల నియామకం, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా చేయాలని సూచించారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ కందనూలు: రాష్ట్ర షెడ్డ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణకు ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్డ్యూల్డ్ అభివృద్ధి అధికారి రామ్‌లాల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025– 26 సంవత్సరానికి గాను సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు http://tsstudy circle.co.in లో శుక్రవారం నుంచి వచ్చేనెల 7 వరకు లాన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఆదాయం రూ.3 లక్షలకు మించకూడదన్నారు. వీరికి వచ్చే నెల 13న హైదరాబాద్, ఇతర సెంటర్లలో పరీక్ష ఉంటుందని, పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఉచిత శిక్షణకు ఎంపిక చేస్తారన్నారు. పూర్తి వివరాల కోసం 040– 23546552, 8121626423 నంబర్లను సంప్రదించాలని సూచించారు. కళాశాలకు షోకాజ్ నోటీసులు కందనూలు: అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న కొల్లాపూర్‌లోని ఎస్వీఎస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని డీఐఈఓ వెంకటరమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కళాశాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని సూచించారు. అనుమతి లేని కళాశాలలో ఎవరు కూడా అడ్మిషన్ తీసుకోవద్దని, ఎవరైనా అడ్మిషన్లు తీసుకుంటే వారే బాధ్యత వహించాలని హెచ్చరించారు. -
దోపిడీ చేస్తున్నాయి..
ప్రైవేటు విద్యాసంస్థలు ఐఐటీ, నీట్ పేరుతో తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత బోధించాల్సిన సబ్జెక్టులను ఇప్పుడు బోధిస్తూ.. ఒక్కో విద్యార్థి నుంచి రూ.20వేల నుంచి రూ. 30వేల వరకు వసూలు చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదు. – ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ నిబంధనలు పాటించాల్సిందే.. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించుకోవాలి. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – రమేశ్‌కుమార్, డీఈఓ, నాగర్‌కర్నూల్ ● -
నియోజకవర్గ కేంద్రాల్లో ఇదీ పరిస్థితి..
కొల్లాపూర్ పట్టణంలోని మూల వాగు వెంట వందల సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి. రెండున్నర దశాబ్దాల క్రితం నుంచి ఈ ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం చాలా మంది స్లాట్ బుక్ చేసుకున్నారు. కానీ మూలవాగు పరిసర ప్రాంతాల్లోని సర్వే నంబర్లు హైడ్రా పరిధిలో చేర్చారు. దీంతో వాగుకు వంద మీటర్ల దూరం వరకు గల ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టించుకోవడం లేదు. వాస్తవానికి డీటీసీపీ నిబంధనల ప్రకారం వాగులు, నాలాలు, కాల్వలకు బఫర్ జోన్ అంత దూరంలో ఉండదు. మూలవాగు విస్తీర్ణం రెవెన్యూ నక్ష ప్రకారం 12 ఫీట్ల నుంచి 28 ఫీట్ల వెడల్పులో మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం దీనికి 2 నుంచి 9 మీటర్లలోపు బఫర్ జోన్ ఉంటుంది. కానీ హైడ్రా యాక్ట్‌కు వీటిని అనుసంధానించడంతో ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ స్వీకరణ జరగడం లేదు. అదే విధంగా నాగర్‌కర్నూల్‌లోని సద్దల్సాబ్ వాగు, నాగనూలు వాగు, కల్వకుర్తిలోని ఎర్రకుంట సమీపంలో, అచ్చంపేటలోని మల్లంకుంట సమీపంలోని ప్లాట్లకు కూడా ఇదే సమస్య ఎదురవుతోంది. -
బోగస్ పత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు
నాగర్‌కర్నూల్: బోగస్ ధ్రువపత్రాలతో ఆస్పత్రులు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు తప్పవని కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతుల జారీపై బుధవారం కలెక్టరేట్లో వైద్యాధికారులు, ఆస్పత్రుల పర్యవేక్షకులు, ప్రోగ్రాం అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో 72 ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయని.. కొత్తగా అనుమతుల కోసం 21 ప్రతిపాదనలు వచ్చాయని కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 1994 చట్టం ప్రకారం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణలో ప్రభుత్వ నియమ, నిబంధనలు అనుసరించాలని సూచించారు. డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్ల నిర్వహణలో పారదర్శకత ఉండాలన్నారు. కొత్తగా అనుమతుల కోసం వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఆస్పత్రుల పూర్తి వివరాలను పరిశీలించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బయో మెడికల్ వేస్టేజ్ పద్ధతులు పాటించడం, ఆస్పత్రుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో అనుమతి కాలపరిమితి, తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రి, డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్లలో చికిత్స, వైద్య పరీక్షలకు విధించే రుసుమును ప్రదర్శించాలన్నారు. అర్హత కలిగిన వైద్యులు, స్పెషలిస్టులను మాత్రమే నియమించుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. కన్సల్టేషన్ వైద్యుడిని రప్పించి వైద్యం అందిస్తే అఫిడవిట్ దాఖలు చేయాలని.. స్కానింగ్ సెంటర్లలో పనిచేయని యంత్రాలు ఉంటే నివేదిక ఇవ్వాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రోగికి సంబంధించి శస్త్రచికిత్స వివరాలు, కేస్ షీట్ నివేదికలను మూడేళ్ల వరకు భద్రపరిచేలా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న 39 స్కానింగ్ సెంటర్లను ప్రతినెలా తనిఖీ చేయాలన్నారు. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడతానని, ప్రభుత్వ నిబంధనలు పాటించని వాటిపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రైవేటు ఆస్పత్రు ల అనుమతుల కమిటీ సభ్యులు అదనపు కలెక్టర్ దేవ సహాయం, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి, ప్రైవేటు ఆస్పత్రుల జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఇమ్యునైజేషన్ అధికారి రవికుమార్, సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారిణి రాజేశ్వరి, బాలికా విద్యాభివృద్ధి అధికారిణి శోభారాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్ ఉన్నారు. 2,14,347 మందికి రూ.175.93 కోట్ల పెట్టుబడి సాయం అన్నదాతలకు బాసటగా నిలవాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సాగుకు ముందే రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందిస్తుందని.. ఈ పథకంతో జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తోందని కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2025–26 వానాకాలం సీజన్‌కు సంబంధించి బుధవారం నాటికి 2,14,347, మంది రైతుల ఖాతాల్లో రూ. 175,93,75,635 నిధులు జమ చేసినట్లు వివరించారు. మొత్తం 3,34,835 మంది రైతులకు రూ.429 కోట్ల పెట్టుబడి సాయం అందించనున్నట్లు వెల్లడించారు. రైతుల బ్యాంక్ ఖాతా వివరాలను ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుభరోసా పోర్టల్‌లో నమోదు చేశారన్నారు. వారం రోజుల్లో వ్యవసాయ భూమి కలిగిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.6వేల చొప్పున చెల్లించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన వారు ఈ నెల 20వ తేదీలోగా రైతుభరోసా పథకంలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. డయాగ్నొస్టిక్, స్కానింగ్ సెంటర్లనిర్వహణలో పారదర్శకత పాటించాలి కలెక్టర్ బదావత్ సంతోష్ -
ఎఫ్‌సీ లేని 30 స్కూల్ బస్సులు సీజ్
పాలమూరు: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 12 నుంచి జిల్లాలో అన్ని రకాల పాఠశాలలు పునఃప్రారంభం అయిన క్రమంలో ఉమ్మడి జిల్లాలో 1,429 స్కూల్ బస్సులు ఉంటే ఇప్పటి వరకు 1,066 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోగా ఇంకా 363 బస్సులకు పరీక్షలు పూర్తి కాలేదు. దీంతో ఎంవీఐల ఆధ్వర్యంలో ఉదయం, సాయంత్రం వేళలలో రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా ఉమ్మడి జిల్లాలో 30 స్కూల్ బస్సులు సీజ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం ఉదయం, సాయంత్రం ఆర్టీఏ అధికారులు ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి స్కూల్ బస్సుకు సంబంధించి ఎఫ్‌సీ (ఫిట్నెస్ సర్టిఫికెట) కచ్చితంగా ఉండాలని, లేకుండా రోడ్లపై తిరిగితే సీజ్ చేస్తామని డీటీసీ కిషన్ హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న తనిఖీలు -
బఫర్ జోన్ హద్దులు ఏర్పాటుచేయాలి..
కొల్లాపూర్‌లోని మూలవాగు సమీపంలో నేను పదేళ్ల క్రితం ప్లాటు కొనుగోలు చేశాను. వాగుకు దూరంగా ప్లాటు ఉంది. ఎల్ఆర్ఎస్ చెల్లింపు కోసం స్లాట్ బుక్ చేసుకున్నా. కానీ ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ స్వీకరించడం లేదు. అధికారులు వాగుకు బఫర్‌జోన్ హద్దులు ఏర్పాటుచేసి, ఆన్లైన్లో పెడితే ఎల్ఆర్ఎస్ తీసుకుంటారని చెబుతున్నారు. అధికారులు త్వరగా స్పందించి హద్దులు ఏర్పాటుచేయాలి. – బాలకృష్ణ, కొల్లాపూర్ సమస్య మా దృష్టికి వచ్చింది.. వాగుల సమీపంలోని ప్లాట్లకు బఫర్ జోన్లు ఏర్పాటు చేయక పోవడం వల్ల ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ స్వీకరణ జరగడం లేదు. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు వివరించాం. బఫర్‌జోన్ నిర్ణయం బాధ్యత రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలది. వారు హద్దులు నిర్ణయిస్తే మేము ఆన్లైన్లో ఓకే చేస్తాం. ఈ అంశంపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుతాం. – శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, కొల్లాపూర్ ● -
నిలువు దోపిడీ
● ప్రైవేటు పాఠశాలల్లో తడిసి మోపెడవుతున్న ఫీజులు ● ఐఐటీ, నీట్ ఫౌండేషన్ పేరుతో అదనపు వసూళ్లు ● బడుల్లోనే పుస్తకాలు, యూనిఫామ్స్ విక్రయాలు ● చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/అచ్చంపేట: తమ పిల్లలను ఉన్నతంగా ప్రైవేటు బడుల్లో చదివించాలన్న తల్లిదండ్రుల ఆశ కొన్ని ప్రైవేటు పాఠశాలలకు కాసుల పంట పండిస్తోంది. విద్యాశాఖ అధికారుల వైఫల్యం, తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు విద్యాసంస్థలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. ఫీజుల నియంత్రణ లేకపోవడంతో ఎల్కేజీ విద్యార్థికి సైతం రూ.వేలల్లో వసూలు చేసే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ల పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. బస్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెట్టు అంటూ ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నియంత్రించాల్సిన విద్యాశాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోటీ పడి మరీ.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,350 ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. 1.90 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరం పలు కొత్త ప్రైవేటు స్కూల్స్ ఏర్పాటు కావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఫీజులు పెద్దఎత్తున పెరిగిపోయాయి. అడ్మిషన్ ఫీజుతో మొదలుకొని అనేక రకాలుగా దోచుకుంటున్నారు. ఎల్కేజీ విద్యార్థికి దాదాపుగా రూ.20 వేలు.. 2, 3 తరగతుల వారికి రూ.20 వేల నుంచి రూ. 30 వేల వరకు.. 9, 10 తరగతుల వారికి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికి తోడు ఐఐటీ, నీట్ ఫౌండేషన్ కోర్సులంటూ రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. మరోవైపు పాఠశాలల్లోనే పుస్తకాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొన్ని పాఠశాలలు యూనిఫామ్స్ సైతం విక్రయిస్తుండగా.. మరికొన్ని పలు గార్మెంట్ సంస్థలతో ఒప్పందం ప్రకారం యూనిఫామ్స్ విక్రయాలు సాగిస్తున్నారు. కనీస సౌకర్యాలు కరువు.. పాఠశాల తరగతి గదుల్లో వెలుతురు, గాలితో పాటు శుభ్రత ఉండాలి. అయితే ఉమ్మడి జిల్లాలోని చాలా పాఠశాలల్లో రేకుల షెడ్లే తరగతి గదులుగా కొనసాగుతున్నాయి. వెలుతురు లేకపోగా.. ఫ్యాన్లు కూడా సక్రమంగా తిరగని పరిస్థితి ఉంది. మెజార్టీ పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు. పిల్లలను ఉదయం 9నుంచి సాయంత్రం వరకు పాఠశాల గదుల్లో యాజమాన్యాలు బంధిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో మానసిక వికాసం తగ్గిపోతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. పేరుకే పేరెంట్స్ కమిటీలు.. ప్రతి పాఠశాలకు ఒక పేరెంట్స్ కమిటీ ఉండాలి. పాఠశాల యాజమాన్యాలు మాత్రం వారికి అనుకూలమైన వారిని పెట్టుకొని పేరెంట్స్ కమిటీలను కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. చాలా పాఠశాలలు ఈ కమిటీలను కూడా వేయడం లేదు. ఫీ‘జులుం’ సొంత సిలబస్ బోధన.. అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం సూచించిన సిలబస్ మాత్రమే బోధించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు స్టేట్ సిలబస్‌ను పక్కన పెట్టి.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సొంత సిలబస్ బోధిస్తున్నారని తెలుస్తోంది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి వాటికి ప్రభుత్వం ఇప్పటికీ సిలబస్‌ను సూచించలేదు. కానీ వారికి కూడా ప్రైవేటు పబ్లికేషన్స్‌లో సిలబస్ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. ప్రైవేటు కరికులమ్‌కు ఒక్కో విద్యార్థికి రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ సిలబస్ పుస్తకాలను విక్రయిస్తే రూ.500 నుంచి రూ.1000 మాత్రమే ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. తాత్కాలిక బుక్ సెంటర్లు ఏర్పాటు.. కొంత మంది వివిధ బుక్ సెంటర్లలో పుస్తకాలను పెట్టి అమ్ముతుండగా.. మరికొంత మంది బయట తాత్కాలిక షాప్‌లు ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు ప్రైవేటు పబ్లికేషన్స్‌కు సంబంధించిన మెటీరియల్స్ సరఫరా చేసేందుకు మహబూబ్‌నగర్‌లోని షాషాబ్‌గుట్ట సమీపంలో గోదాం ఏర్పాటు చేయడం గమనార్హం. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో చదువు మరింత ఖరీదవుతోంది. సర్కారు బడులను కాదని అక్కడ చేర్పించే పిల్లలకు చెల్లించే ఫీజులు తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారుతోంది. ప్రతి ఏటా పెరుగుతున్న ఫీజులతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. -
రైతులకు విద్యుత్ సమస్యలు ఉండొద్దు
కొల్లాపూర్: రైతులకు విద్యుత్ సమస్య తలెత్తకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లో విద్యుత్‌శాఖ అధికారులతో మంత్రి సమావేశమై.. కొల్లాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విద్యుత్ కనెక్షన్లు, స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఆయా సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కరెంటు సౌకర్యం కల్పించాలన్నారు. లోఓల్టేజీ సమస్య ఏర్పడకుండా అవసరమైన మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, కొల్లాపూర్‌లోని వంద పడకల ఆస్పత్రిలో తరచూ విద్యుత్ సమస్యలు ఎదురవుతుండటంతో డయాలసిస్ పేషెంట్లు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి అధికారుల దృష్టికి తెచ్చారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. మల్లేశ్వరంలో కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటుచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖ్ అలీ తదితరులు ఉన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
బఫర్.. సఫర్!
కొల్లాపూర్: జిల్లాలోని వాగులు, నాలాల వెంట బఫర్ జోన్లు ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఫలితంగా వాటి సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు క్రమబద్ధీకరణకు నోచుకోవడం లేదు. ప్రధానంగా పట్టణ కేంద్రాల్లో వాగులు, కాల్వల సమీపంలో దశాబ్దాల క్రితం స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు అనుమతులు ఇచ్చినా.. బఫర్ జోన్ల నిర్ధారణ చేపట్టక పోవడంతో ప్లాట్ల క్రమబద్ధీకరణలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. వందల సంఖ్యలో.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గ కేంద్రాలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీలతో పాటు మండల కేంద్రాల్లో వాగులు, చిన్నపాటి కాల్వలను అనుసరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటుచేశారు. వీటిలో వందల సంఖ్యలో ప్రజలు ప్లాట్లు కొనుగోలుచేసి.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. గత ప్రభుత్వం డీటీసీపీ లే అవుట్లు లేని వెంచర్లలో కొనుగోలుచేసిన ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్కు శ్రీకారం చుట్టింది. ముందుగా ప్లాటుకు రూ.వెయ్యి చొప్పున, వెంచర్‌కు రూ. 10వేల చొప్పున ఆన్లైన్లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో వేలాది మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వివిధ కారణాలతో దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్పై ప్రత్యేక దృష్టి సారించి.. ఫీజు చెల్లింపులో రాయితీ సౌకర్యం కల్పించింది. అయితే మున్సిపాలిటీల్లో ప్రధాన కాల్వలు, నాలాలు, వాగుల వెంట నిబంధనల పేరుతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపును సాంకేతికంగా నిలిపివేయడంతో.. ఆయా ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. హద్దులు నిర్ణయిస్తే ప్రభుత్వానికి ఆదాయం.. పట్టణ కేంద్రాల సమీపంలో ఉండే వాగులు, నాలాలు, కాల్వలకు బఫర్ జోన్లు నిర్ణయించే బాధ్యతను ప్రభుత్వం మూడు శాఖలకు అప్పగించింది. రెవెన్యూ అధికారులు నక్ష ప్రకారం నీరు ప్రవహించే ప్రాంతాలకు హద్దులు ఏర్పాటుచేసి.. వాటిని ఆన్లైన్లో పొందుపర్చాలి. ఆ తర్వాత నీటిపారుదల శాఖ అధికారులు రెవెన్యూ శాఖ ఏర్పాటుచేసిన హద్దు నుంచి నిర్ణీత కొలతల ప్రకారం బఫర్ జోన్ నిర్ణయిస్తారు. దీన్ని కూడా ఆన్లైన్లో నమోదు చేయాలి. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు నిర్ణయించిన హద్దులకు వెలుపల ఉన్న ప్లాట్లను మున్సిపల్ లాగిన్‌లో ఎల్ఆర్ఎస్ ఫీజు స్వీకరణకు కమిషనర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ప్లాట్ల కొనుగోలు దారులు ఇబ్బందులు పడుతున్నారు. బఫర్ జోన్లు నిర్ణయిస్తే వందలాది సంఖ్యలో ప్లాట్ల వినియోగదారులు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులకు సిద్ధంగా ఉన్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరుతుంది. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపులోసాంకేతిక సమస్యలు వాగులు, నాలాల సమీపాన బఫర్ జోన్ల గుర్తింపులో అధికారుల నిర్లక్ష్యం మున్సిపాలిటీల్లో క్రమబద్ధీకరణకు నోచుకోని ప్లాట్లు జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
అచ్చంపేట రూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో వైద్య సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. క్షేత్రస్థాయి సిబ్బంది గతేడాది ఎక్కువగా డెంగీ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు నమోదైన గ్రామాలు, పట్టణాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. దోమకాటు వ్యాధులైన డెంగీ, మలేరియా, చికెన్ గున్యా రాకుండా ప్రతి శుక్రవారం పొడి దినం (డ్రై డే) పాటించాలన్నారు. దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు ఇనుప జాలీలను బిగించుకోవాలని, దోమతెరలు వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి ఆవరణ, పరిసరాలల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్, గాజు సీసాలు, డిస్పోజబుల్ కప్పులు, కొబ్బరి చిప్పలు తమ ఇంటి ఆవరణలో లేకుండా చూసుకునే విధంగా ప్రజలకు సూచించాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని, అనుమానం ఉన్నవారి రక్త నమూనాలను టీ–డయాగ్నోస్టిక్ హబ్‌కు ప్రతినిత్యం పంపాలన్నారు. గాలి ద్వారా వ్యాపించే స్వైన్‌ఫ్లూ, కోవిడ్–19 నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తారాసింగ్, ప్రోగ్రాం అధికారి రాజశేఖర్, డాక్టర్ రవికుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మరో అవకాశం..
నాగర్‌కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు సాయం కింద పెట్టుబడి కోసం అందించే సాయానికి కొత్త వారికి అవకాశం కల్పించనుంది. కొత్తవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు నిర్ణయించింది. ఇప్పటికే 2025 వానాకాలానికి సంబంధించి రైతు భరోసా నిధులు రైతు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొమ్మిది రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా వేసేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వారికి అవకాశం కల్పిస్తుండడం రైతులకు కొంత ఊరటనిచ్చే అంశమే. పెరుగుతున్న సాగు విస్తీర్ణం.. జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం రోజురోజుకూ పెరుగుతోంది. కాగా రైతులకు పెట్టుబడికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు భరోసా పేరుతో రైతుఖాతాలో ఎకరాకు రూ.6 వేల చొప్పు న జమ చేయనుంది. జిల్లాలో మొత్తం 3,34,835 మంది రైతులు రైతు భరోసాకు అర్హత పొందినవా రు ఉండగా.. కొత్తవారికి అవకాశం ఇస్తుండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. జూన్ 5 వరకు నూతన పాస్‌బుక్కులు మంజూరైన రైతులకు కూడా రైతు భరోసాకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ నెల 20 వరకు సంబంధిత ఏఈఓల వద్ద రైతులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నూతన పాస్‌బుక్కులు పొందిన రైతులు జిల్లాలో 6,648 మంది ఉండగా అందులో మంగళవారం వరకు దాదాపుగా 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో రెండు రోజుల్లో ఈ ప్రక్రియను అధికారులు పూర్తి చేయనున్నారు. అనంతరం రైతు ఖాతాల్లో భరోసా నిధులు ప్రభుత్వం జమ చేయనుంది. దరఖాస్తు ఇలా... కొత్తగా రైతుభరోసా కోసం దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 20 (శుక్రవారం)లోగా గ్రామంలోని వ్యవసాయ విస్తరణాధికారికి దరఖాస్తు అందజేయాలి. పట్టాదార్ పాసు పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయిన జిరాక్స్, ఆధార్, బ్యాంకు ఖాతా అందజేయాలి. దీంతోపాటు పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారం ఏఈఓకు అందించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ నెల 5 వరకు భూ భారతిలో నమోదైన రైతుల వివరాలను రైతుభరోసా పోర్టల్‌లో పొందుపరిచారు. రైతుభరోసా కోసం దరఖాస్తుల స్వీకరణ మరో రెండురోజుల వరకు చివరి గడువు ఈ నెల 5 నాటికి పాస్‌బుక్కులు పొందినవారు అర్హులు -
విద్యార్థుల సంఖ్య పెంచాలి
తెలకపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి నాణ్యమైన విద్య అందించాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండలంలోని కార్వంగ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో నమోదైన విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. తరగతికి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. గతేడాది కంటే విద్యార్థుల సంఖ్య తగ్గకూడదని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 8 మంది విద్యార్థులను చేర్పించడంతో ఉపాధ్యాయులను అభినందించారు. డయాలసిస్ సేవలువినియోగించుకోవాలి నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని కిడ్నీ వ్యాధిగ్రస్తులు జనరల్ ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ సేవలు వినియోగించుకోవాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ రఘు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ ఆస్పత్రిలో కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ సేవలు ప్రస్తుతం 46 మంది వినియోగించుకుంటున్నారని, ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మూడు విడతల్లో డయాలసిస్ ఆరోగ్య సేవలు చేస్తున్నామన్నారు. ఇంకా ఖాళీగా ఉన్న పది మంది రోగులకు సేవలు అందించడానికి అవకాశం ఉందన్నారు. హెపటైటిస్ సీ పాజిటివ్ ఉన్న రోగులు కూడా ఈ సేవలు పొందవచ్చన్నారు. డయాలసిస్ ఆరోగ్య సేవల కోసం నేరుగా జనరల్ ఆస్పత్రిలో అన్ని రకాల రిపోర్టులు, ఆధార్, రేషన్, ఇతర ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతో సంప్రదించాలన్నారు. పూర్తి వివరాల కోసం డయాలసిస్ ఇన్చార్జ్ వినోద్ కుమార్ (81858 08145), హెల్ప్ డెస్క్ ఇన్చార్జ్ యాదగిరి (90149 32408)లను సంప్రదించాలని సూచించారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పీయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రవీణ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో ఆమె ఎన్ఎస్ఎస్ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. యోగా దినోత్సవం రోజు నిర్వహించే అంతర్జాతీయ వెబినార్‌లో పెద్ద ఎత్తున ఎన్ఎస్ఎస్ వలంటీర్లు భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. యోగా ప్రాధాన్యత, ఆరోగ్యం తదితర వివరాలను విద్యార్థులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో అర్జున్‌కుమార్, రవికుమార్, రాఘవేందర్, శివకుమార్, గాలెన్న, ఈశ్వర్, చిన్నదేవి తదితరులు పాల్గొన్నారు. రేపు జూనియర్ ఫుట్‌బాల్ జట్టు ఎంపిక మహబూబ్‌నగర్ క్రీడలు: నిజామాబాద్‌లో ఈనెల 28 నుంచి జూలై 1 వరకు జరిగే రాష్ట్రస్థాయి బాలుర జూనియర్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో పాల్గొనే జిల్లా జట్టు ఎంపికలను ఈనెల 19న ఉదయం 8 గంటలకు స్థానిక మెయిన్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.భానుకిరణ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలో వనపర్తి జిల్లా మినహా పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా క్రీడాకారులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలతో రావాలని కోరా రు. మిగతా వివరాల కోసం 93964 39663 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. -
దరఖాస్తు చేసుకోండి
కొత్తగా రైతుభరోసా కోసం అర్హులైన వారు శుక్రవారంలోగా దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో కొత్తగా నమోదు చేసుకోవాల్సిన వారు 6,648 మంది రైతులు ఉండగా.. ఇప్పటి వరకు 4 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఇతర గ్రామాలకు వెళ్లి అందుబాటులో లేని వారికి ఫోన్లో సమాచారం ఇస్తున్నాం. రెండు రోజుల్లో వంద శాతం నమోదు పూర్తి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి ● -
వంద పాఠశాలల్లో మాత్రమే..
జిల్లాలో మన ఊరు– మనబడి కింద 290 పాఠశాలలకు నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు వంద పాఠశాలల్లో మాత్రమే వివిధ రకాల పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. 172 పాఠశాలల్లో నత్తనడకన సాగుతుండగా 18 చోట్ల ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ నియోజకవర్గాల్లోని పలు పాఠశాలల్లో ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో పనులు చేపట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నెల 12న పాఠశాలలు తెరిచే వరకు పనులు పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఆదేశించినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. పాఠశాలల్లో వంట గదుల నిర్మాణం, తాగునీటి వసతి, విద్యుత్, టేబుళ్లు, పాఠశాలలకు రంగులు, గ్రీన్ బోర్డు, తరగతి గదుల మరమ్మతు, అదనపు గదుల నిర్మాణం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీలు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఈ పనులను విద్యాశాఖ అధికారులు పర్యవేక్షించాలి. -
మూడేళ్లుగా నత్తనడకన
అచ్చంపేట: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు గత ప్రభుత్వం ‘మన ఊరు– మన బడి’ పథకం అమలు చేయగా.. కొన్నిచోట్ల పూర్తి కాగా.. మరికొన్నిచోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. ఆయా పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ఆ పథకానికి నిధులు రాక ఇక్కట్లు తప్పడం లేదు. ఆయా పనులకు సంబంధించి జిల్లాకు రూ.86 కోట్ల నిధులు మంజూరు కాగా కాంట్రాక్టర్లకు రూ.18.32 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.11 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 2024– 25 విద్యా సంవత్సరంలో రూ.లక్షలు ఖర్చు చేసి పలు పాఠశాలల్లో మరమ్మతు చేపట్టినా.. మన ఊరు– మనబడి పనులను త్వరగా పూర్తిచేయడానికి అధికారులు చొరవ తీసుకోవడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు సకాలంలో పూర్తి చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభం కాలే.. అచ్చంపేట మండలంలోని రంగాపూర్ ప్రాథమిక పాఠశాల, ఉప్పునుంతల జెడ్పీహెచ్ఎస్, మామిళ్లపల్లి, లక్ష్మాపూర్, వంగూరు మండలం రంగాపూర్ జెడ్పీహచ్ఎస్, బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్, పాలెం, కల్వకుర్తిలోని బాలికల ఉన్నత పాఠశాల, కోడేరు మండలం రాజాపూర్ పీఎస్, తెలకపల్లి మండలంలోని లక్నారం, గౌరెడ్డిపల్లి, కార్వంగ, నాగర్‌కర్నూల్ జెడ్పీహెచ్ఎస్ బాలుర, బాలికలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొల్లాపూర్ బాలికలు, గాంధీ మెమోరియల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను మనబడి పథకం కింద ఎంపిక చేసినా.. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదనపు గదుల కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. పర్యవేక్షిస్తున్నాం.. జిల్లాలో మన ఊరు– మన బడి పనులను పర్యవేక్షిస్తున్నాం. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటాం. పెండింగ్ బిల్లుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ విద్యా సంవత్సరం మొదటి, రెండు నెలల్లో పనులు పూర్తి చేయించి విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – నూరుద్దీన్, విద్యా శాఖ సెక్టోరియల్ అధికారి జిల్లాలో అసంపూర్తిగా ‘మన ఊరు– మనబడి’ పనులు బిల్లులు రాక చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు కొన్నిచోట్ల శిథిల భవనాలను కూల్చివేసి వదిలేసిన వైనం అదనపు గదులు, భోజనశాలలు,మూత్రశాలల పూర్తిపై నీలినీడలు అరకొర భవనాల్లో కష్టతరంగా మారిన విద్యాబోధన -
మన పాలమూరు ఫస్్ట..
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు.. నాకు జన్మనిచ్చిన జిల్లా. మక్తల్ నుంచి ఇక్కడకు కాళ్లతో తిర్లాడిన.. సైకిల్‌పై తిర్లాడిన.. ఆ తర్వాత బండిపై తిర్లాడిన. ఇప్పుడు మంత్రిగా ఇక్కడికి రావడం చెప్పలేని ఆనందంగా ఉంది.’ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్స, పాడి అభివృద్ధి, క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం ఆయన తొలిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’ ఆయనతో ముచ్చటించగా.. పలు విషయాలు వెల్లడించారు. తన రాజకీయ జీవితం, పలు పరిణామాలతో పాటు 1991లో ఆదర్శ కళాశాలలో ఇంటర్ చదువుకునే రోజులను గుర్తు చేసుకున్నారు. వెనుకబడిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలిపేలా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. మంత్రి ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. నాపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ఇతర జిల్లాల్లో మంత్రి పదవులకు పోటీ ఉంది. కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన అందరు ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో నన్ను మంత్రిగా చేయాలని కోరారు. పాలమూరు బిడ్డ అయిన సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఎమ్మెల్యేలు ఏ లక్ష్యంతోనైతే నాకు మంత్రిగా బాధ్యత కట్ట్టబెట్టారో.. అందుకనుగుణంగా నా విధులు నిర్వర్తిస్తా. వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పాలమూరు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషిచేస్తా. -
చెంచుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక
మన్ననూర్: అత్యంత పేదరికంలో ఉన్న చెంచు కుటుంబాలను గుర్తించి వారి అభివృద్ధి కోసం రెండేళ్లలో పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందిస్తామని ప్రపంచ అభివృద్ధి సంస్థ, పేదరిక నిర్మూలన సాధికారత మిషన్ సభ్యులు స్మృతి శరణ్ అన్నారు. మంగళవారం అమ్రాబాద్ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సరస్వతి అధ్యక్షతన మన్ననూర్లోని రైతువేదికలో పదర, అమ్రాబాద్ మండలంలోని మహిళా సమాఖ్య సభ్యులు, చెంచు సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆయా మండలాల్లోని 15 గ్రామాల్లో చేపట్టిన అత్యంత పేదరికంతో బాధపడుతున్న 440 కుటుంబాలను గుర్తించామన్నారు. ఈ క్రమంలో నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను నిజమైన లబ్ధిదారునికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెర్ఫ్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ సమాజం గురించి తెలియని చెంచుల వద్దకు అధికారులు వెళ్లి వారికి కావాల్సిన సౌకర్యాలు, వసతులను సమకూర్చాలన్నారు. అటవీ ఉత్పత్తులలో ప్రధానమైన తేనె సేకరణకు ప్రోత్సాహం అందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా గుర్తించిన నిరుపేద కుటుంబాలను కొంత కాలంపాటు వారి స్థితిగతులు, అలవాట్లు గమనించాలన్నారు. ఇప్పటి వరకు మల్లాపూర్, చౌటగూడెం గ్రామాల్లో గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రేషన్ కార్డులు, ఉపాధి కూలీగా గుర్తించే కార్డులను తక్షణమే వారి పేరిట దరఖాస్తు చేసి కార్డులు ఇంపించాలని ఆర్డీఓ మాధవి, పౌర సంబంధాల శాఖ అధికారులకు సూచించారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయం, వెటర్నరీ, ఉపాధి తదితర శాఖల జిల్లా అధికారులు ఈ ప్రక్రియలో భాగస్వాములై పథకం విజయవంతం కోసం కృషిచేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు రూ.కోట్లు వెచ్చిస్తున్నా చెంచుల స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదని బిల్లకల్లు గ్రామానికి చెందిన సైదమ్మ అభిప్రాయపడింది. ప్రభుత్వం నుంచి అందించే పథకాలు, లబ్ధి నేరుగా చెంచులకే అందిస్తే ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రపంచ అభివృద్ధి సంస్థ సభ్యులు ఉషారాణి, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, అదనపు కలెక్టర్ దేవసహాయం, సెర్ప్ అధికారి జయరాం, డీఆర్డీఓ చిన్న ఓబులేసు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, డీఎండీహెచ్‌ఓ రాజ్యలక్ష్మి, అమ్రాబాద్ మండల ప్రత్యేకాధికారి రజని, తహసీల్దార్ శైలేంద్రకుమార్, ఎంపీడీఓ లింగయ్య, వీఆర్ఓ భీముడు పాల్గొన్నారు. -
అసమగ్ర ఐటీడీఏ
నాగర్కర్నూల్సిబ్బంది, నిధులకు నోచుకోని గిరిజనాభివృద్ధి సంస్థ మంగళవారం శ్రీ 17 శ్రీ జూన్ శ్రీ 2025వివరాలు 8లో u●ప్రభుత్వానికి ప్రతిపాదించాం.. మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ రెగ్యులర్ పీఓ, ఇతర సిబ్బంది నియామకం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. ప్రస్తుతం పీఎం జన్మన్ కింద చెంచుల్లోని ప్రతి ఒక్కరికి అవసరమైన పత్రాలను అందించేందుకు కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా వైద్యసేవలు ప్రారంభించాం. – రోహిత్ గోపిడి, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ, మన్ననూర్ ● ఒకే ఒక్క ఉద్యోగితో కొనసాగుతున్న మన్ననూరు కార్యాలయం ● ఏళ్లతరబడిగా ఇన్చార్జ్ పీఓతోనే నెట్టుకొస్తున్న వైనం ● అగమ్యగోచరంగా చెంచులు, గిరిజనుల జీవనం ● నల్లమలలోని అడవి బిడ్డలకు అందని ఆర్థిక ప్రోత్సాహకాలు నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన మన్ననూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ నిధులు, సిబ్బంది లేక నామమాత్రంగా తయారైంది. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజన జాతులు (పర్టిక్యూలర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్– పీవీటీజీ), చెంచులు, గిరిజనుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏ ప్రాజెక్ట్‌లో దశాబ్ద కాలంగా రెగ్యులర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ) లేకపోవడం ఇక్కడి గిరిజనుల పాలిటశాపంగా మారింది. అత్యంత కీలకమైన పీఓ పోస్టు ఖాళీగా ఉండటం, ఏళ్లుగా ఇన్‌చార్జ్‌తోనే నెట్టుకొస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ కింద కార్యకలాపాలు మందగించాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా జిల్లాలో ఇందిరా సౌర జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద చెంచులకు ఉచితంగా సోలార్ బోర్ ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలు కావాలన్నా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం చేపడితేనే అది సాధ్యమవుతోంది. ఏళ్లుగా ఒక్కరే దిక్కు.. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ సున్నిపెంట (శ్రీశైలం) పరిధిలో కార్యకలాపాలు కొనసాగగా.. 2014లో రాష్ట్ర విభజన అనంతరం నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్‌లో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఏర్పాటైంది. అయితే గడిచిన 11 ఏళ్లుగా ప్రభుత్వం రెగ్యులర్ పీఓను మాత్రం నియమించలేదు. ప్రాజెక్ట్ అధికారిగా ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాల్సి ఉండగా, ఇన్నేళ్లుగా తాత్కాలికంగా, జిల్లాస్థాయి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నెట్టుకొస్తోంది. పీఓతోపాటు కార్యాలయంలో వివిధ విభాగాలకు అధికారులు, కార్యాలయ నిర్వహణకు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు తదితర పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా, కేవలం సీనియ ర్ అసిస్టెంట్ స్థాయిలో ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా ఏ ఒక్క అధికారి కూడా లేకపోవడంతో ఐటీడీఏ ప్రాజెక్ట్ నామమాత్రంగా మారింది. పీఎం జన్మన్కే పరిమితం.. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న గిరిజనులు (పీవీటీజీ) గ్రూప్‌నకు చెందిన చెంచులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందించేందుకు వీలుగా పీఎం జన్మన్ కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్, జాతీయ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ప్రయోజనాలను పొందేందుకు అవసరమైన ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, జన్ ధన్ బ్యాంకు ఖాతా వంటి మౌలికమైన పత్రాలను ప్రతి ఒక్క చెంచు వ్యక్తికి అందించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా శిబిరాలను నిర్వహించి అవసరమైన పత్రాలను అధికారులు అందజేస్తారు. ఈ కార్యక్రమం మినహా గిరిజనుల కోసం ఉద్దేశించిన ఇతర ఏ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. చెంచు పెంటల సంఖ్య 150 మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి జిల్లాలు 3 (మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ) చెంచులు ఉండే మండలాలు 25 చెంచుల జనాభా (సుమారు) 18,000 గతమెంతో ఘనం.. గతంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ కార్యాలయం మినీ కలెక్టరేట్‌ను తలపించేంది. సున్నిపెంట కేంద్రంగా ఉన్నప్పుడు వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కళకళలాడింది. ఐటీడీఏ పీఓతోపాటు గిరిజన, వ్యవసాయ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఉపాధి హామీ, విద్యుత్ తదితర శాఖల అధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండేవారు. చెంచులు, గిరిజనుల ఆర్థికాభివృద్ధి, సాధికారత కోసం ఎకనామిక్ సపోర్ట్ స్కీం అమలు చేసేవారు. కానీ, నాలుగేళ్లుగా ఐటీడీఏ ప్రాజెక్ట్‌కు ఎలాంటి నిధులు రావడం లేదని అధికారులు చెబుతున్నారు. రెగ్యులర్ పీఓ సహా ఇతర అధికారులు ఎవరూ లేక, సిబ్బంది లేకపోవడంతో చెంచులు, గిరిజనులు సైతం కార్యాలయానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో నల్లమల లోతట్టు ప్రాంతాల్లోని చెంచులు ప్రభుత్వ పథకాలు, ఆర్థిక ప్రోత్సాహకాలకు నోచుకోలేకపోతున్నారు. వారి జీవనోపాధికి ఉపకరించే పథకాలు, కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం, ఉపాధి హామీ పనులు, అంగన్వాడీ సరుకులపై మాత్రమే చెంచులు ఆధారపడి జీవించాల్సి వస్తోంది. చెంచుల ఉపాధి, జీవనాభివృద్ధి కోసం ఉద్దేశించిన గిరివికాసం, ఈఎస్ఎస్, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల సేకరణ తదితర పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. చెంచులు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) నిస్సహాయత చాటుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సంబంధించి మన్ననూరులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కనీసం పూర్తిస్థాయి పీఓకు నోచుకోలేకపోతోంది. దీనికితోడు నిధులు కేటాయించక, ఇతర సిబ్బందిని నియమించకపోవడంతో సదరు కార్యాలయం ఒకేఒక్క ఉద్యోగితో నెట్టుకొస్తోంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య సాగుతున్న ఐటీడీఏ ఇక చెంచు, గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఏమాత్రం తోడ్పాటునందిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. – సాక్షి, నాగర్‌కర్నూల్ -
రైతుకు ‘భరోసా’
రైతుల ఖాతాల్లో నిధుల జమ ●జాబితా సిద్ధం చేశాం.. జిల్లాలో రైతు భరోసాకు సంబంధించి అర్హుల జాబితా రాష్ట్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించిన నిధులు విడుదల చేయడం జరిగింది. సోమవారం సాయంత్రం నుంచే కొంత మంది రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ అయ్యాయి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి డబ్బులు జమయ్యాయి.. ప్రస్తుత వానాకాలం సీజన్లో వ్యవసాయ పెట్టుబడి పెట్టే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా డబ్బులు జమచేయడం సంతోషంగా ఉంది. ఈ పథకం ద్వారా నాకున్న ఎకరా పొలానికి గాను రూ.6 వేలు బ్యాంకు ఖాతాలో సోమవారం రాత్రి జమయ్యాయి. – చంద్రశేఖర్, రైతు, జూపల్లి, చారకొండ మండలం ఆసరా అవుతాయి.. నాకు ఎకరా 18 గుంటల వ్యవసాయ పొలం ఉంది. ఆ పొలంలో వరి పంట సాగు చేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. నా బ్యాంకు ఖాతాలో రూ.8,700 జమైనట్లు మెసేజ్ వచ్చింది. ఈ నిధులు నాకు ఎంతో ఆసరా అవుతాయి. రైతు భరోసా నిధులు రావడం సంతోషంగా ఉంది. – ఖాజామైనొద్దీన్, రైతు, మార్చాల, కల్వకుర్తి మండలం నాగర్‌కర్నూల్: వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాగు ఖర్చుల నిమిత్తం అందించే రైతు భరోసా నిధుల కోసం జిల్లాలో రైతుల జాబితాను ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం లాంఛనంగా నిధులు విడుదల చేయడంతో మంగళవారం నుంచి రైతు ఖాతాల్లో జమ కానున్నాయి. వానాకాలం పనులు కొనసాగుతున్న ఈ సమయంలో రైతులకు భరోసా నిధులు జమ కానుండటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తొమ్మిది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ వానాకాలానికి పూర్తిస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు భరోసా నిధులు అందుతాయని రైతులు భావిస్తున్నారు.ఏడాదికి రూ.12 వేలు.. జిల్లాలో రైతులు, నిధుల జమ ఇలా.. సంవత్సరం సీజన్ రైతులు నిధులు (రూ.కోట్లలో) 2018 యాసంగి 2.19 262.97 2018 వానాకాలం 2.38 274.08 2019 యాసంగి 1.90 225.80 2019 వానాకాలం 2.27 299.70 2020 యాసంగి 2.58 362.71 2020 వానాకాలం 2.51 356.71 2021 యాసంగి 2.77 366.45 2021 వానాకాలం 2.66 363.62 2022 యాసంగి 2.83 361.33 2022 వానాకాలం 2.88 368.52 2023 యాసంగి 3.06 369.21 2023 వానాకాలం 3.01 370.17 2024 యాసంగి 2.47 247.39 రైతులకు సాగు ఖర్చులకు నిధులు అందించాలనే ఉద్దేశంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదటి సారిగా 2018 సంవత్సరం యాసంగిలో రైతు ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసింది. ప్రతి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ.8 జమ చేసింది. ఆ తర్వాత 2019 సంవత్సరంలో తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలకు పెంచింది. ఆ తర్వాత 2023లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రూ.12 వేలకు పెంచింది. ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి జిల్లాలో 3,34,835 మంది రైతులతో అర్హుల జాబితా సిద్ధం చేయగా.. వీరికి రూ.429.31 కోట్ల నిధులు జమ చేయాల్సి ఉంది. అయితే 2024 యాసంగిలో చాలామంది రైతులు రైతుభరోసా జమ చేయడంలో గంగరగోళం నెలకొంది. ఈ సీజన్లో కూడా ఎన్ని ఎకరాల వరకు నిధులు జమ చేస్తారో అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. తొలిరోజు జమ అయిన నిధులు ఇలా..రైతులు 1,63,796నిధులు రూ.1,00,90,97,923 తొమ్మిది రోజుల్లో ప్రక్రియ పూర్తిచేస్తామని వెల్లడి గడిచిన 13 సీజన్లలో కలిపి రూ.4,228.66 కోట్లు మంజూరు ఈ వానాకాలంలో 3.34 లక్షల మందికి రూ.429 కోట్లు కేటాయింపు ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
ఆకలి బాధ తీరేనా?
నాగర్‌కర్నూల్: పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసించేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు వస్తుంటారు. తమ స్వగ్రామం నుంచి కళాశాల సమయానికి చేరుకునేందుకు ఉదయాన్నే బయలుదేరాల్సి వస్తోంది. అయితే కొందరు విద్యార్థులు భోజనం చేసి రావడం గగనంగా ఉంటోంది. అలాంటి విద్యార్థులు కళాశాలలో ఆకలి బాధతో తరగతులు వినాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసేందుకు గత సంవత్సరం ప్రభుత్వం ప్రతిపాదనలు స్వీకరించింది. 2024–25 విద్యా సంవత్సరం చివరలో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో.. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటి నుంచి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుందని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈసారి కూడా మధ్నాహ్న భోజనం అమలయ్యే సూచనలు కనిపించడం లేదు. జూనియర్ కళాశాలల్లో అమలుకు నోచుకోని మధ్యాహ్న భోజన పథకం గతేడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు నేటికీ స్పష్టత కరువు అవస్థలు పడుతున్న గ్రామీణ విద్యార్థులు ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించే ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాల్సి ఉంది. ఒక్కో విద్యార్థికి ఎంత కేటాయిస్తారు.. ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే విషయాలపై ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే అమలు చేస్తాం. – వెంకటరమణ, ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ -
జిల్లాను ప్రప్రథమంగా నిలుపుదాం
నాగర్‌కర్నూల్: జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధిపరిచి.. రాష్ట్రస్థాయిలో ప్రప్రథమంగా నిలుపుదామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం ఆయనను అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ పూర్తిస్థాయిలో చేరేలా అధికారులు మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉన్నప్పటికీ కొన్నిసార్లు అవి అర్హులకు చేరడంలో జాప్యం లేదా అవకతవకలు జరుగుతుంటాయని, ఈ సమస్యలను అధిగమించి పథకాలు నిజమైన అర్హులకే అందేలా చూడాలన్నారు. సంక్షేమ పథకాల లక్ష్యాన్ని నెరవేర్చడంలో జిల్లాస్థాయి అధికారులు అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. పథకాల అమలులో పారదర్శకత పాటిస్తూ, అధికారులు తమ విధులకు జవాబుదారీగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని, కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో పర్యటించి పథకాల అమలును పర్యవేక్షించాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా పరిష్కారాలను మరింత సమర్థవంతంగా చేయవచ్చన్నారు. విద్య, ఆరోగ్యం, మౌళిక సదుపాయాలు, వ్యవసాయం వంటి అన్నిరంగాల్లో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమష్టిగా పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు రాంమోహన్‌రావు, రమేష్‌కుమార్, సీతారాంనాయక్, స్వరాజ్యలక్ష్మి, రాజేశ్వరి, నాగేందర్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పాలనలో ముద్ర
నాగర్‌కర్నూల్: గతేడాది జూన్ 16న బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ బదావత్ సంతోష్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నిబద్ధత, దార్శనికత, కఠోర శ్రమతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే ప్రతి పనిని తనదైన శైలిలో ఉత్తమంగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు. నిత్యం సమీక్షలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు, ఇతరత్రా కార్యక్రమాల పరిశీలనతో పారదర్శకత పెంచుతున్నారు. ఊహించని విపత్తులు, అధిక వర్షాల వరదలు, ఎస్ఎల్బీసీ వంటి విపత్తులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జిల్లా అభివృద్ధికి నిర్విరామంగా కృషిచేస్తున్నారు. విద్యే మార్పునకు నాంది కలెక్టర్ బదావత్ సంతోష్ విద్యే మార్పునకు నాంది అని భావించి.. జిల్లాలో విద్యా వ్యవస్థపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ.. పాఠాలు బోధిస్తూ.. విద్యాలయాల్లో వసతులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ తదితర పాఠాలు సైతం బోధించి.. లక్ష్యం వైపు స్పష్టత ఇస్తూ భవిష్యత్ ప్రణాళికపై సూచనలు చేశారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 23వ స్థానంలో జిల్లా ఈ ఏడాది 13వ స్థానానికి చేరుకోవడంలో కలెక్టర్ కృషి ప్రత్యేకమైనది. ● ఇందిర సౌర గిరి జల వికాస పథకం ద్వారా పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ ఏర్పాట్లను అతి తక్కువ సమయంలోనే విజయవంతంగా పూర్తిచేయడంతో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక ఎంపీ మల్లురవి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ వారి ప్రశంసలు అందుకుంటూ ముందుకెళ్తున్నారు. ● మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్ష, కార్యదర్శులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా తదితర వాటిని గాడిలో పెట్టేలా చొరవ తీసుకున్నారు. ● జిల్లా జనరల్ ఆస్పత్రితోపాటు సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను ఆకస్మికంగా సందర్శించి.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచిస్తున్నారు. జనరల్ ఆస్పత్రి ఐసీయూలో బెడ్స్, డ్రగ్స్ అలాగే నిరంతరం శానిటేషన్ చేపట్టాలని, ప్రసూతి కోసం వచ్చే గర్భిణులకు సాధారణ కాన్పులకు ప్రాధాన్యత ఇచ్చేలా కృషి చేశారు. ఎప్పటికప్పుడు జనరల్ ఆస్పత్రిలోని సాధారణ, ఆర్థో వార్డులను తనిఖీ చేసి రోగులతో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ● కలెక్టరేట్లో అధికారులు సమయపాలన పాటించేలా బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. నిత్యం సమీక్షలు జరుపుతూ ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ వేగిరం చేశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సత్వరమే పరిష్కరించాలని సూచిస్తున్నారు. ● నల్లమల్ల ప్రాంతంలోని చెంచుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్ యోజన) పథకం ద్వారా జిల్లాలోని 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపట్టారు. చెంచు పెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి పనులు ప్రారంభించారు. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్, ఆయుష్మాన్ భారత్, ఆధార్ కార్డులు అందజేశారు. ప్రత్యేకంగా మెడికల్ వాహనం ఏర్పాటు చేశారు. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు పంపించారు. కలెక్టర్‌గా ఏడాది పూర్తి చేసుకున్న బదావత్ సంతోష్ నిత్యం సమీక్షలతో అధికారులకు దిశానిర్దేశం పదో తరగతి ఫలితాల పెరుగుదలకు కృషి విజయవంతంగా అధికారిక కార్యక్రమాల నిర్వహణతో ప్రముఖుల ప్రశంసలు -
పెరిగిన పత్తి విత్తనాల ధరలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్‌పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్‌కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్, బాలానగర్, భూత్పూర్ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు. బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా సంవత్సరం పాకెట్ ధర (రూ.లలో..) 2018 690 2019 710 2020 730 2021 767 2022 810 2023 853 2024 864 2025 901 చిన్నచింతకుంటలో సాగు చేసిన పత్తిపంట ఒక్కో పాకెట్‌పై రూ.37 పెంపు -
కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యం
కొల్లాపూర్ రూరల్: దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమవుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని ముక్కిడిగండం గ్రామం నుంచి మొలచింతలపల్లి వరకు నిర్వహించిన జైభీమ్– జైబాపు యాత్రలో మంత్రి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆయా గ్రామాల్లో మహాత్మాగాంధీ, అంబేడ్కర్ విగ్రహలకు పాలాభిషేకాలు చేసి.. ఘనంగా నివాళలర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే జైభీమ్– జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ వాటిని కాపాడే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అందరికీ సమాన హక్కులు, అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు. పాదయాత్రలో భాగంగా మొలచింతపల్లి గ్రామానికి వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు దశాబ్దాల కాలంగా సాగునీరు లేక ముక్కిడిగుండం, మొలచింతపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చెంతనే కేఎల్ఐ ప్రాజెక్టు ఉన్నా సాగునీరు అందడం లేదని సీపీఐ మండల కార్యదర్శి శివుడు ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని మంత్రి సమక్షంలోనే పేర్కొన్నారు. -
అమాయకులకు వల
గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ పోలీసులకు ఫిర్యాదు చేయండి.. ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి. – రామేశ్వర్, ఏఎస్పీ, నాగర్‌కర్నూల్ సాక్షి, నాగర్‌కర్నూల్: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’ ఉమ్మడి పాలమూరులో ఇంకా మూఢనమ్మకాల జాఢ్యం వీడటం లేదు. మంత్రాలు, మాయలు, గుప్తనిధుల పేరుతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాయగాళ్లను నమ్మి పెద్దఎత్తున సొమ్మును కోల్పోయి మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూళనలో పోలీసులు, సంబంధిత అధికారులు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన నిందితులు, సూత్రదారులు పోలీసులకు చిక్కడం లేదు. ఉమ్మడి జిల్లాలో మాయగాళ్లు, నాటు వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అమాయకులే లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్నపిల్లలతోపాటు మహిళలు, వృద్ధులు అనారోగ్యానికి గురైనా తాయత్తులు, బిల్లలు కడతామంటూ రోజుకొకరు చొప్పున మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, నాటువైద్యం పేరుతో వ్యవస్థీకృతంగా దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా మాయగాళ్లకే సహకరించిన ఘటనలే ఎక్కువ. ఉమ్మడి జిల్లాలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూ అపురూపమైన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలలోని పురాతన నవ నారసింహా ఆలయం, ప్రతాప రుద్రుని కోట, రాయలగండి చెన్నకేశవ ఆలయం, బైరాపూర్, వడ్డేమాన్‌లోని పురాతన ఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాయగాళ్లు, నాటువైద్యులు ఆలయాల విధ్వంసం.. అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న దందాలు అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు -
రైతులకు చేరువగా రైతు నేస్తం
అచ్చంపేట రూరల్: కాలానుగుణంగా అన్నదాతలు సైతం ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంభించాల్సి వస్తోంది. గ్రామీణ కర్షకులకు సలహాలు, సూచనలు అందిస్తే అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. సరైన పరిజ్ఞానం లేక వ్యాపారులు సూచించిన సలహాలు పాటిస్తూ నష్టపోతుంటారు. మండల కేంద్రాల్లో ఉండే వ్యవసాయాధికారులను కలిసేందుకు వెళ్లడం కష్టంగా ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి క్లస్టరుకు ఒక రైతువేదిక నిర్మించింది. వాటిలో ఏఈఓలు తప్పనిసరిగా ఉండేలా చర్యలు చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రైతువేదికలను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రతి మండలంలో రైతులకు అందుబాటులో ఉండేలా ‘రైతునేస్తం’ ద్వారా వీడియో కాన్ఫరెన్సు సైతం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 20 మండలాల రైతు వేదికల్లో మొదటగా 20 వీసీలు అందుబాటులోకి తీసుకురాగా.. ప్రస్తుతం మరో 40 వీసీ కేంద్రాలను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని పలు జిల్లాలో వీసీ కేంద్రాలను ప్రారంభిస్తుండగా.. జిల్లాలోనూ 40 వీసీ కేంద్రాలను ప్రారంభించి.. 60 కేంద్రాల్లోని రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. సాగు, పాడిపై సూచనలు జిల్లాలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు. చిరుధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు విధానాలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. కాలానుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాలపై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను వివరిస్తున్నారు. తాజాగా మరిన్ని రైతు నేస్తం కేంద్రాలను విస్తరించడంతో మరింత మంది రైతులకు సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆధునిక పరిజ్ఞానంతో.. వ్యవసాయ రంగంలో ఆధునిక పరిజ్ఞానం రైతులకు మరింత చేరువయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంటల సాగులో మెలకువలు, ఆధునిక పద్ధతులపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు సందేహాలను నివృత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి నుంచి ప్రతి మంగళవారం ‘రైతునేస్తం’ కార్యక్రమం నిర్వహిస్తోంది. జిల్లాలోని 20 మండలాల్లో కేటాయించిన రైతు నేస్తం రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సులను వ్యవసాయశాఖ నిర్వహిస్తోంది. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సుకు సంబంధించిన ఎలక్ట్రికల్ పరికరాలు కంప్యూటర్, మైకులు, ఇన్వర్టర్ బ్యాటరీలతోపాటు నెట్ కనెక్షన్ ద్వారా నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహించడంతోపాటు సాగులో మెలకువలు, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, పంటల తెగుళ్ల నివారణ, చీడపీడల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, నూతన వంగడాలపై రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంతోపాటు అనుబంధ రంగాలపై కూడా వీసీలో చర్చిస్తున్నారు. అచ్చంపేట మండలంలోని పులిజాల రైతు వేదిక రైతులకు ఎంతో మేలు.. రైతువేదికలకు వీడియో కాన్ఫరెన్సులు మంజూరు కావడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. జిల్లాలోని 20 మండలాల్లో ఇప్పటికే 60 రైతునేస్తం కేంద్రాలు మంజూరయ్యాయి. వీటి ద్వారా ఎప్పటికప్పుడు పంటల సాగులో మెలకువలను తెలియజేసే వీలుంటుంది. రైతులు రైతువేదికల వద్దకు వెళ్లి సద్వినియోగం చేసుకోవాలి. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. రైతులు అందరూ పాల్గొనాలి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి జిల్లాలో అందుబాటులోకి రానున్న మరో 40 కేంద్రాలు ఇప్పటికే 20 రైతు వేదికల్లో అందుతున్న సేవలు నేడు జిల్లా రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆధునిక పరిజ్ఞానంతో అన్నదాతలకు ప్రయోజనం -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి
స్టేషన్ మహబూబ్‌నగర్: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని నూతన రీజియన్ కమిటీ అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సత్యశీలారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాష్ట్ర ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం చైర్మన్ రహెమాన్ సోఫి, రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ సత్యన్న ఆచారి, రాష్ట్ర కార్యదర్శి బసన్న ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మహబూబ్‌నగర్ రీజియన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రీజియన్ అధ్యక్షుడిగా భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శిగా సత్యశీలారెడ్డి, కోశాధికారిగా కేకే మూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రాంమూర్తి, ఉపాధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి, చీఫ్ అడ్వయిజర్‌గా ఎంకే జోసెఫ్, జాయింట్ సెక్రటరీగా దమ్మాయిపల్లి శ్రీనివాస్‌లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో రీజియన్ పరిధిలోని పది డిపోలకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నాగర్‌కర్నూల్
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025నాన్నంటే ఓ ఆసరా.. ఓ భరోసా.. నాన్నంటే ఓ బాధ్యత.. ఓ ధైర్యం.. నాన్నంటే ఓ స్ఫూర్తి..ఓ ఆర్తి.. బరువెక్కుతున్న గుండె భారంగా మారుతున్నా, కంటి నిండా నిద్ర కరువవుతున్నా కుటుంబ బరువు బాధ్యతలను భుజాన వేసుకునే సూపర్ హీరో. నవ మాసాలు మోసి అమ్మ జన్మనిస్తే.. బతుకంతా ధారపోసి జీవితాన్నిచ్చేది నాన్న. స్వార్థం లేని ప్రేమతో గుండెలపై ఆడిస్తాడు. బుడిబుడి అడుగుల నుంచి ప్రతి చోట వెన్నంటి ఉంటాడు. కష్టాల్లో నిర్భరంగా.. ఆపదలో ధైర్యంగా నిలబడేలా భరోసనిస్తాడు. విజయంలో మెట్టుగా మారుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కష్టాన్ని కళ్లలో దాచిపెట్టి.. సంతోషాన్ని చేతినిండా పంచిపెట్టి.. తన కోసం ఏదీ దాచుకోకుండా.. కన్న బిడ్డలే సర్వస్వంగా బతుకుతాడు. అందుకే నాన్నంటే ప్రతి కుమారుడు, కుమార్తెకు కొండంత ధైర్యం. తండ్రి చేయి పట్టుకొని ఉన్నత గమ్యం వైపు నడిచిన వారు ఎందరో ఉన్నారు. ఆదివారం ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు.. రియల్ హీరో.. ‘మా నాన్న రఘునాథ్ గైక్వాడ్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించారు. కిరాణ షాపు నిర్వహిస్తూ మా చదువుల కోసం ప్రోత్సహించారు. ఆయన నుంచి కష్టపడే తత్వాన్ని, ఇతరులకు సాయం చేసే గుణాన్ని నేర్చుకున్నా. ప్రతి ఒక్కరికీ నాన్నే రియల్ హీరోగా ఉంటారు. – నాన్న రఘునాథ్ గైక్వాడ్‌తో నాగర్‌కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నేడు ప్రపంచ తండ్రుల దినోత్సవం -
నాన్నే.. సూపర్ హీరో
వెన్నుదన్నుగా నిలబడ్డారు.. నా చిన్నతనం నుంచి అన్ని విషయాల్లో మా నాన్నే ఆదర్శం. మాది మధ్య తరగతి కుటుంబం. నాన్న మహదేవ్ చిన్నపాటి వ్యాపారం చేస్తారు. నాకు చిన్నప్పటి నుంచి చదువు ప్రాముఖ్యత తెలియజేశారు. నేను ఇంజినీరింగ్ అయిన తర్వాత ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చినా.. నేను నిర్దేశించుకున్న ఐఏఎస్ లక్ష్యాన్ని సాధించేందుకు అందులో చేరలేదు. ఆ సమయంలో నాన్నే నా వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సివిల్స్ రెండు ప్రయత్నాల్లో సాధించలేకపోయా. ఈ సమయంలో నీ వెనకాల నేనున్నా అంటూ వెన్నుదన్నుగా నిలబడ్డారు. మూడో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించా. – బీఎం సంతోష్, కలెక్టర్, జోగుళాంబ గద్వాల ● జీవిత పాఠాల్లో తండ్రికి మించిన గురువు లేరు ● పిల్లల ప్రతి అడుగులో వెన్నంటి ఉంటూ భరోసా ● భవితకు మార్గదర్శిగా ఉంటూ.. వారి ఎదుగుదలకు అహర్నిశలు కష్టపడే శ్రమజీవి -
లోక్‌అదాలత్‌లో 17,495 కేసులు పరిష్కారం
కందనూలు: జిల్లాలోని న్యాయస్థానాల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో 17,495 కేసులను పరిష్కరించారు. జిల్లా కోర్టు సముదాయంలో నిర్వహించిన లోక్‌అదాలత్‌లో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రమాకాంత్ పాల్గొని వివిధ కేసుల్లో రాజీ అయిన కక్షిదారులకు ఆర్డర్ కాపీలు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమన్నారు. కక్షిదారులకు సమయం, డబ్బులు ఆదా అవుతాయన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌లో సివిల్ కేసులతో పాటు ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంక్ కేసులు, పెట్టి తదితర కేసులను పరిష్కరించినట్లు వివరించారు. రూ.58,37,519 కాంపౌండింగ్ ఫీజు కింద వసూలైనట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీమా సుల్తానా మాట్లాడుతూ.. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను కొందరు అనివార్య కారణాలతో కట్టలేకపోతున్నారని.. లోక్‌అదాలత్ ద్వారా సెటిల్ చేసుకున్న వారికి బ్యాంకర్లు వడ్డీతో పాటు అసలు కూడా కొంతవరకు మాఫీ చేసే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి శ్రీనిధి, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రావు పాల్గొన్నారు. -
తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్
వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యా వత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు కుమారులను ఉన్న తంగా చదివించారు. ఎస్బీఐ లో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్‌నాయక్ ఇటీవల యూపీఎస్సీ ఫలి తాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. సివిల్స్ లక్ష్యంగా సన్నద్ధమైన యశ్వంత్ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్ సా ధించి ఐపీఎస్ సాధించారు. హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఐఏ ఎస్ సాధించారు. తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి కృషి, ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించానని యశ్వంత్ పేర్కొన్నారు. గర్వంగా ఉంది.. నా పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా ఎదిగేలా తీర్చి దిద్దాలనుకున్నాను. వారి చిన్నతనం నుంచే చదువుపై దృష్టిపెట్టి ప్రోత్సహించాం. పెద్ద కుమారుడు యశ్వంత్‌నాయక్ ఐఏఎస్ సాధించడం గర్వంగా ఉంది. చిన్న కుమారుడు కూడా సు మంత్నాయక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నా డు. వారి చదువు కోసం పడిన శ్రమకు ఫలితం దక్కడంతో ఆనందంగా ఉన్నాను. – యశ్వంత్‌తో తండ్రి ఉమాపతి నాయక్ -
రైతుల అనుమతి లేని రిజర్వాయర్ వద్దు
బల్మూర్: మండల కేంద్రం సమీపంలో నిర్మించతలపెట్టిన ఉమామహేశ్వర రిజర్వాయర్‌ను రైతుల అనుమతి లేకుండా చేపట్టవద్దని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్రాములు అన్నారు. శుక్రవారం రిజర్వాయర్ నిర్మాణంతో భూములు కోల్పోయే రైతులతో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బల్మూర్, అనంతవరం, మైలారం, అంబగిరి గ్రామాలకు చెందిన 2,601 ఎకరాల భూములను ఈ రిజర్వాయర్ నిర్మాణంలో కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. అయినా కూడా ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సర్వేలు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను మోసం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దీనిపై తిరుగుబాటు ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టే బదులు గొలుసు కట్టు చెరువుల ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, నాయకులు నాగరాజు, శివకుమార్, సైదులు, రాజేష్, అంతయ్య తదితరులు పాల్గొన్నారు. -
సౌరగిరి వికాసం రైతులకు ప్రత్యేక శిక్షణ
నాగర్‌ర్నూల్: ఇందిరా సౌర గిరి వికాసం పథకం రైతులకు రాష్ట్రస్థాయి ఉద్యాన పరిశోధన కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తామని, దీనిని సద్వినియోగం చేసుకొని నల్లమలలోని గిరిజన రైతులు రాష్ట్రస్థాయి శిక్షకులుగా మారాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఉద్యాన పంటలపై పూర్తిస్థాయిలో శిక్షణ పొందిన తర్వాత రాష్ట్రస్థాయిలో వారి సేవలు అందేలా చూస్తామన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇందిరా సౌర గిరి జల వికాసం లబ్ధిదారులు రాజకుమార్, లక్ష్మి, అలివేలతో కలెక్టర్ మాట్లాడారు. పాలెం కేవీకే, నల్లగొండ మల్లేపల్లి ఉద్యాన శిక్షణ కేంద్రం, సంగారెడ్డి ఉద్యాన శిక్షణ, పరిశోధన కేంద్రాల్లో ఉద్యాన పంటలపై శిక్షణ ఇస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఆదివాసీ, గిరిజన రైతులు ఆర్థిక అభ్యున్నతి సాధించేలా కృషి చేయాలని, ఆ దిశగా శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉద్యాన పంటలతోపాటు మామిడి, అవకాడ, బత్తాయి, జీడి మామిడి, కొబ్బరి, జామ, సీతాఫలం, నిమ్మ, నేరేడు, రేగు, మునగ, గులాబీ, మల్లె వంటి పూలు, ఆయుర్వేద, సుగంధ తైల మొక్కల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారన్నారు. ఈ పథకం కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని చెప్పారు. అంతిమంగా ఈ సమగ్ర కృషి నల్లమల ప్రాంతాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరణ జిల్లాలో రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరించామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. జిల్లాలో 1.60 లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేయగా.. 3 లక్షల మె.ట., ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు. ఇప్పటి వరకు 28,705 మంది రైతుల నుంచి 1,71,694 మె.ట., ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 26,314 మంది రైతులకు రూ.335 కోట్లు ఖాతాలో జమ చేశామన్నారు. జిల్లాలో ఇంకా 10 వేల మె.ట., ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉందని, రానున్న రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. భూ సేకరణలో వేగం పెంచాలి జిల్లాలో కేఎస్ఐ, పాలమూరు– రంగారెడ్డి, మార్కండేయ, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గత వారం నిర్దేశించిన మేరకు భూ సేకరణ పనులను ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. వచ్చేవారం వరకు మరింత పురోగతి సాధించాలని సూచించారు. -
పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతోపాటు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ప్రతి మూడు నెలలకోసారి తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓల్డ్ హెడ్‌క్వార్టర్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి పోలీసుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీస్ సిబ్బంది ఆరోగ్యంపై శాఖాపరంగా ప్రత్యేక దృష్టి సారిస్తామని, త్వరలోనే అచ్చంపేట, కల్వకుర్తి సబ్ డివిజన్ వారీగా ప్రత్యేక హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పారు. ఈ క్రమంలో మెడికల్ హెల్త్ క్యాంపులో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు దాదాపు 300 మంది పోలీస్ సిబ్బంది, కుటుంబ సభ్యులకు వివిధ రకాల పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రామేశ్వర్, ఏఆర్ ఏఎస్పీ భరత్, డీఎస్పీ శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాసు తదితరులు పాల్గొన్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
కందనూలు: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో క్షేత్రసాయి సిబ్బందికి సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతేడాది ఎక్కువగా డెంగ్యూ, మలేరియా, నీళ్ల విరేచనాలు, జ్వరాలు నమోదైన గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో అంటువ్యాధుల నివారణపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని, దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు, తలుపులకు ఇనుప జాలీలు బిగించుకోవాలని, దోమతెరలు వాడాలని, ఇంటి ఆవరణలో, పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలని, పాత టైర్లు, పనికిరాని ప్లాస్టిక్, గాజు సీసాలు, డిస్పోజబుల్ కప్పులు, కొబ్బరి చిప్పలు వంటివి లేకుండా చేసుకోవాలని ప్రజలకు సూచించాలన్నారు. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, అనుమానం ఉన్నవారి రక్త నమూనాలు టీ–డయాగ్నోస్టిక్ హబ్‌కు ప్రతిరోజు పంపాలని చెప్పారు. కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే టైఫాయిడ్, డయేరియా తదితర వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా పరిశుభ్రమైన నీరు, చేతుల శుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. ఈ నెల 16 నుంచి వచ్చే నెల 31 వరకు నిర్వహించే ‘నీళ్ల విరేచనాలను ఆపండి’ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు ఐదేళ్లలోపు చిన్నారుల ఇంటికి వెళ్లి ముందస్తు జాగ్రత్తగా ఓఆర్ఎస్ పాకెట్లు అందించాలని, డయేరియా కలిగిన పిల్లలకు జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ పాకెట్లు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ వెంకటదాస్, ప్రోగ్రాం అధికారి రాజశేఖర్, డాక్టర్ ప్రదీప్, ఎపిడెమియాలజిస్ట్ ప్రవళిక, ఏఎంఓ శ్రీనివాసులు, డీపీఓ రేనయ్య, ఏపీఓలు విజయ్‌కుమార్, రాజేష్ పాల్గొన్నారు. -
రైతులకు సౌర పంట
వందశాతం సబ్సిడీపై అందజేయనున్న ప్రభుత్వం ●అవగాహన కల్పిస్తాం.. అచ్చంపేట నియోజకవర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయడం సంతోషంగా ఉంది. మొదట వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ కల్పిస్తాం. రెండో విడతలో ఇళ్లకు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సౌర విద్యుత్ ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. దీని వల్ల ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. వందశాతం సబ్సిడీపై ఇవ్వనుండటంతో రైతులకు ఒక్క రూపాయి ఖర్చు కాదు. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట ● సొంత భూముల్లో పంపుసెట్లు, ప్లాంట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం ● వ్యవసాయ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్న ట్రాన్స్‌కో అధికారులు ● పైలెట్ ప్రాజెక్టు కింద అచ్చంపేట ఎంపిక ● రూ.1,389.19 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అచ్చంపేట: రాష్ట్ర ప్రభుత్వం సౌర విద్యుత్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్ కల్పించేందుకు చొరవ తీసుకుంటుంది. ఇందులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గమైన అచ్చంపేటను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వందరోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్‌కో అధికారులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు లెక్కించే పనిలో నిమగ్నమయ్యారు. మొదట వ్యవసాయ రంగానికి, తర్వాత గృహా అవసరాలకు ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. వినియోగదారుల అవసరాల తర్వాత మిగులు విద్యుత్‌ను తిరిగి ట్రాన్స్‌కో అమ్ముకోవడం ద్వారా ప్రతి కుటుంబం నెలకు రూ.3– 6 వేల వరకు ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా చూపించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో సౌర విద్యుత్ కల్పిస్తోంది. ఇందులో సోలార్ ప్యానల్స్, కన్వెర్టర్ కంట్రోలర్ ఇవ్వనున్నారు. కొండారెడ్డిపల్లిలో 420 ఇళ్లు.. ఇప్పటికే సీఎం స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో వ్యవసాయ బోర్లు, ఇళ్లకు ఉచితంగా సోలార్ ద్వారా విద్యుత్ అందించే కార్యక్రమం నాలుగు నెలలుగా ముమ్మరంగా సాగుతుంది. గ్రామంలో 499 కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 420 ఇళ్లకు సౌర విద్యుత్ సదుపాయం కల్పించారు. మరో 79 ఇళ్లకు సంబంధించి మట్టి మిద్దెలు, రేకుల ఇళ్లు ఉండటంతో ఏర్పాటు కాలేదు. వీటికి కూడా స్టాండ్స్ మార్చి, ఖాళీ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 21 ఇళ్లకు 2 కిలోవాట్లు, 9 ఇళ్లకు ఒక కిలోవాట్, 390 ఇళ్లకు 3 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్‌కు తెలంగాణ పునరుత్పాదన ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)ఇప్పటి వరకు సుమారు రూ.8.55 కోట్లు ఖర్చు చేసింది. దీంతో గ్రామంలో ఇంటింటా సౌర విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. అలాగే గ్రామంలో 941 వ్యవసాయ బోర్లు ఉండగా.. వీటికి సోలార్ విద్యుత్ కల్పించాల్సి ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు 5 హెచ్‌పీ నుంచి 7 హెచ్‌పీ బోరు మోటార్లు వినియోగిస్తుంటారు. వీటికి 5 లేదా 7.5 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్యానళ్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అదే ఇళ్లకు అయితే 2 నుంచి 3 కిలోవాట్ల ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్‌కు రూ.65 నుంచి రూ.70 వేల ఖర్చు వస్తుండగా రోజుకు 4 యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. 3 కిలోవాట్‌కు కేంద్రం రూ.78 వేలు రాయితీ ఇస్తుంది. వ్యవసాయానికి 5 కిలోవాట్ల ప్యానల్, కన్వెర్టర్ కంట్రోలర్‌తో కలిపి రూ.3.50 లక్షల ఖర్చు వస్తోంది. నెలకు 600 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి చేయవచ్చు. 5–7.5 కిలోవాట్ల సామర్థ్యం సొంత భూముల్లో.. ఎస్‌హెచ్‌జీలు, రైతులు వ్యక్తిగతంగా లేదా ఇతరులతో కలిసి తమ పొలాల్లో 0.5 మెగావాట్లు నుంచి 2 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్థిక స్థోమత లేకుంటే డెవలపర్లకు తమ భూములను లీజుకు ఇచ్చి ప్లాంట్లు పెట్టించవచ్చు. లీజుకు ఇస్తే లీజు డబ్బును డిస్కంలు నేరుగా రైతు ఖాతాల్లో జమ చేస్తాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు 4 ఎకరాల స్థలం అవసరం. ఈ ప్లాంట్లు ఉత్పత్తి చేసే విద్యుత్‌ను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 25 ఏళ్లపాటు కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకోనున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ) నిర్ణయించిన ధర ప్రకారం యూనిట్ విద్యుత్‌కు రూ.3.13 చొప్పున రైతులకు డిస్కంలు చెల్లిస్తాయి. భవిష్యత్‌లో ఈఆర్సీ నిర్ణయం మేరకు ఈ ధరల్లో మార్పులుంటాయి. ఒక మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంటు ద్వారా ఏటా సగటున 15– 16 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. తద్వారా సోలార్ ఏర్పాటు చేసుకునే వారికి రూ.45–50 లక్షల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. -
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా. – స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల రుణ వివరాలు అందించాం.. చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్‌తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం. – చంద్రమోహన్, అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం వివరాలు సేకరిస్తున్నాం.. చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. – గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల ● -
పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చర్యలు
నాగర్‌కర్నూల్ క్రైం: పిల్లలను పనుల్లో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవానికి ఆమె హాజరై మాట్లాడారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతగా చదివించాలని సూచించారు. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాలబాలికలు ఆటపాటలకు దూరమై పని ప్రదేశాల్లో మగ్గిపోవడం సరికాదన్నారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎవరైనా 14ఏళ్ల లోపు పిల్లలను పనుల్లో పెట్టుకుంటే చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడైనా బాలకార్మికులను గుర్తిస్తే డయల్ 1098కు సమాచారం అందించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవికాంత్‌రావు సూచించారు. కార్యక్రమంలో హెచ్ఎం లత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘భూ భారతి’ దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తాం
వంగూరు/మన్ననూర్: భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై సమర్పించిన ప్రతి దరఖాస్తును పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని భూ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యలపై ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భూ సమస్యలపై అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. భూ భారతి చట్టంతో పరిష్కార మార్గం చూపాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీను, తహసీల్దార్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ● అమ్రాబాద్ మండలం మన్ననూర్‌కు చెందిన రైతు పర్వతాలుకు ఉపాధిహామీ పథకంలో మంజూరైన పౌల్ట్రీ యూనిట్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసంపూర్తిగా షెడ్ నిర్మాణాన్ని నెలరోజుల్లో పూర్తిచేసి.. కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాలని లబ్ధిదారుకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేస్తున్న షెడ్లో వెయ్యి కోడి పిల్లలను పెంచే విధంగా ఏర్పాట్లు చేయాలన్నారు. రైతులు, గ్రామీణ యువతను స్వయం ఉపాధిలో ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట డీఆర్డీఓ చిన్న ఓబులేషు, ఏపీడీ శ్రీనివాసులు, ఎంపీడీఓ లింగయ్య, ఏపీఓ రఘు, పంచాయతీ కార్యదర్శి భీముడు పాల్గొన్నారు. -
సమస్యలు తీర్చండి..
ప్రభుత్వ టీచర్లు సమయపాలన పాటించేలా చూడాలిప్రశ్న: జిల్లాలో విద్యాహక్కు చట్టం ఎక్కడా అమలుకావడం లేదు. పకడ్బందీగా అమలయ్యేలా చూడండి. – ప్రసాద్, కల్వకుర్తి డీఈఓ: జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యాహక్కు చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి విద్యార్థి చదువుకునేలా నిర్బంధ ఉచిత విద్యను పకడ్బందీగా అమలుచేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల్లోనూ బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచితంగా, ఫీజు రాయితీతో విద్య అందించేలా చూస్తాం. దీనిపై ఫిర్యాదులు వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ● జిల్లాలో విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి ●● ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులన నియంత్రించండి ● ‘సాక్షి’ ఫోన్ఇన్లో డీఈఓ రమేశ్‌కుమార్‌కు వినతులు సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్ అన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని.. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంబంధిత అభ్యసన కార్యక్రమాలను అందిస్తున్నామని చెప్పారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో విద్యారంగ సమస్యలపై ‘సాక్షి’ చేపట్టిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని.. జిల్లావ్యాప్తంగా విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలని పలువురు డీఈఓకు ఫోన్‌చేసి విజ్ఙప్తి చేశారు. ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు టీచర్లు సమయపాలన పాటించడం లేదు. ప్రార్థనా సమయానికి ప్రతి ఉపాధ్యాయుడు హజరయ్యేలా చర్యలు తీసుకోవాలి. – విజయ్‌కుమార్, నాగర్‌కర్నూల్ డీఈఓ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించేలా చూస్తాం. సక్రమంగా విధులు నిర్వర్తించని వారిపై చర్యలు తప్పవు. ఉపాధ్యాయుల హాజరు, పనితీరు, సమయపాలనపై ప్రత్యేకంగా పర్యవేక్షణ చేపడతాం. ప్రశ్న: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులు లేవు. కనీసం టాయిలెట్లు కూడా సరిగా ఉండటం లేదు. – అనిల్‌కుమార్, అచ్చంపేట డీఈఓ: అన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా టాయిలెట్లు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. ఎక్కడైనా లేకపోతే ప్రతిపాదనలు సిద్ధంచేసి వెంటనే నిర్మించేలా చర్యలు తీసుకుంటాం. టాయిలెట్లతో పాటు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటుచేస్తున్నాం. ప్రశ్న: విద్యార్థులు లేరన్న కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నారు. మూసేసిన బడులను తిరిగి తెరిపించాలి. – మహేంద్ర, పెద్దాపూర్, అచ్చంపేట డీఈఓ: జిల్లాలో జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లను గుర్తించి.. వాటికి సైతం ఉపాధ్యాయులను కేటాయిస్తున్నాం. విద్యార్థుల సంఖ్య పెంచి బడులను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని కొనసాగించి విద్యార్థుల హాజరు పెరిగేలా చూస్తాం. ప్రశ్న: ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీకే రూ. 20వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ, గ్రౌండ్, కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదు. – ప్రవీణ్, నాగర్‌కర్నూల్ డీఈఓ: ప్రతి పాఠశాలలో పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలో ఫీజులపై తీర్మానం జరగాలి. అన్ని పాఠశాలలు పేరెంట్స్ కమిటీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై మాకు ఫిర్యాదు అందితే తప్పకుండా స్పందించి చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, పారిశుధ్య సమస్య ఉంది. పరిష్కారానికి చర్యలు తీసుకోగలరు. – తిరుపతయ్య, పోతిరెడ్డిపల్లి, తిమ్మాజిపేట డీఈఓ: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్లీపర్లను నియమించాం. ఈసారి కూడా వారి ద్వారానే పారిశుద్ధ్య నిర్వహణ ఉంటుంది. మిషన్ భగీరథ పథకంతో పాఠశాలల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యార్థులకు ఏ విధంగా అవగాహన కల్పిస్తారు? – తిరుపతి, గంగారం, బిజినేపల్లి డీఈఓ: గతేడాది జిల్లాలో 27 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై విద్యా బోధన ప్రారంభించాం. ఈ ఏడాది అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయనున్నాం. ఇందుకోసం ప్రత్యేక సిలబస్‌ను ప్రభుత్వం నిర్దేశించింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఏఐ విద్యా బోధన కొనసాగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు ఏర్పాటు చేస్తుంది. అలాగే ఖాన్ ఫౌండేషన్ ద్వారా జిల్లాలోని ప్రతి ప్రభుత్వ బడిలో విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయి. సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తారు. -
పక్కాగా వంద రోజుల కార్యాచరణ అమలు
కల్వకుర్తి టౌన్: మున్సిపాలిటీల్లో వంద రోజుల కార్యాచరణ పక్కాగా అమలుపర్చాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ నారాయణరావు అధికారులకు సూచించారు. గురువారం పట్టణంలో వంద రోజుల కార్యాచరణ అమలు తీరుతెన్నులను ఆయన పరిశీలించారు. ముందుగా మున్సిపాలిటీలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రక్రియపై మున్సిపల్ సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం డీఆర్ఏసీసీ సెంటర్లో చెత్త రీసైక్లింగ్ ప్రక్రియను పరిశీలించారు. పట్టణంలో ఎనిమల్ బర్త్ సెంటర్ (ఏబీసీ) పనులు పూర్తయినందున.. వెంటనే ప్రారంభించాలని కమిషనర్ మహమూద్ షేక్‌కు సూచించారు. అదే విధంగా ప్రధాన మురుగు కాల్వను పరిశీలించారు. వానాకాలంలో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని తెలిపారు. పట్టణంలో తడి, పొడి చెత్త సేకరణపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వార్డు ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీలో వందశాతం పన్నుల వసూలుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మొండి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ ఏఈ షబ్బీర్, మేనేజర్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
573 బస్సులకు నో ఫిట్నెస్
● ఉమ్మడి జిల్లాలో పునఃప్రారంభమైన పాఠశాలలు ● నేటినుంచి స్కూల్ బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక డ్రైవ్ ● ఫిట్నెస్ లేకుండా నడిపితే కేసులు నమోదు పాలమూరు: ఉమ్మడి జిల్లాలో గురువారం నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభమయ్యాయి. అయితే జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి బస్సులు ఫిట్నెస్ పరీక్షలు పూర్తి చేసుకోలేదు. చాలా బస్సులు ఫిట్‌గా లేకుండానే విద్యార్థులను తరలించడానికి సిద్ధమయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 1,336 స్కూల్ బస్సులు ఉండగా.. ఇందులో బుధవారం సాయంత్రం వరకు 763 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తిచేయగా.. మరో 573 బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోలేదు. డీటీఓలకు ఆదేశాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసుకోవడానికి ఇచ్చిన గడువు బుధవారంతో ముగియడంతో జిల్లా ఆర్టీఏ అధికారులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీటీసీ కిషన్ వెల్లడించారు. మొదట జిల్లాకేంద్రాలతో పాటు పాఠశాలలు అధికంగా నిర్వహించే పట్టణాల్లో ఆర్టీఏ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ఫిట్నెస్, పర్మిట్ ఇతర పత్రాలు పరిశీలిస్తామన్నారు. అన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతోపాటు 15 ఏళ్లు దాటిన వాహనాలపై కూడా ప్రత్యేక దృష్టిసారించి తనిఖీ చేపడుతామన్నారు. జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేయడానికి అధికారులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఆయా జిల్లాల డీటీఓలకు ఆదేశాలు ఇచ్చినట్లు డీటీసీ పేర్కొన్నారు.ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలా.. జిల్లా మొత్తం ఫిట్నెస్ పరీక్షలు బస్సులు చేసినవి చేయనివి మహబూబ్‌నగర్ 457 300 157 నాగర్‌కర్నూల్ 259 138 121 వనపర్తి 230 97 133 జోగుళాంబ గద్వాల 247 171 76 నారాయణపేట 143 57 86 -
సాగు సంబురం
● జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు ● దుక్కులు దున్ని.. విత్తనాలు విత్తుతున్న రైతులు అచ్చంపేట: జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. రైతులు అరకలు, ట్రాక్టర్లతో పొలాలకు వెళ్లి దుక్కులు దున్నుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్నిన రైతులు జొన్న, పత్తి, సజ్జలు, ఆముదం తదితర విత్తనాలు విత్తుతున్నారు. సాగుకు అనుకూలంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. కాగా, ఈసారి సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ ప్రకటించడంతో రైతుల్లో కొంత ఆందోళన నెలకొన్నా.. గతేడాదిలాగే వర్షాలు అధికంగా కురుస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అనుకూలంగా ఉండటంతో మొలకలు ఇబ్బంది లేకుండా వస్తాయని రైతులు అభిప్రాయపడుతున్నారు. సాగు పనుల్లో బిజీబిజీ.. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ పనుల్లో రైతులు బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలో కురిసిన తొలకరి చినుకులకు రైతులు తమ పంట పొలాల్లో జొన్న, పత్తి, సజ్జలు, ఆముదం, కందిపంట సాగుకు శ్రీకా రం చుట్టారు. దుక్కులు దున్నడం.. విత్తనాలు విత్తడం వంటి పనులు జోరందుకున్నాయి. అయితే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు ఘణనీయంగా పెరగడం రైతులకు భారంగా మా రింది. విత్తనాల కొనుగోలు నుంచి మొదలు.. పంట చేతికొచ్చే వరకు పెట్టుబడులు పెట్టినా ఆశించిన స్థాయిలో దిగుబడి, ధరలు వస్తాయో లేదోనని రైతు లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సకాలంలో రైతుభరోసా ఇచ్చినా పెట్టుబడికి కొంత సా యం అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 5,38,462 ఎకరాల్లో పంటసాగు.. జిల్లాలో గతేడాది వానాకాలం 4,35,692 ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగుచేయగా.. ఈఏడాది 5,38,462 ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఇందులో 1,60,021 ఎకరాల్లో వరి, 2,86,471 ఎకరాల్లో పత్తి, 7,822 ఎకరాల్లో జొన్న, 72,929 ఎకరాల్లో మొక్క జొన్న, 8,909 ఎకరాల్లో కందులు, 368 ఎకరాల్లో మినుములు, 895 ఎకరాల్లో వేరుశనగ, 239 ఎకరాల్లో ఆముదం, 809 ఎకరాల్లో ఇతర పంటలు, మరో 52,603 ఎకరాల్లో పండ్ల తోటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరంరాజుపల్లిలో పత్తి విత్తనాలు నాటేందుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతులు అందుబాటులో విత్తనాలు, ఎరువులు వర్షాల రాకతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. రైతులకు కావాల్సిన ఎరువులతో పాటు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు లైసెన్స్ కలిగిన డీలర్ల వదే విత్తనాలు కొనుగోలు చేయాలి. దళారుల వద్ద నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు. – చంద్రశేఖర్, డీఏఓ -
ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ సెమిస్టర్– 1, 3 సంబంధించి ఫలితాలను పీయూ వీసీ శ్రీనివాస్ గురువారం విడుదల చేశారు. ఈ మేరకు సెమిస్టర్–1లో 37.74 శాతం, సెమిస్టర్–3లో 42.11 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ తెలిపారు. ఫలితాలను పీయూ అధికార వెబ్సైట్లో చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, అడిషనల్ కంట్రోలర్ అనురాధ తదితరులు పాల్గొన్నారు. అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాకేంద్రంలోని బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి ఆసక్తి గల నూతన, రిటైర్డ్ గెస్టు లెక్చరర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గోవిందరాజులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిలాసఫీ సోషియాలజీ, జీవవశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితం, సోషల్, తెలుగు, హిందీ, ఉర్దూ, ఐసీటీ, ఆరోగ్య వ్యాయామ విద్య, విజువల్ ఫర్మామింగ్ ఆర్ట్స్‌లో ఒక్కొక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఈ నెల 19లోగా మెట్టుగడ్డ వద్ద ఉన్న బీఈడీ కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ప్రభుత్వ పాఠశాలలన్నీ ఒకే గొడుగు కిందకు
వంగూరు: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి.. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటగా వంగూరు మండల కేంద్రంలో నెలకొల్పిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని గురువారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన సమావేశానికి కలెక్టర్ బదావత్ సంతోష్‌తో పాటు విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి హాజరై మాట్లాడారు. ప్రభుత్వ బడుల బలోపేతంలో భాగంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి కార్పొరేట్ స్థాయిలో విద్యా వ్యవస్థను మెరుగుపరుస్తున్నట్లు వివరించారు. అందులో భాగంగా వంగూరులోని బాలుర, బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలతో పాటు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకే చోట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1,500 నుంచి 1,800 మంది విద్యార్థులకు విద్యా బోధన కొనసాగుతుందన్నారు. అయితే విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 12కోట్లు మంజూరు చేసిందన్నారు. అనంతరం 36 మందితో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా, గతంలో ఉన్న స్కూల్ డెవలప్మెంట్ కమిటీని యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. వారానికి ఒకసారి కమిటీలు సమావేశమై పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫామ్స్ పంపిణీ చేశారు. సమావేశంలో విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, విశ్వేశ్వర్రావు, జ్యోత్స్నారెడ్డి, డీఈఓ రమేశ్‌కుమార్, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్, ఎంఈఓ మురళీ మనోహరాచారి తదితరులు పాల్గొన్నారు. వంగూరులో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం సౌకర్యాల కల్పనకు రూ. 12కోట్లు మంజూరు రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి -
ఫోన్ చేయాల్సిన నంబర్: 79950 87602, 88972 29929
సమయం: గురువారం మధ్యాహ్నం 2 నుంచి 3గంటల వరకుకందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, మూతపడిన పాఠశాలలను తెరిపించడం, విద్యార్థులను చేర్పించడం, పారి శుద్ధ్యం, ప్రైవేటు పాఠశాలల్లో వసతులు, ఇతరత్రా సమస్యలపై సందేహాల నివృత్తి కోసం జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్‌కుమార్‌తో గురువారం ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ ద్వారా డీఈఓతో నేరుగా మాట్లా డి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నేడు డీఈఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్ -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
పెద్దకొత్తపల్లి: రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్‌లో భాగంగా బుధవారం పెద్దకొత్తపల్లి మండలంలోని దేవుని తిర్మలాపూర్ నుంచి వెన్నచర్ల గుండా నక్కలపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 70 ఏళ్లలో భారత రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు, మహనీయుల ఆలోచనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ చేపట్టినట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, మాజీ సర్పంచులు సత్యం, రాధ, రవికుమార్, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
బడికి పోదాం.. చలో చలో
సాక్షి, నాగర్‌కర్నూల్/కందనూలు: జిల్లాలోని పాఠశాలలు పునఃప్రారంభానికి ముస్తాబయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను పండుగ వాతావరణంలో ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పాఠశాలలను సుందరంగా అలంకరించారు. విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం శానిటేషన్ పనులు ముమ్మరంగా చేపట్టారు. పాఠశాలల పరిసరాలతో పాటు మూత్రశాలలు, మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. తాగునీటి వసతులను పరిశీలించి, అవసరమైన వాటికి మరమ్మతు చేయించారు. పండగ వాతావరణంలో బడుల్లో విద్యాబోధన చేపట్టేందుకు వీలుగా పరిశుభ్రత, ఆహ్లాదానికి ప్రాధాన్యతనిస్తూ ఉపాధ్యాయులు పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. ● విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు ఇప్పటికే జిల్లాకు చేరగా.. డీఈఓ పర్యవేక్షణలో వాటిని ఆయా మండలాలకు చేరవేశారు. అక్కడి నుంచి పాఠశాలల ఉపాధ్యాయులకు పంపిణీ చేస్తున్నారు. విద్యార్థులకు మొదటి రోజు నుంచే పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేపట్టనున్నారు. అయితే అనేక పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌలిక వసతుల పనులు ఇంకా పూర్తి కాలేదు. కాగా, బడిబాట కార్యక్రమంలో ఇప్పటి వరకు 2,311 మంది విద్యార్థులను చేర్పించారు. 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం జిల్లాలో 560 ప్రాథమిక, 126 ప్రాథమికోన్నత, 153 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 54,898 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి మొత్తం 3,98,660 పాఠ్యపుస్తకాలు అవసరం కాగా.. ప్రస్తుతం జిల్లాకు 3,65,370 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. మిగిలిన పుస్తకాలను కూడా త్వరలో జిల్లాకు తెప్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే విధంగా 56,733 యూనిఫామ్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని కూడ త్వరలో సిద్ధం చేయనున్నారు. విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను గ్రామాల్లో సెర్ప్, అర్బన్‌లో మెప్మాకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈసారి సరికొత్తగా విద్యాబోధన.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలల్లో అదనపు అంశాలతో విద్యార్థులకు విద్యాబోధన కొనసాగనుంది. అధునాతన సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రాథమిక స్థాయి నుంచే ఆయా సబ్జెక్టుల్లో అభ్యసన కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రాథమిక స్థాయిలోనే తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించడంతో పాటు వారికి ఏఐ ఆధారిత అభ్యసన కార్యక్రమాన్ని అమలుచేయనున్నారు. ఇందుకోసం ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఐదు వరకు కంప్యూటర్లను సమకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాం. జిల్లాకు చేరిన పుస్తకాలను ఇప్పటికే పాఠశాలలకు పంపించాం. మిగిలిన పుస్తకాలను కూడా త్వరలో తెప్పిస్తాం. – రమేశ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం విద్యార్థుల రాకకోసం సర్కారు బడుల ముస్తాబు మౌలిక వసతుల కల్పనలోఅధికారుల నిమగ్నం పండుగ వాతావరణంలో విద్యాసంవత్సరం ప్రారంభించేందుకు ఏర్పాట్లు -
డయేరియా నివారణకు రోటసిల్ వ్యాక్సిన్
నాగర్‌కర్నూల్ క్రైం: చిన్నారుల్లో డయేరియా నివారణ కోసం రెండు డోస్‌ల రోటసిల్ వ్యాక్సిన్ పంపిణీ చేస్తున్నామని.. అందరూ సద్వినియోగం చేసుకోవాలని డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈదమ్మగుడి ఆరోగ్య ఉప కేంద్రంలో చిన్నారులకు రోటసిల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 178 ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోటసిల్ వ్యాక్సినేషన్ ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో చిన్నారులకు ఒక డోస్ రోటవైరస్ వ్యాక్సిన్ వేశామని తెలిపారు. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు డోస్‌ల రోటసిల్ వ్యాక్సిన్ వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకటదాస్, జిల్లా టీకాకరణ అధికారి డా.రవికుమార్, డా.వాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేయాలి
నాగర్‌కర్నూల్: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్లు పి.అమరేందర్, దేవ సహాయం, అడిషనల్ ఎస్పీ రామేశ్వర్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులతో కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, నీలాదేవి, రాంబాబు నాయక్, రేణికుంట్ల ప్రవీణ్‌తో కలిసి చైర్మన్ సమావేశమై.. అట్రాసిటీ కేసుల దర్యాప్తులో పురోగతి, ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. అన్ని రకాల పెండింగ్ కేసులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆయన సమీక్షించారు. ముఖ్య ప్రణాళికాధికారి పరిధిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టవద్దన్నారు. ఎక్కడైనా నిధులు దుర్వినియోగం జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, కులాంతర వివాహాలు, అంబేడ్కర్ విద్యా పథకం తదితర వాటిపై గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీవీఎంసీ)ని వెంటనే ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్షతను నిరోధించడానికి, వారి హక్కులను రక్షించడానికి జిల్లాలో పకడ్బందీగా పౌరహక్కుల దినోత్సవాన్ని విరివిగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న కలెక్టర్, విద్యాశాఖ అధికారిని చైర్మన్ అభినందించారు. ● కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారం, నష్టపరిహారం చెల్లింపులు, రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు వంటి వివరాలను కమిషన్ చైర్మన్‌కు కలెక్టర్ వివరించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలతో జిల్లా రాష్ట్రస్థాయిలో 13వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కోటా మేరకు ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువవికాసం పథకాలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. ముందుగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌కు కలెక్టర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి చైర్మన్ గౌరవ వందనం స్వీకరించారు. అదే విధంగా పలువురు వివిధ సమస్యలపై చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అట్రాసిటీ కేసుల పరిష్కారానికి చొరవ చూపాలి నిధులు పక్కదారి పడితే సహించం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు
నాగర్‌కర్నూల్: ప్రజా ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా తాను కృషి చేస్తున్నట్లు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు పొందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
రూ. 4.29కోట్లతో మరమ్మతులు
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల భవనాలకు మరమ్మతు నిమిత్తం రూ. 4.29కోట్లు మంజూరు కాగా.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పనులు కొనసాగుతున్నాయి. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, లైట్లు, బోర్డుల ఏర్పాటు, ఇతరత్రా పనులు చేపడుతున్నారు. మొత్తం 411 పాఠశాలల భవనాల మరమ్మతు కోసం ప్రతిపాదనలు పంపగా.. 110 బడుల్లో వందశాతం పనులను పూర్తిచేశారు. 162 బడుల్లో పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 139 పాఠశాలల్లో పనులు ఇంకా మొదలుకాలేదు. ఈ నెలాఖరులోగా పనులను పూర్తి చేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం నిర్ణీత సమయానికి పనులు పూర్తయ్యేలా కనిపించడం లేదు. -
కేసుల పరిష్కారానికి చొరవ చూపండి
నాగర్‌కర్నూల్ క్రైం: జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ అయ్యే కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు చొరవ చూపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా సూచించారు. బుధవారం జిల్లా కోర్టు సముదాయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌లో రాజీ అయ్యే క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులతో పాటు పెట్టి కేసులు, డ్రంకెన్ డ్రైవ్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. చిన్నచిన్న కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే ఉత్తమమని.. జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సివిల్ కేసుల్లో కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని తెలిపారు. సమావేశంలో సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్‌జడ్జి ఎన్.శ్రీనిధి ఉన్నారు. -
జడ్జిని కలిసిన కలెక్టర్
నాగర్‌కర్నూల్ క్రైం: ఇటీవల జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన డి.రమాకాంత్‌ను బుధవారం కలెక్టర్ బాదావత్ సంతోష్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు సముదాయంలో న్యాయమూర్తికి పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరువురు కొంతసేపు సమావేశమై జిల్లా స్థితిగతులపై చర్చించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని కలెక్టర్ అన్నారు. జిల్లా పరిపాలన, న్యాయ వ్యవస్థ సమన్వయం, సహకారంతో జిల్లా ప్రజలకు మరింత మెరుగైన న్యాయ సేవలు అందించేలా కృషి జరగాలని ఇరువురు అభిప్రాయపడ్డారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలు కందనూలు: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి సంబంధిత అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాన్ని బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ బదావత్ సంతోష్, డీవైఎస్ఓ సీతారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీవైఎస్ఓ మాట్లాడుతూ.. ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో ఎంపికై న విద్యార్థులకు రాష్ట్రస్థాయిలో జూలై 1 నుంచి 5వ తేదీ వరకు ఎంపికలు ఉంటాయన్నారు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 30వ తేదీ మధ్య జన్మించిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు డీవైఎస్ఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో కలశాభిషేకం బిజినేపల్లి: జ్యేష్టమాసం పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీమన్నారాయణాచార్యుల ఆధ్వర్యంలో పలువురు దంపతులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో కలశాభిషేకాలు చేశారు. అదే విధంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక సభ్యులు సందడి ప్రతాప్‌రెడ్డి, కొర్త చంద్రారెడ్డి, గుబ్బ సత్యనారాయణ, కృష్ణారెడ్డి, జక్పారెడ్డి, చెన్న కృష్ణారెడ్డి, మట్పూరి నాగేశ్వర్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లు రద్దుచేసే వరకు పోరాటం కల్వకుర్తి రూరల్: కార్మికులకు నష్టం చేకూర్చే నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు అన్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథకం కార్మికులతో కలిసి మండల విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసేలా లేబర్ కోడ్లను తీసుకురావడమే కాకుండా వివిధ రంగాల కేంద్ర పథకాలకు బడ్జెట్లో కోత విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 20ఏళ్లుగా మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు సైతం బడ్జెట్ తగ్గించడం బాధాకరమన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం జూలై 9న సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకు ముందు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో ఆంజనేయులు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో నిర్మల, లక్ష్మి, అన్నపూర్ణ, యాదమ్మ, సువర్ణ, పర్వీన్, సాయమ్మ, అలివేల పాల్గొన్నారు. -
పశుసంవర్ధక శాఖ మంత్రిగా వాకిటి శ్రీహరి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో రెండో దఫా చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి పాలమూరులోని మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన ఈ నెల 8న మరో ఇద్దరు మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేశారు. అయితే రెండు రోజులుగా ఆయనకు ఏ శాఖలు కేటాయిస్తారనే అంశంపై ఉమ్మడి జిల్లాలో నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. బుధవారం రాత్రి శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కాగా.. వాకిటి శ్రీహరికి రాష్ట్ర పశుసంవర్ధకశాఖ, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు దక్కాయి. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మక్తల్ నుంచి మూడో వ్యక్తి.. ఉమ్మడి ఏపీలో సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి హయాంలో తొలిసారిగా నారాయణపేటకు చెందిన రాంచందర్ కల్యాణి మార్కెటింగ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. 1994లో టీడీపీ నుంచి మక్తల్ ఎమ్మెల్యేగా ఎల్లారెడ్డి గెలుపొందగా.. ఆయనకు 1997లో మార్కెటింగ్ శాఖ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మూడో పర్యాయం 2023లో జరిగిన ఎన్నికల్లో మక్తల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరికి ఈ నెల 8న మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పాడి అభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖలు కూడా.. మక్తల్‌కు మూడుసార్లు దక్కిన అమాత్యగిరి -
నీలినీడలు
నాగర్కర్నూల్బుధవారం శ్రీ 11 శ్రీ జూన్ శ్రీ 2025● పాలమూరులోనిరుపయోగంగా చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాలు ● కొత్త కేంద్రాల ఏర్పాటుపైనా అధికారుల నిర్లక్ష్య వైఖరి ● పుష్కలంగా నీటి వనరులున్నా నిష్ప్రయోజనం ● క్షేత్రస్థాయిలో సమస్యలపై దృష్టిపెట్టని ప్రభుత్వం ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగానష్టపోతున్న మత్స్యకారులు న్యూస్‌రీల్ ‘మీన’మేషాలు -
కేజీబీవీల అప్‌గ్రేడ్
● జిల్లాలో కొత్తగా 9 కస్తూర్బాల్లోఇంటర్ తరగతులు ప్రారంభం ● ఈ ఏడాది నుంచే కృత్రిమ మేధ (ఏఐ) బోధన ● అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సులకు ప్రాధాన్యం ● మెరుగైన విద్య, భోజనం, వసతి కల్పనతో పెరిగిన డిమాండ్ ● పేద, మధ్య తరగతి బాలికలకు వరంగా మారిన విద్యాలయాలు అచ్చంపేట: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)ను ఇంటర్మీడియట్ వరకు అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించగా.. సానుకూల స్పందన వచ్చింది. దీంతో పేదరికంతో తల్లిదండ్రులు చదివించే స్తోమత లేక, స్థానికంగా పాఠశాలలు అందుబాటులో లేక, మధ్యలో చదువు మానేసిన, బడిబయటి ఆడపిల్లలకు రెసిడెన్షియల్ విద్య అందించేందుకు కేంద్రం 2005 సంవత్సరంలో కేజీబీవీలను నెలకొల్పింది. ఈ పాఠశాలలు అనాథ, పేద, మధ్య తరగతి కుటుంబాల బాలికలకు వరంగా మారాయి. భోజనం, వసతి కల్పించడంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తుండటంతో క్రమంగా వీటిలో ప్రవేశాలకు పోటీ పెరిగింది. 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న కొన్ని పాఠశాలల్లో 2018లో ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టారు. తాజాగా అన్ని పాఠశాలల్లో ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేసేందుకు కేంద్రం అంగీకరించగా నిరుపేద విద్యార్థినులకు మేలు జరగనుంది. దీంతోపాటు కేజీబీవీలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) తరగతులు ప్రవేపెట్టాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. స్వయం ఉపాధి కోర్సులు కేజీబీవీ కళాశాలలో 160 ఎంపీసీ, బైపీసీ కోర్సులు ఉండగా.. మరికొన్నింట్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ఉన్నాయి. కొత్తగా ప్రారంభించనున్న ఇంటర్మీడియట్ తరగతుల్లో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తోపాటు అకౌంటింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంపీహెచ్‌డబ్ల్యూ వంటి డిమాండ్ ఉన్న కోర్సులను ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. విద్యార్థులకు భవిష్యత్‌లో స్వయం ఉపాధి పొందేలా వృత్తి విద్యా కోర్సులతోపాటు కుట్లు, అల్లికలు, కరాటే వంటి వాటిలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ పాఠశాలలో చదివే వారు చదువుతోపాటు స్వయం ఉపాధి కోర్సులు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అప్‌గ్రేడ్ చేసినవి ఇవే.. అచ్చంపేట కేజీబీవీలో ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఏఐ కోర్సులు, కోడేరులో కంప్యూటర్ సైన్స్, ఏఐ, పదరలో సీఈసీ, అకౌంటింగ్, తాడూరులో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, పెద్దకొత్తపల్లిలో కంప్యూటర్ సైన్స్, ఏఐ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, తిమ్మాజిపేటలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఉప్పునుంతలలో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఊర్కొండలో ఎంపీహెచ్‌డబ్ల్యూ, ఏఐ, వంగూరులో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులతో ఇంటర్ విద్య ప్రారంభించనున్నారు. అందుబాటులో 720 సీట్లు జిల్లాలో 20 కేజీబీవీలు ఉండగా.. ఇప్పటికే 11 చోట్ల ఇంటర్ విద్య అందుబాటులో ఉంది. ఈ ఏడాది ప్రభుత్వం మిగిలిన 9 చోట్ల కూడా ఇంటర్ విద్యకు అనుమతించింది. అన్ని కేజీబీవీల్లో ఇంటర్ విద్య అందుబాటులోకి రాగా.. మొదటి సంవత్సరంలో చేరికకు 720 సీట్లు ఉన్నాయి. నాలుగు కేజీబీవీలో ఏఐతోపాటు కొత్తగా అకౌంటింగ్ కోర్సుల వల్ల బాలికల విద్యకు మంచి భవిష్యత్ లభిస్తుంది. – శోభారాణి, జీసీడీఓ -
రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
తెలకపల్లి: రైతుల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం తెలకపల్లిలో నిర్వహించిన భూ భారతి సదస్సును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులు రైతుల సమస్యల పరిష్కారం కోసమే జరుగుతున్నాయని, రైతులు తమ భూ సమస్యలను పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అనంతరం బడిబాట కార్యక్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను బడీడు పిల్లలను నమోదు చేయాలని, విద్యార్థుల సంఖ్యను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఉచిత వసతులు ఉంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలుపుతూ విద్యార్థుల సంఖ్యను పెంచాలని సూచించారు. పాఠశాలల పునఃప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షల నిర్వహణాధికారి రాజశేఖర్‌రావు, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
నాగర్‌కర్నూల్ క్రైం: ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అని, జాతీయ లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్‌బౌన్స్, ట్రాఫిక్ చలానా, ఎకై ్సజ్, అన్ని రకాల సివిల్ కేసులతోపాటు కోర్టు వరకు రాకుండా ఉన్న బ్యాంకు, చిట్‌ఫండ్ పెండింగ్‌లో ఉన్న కేసులను కూడా పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీలు లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని కోర్టుల ప్రాంగణాల్లో కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవడంతో ఇరువర్గాలు సంతోషంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నసీం సుల్తానా తదితరులు పాల్గొన్నారు. నెలాఖరు వరకు రేషన్ పంపిణీ నాగర్‌కర్నూల్: జిల్లాలోని రేషన్ కార్డుదారులు తమ రేషన్ తీసుకునేందుకు ఈ నెలాఖరు వరకు పొడిగించామని కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రజా పంపిణీ సన్నబియ్యం ఈ నెలలోనే మూడు నెలలకు సంబంధించిన రేషన్ పంపిణీ చేస్తున్నందున ఈ నెలాఖరు వరకు తమకు కేటాయించిన బియ్యం పొందవచ్చన్నారు. లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా పరిధిలో ఇప్పటికే 558 రేషన్ షాపులకు గాను 425 రేషన్ షాపులకు బియ్యం పంపిణీ చేశామని చెప్పారు. 16న వేలం పాట బిజినేపల్లి: మండలంలోని పాలెం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సంవత్సరం వరకు కొబ్బరి చిప్పల సేకరణ, పూలు, పూలదండలు అమ్ముకోవడానికి హక్కుల కోసం ఈ నెల 16న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ రంగారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 10 నుంచి వేలం పాట ఉంటుందని, వేలంలో పాల్గొనేవారు డిపాజిట్ రుసుం చెల్లించాలన్నారు. పూర్తి వివరాల కోసం సెల్ నంబర్లు 80747 76229, 79817 07326లను సంప్రదించాలని సూచించారు. దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల స్వీకరణ నాగర్‌కర్నూల్: రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ద్వారా జిల్లాలో దివ్యాంగులకు ఉచితంగా సహాయ ఉపకరణాలను మంజూరు చేస్తుందని కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన దివ్యాంగులు ఈ నెల 18 వరకు ఆన్లైన్లో తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఒక సహాయ ఉపకరణం మాత్రమే మంజూరు చేస్తామని చెప్పారు. పీజీ మూడో సెమిస్టర్ ఫలితాలు విడుదల మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో పీజీ 3వ సెమిస్టర్, ఎంసీఏ, ఎంబీఏ పరీక్ష ఫలితాలను పీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాస్ మంగళవారం విడుదల చేశారు. మొత్తం 84.83శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ కె.ప్రవీణ పేర్కొన్నారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవాలని, ఏమైనా సందేహాలుంటే త్వరలో రీకౌంటింగ్‌కు నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రకిరణ్, కోఆర్డినేటర్ డాక్టర్ అరుంధతి, డాక్టర్ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
సాక్షి, నాగర్‌కర్నూల్: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచ వ్యాప్తమైందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కూలంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని గుర్తు చేశారు. మేక్ ఇన్ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని, మోదీ పాలన ఓ స్వర్ణయుగం అని వివరించారు. పెహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి ఘటనను పాక్ ప్రధానే ఒప్పుకున్నా.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్‌ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, పట్టణాధ్యక్షుడు ప్రమోద్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, యువమోర్చ జిల్లా కార్యదర్శి నరేష్‌చారి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు -
ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు అడిగితే చర్యలు
తిమ్మాజిపేట: ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తేవాలని ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పలువురు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇళ్ల మంజూరైందని ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైన డబ్బులు ఇచ్చినట్లు తెలిసినా రద్దు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించారని, ఇందులో తన సొంత మండలం కంటే తిమ్మాజిపేటకే ఎక్కువగా 510 ఇళ్లు ఇచ్చామన్నారు. మరో రెండు విడతల్లోనూ ఇళ్లు వస్తాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలలో ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందేలా చూస్తామన్నారు. నన్ను ఆదరించి ఈ స్థానంలో నిలబెట్టారు.. మీకు అండగా ఉంటానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీదేవి, నాయకులు వెంకట్రామరెడ్డి, మల్లయ్యగౌడ్, శ్రీనివాస్, వివేక్‌రెడ్డి, ఉస్మాన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి
పెద్దకొత్తపల్లి: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషిచేస్తోందని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం పెద్దకొత్తపల్లిలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. అలాగే విద్యార్థులకు ఉచితంగా యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, మధ్యాహ్న భోజనం సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా అవగాహన కల్పించారు. ఇంటింటి ప్రచారం బడిబాటలో బడిఈడు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల వసతుల కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న శానిటేషన్ కార్మికులు పరిశుభ్రతపై ఇస్తున్న శిక్షణ తరగతులల్లో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మూత్రశాలలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. డీఈఓ వెంట ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు తదితరులున్నారు. -
అమ్మమాట.. అంగన్వాడీ బాట
వినూత్న కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం అచ్చంపేట: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య ఎంతో కీలకం. వారు పాఠశాలల్లో చేరే నాటికి అక్షరాలు, అంకేలు నేర్పి అటపాటలతో కూడిన విద్య అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రెండున్నరేళ్లు దాటిన చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించేందుకు మంగళవారం నుంచి 17వ తేదీ వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో‘అమ్మమాట–అంగన్వాడీ బాట’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న సామూహికంగా అక్షరభ్యాసం చేయించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలోనే అంగన్వాడీ కేంద్రాల్లో నమోదైన చిన్నారులకు ఉచితంగా యూనిఫాం అందించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మానసిక ఒత్తిడికి లోనుకాకుండా.. ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీప్రైమరీ విద్య అందిస్తున్నారు. పిల్లలపై ఎలాంటి మానసిక ఒత్తిడి కలగకుండా నిపుణుల సూచన మేరకు ఆటలు, పాటలు, కథల ద్వారా చిన్నారులకు చదువుపై ఆసక్తి పెంపొందిస్తున్నారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా సిలబస్ రూపొందించారు. అంగన్వాడీ కేంద్రాల చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి యూనిఫాం అందజేస్తోంది. బడిబాట పట్టేలా.. అంగన్వాడీ కేంద్రాల్లోని 3–6 ఏళ్ల పిల్లలను బడిబాట పట్టించేందుకు సిద్ధం చేస్తున్నారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్స్‌గా భావించే వారు. చిన్నారులు పాఠశాల వాతావరణానికి అలవాటయ్యేలా.. పౌష్టికాహారం అందించి, ఆటలు ఆడించి, బడి అంటే భయం పోగొట్టే కేంద్రాలు అని అనుకునేవారు. అయితే గతేడాది నుంచి మార్పులు తెచ్చారు. కేవలం పౌష్టికాహారం అందించడం, ఆటపాటలతో గడపడమే కాకుండా.. వారికి విజ్ఞానాన్ని అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వర్క్‌బుక్కులు అందించి.. వారితో హోంవర్క్ చేయిస్తున్నారు. ఎల్కేజీ వారికి తంగేడు పువ్వు పేరుతో నాలుగు పుస్తకాలు, యూకేజీ వారికి పాలపిట్ట పేరిట ఐదు పుస్తకాలు రూపొందించి ఆటపాటలతో బోధించారు. ప్రస్తుతం నిపుణ్ బారత్ ద్వారా వచ్చిన ప్రియదర్శిని పుస్తకంతో సులభ పద్ధతుల్లో విద్యా బోధనతో చిన్నారుల మేధస్సు వికసించనుంది. అంగన్వాడీ కేంద్రాలు: 1,131 జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు: 4 ఆరేళ్లలోపు చిన్నారుల సంఖ్య: 46,229 గర్భిణులు: 5,745 బాలింతలు: 3,772ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట–అంగన్వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తాం. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు అలవాటు చేసి ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్య అందించడమే ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి అంగన్వాడీ టీచర్, ఆయాలు కృషి చేయాలి. – రాజేశ్వరి, డీడబ్ల్యూఓ రెండున్నరేళ్లు పైబడిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చర్పించడమే లక్ష్యం నేటి నుంచి 17వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు -
హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు..
ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చా. పనులు దొరక్కపోవడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉండేవాడిని. ఓ వ్యక్తి పరిచయమై చేపల కంపెనీలో పనిచేసేందుకు పిలిచాడు. అడ్రస్ చెప్పలేదు. అతడి వెంట వచ్చా. మల్లేశ్వరంలో ఓ వ్యక్తికి అప్పగించాడు. 5 నెలలుగా కృష్ణానదిలో చేపల వలలు లాగే పనులు చేశా. రోజు అన్నంతోపాటు కారంపొడి పెట్టేవారు. లేదంటే చేపలు వండుకొని తినాలి. రాత్రి, పగలు పనిచేయాలి. పని చేయలేమంటే కొట్టేవారు. మూత్రానికి వెళ్లినా ఒకరిద్దరు మాకు కాపలా ఉంటారు. పనిచేసినందుకు జీతాలు మాత్రం ఇవ్వలేదు. అధికారులు జీతాలు ఇప్పించకుండానే మా ఊళ్లకు పంపించారు. – రాహుల్, బెంగుళూరు ● -
పాఠశాలల పనితీరు మెరుగుపరుస్తాం
నాగర్‌కర్నూల్: ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపరిచి.. జిల్లాలో విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమశాఖ మంత్రి సీతక్క కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. పాఠశాలల పునఃప్రారంభం రోజున విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, మహిళల అభ్యున్నతికి సోలార్ విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంక్‌ల ఏర్పాటు, స్వయం సహాయక మహిళా సంఘాల భవనాల నిర్మాణాలు, సంఘాల్లో కోటి మంది మహిళలను చేర్చడం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీనే ప్రతి విద్యార్థికి యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు అందిస్తామన్నారు. పాఠశాలల పునఃప్రారంభోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూస్తామన్నారు. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని.. బడిఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలతో పెట్రోల్ బంక్‌ల ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణ పూర్తి చేస్తామన్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులను నవంబర్ నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచినట్లు వివరించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదుల్లో విద్యార్థులను కూర్చొబెట్టకుండా చూస్తామని కలెక్టర్ తెలిపారు. పుస్తకాలు, యూనిఫాంల పంపిణీకి సిద్ధం బడిఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించేందుకు చర్యలు కలెక్టర్ బదావత్ సంతోష్ -
పోలీస్ ప్రజావాణికి 12 ఫిర్యాదులు
నాగర్‌కర్నూల్ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు ఎస్పీ రామేశ్వర్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 12 ఫిర్యాదులు అందగా.. 6 భూ తగాదాలపై, 4 వివిధ కేసుల్లో న్యాయం చేయాలని, 2 భార్యాభర్తల గొడవలపై ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. పేదల పక్షాన నిరంతర పోరాటం తాడూరు: పేదల పక్షాన సీపీఐ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ అన్నారు. సోమవారం తాడూరు మండలం నాగదేవపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదల జీవన మార్పునకు నాంది పలికిన జెండా ఎర్రజెండా అని అన్నారు. దోపిడీ, అన్యాయం, అణచివేత ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు భరత్, నాయకులు వార్ల వెంకటయ్య, జంగన్న ఉన్నారు. స్పాట్ కౌన్సెలింగ్ వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సీఈసీలో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 15న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గిరిజన సంక్షేమ కళాశాల ప్రిన్సిపాల్ సరస్వతి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కేవలం ఎస్టీ బాలికలకు మాత్రమే అవకాశం ఉంటుందని.. అన్ని ధ్రువపత్రాలతో కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 94909 57315 సంప్రదించాలని సూచించారు. -
పునరావాస పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, నాగర్‌కర్నూల్: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం చేపట్టిన పునరావాస పనులను వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఎల్లూరు శివారులోని సొరంగం సమీపంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. అందుకు బదులుగా మరో చోట ఎత్తైన ప్రాంతంలో చేపట్టాలన్న నిర్వాసితుల డిమాండ్‌ను పరిశీలించాలని సూచించారు. బోడబండతండా, సున్నపుతండా, దూల్యానాయక్తండా, అంజనగిరి తండా, వడ్డె గుడిసెలు తదితర గ్రామాలకు చెందిన 117 మంది నిర్వాసితుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటుచేసిన నార్లాపూర్, ఎల్లూర్ గ్రామాల నిర్వాసితులకు ఇంకా పూర్తిస్థాయిలో పరిహారం అందాల్సి ఉండగా, త్వరగా చెల్లించాలని ఆదేశించారు. -
పేదల సొంతింటి కల సాకారం
చారకొండ: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. చారకొండ రైతువేదికలో సోమవారం 240మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. అనంతరం ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలు అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొదటి జాబితాలో పేరు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ బాలాజీ సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్, తహసీల్దార్ సునీత, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, మాజీ జెడ్పీటీసీ వెంకట్‌గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాల్‌రాంగౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు వెంకటయ్య యాదవ్, మహేందర్, జైపాల్ పాల్గొన్నారు. -
రైతులకు ‘మద్దతు’
14 రకాల పంటల ధరలు పెంచిన కేంద్రం ●మద్దతు సరిపోదు.. ప్రస్తుతం సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఎకరం పత్తి సాగుకు సుమారు రూ.45 వేలు పెట్టుబడి అవుతుండగా దిగుబడి మాత్రం 8 నుంచి 10 కింటాళ్లు వస్తుంది. కేంద్రం క్వింటాకు కేవలం రూ.589 పెంచింది. మద్దతు ధర మరింత పెంచి క్వింటాకు రూ.పది వేలు ధర చెల్లిస్తే రైతుకు మేలు జరుగుతుంది. – సూగురు లింగస్వామి, రైతు, రాయిపాకుల వానాకాలం నుంచి అమలు.. కేంద్ర ప్రభుత్వం పంటలకు పెంచిన మద్దతు ధర ఈ వానాకాలం నుంచి అమలులోకి వస్తుంది. మద్దతు ధర పెంపుతో రైతులకు కొంత మేలు జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి. – చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి ● పత్తికి రూ.589.. వరికి రూ.69 మాత్రమే... ● వానాకాలం నుంచి అమలులోకి.. ● జిల్లాలో 5.38 లక్షల ఎకరాల్లో పంటల సాగు -
మైసమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
పెద్దకొత్తపల్లి: మండలంలోని నాయినోనిపల్లి మైసమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. మృగశిర కార్తె రావడంతో వివిధ గ్రామాల భక్తులు భారీగా సొంత వాహనాల్లో పోట్టేళ్లను తీసుకొచ్చి అమ్మవారికి బలిచ్చి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. ఈ ఒక్కరోజే సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి : సీపీఐ పెంట్లవెల్లి: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో చిన్న కుర్మయ్య అధ్యక్షతన సీపీఐ ఒకటో మహాసభ నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అభివృద్ధే లక్ష్యంగా పోరాటాలు కొనసాగిస్తామని.. వందేళ్ల చరిత్ర గల పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని తెలిపారు. చరిత్రలో పదవులున్నా.. లేకున్నా కార్మిక, కర్షక, పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ తమదని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న కొల్లాపూర్ కమ్యూనిస్ట్‌ల పోరాటం ఫలితంగా సాధించుకున్న కేఎల్‌ఐతో అభివృద్ధి దిశగా సాగుతుందని, నియోజకవర్గంలో లభించే ముడి సరుకుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మండలంలో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దేశంపై జరుగుతున్న దాడులపై సమాధానం ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మోసాలను త్వరలోనే ఎండగడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఏఎల్ రాష్ట్ర కార్యదర్శి బత్తిని రాము, జిల్లా కార్యదర్శి చిన్న కుర్మయ్య, తుమ్మల శివుడు, కిరణ్‌కుమార్, వంక గోపాల్, దేవ సహాయం, నిరంజన్, సువర్ణ, నర్సింహ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్‌లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు. కోయిల్‌సాగర్‌లో పెరుగుతున్న నీటిమట్టం దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.7 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉంది. పాత అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు కాగా.. గేట్ల స్థాయి వరకు 32.6 అడుగులు. జూరాల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు పాత అలుగుకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది. -
సర్పంచ్ టు మంత్రి..
అంచెలంచెలుగా ఎదిగిన ముదిరాజ్ బిడ్డ వాకిటి శ్రీహరి సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో మరో పాలమూరు వాసికి చోటు దక్కింది. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి.. అంచెలంచెలుగా ఎదిగిన మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిని అమాత్య పదవి వరించింది. ఈ మేరకు హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ఆదివారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు మంత్రి పదవి రావడంతో బీసీ సంఘాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. తాజాగా వాకిటి శ్రీహరికి మంత్రి పదవి దక్కడం పాలమూరుకు వరమని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నేపథ్యం.. ● వాకిటి శ్రీహరి 1990 నుంచి 1993 వరకు ఎన్ఎస్యూఐ మక్తల్ మండల ప్రెసిడెంట్‌గా.. 1993–1996 వరకు యూత్ కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షుడిగా.. 1996 నుంచి 2001 వరకు మక్తల్ మండల కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. ● 2001–2006 వరకు మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధిక మెజార్టీ సాధించి రికార్డుల్లోకెక్కారు. ● 2001–2006 ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ● 2006 నుంచి 2011 వరకు వాకిటీ శ్రీహరి సతీమణి వాకిటి లలిత దాసర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. 2006 నుంచి 2011 వరకు ఆమె కాంగ్రెస్ మక్తల్ మండల అధ్యక్షురాలిగా పనిచేశారు. ● 2006 నుంచి 2012 వరకు వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్‌గా.. 2006 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ● 2014 నుంచి 2018 వరకు వాకిటి శ్రీహరి మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా సేవలందించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనే రెండో మెజార్టీ స్థానంలో నిలిచారు. 2014 నుంచి 2018 వరకు కాంగ్రెస్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్‌గా.. 2014 నుంచి 2018 వరకు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ● 2018 నుంచి వాకిటి శ్రీహరి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో కలిసి పనిచేశారు. ● 2019లో వాకిటి శ్రీహరి సోదరుడి భార్య రాధిక మక్తల్ మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా పనిచేశారు. ● 2022 సెప్టెంబర్ 03 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ● 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. సమీప బీఆర్ఎస్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డిపై 17,525 ఓట్లతో గెలుపొందారు. తాజాగా రెండో దఫాలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కేబినెట్లో చోటుదక్కించుకున్నారు. వాకిటి శ్రీహరి విద్యార్థి దశలో యూత్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయుడిగా ముద్రపడిన ఆయనకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. దీంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన క్రమంలో మంత్రివర్గంలో బీసీలకు, అందులోనూ ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారికి చోటు కల్పించాలన్న డిమాండ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ సైతం ముదిరాజ్‌కు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గెలిచిన ఎమ్మెల్యేలలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే శ్రీహరి ఒక్కరే కాగా.. విధేయత, సామాజిక సమీకరణాలు ఆయనకు కలిసి వచ్చాయని.. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. వ్యవసాయ కుటుంబం నుంచి.. మక్తల్ పట్టణం నేతాజీ నగర్‌కు చెందిన వాకిటి శ్రీహరిది తొలుత వ్యవసాయ కుటుంబం కాగా.. కాంగ్రెస్‌లో చేరి క్రమక్రమంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్‌తో పాటు పార్టీలో మండల, ఉమ్మడి జిల్లా, విభజన అనంతరం నారాయణపేట జిల్లాలో వివిధ హోదాల్లో సేవలందించారు. వాకిటి శ్రీహరి తల్లి రాములమ్మ స్టాఫ్ నర్స్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. స్థానికంగా వేలాది మంది నిరుపేద మహిళలకు ఉచితంగా కాన్పులు చేసి రాములమ్మ సిస్టర్‌గా పేరు సాధించారు. తండ్రి వాకిటి నరసింహులు వ్యవసాయంతో పాటు చిన్నపాటి కాంట్రాక్టర్‌గా పనిచేశారు. వీరికి మొత్తం ఆరుగురు సంతానం కాగా.. నాలుగో కాన్పులో శ్రీహరి జన్మించారు. విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్న ఆయన డిగ్రీ (బీఏ) దాకా విద్యాభ్యాసం కొనసాగించారు. 1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన మక్తల్ సర్పంచ్‌గా, జెడ్పీటీసీ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తాజాగా సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. మంత్రి వాకిటి శ్రీహరి అమ్మమ్మ ఇంట్లో సంబరాలు నారాయణపేట: మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి వర్గంలో చోటు కల్పించడం, ఆదివారం ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో జిల్లా కేంద్రంలోని మంత్రి అమ్మమ్మ పోషల్ శివమ్మ ఇంటా సంబరాలు అంబరాన్నంటాయి. శివమ్మ కుటుంబ సభ్యులు గొడుగుగేరిలోని అంజనేయస్వామి దేవాలయం దగ్గర టపాకులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. చిన్నారులు నృత్యాలు చేస్తూ ఆనందంగా డప్పు వాయిస్తూ కేరింతలు కొట్టారు. సత్యనారాయణ చౌరస్తాలో సైతం కుటుంబ సభ్యులందరూ మిఠాయిలను పంపిణీ చేశారు. విధేయత.. సామాజిక సమీకరణాలు.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే మంత్రి.. వ్యవసాయ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి.. కుటుంబంలో అందరూ విద్యావంతులే.. తొలిసారి ఎమ్మెల్యే.. తొలిసారే అమాత్యగిరి గతంలో ఎల్లారెడ్డి, పి.చంద్రశేఖర్, పులి వీరన్న, చిత్తరంజన్‌దాస్, శ్రీనివాసరావుకు అవకాశం బీసీ వర్గాలతో పాటు ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు 2023 ఎన్నికల్లో మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వాకిటి శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన.. వెంటనే మంత్రి పదవి చేపట్టి ఘనత సాధించారు. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ నుంచి ఎల్కోటి ఎల్లారెడ్డి (మక్తల్), పి.చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్), చిత్తరంజన్‌దాస్ (కల్వకుర్తి), శ్రీనివాసరావు (నాగర్‌కర్నూల్), పులి వీరన్న (మహబూబ్‌నగర్)కు ఈ అవకాశం దక్కగా.. శ్రీహరి వారి సరసన చేరడం విశేషం. కాగా, వాకిటి శ్రీహరితో పాటు ఆయన కుటుంబసభ్యులందరూ విద్యావంతులే. శ్రీహరితో పాటు ఆయన భార్య, ఆయన తమ్ముడు, మరదలు ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజాసేవలోనే ఉన్నారు. -
నెలకు మూడు చీరలు..
గతంలో మాస్టర్ వీవర్స్పై ఆధారపడి మగ్గాలపై చీరలు నేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ప్రస్తుతం కంపెనీ ద్వారా ముడి సరుకులతో పాటు మగ్గాన్ని ఇవ్వడం, తయారు చేసిన చీరలకు మాస్టర్ వీవర్స్ కంటే అధిక ధర వస్తుంది. దీంతో మూడేళ్లుగా నెలకు మూడు జరీ చీరల తయారీతో రూ.12 వేల ఆదాయం పొందుతున్నా. – దాస్పత్తి తిమ్ములు, నేత కార్మికుడు అత్యంత ప్రామాణికంతో.. చేనేత ఉత్పత్తుల సంఘం ఏర్పాటుతో తమకు జీవనోపాధి దొరికినట్లయింది. మాస్టర్ వీవర్స్ వద్ద చీరలు నేయడం వల్ల వారం, పక్షం రోజులకు వేతనాలు అందించేవారు. ప్రస్తుతం సంఘం ద్వారా చీరలు నేస్తూ నెలకు రెండు చీరలను అత్యంత ప్రామాణికంతో తయారు చేయడం వల్ల అధిక డబ్బులు వస్తున్నాయి. నెలలో రెండు చీరల తయారీతో రూ.20– 25 వేల ఆదాయం వస్తుంది. – స్వప్న, నేత కార్మికురాలు స్థల ప్రభావం లేదు.. ఇంట్లో మగ్గాల ఏర్పాటుకు స్థలాలు ఉండేవి కాదు. దీంతో కిరాయి ఇంట్లో ఉంటూ మగ్గాలను నేసుకొని చీరలు తయారు చేసేవాళ్లం. ప్రస్తుతం సంఘం ద్వారా భవనం నిర్మించడం, వీటిలోనే మగ్గాలు ఏర్పాటు చేయడంతో ప్రతిరోజు అక్కడికే వెళ్లి జరీ చీరలు నేస్తూ జీవనం సాగిస్తున్నా. – పద్మ, నేత కార్మికురాలు నెలవారీగా వేతనాలు.. అప్పట్లో యజమానుల ద్వారా డబ్బులు తీసుకుని చీరలు నేసి వాటి ద్వారా అడ్వాన్సుగా తీసుకున్న డబ్బులను చెల్లించేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. స్వయంగా తయారు చేసిన చీరలకు క్రమం తప్పకుండా నెలవారీగా వేతనాలు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నారు. – గంజి కృష్ణయ్య చేనేత అంతరించకుండా.. పుట్టి పెరిగిన ఊరిలో చేనేత కార్మికులు ఉపాధి కోల్పోవడం చూసి సగటు నేత కార్మికుడిగా ఎంతో బాధపడ్డా. ఇలాంటి పరిస్థితుల నుంచి చేనేత పరిశ్రమను కాపాడాలని భావించా. స్వయంగా నేత కార్మికులను యజమానులను చేయాలనుకున్నా. నాబార్డుతో సంప్రదించి కంపెనీ ఏర్పాటుకు ప్రయత్నించా. కార్మికులు, ప్రజల సహకారంతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధుల చొరవతో కంపెనీ ఏర్పాటు చేశాను. 40 మందితో ప్రారంభించి ఇప్పుడు 538 కార్మికులతో కొనసాగుతోంది. వచ్చిన ఆదాయంతో పాటు తయారు చేసిన చీరలకు నెలవారీగా వేతనాలు అందిస్తూ కార్మికుల ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. – మహంకాళి శేఖర్, కంపెనీ సీఈఓ ● -
‘పాలమూరు’కు మరో అమాత్యగిరి
కర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరుకు మరో అమాత్యగిరి దక్కనుంది. నారాయణపేట జిల్లా మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించనుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసిన జాబితాలో ఆయన పేరున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. బీసీ కోటాలో వాకిటితో పాటు రాష్ట్రంలో పలు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు లేదా నలుగురికి సీఎం రేవంత్‌రెడ్డి కేబినెట్లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం మధ్యాహ్నం తర్వాత ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో ఒకే ఒక్క ముదిరాజ్ ఎమ్మెల్యే.. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు మొదటి విడతలో మంత్రి పదవి లభించలేదు. దీంతో ముదిరాజ్‌ల నుంచి విమర్శలు వెల్లువెత్తగా.. రెండో విడతలో చేపట్టే మంత్రి వర్గ విస్తరణలో ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ పెద్దలు సంకేతాలు ఇచ్చారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలుమార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. ముదిరాజ్‌ల విజ్ఞప్తి మేరకు వారిని బీసీ–డీ నుంచి ఏ కేటగిరికి మారుస్తామని.. దీంతోపాటు ఈసారి మంత్రివర్గ విస్తరణలో ముదిరాజ్‌లకు స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఆ సామాజిక వర్గానికి చెంది.. అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో వాకిటి శ్రీహరి మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కూర్పులో ఆయనకు బెర్త్ ఖరారైంది. కాగా.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, కొల్లాపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉండగా ఇప్పుడు శ్రీహరికి బెర్త్ దక్కడంతో.. రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. ఖర్గేతో సాన్నిహిత్యం.. రాహుల్‌తో ప్రశంసలు.. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి మంత్రి పదవి ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి కేబినెట్ బెర్త్ ఖరారు ఫైనల్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. నేడు ప్రమాణస్వీకారం చేసే అవకాశం -
పేదల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
తాడూరు/తెలకపల్లి/బిజినేపల్లి: ఇల్లు అనేది ప్రతి మనిషి కల.. ఆ కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, పేదల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. శనివారం తాడూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరం, తెలకపల్లి, బిజినేపల్లిలోని ఏంజేఆర్ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేసి మాట్లాడారు. తాడూరు మండలం తమకు కలిసొచ్చిందని.. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభిస్తున్నామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేయాలన్నదే తమ లక్ష్యమని.. ప్రజల మద్దతుతో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వివరించారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పక అమలు చేస్తారని చెప్పారు. తాడూరు మండలానికి 500 మంజూరయ్యాయని.. లబ్ధిదారులందరూ త్వరగా నిర్మించుకోవాలని కోరారు. అలాగే తెలకపల్లిలో 619 మంది, బిజనేపల్లి మండలంలో 685 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. తాడూరులో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ఆంజనేయులు, చైర్మన్ రామచంద్రారెడ్డి, పీడీ సంగప్ప, ఏఈ రాజవర్ధన్‌రెడ్డి, సంద రేణుక, యూత్ కాంగ్రెస్ నాయకుడు వినోద్‌కుమార్, తెలకపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు, వైస్ చైర్మన్ మామిళ్లపల్లి యాదయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిన్న జంగయ్య, ప్రకాష్, ఖుర్షిద్, బండ పర్వతాలు వెంకటయ్యగౌడ్, నిరంజన్, బిజనేపల్లిలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నసీర్, తిరుపతయ్య, మిద్దె రాములు, బంగరి పర్వతాలు, పండ్ల పాషా, ముద్ద మధుసూదన్‌రెడ్డి, ముక్తార్, అధికారులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ.. నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 73 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే డా. రాజేశ్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్‌కుమార్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్ శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఏలినాటి శనిదోష నివారణకు అక్కడే స్నానాలు చేసి నల్లటి వస్త్రాలు ధరించగా వారితో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి ప్రత్యేక పూజలు చేయించి స్వామివారికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులను సమర్పింపజేశారు. అనంతరం భక్తులు పక్కనే ఉన్న శివాలయాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఓపెన్ స్కూల్ ఫలితాలు విడుదల మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గత నెల మొదటి వారంలో జరిగిన ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి 559 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 374 మంది (67.09 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లా పరిధిలో 455 మంది పరీక్ష రాయగా.. 255 మంది (52.43 శాతం), వనపర్తి జిల్లా పరిధిలో 346 మందికి గాను 289 (88.59 శాతం), నాగర్‌కర్నూల్ జిల్లాలో 353 మందికి గాను 235 (67.10 శాతం), నారాయణపేటలో 503 మంది పరీక్ష రాయగా.. 424 మంది (84.48 శాతం) ఉత్తీర్ణత నమోదు చేశారు. ● ఇంటర్మీడియట్‌కు సంబంధించి మహబూబ్‌నగర్ జిల్లాలో 841 మంది పరీక్ష రాయగా.. 490 మంది (60.21 శాతం) ఉత్తీర్ణత సాధించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 652 మందికి గాను 412 (63.12 శాతం), వనపర్తి పరిధిలో 510 మందికి గాను 370 మంది (72.84 శాతం), నాగర్‌కర్నూల్‌లో 746 మందికి గాను 546 మంది (73.30 శాతం), నారాయణపేట జిల్లాలో 897 మందికి గాను 528 మంది (59.62 శాతం) నమోదు చేసినట్లు డీఈఓ ప్రవీణ్‌కుమార్, ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. పురిటిగడ్డ రుణం తీర్చుకుంటా : మంత్రి చిన్నంబావి: తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకుంటానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం స్వగ్రామైన పెద్దదగడలో ఆయన గ్రామస్తులతో కలిసి వీధుల్లో పర్యటించి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనను ఇంతటివాడిని చేసిన గ్రామానికి ఎంతో చేయాల్సి ఉందని.. రానున్న కొద్దిరోజుల్లో గ్రామ రూపురేఖలు మార్చేందుకు బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన రహదారి విస్తరణ, రూ.రెండు కోట్లతో తిరుమలనాథస్వామి ఆలయ మరమ్మతు లు, తాగునీటి ఇబ్బందులు శాశ్వతంగా తొలగించేందుకు 1.20 లక్షల లీటర్ల సామర్థ్యంగల నీటి ట్యాంకును నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా గ్రామానికి 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి మట్టి మిద్దె లేని గ్రామంగా చూడాలన్నదే తన సంకల్పమని వివరించారు. పొలాలకు వెళ్లేందుకు రోడ్డు సరిగా లేదని రైతులు అడగగా.. రహదారి నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తానన్నారు. అదేవిధంగా మండలకేంద్రంలోని ప్రధాన కూడలిని రూ.కోటితో పట్టణ స్థాయిలో పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. టాయిలెట్స్ లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన దృష్టికి తీసుకురాగా.. తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొప్పునూరులో బీరప్ప ఆలయంలో పూజలకు హాజరయ్యారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, బీచుపల్లి యాదవ్, మాజీ సర్పంచ్ సురేందర్సింగ్, వెంకటేష్, నర్సింహ, రజినిబాబు, నరేష్ కుమార్, బొల్లు శ్రీనివాసులు, యుగంధర్‌గౌడ్, మధు గౌడ్, శంకర్ యాదవ్, రాజగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
త్యాగానికి ప్రతీక బక్రీద్
కందనూలు: ముస్లింలు జిల్లావ్యాప్తంగా బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. శనివారం ఉదయమే జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీపురం రోడ్లో ఉన్న ఈద్గా వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఈ సందర్భంగా జామియా నిజామియాకు చెందిన మతపెద్దలు బక్రీద్ ప్రాముఖ్యతను వివరించారు. అల్లా ముస్లింలకు ప్రసాదించిన ఐదు అంశాల్లో హజ్ కూడా ప్రధానమైందన్నారు. బక్రీద్ ప్రాముఖ్యతను గుర్తుంచుకొని ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ ఖుర్బానీ ఇవ్వాలని ఖురాన్ చెబుతోందని.. ఇబ్రహీం అలై సలాం త్యాగనీరతికి ప్రతీక అయిన బక్రీద్ నిష్టతో జరుపుకోవాలని సూచించారు. అల్లా కరుణ ఉన్నంత వరకు సమాజంలో మంచి జరుగుతుందని.. ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతోందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్‌కర్నూల్ ఎమ్యెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి హాజరై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఇస్లాం మతానికి మూల స్తంభాలైన ఇమాన్, నమాజ్, రోజా, జకాత్, హజ్ సూత్రాలను పాటిస్తూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవడం హర్షణీయమన్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అచ్చంపేట, కల్వకుర్తిలో ఎమ్మెల్యేలు డా. వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఈద్గాల వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు