నేడే తొలి సం‘గ్రామం’
సాక్షి, నాగర్‌కర్నూల్: తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి విడతలో మొత్తం 151 సర్పంచ్, 1,326 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. 14 సర్పంచ్ స్థానాలతో పాటు 208 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 137 సర్పంచ్, 1,118 వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ చేపట్టారు. తొలి విడత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. గురువారం ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 1గంట వరకు కొనసాగనుంది. మధ్యాహ్నం 1గంట వరకు క్యూలో ఉన్నవారికి ఓటే సే అవకాశం కల్పించనున్నారు. అనంతరం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. గురువారం సా యంత్రమే తొలి విడత ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.
వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లతో పర్యవేక్షణ..
తొలి విడత పంచాయతీ ఎన్నికల తీరును 55 మంది మైక్రో అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించనున్నారు. తొలి విడతలో గుర్తించిన 32 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నికల తీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, ఎన్నికల సిబ్బంది బుధవారం సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కల్వకుర్తి, ఊర్కొండ తదితర మండలాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పర్యవేక్షించారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామగ్రి, సీటింగ్ ఏర్పాట్లు, సీక్రెట్ ఓటింగ్ బ్యాలెట్ కంపార్ట్‌మెంట్ తదితర ఏర్పాట్లను పూర్తిచేశారు. తొలివిడతలో ఎన్నికలు జరిగే మండలాల్లో మొత్తం 1,92,156 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 95,625 మంది పురుషులు కాగా, 96,529 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామాల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే అవగాహన కల్పించారు.
బరిలో ఉన్న
సర్పంచ్ అభ్యర్థులు
447 మంది
వెబ్‌కాస్టింగ్ చేపట్టే పోలింగ్ కేంద్రాలు 32
ఓపీఓలు 3,000
మైక్రో
అబ్జర్వర్లు
55
జిల్లాలో 137 సర్పంచ్, 1,118 వార్డులకు ఎన్నికలు
ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్
మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి పరిశీలన
నేటి సాయంత్రమే ఎన్నికల ఫలితాలు వెల్లడి
నేడే తొలి సం‘గ్రామం’
నేడే తొలి సం‘గ్రామం’
నేడే తొలి సం‘గ్రామం’


