మండలం కనిష్టం బల్మూరు 9.4 అమ్రాబాద్ 9.8 కల్వకుర్తి 9.8
వణికిస్తున్న చలి
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లావ్యాప్తంగా చలిపులి వణికిస్తోంది. రాత్రివేళ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వరకు చలి వణికిస్తోంది. శనివారం జిల్లాలోని బల్మూరు మండలంలో అత్యల్పంగా 9.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అమ్రాబాద్ మండలంలో 9.8, కల్వకుర్తి 9.8, తెలకపల్లిలో 10.1, పదరలో 10.4, లింగాలలో 10.7, తాడూరు మండలంలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల తెల్లవారుజాము నుంచి ఉదయం 7 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది.


