పకడ్బందీగా వెబ్‌కాస్టింగ్ నిర్వహణ
సాక్షి, నాగర్‌కర్నూల్/ నాగర్‌కర్నూల్/ తిమ్మాజిపేట: పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని నాగర్‌కర్నూల్, బిజినేపల్లి, తిమ్మాజిపేట, కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి మండలాల్లో రెండో విడత పోలింగ్ జరగనుండగా.. మొత్తం 40 మంది మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ తీరును పరిశీలించనున్నారు. 42 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా ఓటింగ్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంచారు. ప్రిసైడింగ్ ఆఫీసర్లు, ఓపీఓలు, ఆర్‌ఓ, ఎన్నికల సిబ్బంది ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శనివారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోలింగ్ సామగ్రి పంపిణీని జిల్లా కలెక్టర్ సంతోష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
గైర్హాజరైతే కఠిన చర్యలు
ఎన్నికల సామగ్రి పంపిణీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండో విడత పోలింగ్ కోసం 1,694 పీఓలు, 2,411 ఓపీఓలతోపాటు వివిధ రకాల బాధ్యతలతో 6 వేల మందికిపైగా సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. ఎన్నికల విధులకు గైర్వాజరైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాంటి వారి పేర్ల వివరాలను సస్పెన్షన్‌కు సిఫారసు చేయాలని తిమ్మాజిపేట మండల ప్రత్యేకాధికారి, డీఈఓ రమేష్‌కుమార్‌ను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సిబ్బంది సకాలంలో నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు చేరుకునేలా పర్యవేక్షించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కరించుకోవాలని చెప్పారు.


