సోనియా, రాహుల్‌గాంధీలపై బీజేపీ కుట్ర
● కాంగ్రెస్ లేకుండా చేయాలనేదే
మోదీ, అమిత్‌షా ప్రయత్నం
● రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ
మంత్రి జూపల్లి కృష్ణారావు
నాగర్‌కర్నూల్: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం సోనియా, రాహుల్‌గాంధీలపై కేసును నమోదు చేస్తూ కుట్రలకు పాల్పడుతుందని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోనియా, రాహుల్‌గాంధీలపై నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు నమోదు చేస్తుందని ఆరోపిస్తూ ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామంలో ఉద్యమాన్ని వ్యాప్తి చేసేందుకు నేషన్ హెరాల్డ్ పెట్టారని, దీనిని నెహ్రూ తన సొంత డబ్బులతో నడిపారని, ఇందులో ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌గాంధీలకు ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నా మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని చేశారన్నారు. పార్టీలకతీతంగా బీజేపీ చేసే కుట్రలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరు లేకుండా చేసే కుట్ర పన్నుతుందని ఇందులో భాగంగానే ఉపాధి హామీ పథకానికి పేరు తొలగించాలరని ఆరోపించారు. తద్వారా పేదలకు ఉపాధి హామీ పథకాన్ని దూరం చేసే కుట్ర కేంద్రం చేస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాను ఇవ్వకపోగా అదనపు భారాన్ని మోపుతుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కేంద్రం చేస్తున్న కుట్రలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలన్నారు. ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి విజయం అందించాలని, రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే వరకు కార్యకర్తలు శ్రమించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికై నా సత్యమే గెలుస్తుందని, నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో అదే జరిగిందన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసులపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేయించడం, బెదిరింపులకు పాల్పడడం తగదన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ శశ్రేణులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యేలు ర్యాలీగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు చేరుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


