నాగర్‌కర్నూల్‌ | - | Sakshi
Sakshi News home page

నాగర్‌కర్నూల్‌

Dec 22 2025 9:01 AM | Updated on Dec 22 2025 9:01 AM

నాగర్

నాగర్‌కర్నూల్‌

న్యూస్‌రీల్‌

పాలమూరులో క్రికెట్‌ టోర్నీ

మహబూబ్‌నగర్‌లోని ఎండీసీఏ క్రికెట్‌ మైదానంలో సోమవారం తెలంగాణ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ టీ–20 లీగ్‌ టోర్నీ ప్రారంభం కానుంది.

సోమవారం శ్రీ 22 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

–8లో u

అచ్చంపేట: పల్లె ఓటర్లు పంచాయతీలకు నూతన పాలకులను ఎన్నుకున్నారు. కొత్త పంచాయతీల్లో సోమవారం పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. అయితే ఈసారి గెలుపొందిన వారిలో అత్యధికులు కొత్తవారే. పాలన అనుభవం, రాజకీయ నేపథ్యం లేని వారే ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని, అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పించారు. ప్రస్తుతం పల్లెల్లో సమస్యలు తిష్టవేశాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు.. ఏ విధంగా పాలన సాగిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

తొలిసారి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ చేసిన నన్ను మా గ్రామస్తులు ఆశీర్వదించి గెలిపించారు. నాపై వారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తా. గ్రామంలోని సమస్యలు పరిష్కరించేందుకు శాయశక్తులా కృషిచేస్తాను. ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో వీలైనన్ని అధిక నిధులు తెప్పించి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను.

– సంతోష్‌రెడ్డి, సర్పంచ్‌,

పలకపల్లి గ్రామం, అచ్చంపేట మండలం

అందుబాటులో ఉంటా..

గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులు కల్పించేలా ప్రత్యేకంగా కృషి చేస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోపాటు ఎమ్మెల్యే వంశీకృష్ణ సహకారంతో మరిన్ని నిధులు తెప్పించి గ్రామ అభివృద్ధికి పాటుపడుతాను. నన్ను గెలిపించిన ప్రజలకు రుణపడి సేవచేస్తా. – శ్రీలత, సర్పంచ్‌,

పెనిమిళ్ల గ్రామం, ఉప్పునుంతల మండలం

నేడు ప్రజావాణి

కార్యక్రమం

నాగర్‌కర్నూల్‌: ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం కొనసాగుతుందని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడం వల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

రేపు కలెక్టరేట్‌లో ‘మీ డబ్బు– మీ హక్కు’ కార్యక్రమం

నాగర్‌కర్నూల్‌: వివిధ కారణాలతో క్లెయిం చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం కల్పించిన మూడు నెలల ప్రత్యేక కార్యక్రమం ‘మీ డబ్బు– మీ హక్కుశ్రీలో భా గంగా మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి శిబిరం నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఆస్తులు తనిఖీ చేసుకుని, తగిన పత్రాలతో కలెక్టరేట్‌లో నిర్వహించే శిబిరంలో పాల్గొనాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఐద్వా మహాసభలను జయప్రదం చేయండి

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐద్వా 14వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో వచ్చేనెల 25 నుంచి 28 వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ మహాసభలలో దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొనే ప్రధానమైన సమస్యలపై చర్చించి భవిష్యత్‌ కార్యాచరణపై పోరాటాలు చేపడుతామన్నారు. గడిచిన పదేళ్లుగా మహిళలు, మైనార్టీలు, దళితులు అట్టడుగు వర్గాలకు భద్రత కరువైందన్నారు. మహిళలపై హింస, అభద్రత, నిరుద్యోగం పెరిగిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పని దొరక్కపోవడంతో మహిళలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. జాతీయ మహాసభల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. కార్యక్రమంలో నాయకురాలు నిర్మల, దీప, వెంకటమ్మ, ఈశ్వరమ్మ, సైదమ్మ పాల్గొన్నారు.

పేరుకుపోయిన సమస్యలు

జిల్లాలో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లకు గ్రామాల్లోని సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో ఎక్కడిక్కడ సమస్యలు పేరుకుపోయాయి. ప్రధానంగా పారిశుద్ధ్య చర్యలు, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ సైతం చేపట్టలేని దుస్థితి నెలకొంది. ట్రాక్టర్‌ కిస్తీలు, కరెంటు బిల్లులు సైతం పెనుభారంగా మారాయి. డీజిల్‌కు సైతం డబ్బులు లేక పలు జీపీల్లో ట్రాక్టర్లు మూలనపడి ఉన్నాయి. ఇలా పలు సమస్యలతో పంచాయతీలు సతమతవుతుండగా వీటిని పరిష్కరించడం కొత్త సర్పంచ్‌లకు సవాల్‌గా మారనుంది. అలాగే ఎన్నికల సందర్భంగా ఆలయాలు, లైబ్రరీలు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని హామీలిచ్చారు. నిధుల కొరతతో చిన్నపాటి సమస్యలే పరిష్కరించలేని పరిస్థితి ఉండగా హామీల అమలు వారికి కత్తిమీద సాముగానే మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిలిచిన నిధుల విడుదల

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం (ఎఫ్‌ఎఫ్‌సీ) రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) నిధులను గ్రామాల్లోని జనాభా దామాషా ప్రచారం కేటాయిస్తుంది. అయితే పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో రెండేళ్లుగా ఈ నిధులు విడుదల పూర్తిగా నిలిచిపోయింది. దీంతో జీపీల ఖజానాలు నిండుకున్నాయి. నయాపైసా లేపోవడంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేని పరిస్థితి దాపురించింది. అత్యవసర పనులకు పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన బిల్లులన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా కొత్త పాలకవర్గాలు రావడంతో ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలవుతాయని భావిస్తున్నారు. అయితే కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లు పెండింగ్‌ బిల్లులను తమకు చెల్లిస్తారా లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌1
1/3

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌2
2/3

నాగర్‌కర్నూల్‌

నాగర్‌కర్నూల్‌3
3/3

నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement