రౌండ్‌టేబుల్ సమావేశానికి తరలిన నిర్వాసితులు
చారకొండ: డిండి– నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న మండలంలోని గోకారం జలాశయం సామర్థ్యాన్ని తగ్గించాలని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ప్రజలు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం 20వ రోజు కొనసాగాయి. ఈ క్రమంలో ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ముంపు నిర్వాసితుల డిమాండ్‌పై జలాశయం సామర్థ్యం తగ్గింపు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు, సమాలోచనలు అనే అంశంపై చేపట్టిన రౌండ్‌టేబుల్ సమావేశానికి నిర్వాసితులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు.


