వైకుంఠ ఏకాదశికి ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు

Dec 30 2025 9:08 AM | Updated on Dec 30 2025 9:08 AM

వైకుం

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు

నాగర్‌కర్నూల్‌: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీపురంలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మంగళవారం ఉదయం 5.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలు, పూలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తుల రద్దీ మేరకు ఏర్పా ట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ప్రజావాణికి

50 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్‌: వివిధ శాఖలలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు అందించే వినతులపై తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో అదనపు కలెక్టర్లు అమరేందర్‌, దేవసహాయంతో కలిసి 50 ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌కు 7..

నాగర్‌కర్నూల్‌ క్రైం: పోలీసు ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది కృషిచేయాలని ఏఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పోలీసు ప్రజావాణిలో 5 భూ తగాదా, 2 తగు న్యాయం గురించి ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు ఆయా పోలీస్‌స్టేషన్లకు పంపిస్తామని చెప్పారు.

టీబీ నిర్మూలనకు

ప్రతిఒక్కరూ సహకరించాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ప్రాణాంతకమైన టీబీ మహమ్మారిని అంతం చేయడానికి మనందరం పనిచేయాలని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి రఫిక్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సీబి నెట్‌ ల్యాబ్‌ వద్ద భవిష్య భారత్‌ ఆధ్వర్యంలో సోమవారం టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్‌ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ వ్యాధి పట్ల విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎస్‌బీఐ ఆర్థిక సహాయంతో భవిష్య భారత్‌ అనే స్వచ్ఛంద సంస్థ టీబీ రోగులకు బలవర్ధకమైన ఆహారం ప్రతినెలా అందించడం గొప్ప సహాయంగా చెప్పవచ్చన్నారు. కార్యక్రమంలో భవిష్య భారత్‌ మేనేజర్‌ గోపి, టీబీ సూపర్‌వైజర్లు శ్రీనివాసులు, ఆరిఫ్‌ఖాన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ గంగాధర్‌, టీబీ హెచ్‌వీ తౌకిర్‌, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ఉప్పునుంతల: క్రిమినల్‌ కేసులో రిమాండ్‌ నిందితులుగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారని సోమవారం ఎంఈఓ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని గట్టుకాడిపల్లిలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న నేనావత్‌ పద్మ, మండలంలోని తాడూరు యూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాత్లావత్‌ గోపి సస్పెన్షన్‌కు గురైనట్లు ఎంఈఓ చెప్పారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఈ నెల 24 నుంచి రిమాండ్‌లో ఉండటంతో డీఈఓ కలెక్టర్‌కు రిపోర్టు చేస్తూ ఇద్దరిని సస్పెండ్‌ చేశారని ఎంఈఓ పేర్కొన్నారు.

వివరాలు 8లో..

కొండనాగుల సొసైటీకి ఉత్తమ అవార్డు

క్యూలో నిల్చొని.. రూ.2 లక్షలు చోరీ

బొటానికల్‌ గార్డెన్‌లో సిగ్నేచర్‌ స్పైడర్‌ కనువిందు

ఇసుక తరలింపు అడ్డగింత

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు 
1
1/2

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు 
2
2/2

వైకుంఠ ఏకాదశికి ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement