పోస్టల్ బ్యాలెట్‌నువినియోగించుకోండి
వెల్దండ: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని జిల్లా సాధారణ పరిశీలకురాలు రాజ్యలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉండగా ఉందులో నాలుగు సర్పంచ్ స్థానాలకు ఏకగ్రీవమైనట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశా రు. కార్యక్రమంలో నోడల్ అధికారి సీతారాం, ఎంపీడీఓ సత్యపాల్‌రెడ్డి, సూపరింటెండెంట్ మోహన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ పరిశీలన
నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ బదావత్ సంతోష్ సోమవారం పరిశీలించారు. నిబంధనల ప్రకారం గోడౌన్ సీల్ తెరిచి.. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఎన్నికల సామగ్రి భద్రతను సమీక్షించారు. గోడౌన్‌లో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి సూచనలు చేశారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు రవికుమార్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులున్నారు.
విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన
కందనూలు: జిల్లాకేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలను డీఈఓ రమేష్‌కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయుల హాజరు రిజిష్టరు, విద్యార్థుల సామర్థ్యాలను, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా బోధన చేయాలని, ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
పోస్టల్ బ్యాలెట్‌నువినియోగించుకోండి


