ప్రచారానికి తెర..!
మంతనాలు.. దావత్‌లు
సోషల్ మీడియా జోరు
రేపు రెండో విడత పోలింగ్‌కు సన్నద్ధం
● బరిలో 469 సర్పంచ్,
3,087 వార్డు అభ్యర్థులు
● ఇప్పటికే 4 సర్పంచ్,
142 వార్డు స్థానాలు ఏకగ్రీవం
● ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న
అధికార యంత్రాంగం
● సోషల్ మీడియాలో ప్రచార జోరు.. ప్రలోభాల పర్వం
స్వతంత్ర/
సీపీఎం/టీడీపీ
14న రెండో విడత పోలింగ్ జరగనుంది. మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. శనివారం ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రి తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు.
అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్‌కు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచే ప్రచారం ప్రారంభించిన అభ్యర్థులు, నామినేషన్లు పర్వం ముగిసిన తర్వాత జోరు పెంచారు. శుక్రవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో అధిక సంఖ్యలో మద్దతుదారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. సాయంత్రం 5 గంటలకు ఎక్కడికక్కడ నిశబ్ధం నెలకొంది. దీంతో సోషల్ మీడియా ద్వారా హోరెత్తిస్తున్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో ఆదివారం రెండో విడత పంచా యతీ ఎన్నికలు జరగనున్నాయి. ఆయా మండలా ల్లోని 151 గ్రామాలు, 1,412 వార్డులు ఉండగా.. నా మినేషన్ల 4 సర్పంచ్, 142 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 147 పంచాయతీలు, 1,269 వార్డుస్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
ప్రత్యక్ష ప్రచారం ముగియడంతో అభ్యర్థులు మిగిలిన రోజును సద్వినియోగం చేసుకోవడంపై దృష్టిసారించారు. దాదాపు అన్ని పంచాయతీల్లో అభ్యర్థుల పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఉన్న పంచాయతీ, మండల గ్రూపులతోపాటు కుల, యూత్ గ్రూపుల్లోనూ తమ గుర్తులు, హామీలు, గెలిచిన తర్వాత చేపట్టనున్న పనులతో పోస్టులు పెడుతున్నారు. మద్దతుదారులతో కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో ప్రచారంతో దూసుకెళ్తున్నారు.
ఉపసర్పంచ్‌పై గురి..
ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వు అయిన స్థానాల్లో ఉప సర్పంచ్‌గా ఎన్నిక కావాలని వార్డు సభ్యులు అనేక మంది పోటీలో ఉన్నారు. పలువురు అభ్యర్థులకు గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అనేక ప్రాంతాల్లో ఒకే పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవడం తలనొప్పిగా మారింది. మహిళలు బరిలో ఉన్న స్థానాల్లో పతులు, కుటుంబ సభ్యులే ఎక్కువగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
మద్యం దుకాణాలు బంద్
జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయా మండలాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని జిల్లా ఎకై ్సజ్‌శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఎన్నికల జరిగే బిజినేపల్లి, నాగర్‌కర్నూల్, తిమ్మాజిపేట, కొల్లాపూర్, పెంట్లవెల్లి, కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాల్లో శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకు షాపులు మూతపడనున్నాయి.
రెండో విడత ఎన్నికల బరిలో నిలిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థుల ప్రచారం ముగించి ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పంచాయతీ ఎన్నికలతో ఎక్కడ చూసినా దావత్‌లే కనిపిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెరపడటంతో ఎక్కడిక్కడ రహస్య మంతనాలు జరుగుతున్నాయి. అన్నివర్గాల మద్దతు కూడగట్టేందుకు మందు, విందులు ఏర్పాటు చేస్తున్నారు. నగదు, నజరానాలు పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకొంటున్నారు. కొందరు అభ్యర్థులు దావత్‌లకు విముఖత వ్యక్తం చేస్తుండగా.. వారి సహచరులకు తలనొప్పి తప్ప డం లేదు. మందు, విందులకు వారే నగదు సమకూరుస్తున్నారు.
ప్రచారానికి తెర..!
ప్రచారానికి తెర..!
ప్రచారానికి తెర..!
ప్రచారానికి తెర..!


