ప్రవాహం.. ప్రమాదం
అమరచింత: ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు తాగునీరు అందిస్తున్న జూరాల ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలోకి దిగి ప్రమాదవశాత్తు కొట్టుకుపోయి విలువైన ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. కాల్వలో నీటి ప్రవాహ తీవ్రత, ప్రవహించే నీటితో కలిగే నష్టాల గురించి అవగాహన లేక అమాయక ప్రజలు, విద్యార్థులు, చిన్నారులు ఈత సరదాతో ప్రాణాలు కోల్పోతున్నారు. నందిమళ్ల సమీప కాల్వలో ఇలాంటి మరణాలు అధికంగా చోటు చేసుకుంటున్నా.. సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.
రామన్‌పాడు వరకు..
జూరాల ఎడమ కాల్వ ద్వారా రామన్‌పాడుకు నీటి ని క్రమం తప్పకుండా వదులుతుంటారు. కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల, మూలమళ్ల, జూరాల గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగి తమ అవసరాలను తీర్చుకుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోయి రామన్‌పాడు రిజర్వాయర్‌లో మృతదేహాలు కనిపించడం సర్వసాధారణంగా మారింది.
● ఈత సరదా, దుస్తులు శుభ్రం
చేసేందుకు వెళ్లి గల్లంతు
● అవగాహన కల్పించడంలో
విఫలమవుతున్న అధికారులు


