పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..
సాయి ఈశ్వరాచారి మృతి బాధించింది. పాలకుల మెడలు వంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించుకుంటాం. దశల వారీ పోరాటాలకు సిద్ధం. పూలే, పండుగ సాయన్న బాటలో ముందుకు సాగుతాం. బీసీలు అడగకముందే 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ మాట తప్పి.. మోసం చేసింది. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకుందామే తప్ప.. ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఈశ్వరాచారి మృతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. – బెక్కం జనార్దన్,
బీసీ సంఘాల జేఏసీ చైర్మన్
ఇప్పటికై నా మేల్కోవాలి..
బీసీలకు రాజ్యాధికారం రావడం కష్టమని భా వించి సాయి ఈశ్వరా చారి బలిదానం కావ డం బాధేస్తోంది. బీసీల కు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ మోసం చేసింది. 17 శాతానికే పరిమితం చేయడం దారుణం. బీసీలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహానికి గురికాక తప్పదు. ఇప్పటికై నా మేల్కోవాలి. లేకుంటే పోరు బాట తప్పదు. మాకు ఉద్యమం కొత్త కాదు.. బీసీలందరం ఏకమై సత్తా ఏంటో చూపిస్తాం.
– శ్రీనివాస్ సాగర్, బీసీ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
●
పోరాడి సాధించుకుందాం.. ఆత్మహత్యలు వద్దు..


