చిగురిస్తున్న ఆశలు!
సీఎం హామీతో కొత్త సర్పంచుల్లో నూతనోత్సాహం
● ప్రస్తుతం పంచాయతీల ఖజానాలో కాసులు లేక కటకట
● కేంద్ర, రాష్ట ప్రభుత్వాల గ్రాంట్స్ కోసం ఎదురుచూపులు
● పంచాయతీలకు ప్రత్యేక నిధులతో సమస్యల పరిష్కారానికి వెసులుబాటు
●
సొంత డబ్బులతో పనులు
ప్రస్తుతం పంచాయతీల్లో ఎలాంటి నిధులు లేవు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన ప్రత్యేక నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడతాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్ విడుదలైతేనే జీపీలో నిధులు సమకూరుతాయి. తాము గెలిచిన తర్వాత సొంత డబ్బులతో చిన్నచిన్న పనులు చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవు.
– చింతగాళ్ల శ్రీనివాసులు,
సర్పంచ్, ఉప్పునుంతల
పైసలు లేవు..
గ్రామపంచాయతీలో చిన్న పని చేసేందుకు కూడా పైసలు లేవు. గత సర్పంచులు, కార్యదర్శలు చేపట్టిన పనులకు సంబంధించి బకాయిలు రూ. లక్షల్లో ఉన్నాయి. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు విడుదలైనా పాత బకాయిలకు సరిపోవు. పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఇస్తామని సీఎం చేసిన ప్రకటన కొంత ఊరటనిచ్చింది. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతాం. – సభావత్ రాఘవులు,
సర్పంచ్, సిద్ధాపూర్, అచ్చంపేట మండలం
అచ్చంపేట: ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నిధులు లేకపోవడంతో నూతన పాలకవర్గాలు సతమతమవుతున్నాయి. కొత్తగా ఎన్నికై న తాము ఏదైనా చేయాలనే తలంపుతో కొందరు సర్పంచులు సొంత డబ్బులతో చిన్నచిన్న పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్న పంచాయతీలకు రూ. 5లక్షలు, పెద్ద జీపీలకు రూ. 10లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు ఇస్తామని.. తద్వారా గ్రామాల్లో నెలకొన్న కొన్ని సమస్యలు తీరడంతో పాటు మౌలిక వసతులు సమకూరుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల కోస్గిలో నిర్వహించిన సర్పంచుల అత్మీయ సమ్మేళనంలో ప్రకటించడం కొత్త పాలకవర్గాల్లో నూతనోత్సాహం నింపింది. ప్రజలకిచ్చిన కొన్ని హామీలైనా నెరవేర్చే అవకాశం లభిస్తోందని ఆశిస్తున్నారు. నిధుల లేమితో సతమతమవుతున్న జీపీలకు వెసులుబాటు కలగనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆ గ్రామాలకు తప్పని ప్రత్యేకాధికారుల పాలన..
ఏజెన్సీ ప్రాంతంలోని ఐదు గ్రామ పంచాయతీలతో పాటు చారకొండ మండలం ఎర్రవల్లి జీపీలో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుమ్మరోనిపల్లి, వంగరోనిపల్లి, కల్మలోనిపల్లి, లక్ష్మాపూర్, ప్రశాంత్‌నగర్ గ్రామ పంచాయతీలు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. ఆయా గ్రామాల్లో ఎస్టీలు ఎవరూ లేకపోవడంతో ఎన్నికలు జరగలేదు. చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనుంది.
చిగురిస్తున్న ఆశలు!
చిగురిస్తున్న ఆశలు!
చిగురిస్తున్న ఆశలు!
చిగురిస్తున్న ఆశలు!


