ఉత్సాహంగా హ్యాండ్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్‌బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


