నేడు జిల్లాకు కేటీఆర్
నాగర్‌కర్నూల్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం జిల్లాకు రానున్నారు. ఇటీవల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులుగా గెలుపొందిన బీఆర్‌ఎస్ మద్దతుదారులను జిల్లా పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శనివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పరిశీలించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
శనేశ్వరుడికితైలాభిషేకాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జేష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తమ శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు శాంతికుమార్, ఉమ్మయ్య పాల్గొన్నారు.
ప్రతి విద్యార్థిపై
ప్రత్యేక శ్రద్ధ చూపాలి
చారకొండ: చదువులో వెనకబడిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఈఓ రమేశ్‌బాబు అన్నారు. శనివారం మండలంలోని తిమ్మాయిపల్లి ప్రాథమిక పాఠశాల, చారకొండ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి అభ్యసన సామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలతో పాటు పలు రికార్డులను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. అదే విధంగా ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహించి.. అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని సూచించారు. డీఈఓ వెంట పాఠ్యపుస్తకాల మేనేజర్ నర్సింహులు, కేజీబీవీ ఎస్‌ఓ మంజుల ఉన్నారు.
రేపటి నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్
కందనూలు: జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ఈ నెల 29, 30 తేదీల్లో జిల్లాస్థాయి సైన్స్‌ఫెయిర్ నిర్వహించనున్నట్లు డీఈఓ రమేశ్‌కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొనే వారు ఆదివారం మధ్యాహ్నంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.
నేడు జిల్లాకు కేటీఆర్
నేడు జిల్లాకు కేటీఆర్


