ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపికలు
మన్ననూర్: స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం క్రీడా మైదానంలో శుక్రవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బ్యాడ్మింటన్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి వెంకటరామిరెడ్డి సమక్షంలో నిర్వహించిన పోటీల్లో గద్వాల, పెబ్బేరు, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, తెలకపల్లి, మన్ననూర్ సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఉమ్మడి జిల్లా బాలబాలికల జట్లకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రూపాదేవి, అలీం, చంద్రశేఖర్, డా.నరేందర్‌రెడ్డి, శ్యామ్, బాబునాయక్, పీఈటీలు అస్మత్, అనిత, స్నేహ పాల్గొన్నారు.
జట్ల వివరాలు..
బాలుర జట్టు: ప్రణీత్ (గద్వాల), రంజిత్ (పెబ్బేరు), ఎం.చరణ్ (గద్వాల), భాస్కర్ (పెబ్బేరు), మణికంఠ (అచ్చంపేట), సుదర్శన్ (గద్వాల), జి.చరణ్ (గద్వాల), మోహన్ (వనపర్తి).
బాలికల జట్టు: అక్షిత (మన్ననూర్), అను (పెబ్బేరు), కావేరి (మన్ననూర్), మేరీ (మన్ననూర్), రాధిక (మన్ననూర్), రేణుక (కల్వకుర్తి), మహాలక్ష్మి (కల్వకుర్తి), శ్రావణి (మన్ననూర్), సమారిన్ బేగం (గద్వాల), యశస్విని (తెలకపల్లి) ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు.


