అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
తెలకపల్లి/తాడూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం తెలకపల్లి, తాడూరు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుతోందన్నారు. అదే విధంగా గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను భారీ మెజార్టీతో గెలిపించి.. గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో మారె్‌క్ట్ కమిటీ మాజీ చైర్మన్ వల్లభ్‌రెడ్డి, నాయకులు మామిళ్లపల్లి యాదయ్య, రాముడు, ప్రభాకర్, సర్పంచ్ అభ్యర్థి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


