సర్పంచ్‌కు 410.. వార్డులకు 2,639
మూడో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలు ఇలా..
● మూడో విడత బరిలో నిలిచిన అభ్యర్థులు
● 7 మండలాల్లో 139 పంచాయతీలు, 1,048 వార్డులకు ఎన్నికలు
అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలలో భాగంగా మూడో విడతకు సంబంధించి బరిలో నిలిచిన వారి లెక్క తేలింది. మూడో విడతలో 158 గ్రామ పంచాయతీలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 18 సర్పంచ్, ఒక ఉపసర్పంచ్‌తోపాటు 251 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా ఎస్టీ జనాభా లేని కారణంగా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి, లక్ష్మాపూర్, కల్ములోనిపల్లి, వంగురోనిపల్లి, ప్రశాంత్‌నగర్ గ్రామాల్లో సర్పంచ్, 40 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగడం లేదు. గోకారం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ చారకొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించారు. దీంతో మిగిలిన 139 పంచాయతీల్లో 410 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండగా.. 1,096 వార్డుల్లో 48 వార్డులకు ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికలు జరగనున్న 1,048 వార్డులకు 2,639 మంది పోటీలో ఉన్నారు. బరిలో ఉన్న సర్పంచ్,వార్డు సభ్యులకు రిటర్నింగ్ అధికారులు మంగళవారం సాయంత్రం 3 గంటల తర్వాత గుర్తులు కేటాయించడంతో ప్రచారం కొనసాగిస్తున్నారు.
ఏకగ్రీవమైన గ్రామాలు, వార్డులు..
మూడో విడతలో ఎక్కువగా సర్పంచ్, వార్డు స్థానా లు ఏకగ్రీవమయ్యాయి. ప్రజలు ఏకతాటిపైకి వచ్చి గ్రామంలో పోటీ లేకుండా సర్పంచ్ అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఇందులో అచ్చంపేట మండలంలో ని కిష్ట్యాతండా, బుడ్డతండా, చెంచుపల్గుతండా, చౌటపల్లి, ఎద్దుమిట్టతండా, పద్మారంతండా, బోల్గట్‌పల్లి, రంగాపూర్, బ్రాహ్మణపల్లి సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అలాగే ఉప్పునుంతల మండలంలోని సూర్యతండా సర్పంచ్‌తోపాటు ఆరు వార్డుల అభ్యర్థులు, పదర మండలంలోని జ్యోతనాయక్‌తండా, గాన్‌గుపెంట సర్పంచ్‌తోపాటు ఉపసర్పంచ్, అమ్రాబాద్ మండలం కొత్తపల్లి, వెంకటేశ్వర్లబావి, అమ్రాబాద్ సర్పంచ్‌లు, చారకొండ మండలం క మాల్‌పూర్, శేరిఅప్పారెడ్డిపల్లి, లింగాల మండలం అప్పాపూర్ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవమైంది. అయితే వీటిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
పోలింగ్.. ఫలితాలు
ఈ నెల 17న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మూడో విడత ఎన్నికల పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి చేసి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.
మండలం గ్రామాలు సర్పంచ్‌లు వార్డు
స్థానాలు
అచ్చంపేట 38 99 585
అమ్రాబాద్ 20 38 260
బల్మూర్ 23 68 464
లింగాల 23 62 418
పదర 10 22 183
ఉప్పునుంతల 27 74 457
చారకొండ 17 47 272
మండలం గ్రామాలు వార్డులు
అచ్చంపేట 9 110
అమ్రాబాద్ 3 46
బల్మూర్ – 16
లింగాల 1 18
పదర 2 17
ఉప్పునుంతల 1 24
చారకొండ 2 20


