తొలి పరీక్ష..!
నాగర్‌కర్నూల్: ఎవరికి వారే..
డీసీసీ చీఫ్‌లకు ‘పంచాయతీ’ సవాల్
● మెజార్టీ జీపీల్లో గెలుపే మొదటి టాస్క్
● నేతల మధ్య సమన్వయమే
ప్రధాన సమస్య
● పలు నియోజకవర్గాల్లో
ప్రచారానికి దూరంగా
అసంతృప్త నేతలు
● పట్టించుకోని
అధిష్టానం తీరుతో అలక
● అందరినీ ఒక్కతాటిపైకి
తెచ్చి కాంగ్రెస్ సత్తా
చాటుతామని
నూతన అధ్యక్షుల ధీమా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నూతనంగా ఎన్నికై న అధికార కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు పంచాయతీ పోరు సవాల్ విసురుతోంది. డీసీసీ చీఫ్‌లుగా నియామకమైన వెంటనే ఎన్నికలకు తెరలేవడం.. వారి సత్తాకు పరీక్షగా మారింది. మెజార్టీ పంచాయతీల్లో గెలుపే వారి తొలి టాస్క్ కాగా.. క్షేత్రస్థాయిలో సంగ్రామం బాట పట్టారు. పలు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో గ్రూప్‌లు.. అంటీముట్టనట్లుగా ఉన్న నేతలతో వారికి సమన్వయం కత్తిమీద సాములా మారినట్లు తెలుస్తోంది.
వనపర్తి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన శివసేనారెడ్డి పంచాయతీ ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉన్నారు. ప్రస్తుతం ఆయన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. నూతనంగా డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికై న క్రమంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలోనే పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగుతుందని చెప్పారు.
నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధిష్టానం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణకు మళ్లీ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ జిల్లాలోని నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎవరికి వారు పంచాయతీ ఎన్నికల్లో చక్రం తిప్పుతున్నారు. డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ తన సొంత నియోజకవర్గం అచ్చంపేటకే పరిమితమయ్యారు.
రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు హీటెక్కింది. అటు బీఆర్‌ఎస్ ఇటు బీజేపీ ఏకమై మెజార్టీ గ్రామాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ లోని అసంతృప్త నేతలకు సంబంధించిన వర్గాలు సైతం పోరులో నిలిచాయి.
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!
తొలి పరీక్ష..!


