ఎన్నికల నిర్వహణలో అధికారులే కీలకం
అచ్చంపేట: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం అచ్చంపేటలో మూడో వి డత ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్నిమాయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్తిస్థాయి సామగ్రితో ఉద్యోగులను పోలింగ్ కేంద్రాలకు చేర్చడంతోపాటు లెక్కింపు పూర్తయ్యాక తిరిగి వచ్చేలా రూట్ అధికారులు బా ధ్యత వహించాలని, ఉదయం అల్పాహారం, మ ధ్యాహ్నం భోజనం కల్పించాలని, పోలింగ్ సామ గ్రి, ప్రత్యేకించి బ్యాలెట్ పేపర్లు తరలించే సమయంలో తప్పనిసరిగా సాయుధ పోలీసులతో కూడి న బందోబస్తు ఉండాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరూ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, విధులకు హాజరై ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేస్తేనే స్వేచ్ఛా యుత, న్యాయబద్ధమైన ఎన్నికలు సాధ్యమవుతా యని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సైదులు, ఎంపీడీఓ అరుంధర్‌రావు పాల్గొన్నారు.
మూడో విడతకు సర్వం సిద్ధం
నాగర్‌కర్నూల్: జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్టమైన ప్రణాళికతో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయి సంసిద్ధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3వ విడత ఎన్నికల కోసం 3,629 పీఓలు, ఓపీఓలతోపాటు వివిధ రకాల బాధ్యతలతో 6 వేల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఆయా కేంద్రాల్లో కొనసాగిన పోలింగ్ ప్రక్రియను కలెక్టరేట్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నేరుగా వీక్షించేలా కమాండ్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.


