21న జాతీయ లోక్ అదాలత్
నాగర్‌కర్నూల్ క్రైం: జిల్లాలోని అన్ని కోర్టులలో ఆదివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో కక్షిదారులు తమ కేసులను శాంతియుత వాతావరణంలో రాజీ చేసుకోవాలని జిల్లా జడ్జి రమాకాంత్ అన్నారు. మంగళవారం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌కు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్ ద్వారా కేసులను రాజీ చేసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయన్నారు. రాజీ చేసుకోదగిన సివిల్, క్రిమినల్ కేసులను రాజీ చేసేందుకు పోలీసులు, న్యాయవాదులు సమష్టిగా పనిచేయాలన్నారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర పరిష్కారంతో అప్పీలు లేని తీర్పును పొంది సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవచ్చని చెప్పారు. సమావేశంలో స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు నసీం సుల్తానా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి, సెకండ్ అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీనిధి తదితరులు పాల్గొన్నారు.
నూతన వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలి
ఊర్కొండ: రైతులు వ్యవసాయంలో నూతన వంగడాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏడీఆర్ ఆర్‌ఏఆర్‌ఎస్ డాక్టర్ ఎల్.కృష్ణ అన్నారు. మంగళవారం మండలంలోని ముచ్చర్లపల్లిలో రైతు కుడుముల తిరుపతిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఐసీపీవీ– 21333 అనే రెడ్‌గ్రాం కందులు నూతన వంగడానికి సంబంధించిన పంట దిగుబడి, సస్యరక్షణ చర్యల గురించి రైతులకు స్వల్పకాలిక సమయంలో వచ్చే విధంగా చూసుకోవాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుల పంటకాలం నాలుగు నెలలు ఉంటుందని, అధిక వర్షపాతానికి సైతం తట్టుకొని దిగుబడి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు వస్తుందన్నారు. స్వల్పకాలిక పంట కావడంతో ఇతర పంటలు వేసుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, ఆర్‌ఏఆర్‌ఎస్ పాలెం సైంటిస్టులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–19 విభాగం బాలబాలికల బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పీడీ, స్పోర్ట్స్ ఇన్‌చార్జి వేణుగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సాదత్‌ఖాన్, బాల్‌రాజు, సీనియర్ క్రీడాకారులు సయ్యద్ ఎజాజ్‌అలీ, ఎండీ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.
21న జాతీయ లోక్ అదాలత్


