భక్తిభావంతో మెలగాలి
కల్వకుర్తి రూరల్: మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహా పడిపూజలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు జిల్లెల రాములు, సర్పంచ్ రమేశ్‌నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, సంతు యాదవ్, గోరటి శీను పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు
చారకొండ: గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని డీఎస్పీ సైరెడ్డి వెంకట్‌రెడ్డి స్థానిక పోలీసులకు సూచించారు. గురువారం చారకొండ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించడంతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని తెలుసుకున్నారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వివిధ సమస్యలపై పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి భరోసా ఇవ్వాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కాగా, పోలిసు విధుల్లో ఉత్తమ ప్రతిభకనబరిచిన కానిస్టేబుల్ సురేశ్‌గౌడ్, ఎ.ప్రశాంత్‌లకు డీఎస్పీ రివార్డులు అందజేసి ప్రశంసించారు. డీఎస్పీ వెంట సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎస్‌ఐ వీరబాబు తదితరులు ఉన్నారు.
ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోండి
నాగర్‌కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో చదువుతున్న షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు 2025–26 సంవత్సరానికి గాను ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న గిరిజన విద్యార్థులకు కొత్త పథకం, 9 నుంచి 10వ తరగతి గిరిజన విద్యార్థులకు రాజీవ్ విద్యాదీవెన పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. 5 నుంచి 8వ తరగతి బాలికలకు రూ. 1,500, బాలురకు రూ. 1,000, 9 నుంచి 10వ తరగతి డే స్కాలర్లకు రూ. 2,250 ఉపకార వేతనాలు అందించనున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ–పాస్ వెబ్‌సైట్ అందుబాటులో ఉందన్నారు. దరఖాస్తుకు ఫొటో, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, రేషన్ కార్డు, కుల ధ్రువపత్రం (జిరాక్స్), ఆదాయ ధ్రువపత్రం (ఒరిజినల్) అవసరమని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు అవసరమైన ధ్రువపత్రాలను తమతమ పాఠశాలల హెచ్‌ఎంలకు సకాలంలో అందించాలని సూచించారు. ఈ–పాస్ ద్వారా పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలిపారు.
‘రూ.1.50 లక్షల కోట్ల
వడ్డీ చెల్లించాం’
వనపర్తి: గడిచిన 64 ఏళ్లలో 22 మంది సీఎంలు రూ.63 వేల కోట్ల అప్పు చేస్తే.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని.. ఆయన చేసిన అప్పుల కోసం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.1.50 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం ఆయన వనపర్తిలో విలేకరులతో మాట్లాడారు. పాలమూరు ఎత్తిపోతల డీపీఆర్‌కు కేంద్రం అనుమతి లభించలేదనే విషయం పక్కన పెడితే.. ఉమ్మడి పాలమూరులో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన, నిధులు వెచ్చించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనేనని పునరుద్ఘాటించారు. సాగునీటి ప్రాజెక్టుల పేరిట బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన దోపిడి, అధికారం కోల్పోయాక చేస్తున్న అబద్ధపు ఆరోపణలపై నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు ప్రజలతో నిజాలు సవివరింగా చర్చించాలని సూచించారు.
భక్తిభావంతో మెలగాలి


