ప్రకృతి వ్యవసాయానికి పురస్కారం
తిమ్మాజిపేట: శాస్త్రవేత్తలు, రాష్ట్ర వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తిమ్మాజిపేట మండల రైతు బైరపాగ రాజు ప్రతిష్టాత్మక రైతు అవార్డు అందుకున్నారు. ఈ నెల 23, 24 తేదీల్లో కిసాన్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పూస క్యాంపస్‌లో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో రైతుల సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా సేంద్రియ వ్యవసాయం విభాగంలో తెలంగాణ నుంచి రైతు బైరపాగ రాజుకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో సదస్సులో పాల్గొన్న రాజుకు ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ ఆర్‌ఎస్ బరోడా ప్రతిష్టాత్మక రైతు అవార్డు అందజేశారు.


