హక్కు కోల్పోతారు..
ప్రజాస్వామ్యంలో పోటీచేసే హక్కు ప్రతిఒక్కరికీ ఉంటుంది. అసలు ఏకగ్రీవమే కరెక్ట్ కాదు. దీంతో మిగతా వాళ్లు పోటీ చేసే హక్కును కోల్పోతారు. గ్రామాల్లో పెత్తందారులే ఏకగ్రీవాల పేరిట కుట్రలు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సైతం పదవులకు వేలం అంటే రాజకీయాలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించి.. ఇవ్వకపోవడం కూడా వేలం పాటల సంస్కృతి పెరిగేందుకు కారణమైంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం.. అత్యంత ప్రమాదకరం. – రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్
●


