పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
కందనూలు: పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద సరైన వసతులు కల్పించాలని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి సోమవారం అదనపు కలెక్టర్ దేవసహాయంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఈ నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద అధికార సిబ్బందికి సరైన వసతులు ఏర్పాటు చేయాలని జిల్లాలోని 20 మండల పరిషత్ అధికారులు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ప్రధానంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే మహిళా పోలింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన వసతులు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన టేబుళ్లు, కుర్చీలు, కరెంటు, మంచినీరు, ఇతరత్రావి ఉండేలా చూడాలని వినతిలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


