వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలి
● డీఈఓ రమేష్‌కుమార్
కందనూలు: జిల్లాకేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 29, 30 తేదీల్లో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను విజయవంతం చేయాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఎంఈఓలు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించిన ముందస్తు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్‌ఫేర్ విజయవంతం చేసేందుకు 23 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనలతో విధిగా హాజరయ్యేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయిలో నిర్వహించే వైజ్ఞానిక ప్రదర్శనకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్‌రావు పాల్గొన్నారు.


