నేడు కోస్గికి సీఎం రాక
కోస్గి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం కోస్గికి రానున్నారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంగళవారం ఎస్పీ వినీత్‌తో కలిసి నారాయణపేట, వికారాబాద్ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, ప్రతీక్ జైన్ పరిశీలించారు. పంచాయతీ పాలకవర్గాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించే స్థానిక లక్ష్మీనర్సింహ ఫంక్షన్‌హల్‌తోపాటు సభాస్థలం, హెలీప్యాడ్, సీఎం కాన్వాయ్ రూట్, వాహనాల పార్కింగ్, బారికేడ్లు తదితర భద్రతాపరమైన అంశాలను పరిశీలించి.. అధికారులకు సూచనలు చేశారు. అనంతరం వికారాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి సీఎం పర్యటన బందోబస్తుకు వచ్చిన 800 మంది పోలీసులతో ఎస్పీ వినీత్ సమావేశమై మాట్లాడారు. మొత్తం 10 సెక్టార్లుగా విభజించి.. ఏఎస్పీలు, డీఎస్పీలను ఇన్‌చార్జిలుగా నియమించామని తెలిపారు. ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశంలో అదనపు బలగాలతో భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సీఎం కాన్వాయ్ రూట్‌లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా, ప్రజలకు ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
కందనూలు: విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించే మైనారిటీ విద్యార్థులకు ముఖ్యమంత్రి విదేశి విద్యా పథకం ద్వారా స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి గోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండి పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ చేయాలనుకున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని జనవరి 19న సాయంత్రం కలెక్టరేట్‌లోని మైనారిటీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
‘మీ డబ్బు– మీ హక్కు’నుసద్వినియోగం చేసుకోవాలి
నాగర్‌కర్నూల్: వివిధ కారణాలతో క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరకమైన ఆస్తుల కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన ‘మీ డబ్బు– మీ హక్కు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన మీ డబ్బు– మీ హక్కు శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఆర్థిక రంగంలో క్లెయిమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం గత నవంబర్ 1 నుంచి ఈ నెల 31 వరకు మీ డబ్బు– మీ హక్కు నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రజలు తమకు చెందాల్సిన అన్ క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా రాబడులు తదితర ఆర్థికపరమైన ఆస్తులను తిరిగి క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారన్నారు. అన్ క్లెయిమ్ చేయని ఆర్థికపరమైన ఆస్తులపై హక్కు కలిగిన వారు ధ్రువపత్రాలతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలను సంప్రదించి తమ నిధులను తిరిగి క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్ల వివరాలు ఆర్‌బీఐ ఉద్గమ్ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకుని సులభంగా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, ఎస్‌బీఐ ఆర్‌ఎం సునీత, టీజీబీఆర్‌ఎం సంగీత, డీసీసీబీ ఏజీఎం అబ్దుల్ నబీ, ఆర్‌ఎస్ ఈటీఐ డైరెక్టర్ జావిద్ అహ్మద్ పాల్గొన్నారు.
● కట్ట నిర్మాణానికి మట్టి నమూనాల సేకరణ
● ఉత్పత్తులపై సమగ్ర సమాచారం ఉండాలి
● రోడ్డు పనులు అడ్డుకున్న గ్రామస్తులు
నేడు కోస్గికి సీఎం రాక


