ఓటెత్తారు..
జిల్లాల వారీగా పోలింగ్ శాతం ఇలా..
తొలి విడతలో సగటున 85.12 శాతం పోలింగ్
● జోగుళాంబ గద్వాల జిల్లాలో
అత్యధికంగా 86.77 శాతం
● మహబూబ్‌నగర్‌లో
అత్యల్పంగా 83.04 శాతం
● అన్ని జిల్లాల్లోనూ పురుషుల
ఓటింగ్ శాతమే ఎక్కువ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్‌లో వెనుకపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 83.04 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 83.37 శాతం, మహిళలు 82.71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్ నిర్వహించారు. మొత్తంగా 86.32 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 87.13 శాతం, మహిళలు 85.53 శాతం మంది ఓటు వేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని నాలుగు మండలాల్లో తొలి విడత జీపీ ఎన్నికలు జరిగాయి. ఇందులో మొత్తంగా 86.77 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 87.79 శాతం ఓటు హక్కు వినియోగించుకోగా.. మహిళలు 85.79 శాతం మంది మాత్రమే ఓటు వేశారు.
వనపర్తి జిల్లాలోని ఐదు మండలాల పరిధిలో జరిగిన జీపీ ఎన్నికల్లో 84.90 శాతం పోలింగ్ నమోదైంది. పురుషులు 85.91 శాతం, మహిళలు 83.99 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
నారాయణపేట జిల్లాలో మొత్తంగా 84.58 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుషులు 85.55 శాతం, మహిళలు 83.66 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటెత్తారు..
ఓటెత్తారు..
ఓటెత్తారు..


