ఎన్నికల కోడ్ అతిక్రమిస్తే కఠిన చర్యలు
అచ్చంపేట రూరల్: జిల్లాలో పంచాయతీ ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ హెచ్చరించారు. గురువారం ఆయన అచ్చంపేట మండలంలోని నడింపల్లి, పల్కపల్లి క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికల సిబ్బందికి, పోలీసులకు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లాలో మూడో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం అచ్చంపేటలోని పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. రౌడీషీటర్లు, ఇతర విషయాలపై సీఐ నాగరాజును అడిగి తెలుసుకున్నారు.


