నామినేషన్ల జోరు
బరిలో నుంచి తప్పించేలా..
పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే మొదటి, రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగియనుంది. ఈ క్రమంలో అభ్యర్థులు గెలుపు కోసం పోటీదారులను బుజ్జగిస్తున్నారు. రెబల్స్‌ను బరిలో నుంచి తప్పించేలా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మూడో విడతలో కూడా ఏకగ్రీవాలపై దృష్టిసారించారు. జిల్లాలోని 460 గ్రామ పంచాయతీలు, 4,102 వార్డు సభ్యుల స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. తొలి విడత ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించారు. ఇక రెండో విడత నామినేషన్లపై ఫిర్యాదులకు గురువారం వరకు అవకాశం కల్పించారు. వీటిని శుక్రవారం పరిష్కరిస్తారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ తర్వాత మిగిలిన వారికి గుర్తులు కేటాయిస్తారు.
అచ్చంపేట: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడో దశలో నామినేషన్ల జోరు కొనసాగుతుంది. అచ్చంపేట నియోజకవర్గం 7 మండలాల పరిధిలోని 158 గ్రామాలు, 1,364 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనుండగా గురువారం రెండో సర్పంచ్ స్థానాలకు 242, వార్డు స్థానాలకు 626 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మంచి రోజు లేదని చాలామంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేదు. చివరి రోజు శుక్రవారం అభ్యర్థులు ఆయా క్లస్టర్ల కేంద్రాలకు చేరుకుని భారీ సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలో ఉన్న వారందరి నుంచి నామినేషన్లు స్వీకరించారు. అచ్చంపేట మండలం హాజీపూర్, చెన్నారం, ఉప్పునుంతల క్లస్టర్లలో ఎక్కువ మంది నామినేషన్లు వేసేందుకు రావడంతో ఆలస్యమైంది. లింగాల, పద్మనపల్లి, సూరాపూర్, కొత్తకుంటపల్లి పంచాయతీలకు రాత్రి 9.30 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు.
మూడో విడతలో గురువారం దాఖలైన నామినేషన్లు ఇలా..
ఏడు మండలాల్లో కొనసాగుతున్న మూడో దశ స్వీకరణ
రెండోరోజు సర్పంచ్‌లకు 242, వార్డు స్థానాలకు 626 దాఖలు
నేటితో ముగియనున్న చివరి విడత ప్రక్రియ
మరోవైపు ఉపసంహరణ, ఏకగ్రీవాలపై ప్రధాన పార్టీల దృష్టి
గెలుపు వ్యూహాలపై అభ్యర్థుల కసరత్తు


