పొత్తుల రాజకీయం..!
పల్లె పోరులో చిత్రవిచిత్రాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: విజయమే లక్ష్యం.. ఇందుకు ఏదీ అనర్హం కాదు అన్నట్లు ఉంది ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లోని రాజకీయ పరిస్థితులు. పల్లె పోరు తొలి దశలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసి.. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయింది. ఈ మేరకు వారు ప్రచారం మొదలుపెట్టారు. రెండో దశలో నామినేషన్ల స్క్రూటినీ ముగియగా.. అభ్యంతరాల స్వీకరణ ప్రారంభమైంది. చివరి దశకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఇలా కీలక ఘట్టానికి చేరుకున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి చిత్రవిచిత్ర పొత్తులు చోటుచేసుకున్నాయి. ఒక్కో చోట బీఆర్‌ఎస్, బీజేపీ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏకమై అభ్యర్థులను రంగంలోకి దింపగా.. ఆయా ప్రాంతాల్లో పోటీ రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పైచేయి కోసం ఒకరికొకరు ఆరోపణలు, విమర్శనాస్త్రాలు సంధించుకోవడమే ట్రెండ్‌గా మారిన ప్రస్తుత రాజకీయాల్లో ఊహించని పొత్తులు ఆసక్తి రేపుతున్నాయి.
గెలుపే లక్ష్యంగా
ఊహించని మద్దతులు
కొన్ని జీపీల్లో బీఆర్‌ఎస్, బీజేపీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి..
పలు ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ.. సీపీఎం, కాంగ్రెస్..
మంత్రి జూపల్లి ఇలాకాలో కారు, కమలం ఉమ్మడి కార్యాచరణ?
వీపనగండ్లలో బీఆర్‌ఎస్ రెబల్స్, కాంగ్రెస్ రెబల్స్, సీపీఎం..


