వైజ్ఞానిక ప్రదర్శనకు వేళాయె..
కందనూలు: జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు సర్వం సిద్ధమైంది. పాఠశాల స్థాయి విద్యార్థుల్లో దాగి ఉన్న సాంకేతిక, వైజ్ఞానిక, సృజనాత్మకతను వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏడాది సైన్స్‌ఫెయిర్, ఇన్‌స్పైర్ మనక్ పోటీలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా సోమ, మంగళవారాల్లో నిర్వహించే జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ వేదిక కానుంది. వికసిత భారత్, ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా శాస్త్ర సాంకేతిక, గణితం, ఇంజినీరింగ్ వంటి అంశాల ఇతివృత్తంగా ప్రదర్శనలు జరగనున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, యాజమాన్య పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి వరకు చదివే వారితో పాటు డీఎడ్, బీఎడ్ విద్యార్థులు నూతన ఆవిష్కరణలను ప్రదర్శించవచ్చు. వీరిలో 6, 7, 8 తరగతుల వారిని జూనియర్స్‌గా, 9, 10, 11, 12 తరగతుల వారిని సీనియర్స్‌గా విభజించి పోటీలు నిర్వహించనున్నారు. ఆయా విభాగాల్లో జూనియర్స్ నుంచి 7, సీనియర్ప్ నుంచి 7 ప్రాజెక్టులను ఎంపికచేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నారు.
గతేడాది 93 మంది ఎంపిక..
గతేడాది నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన 93 మంది ఇన్‌స్పైర్ అవార్డుకు ఎంపికయ్యారు. వారు మరింత మెరుగైన ఎగ్జిబిట్లు రూపొందించేందుకు ప్రభు త్వం ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున వారి ఖా తాలో జమ చేసింది. వాటితో మరింత మెరుగైన ఎగ్జిబిట్లు ప్రదర్శించేందుకు కసరత్తు చేస్తున్నారు.
నేటి నుంచి జిల్లాస్థాయి ఎగ్జిబిట్ల ప్రదర్శనలు
రెండు రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమం
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లోఏర్పాట్లు పూర్తి


