ప్రజాస్వామ్యం ఖూనీ..
గ్రామాల్లో డబ్బున్నోళ్లు, పెత్తందారులు కలిసి కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో సైతం ఆలయాల నిర్మాణం ఇతరత్రా అంటూ రూ.30–50 లక్షలు ఇచ్చిన వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. ప్రధానంగా సీడ్ మాఫియా, సీడ్ ఆర్గనైజర్లు పదవుల పందేరానికి పాల్పడుతున్నారు. సామాన్యులు, చదువుకున్న యువత ఆశావహులు డబ్బులు పెట్టలేక మిన్నంకుంటున్నారు. జిల్లాలో తొలి దశలో 15 గ్రామాల వరకు సర్పంచ్ పదవులకు వేలం నిర్వహించారు. – గొంగళ్ల రంజిత్, నడిగడ్డ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు
●


