1,197 ఓట్లతో సర్పంచ్ గెలుపు
ఉప్పునుంతల గ్రామ పంచాయతీ ఎన్నికలో సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి
చింతగాళ్ల శ్రీనివాసులు 1,197 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామ పంచాయతీలో మొత్తం 4,575 ఓట్లు ఉండగా.. 3,652 పోలయ్యాయి. ఇందులో చింతగాళ్ల శ్రీనివాసులుకు 2,195 ఓట్లు, ఆలూరి పర్వతాలుకు 998 ఓట్లు, పాత్కుల శేఖర్‌కు 303 ఓట్లు, చింతగాళ్ల
మల్లయ్యకు 43 ఓట్లు రాగా.. చెల్లనివి 113 వచ్చాయి. దీంతో 1,197 భారీ మెజార్టీతో
గెలుపొందిన శ్రీనివాసులును గ్రామస్తులు
అభినందించారు. – ఉప్పునుంతల


