కోడలిపై అత్త విజయం
జడ్చర్ల మండలం మాటుబండతండా పంచాయతీలో కోడలిపై అత్త విజయం సాధించింది. తండా ఎస్టీ మహిళకు రిజర్వు కాగా నేనావత్ లక్ష్మిని ఆమె పెద్ద కుమారుడు దీపక్‌రాథోడ్ సర్పంచ్‌గా పోటీలో ఉంచారు. అయితే లక్ష్మి చిన్న కుమారుడు నేనావత్ బాలకోటి తన భార్య పల్లవిని సర్పంచ్ బరిలో దింపాడు. వీరితోపాటు ఆంగోతు రూప్లి అనే మహిళ సైతం బరిలో నిలిచింది. ఈ క్రమంలో ఎన్నికల్లో 228 ఓట్లు పోలు కాగా లక్ష్మికి 98, పల్లవికి 72, రూప్లికి 56 ఓట్లు వచ్చాయి. చివరికి అత్త లక్ష్మి 26 ఓట్ల తేడాతో విజయం సాధించారు. – జడ్చర్ల టౌన్


