దమగ్నాపూర్: ఇద్దరూ.. ఇద్దరే
దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి సొంత గ్రామమైన చిన్నచింతకుంట మండలంలోని దమగ్నాపూర్ సర్పంచ్ అన్‌రిజర్వ్‌డ్ మహిళకు కేటాయించారు. ఈ పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారు భారతమ్మ.. బీఆర్‌ఎస్ బలపరిచిన ఇ.పావని సర్పంచ్‌గా బరిలో నిలిచారు. వ్యవసాయం చేసుకుంటూ అందరితో మమేకమై ఉండే బాలకృష్ణారెడ్డి భార్య భారతమ్మ కాగా.. కిరాణం కొట్టు నడిపిస్తూ గ్రామ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న కృష్ణయ్య శెట్టి భార్య పావని. ఈ ఇద్దరి మధ్యనే గట్టి పోరు నెలకొంది. భారతమ్మకు అధికార పార్టీ అండదండలు ఉండడం.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు మొగ్గు చూపడం ఆమెకు ప్లస్‌గా మారే అవకాశం ఉంది. అదేవిధంగా పావనికి బోయ సామాజిక వర్గం మద్దతుగా నిలుస్తుండడంతో పాటు ప్రచారం హోరు కొనసాగించడం కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఎస్సీలు, యాదవులు ఇరు పార్టీల్లో ఉండగా.. వారు ఎటు వైపు మొగ్గు చూపితే అటు వైపు విజయా వకాశాలు ఉన్నట్లు తెలు స్తోంది.


