సమస్యలు ఎవరికి చెప్పాలి..
మా గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ రావడం, ఎస్టీలు ఎవరూ లేక గత ఐదేళ్లు సర్పంచ్ లేకుండానే గడిచిపోయింది. ఈసారి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు ప్రభుత్వానికి, అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. స్పెషల్ అధికారులను నియమిస్తే వారు గ్రామాల్లో అందుబాటులో ఉండటం లేదు. మా బాధలు, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు.
– ఆంజనేయులు, కుమ్మరోనిపల్లి గ్రామం, అమ్రాబాద్ మండలం
మా ఎర్రవల్లి గ్రామం గోకారం రిజర్వాయర్‌లో మునిగిపోతోంది. ఇప్పటికే రిజర్వాయర్ కింద మా భూములను కోల్పోయాం. ఇళ్లు కూడా మునిగితే మా పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. ప్రభుత్వం ఇచ్చే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వద్దు. గ్రామం ముంపునకు గురికాకుండా రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలి. ఊరే లేనప్పుడు సర్పంచ్ ఉండి ఏం లాభం. అందుకే ఎన్నికలను బహిష్కరించుకున్నాం. – శ్రీరామ్,
ఎర్రవల్లి గ్రామం, చారకొండ మండలం
●
సమస్యలు ఎవరికి చెప్పాలి..


