రెమ్యూనరేషన్ ఇవ్వలేదని ధర్నా
తిమ్మాజిపేట: ఎన్నికల విధులు నిర్వహించిన తమకు పూర్తి స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వలేదని, సరైన సౌకర్యాలు కల్పించలేదంటూ ఆదివారం రాత్రి ఎన్నికల సిబ్బంది ధర్నా చేశారు. సిబ్బంది ఎన్నికలు పూర్తయ్యాక ఎన్నికల సామగ్రితో తిమ్మాజిపేటలోని సామగ్రి రిసీవింగ్ కేంద్రానికి వచ్చారు. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాల వద్ద తమకు సరైన వసతులు కల్పించలేదని ఎంపీడీఓ లక్ష్మిదేవితో వాగ్వాదానికి దిగారు. అలాగే కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ ప్రాంతాలకు బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి తీరా ఏర్పాటు చేయకపోవడంతో.. తాము రాత్రి వేళ ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు రావాల్సిన అన్ని రకాల రెమ్యూనరేషన్ ఇప్పించాలని రెండు గంటల పాటు ధర్నా చేశారు.


